Sunset in Maui Island, Hawaii Photo: cbrao
దిన చర్య -పెరుగు రామకృష్ణ
ఒక సాయంత్రం
నల్ల సముద్రమైపోయాక
తన ఉద్యగం లోంచి ఆమె
నా ఉద్యోగంలోంచి నేను
బైటికొచ్చి వొడ్డున పడ్డాక
తీరిగ్గా కలుసుకుంటూ _
చీకటి సముద్ర తీరం మీద
జంట పక్షులమై రెక్కలార్చి కూర్చుంటాం ....
వాళ్ళ ఆఫీసు కబుర్లతో ఆమె
నా దిన చర్య గూర్చి నేను
బతుకు ఫైళ్ళు తెరుచుకుంటాం
అవసరాల గురించి కొంచెం
ఆనందాల గురించి కొంచెం
కొన్ని దిగుల్లై పోతాం
కాసిన్ని చిరునువ్వ్లవుతాం
జారుతున్న చీకటి యవనికలా
ఆలోచనల కెరటాల మై పోతాం
కబుర్ల కలనేత ముగిసాక
ఒక చానల్లో సీరియల్.....
మరో సిడి లోంచి హరిప్రసాద్ చౌరాసియా
అలా గాలిలో ప్రవహించాక
ఆమె కునుకులోంచి
మత్తులోకి జారుకుంటూ
ఆమె శ్వాస
నా ఛాతి పై పాములా పాకుతూ ....
నన్ను గుండెలకు హత్తుకుని
గాడంగా నిద్రిస్తుంది
ఉదయం నుంచి
నా లోపల... లోపల
అల్లరి చేస్తూ
ఆలోచిస్తూ ,ఆక్రోసిస్తూ
ఆవేసిస్తున్న ఓ పద్యం
అప్పుడే మేల్కొని
యిక రాత్రంతా
నిద్ర పోనీకుండా చేస్తుంది...!
6 కామెంట్లు:
ఏమిటిది? కవిత అని పేరు తగిలించుకున్న పదార్థమా? మీకెక్కడ దొరికిందీ? లేకుంటే మీరే పెరుగు వారి కలం పేరుతో రాసి ఇలా మాకు అందచేసారా?
రావు గారు, ఈ ఫోటో కూడా నైకాన్ డీఐ తోనే తీసారా?
ఈ కవిత ఆంగ్ల అనువాదం "Nocturnal Journey"
పేరుతో ప్రతిష్టాత్మక ఇంగ్లీష్ జర్నల్ Taj Mahal Review
లో ఇటీవల ప్రచురితమైంది..
@మాగంటి వంశీ మోహన్: కవితలు నేను వ్రాయటమా? అంత సీన్ లేదు. ఈ కవిత పెరుగు రామ కృష్ణ (ఫ్లెమింగో ఫేం) గారు వ్రాసినది. చదవగానే ఏదో ఆకర్షణ నాకు ఈ కవితలో కనిపించి, రచయిత అనుమతి లేకుండానే ప్రచురించాను. ఫేస్ బుక్ లో సాహిత్యనిధి అనే గుంపులో కొత్తగా సభ్యుడిగా చేరాను. అక్కడ లభించిన రత్నమే ఈ కవిత. దీప్తిధార పాఠకుల సౌలభ్యం కోసం ఇక్కడ పోస్ట్ చేశాను. ఈ రచయిత గురించి రెండు మాటలు. రామకృష్ణ పెరుగు కవితలు ఫ్లెమింగో 7 భాషలలో అనువాదమయ్యింది. దినచర్య కవిత కూడా ఆంగ్లంలో అనువాదమయి ప్రచురించబడింది. కవిత్వం పై ఆసక్తి కలవారు ఫేస్ బుక్ లోని సాహిత్యనిధి లో సభ్యులు కావచ్చును.
@RK : నైకాన్ డి90 (Nikon D90) కొన్న కొత్తల్లో, ఇంకా ఆ కెమేరా ను పూర్తిగా అధ్యయనం చేయకముందే హవాయ్ వెళ్లటం జరిగింది. మావి, బిగ్ ఐలాండ్ (హవాయ్) ల లో నేను తీసిన ఛాయాచిత్రాలు తృప్తికరంగా వచ్చాయి. ఛాయాగ్రహణం, పక్షులను చూడటం (Bird Watching -Ornithology) నాకు ఇష్టమైన విషయాలు. Big Island (Hawaii) లోని జ్వాలా ముఖి చిత్రం బ్లాగులు- వ్యాఖ్యలు -6 లో చూడవచ్చును.
@ramperugu: మీ update కు నెనర్లు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి