Click on photos to enlarge
ఏప్రిల్ మొదటి వారం వచ్చిందంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ (కొలంబియ జిల్లా) వసంత శోభతో ఉట్టిపడుతూ, విరగపూసిన చెర్రీ పూల సోయగాలతో మన మనసును ఆకట్టుకుంటుంది. వాషింగ్టన్ పట్టణ, జఫర్సన్ జ్ఞాపిక చుట్టుపక్కల సుమారుగా 3,750 చెర్రీ చెట్లున్నాయి. ఇవి తెలుపు, లేత గులాబి రంగుల పూలతో ఉండి దగ్గర, దూర ప్రాంతపు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. వాతావరణం లో మార్పుల కనుగుణంగా మార్చ్ నుంచి ఏప్రిల్ నెలలలో రెండు వారాల పాటు ఉండే ఈ చెర్రీల సౌందర్యం చూడాలంటే రెండు కళ్లు చాలవు మరి. ఇదే సమయంలో ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ ఉత్సవాలు జరుపుతారు.
ఈ చెర్రీ చెట్లను 1912 లో జపనీస్ ప్రజలు ప్రేమతో వాషింగ్టన్ ప్రజలకిచ్చారు. ఇక్కడి టైడల్ బేసిన్ ప్రాంతంలో, పొటోమాక్ నదిలో, బోటులో విహరిస్తూ, ఈ చెర్రీల సౌందర్యం చూస్తుంటే కలిగే అనుభూతి మాట్లలో చెప్పలేనిది.
2011 మార్చ్ చివరి వారంలో తీసిన ఈ చిత్రాలు చూసి మీరూ ఆ సౌందర్య జగతిలో విహరించండి.
చిత్రాలు నవీనా హేమంత్ సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి