Click on photo to enlarge Photo:cbrao
హాలెబీడు, కర్ణాటక, దేవాలయంలో బూతు బొమ్మలు. దేవాలయాలపై బూతు బొమ్మలెందుకో తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి.
ఉషా మాధవం...శాన్ అంటోనియో సంక్రాంతి సంబరం!
డెట్రాయిట్, టెక్సాస్ లో సాహితీ చైతన్యం వెల్లివిరుస్తుంది. నిడదవోలు మాలతి గారు కూడా ఇప్పుడు డాలస్ వచ్చేసారని విన్నాను. గోవింద రాజు మాధవరావు గారిని పరిచయం చేసినందుకు ప్రమోదం.
http://afsartelugu.blogspot.com/2011/01/blog-post_27.html
దిన చర్య
@మాగంటి వంశీ మోహన్: కవితలు నేను వ్రాయటమా? అంత సీన్ లేదు. ఈ కవిత పెరుగు రామ కృష్ణ (ఫ్లెమింగో ఫేం) గారు వ్రాసినది. చదవగానే ఏదో ఆకర్షణ నాకు ఈ కవితలో కనిపించి, రచయిత అనుమతి లేకుండానే ప్రచురించాను. ఫేస్ బుక్ లో సాహిత్యనిధి అనే గుంపులో కొత్తగా సభ్యుడిగా చేరాను. అక్కడ లభించిన రత్నమే ఈ కవిత. దీప్తిధార పాఠకుల సౌలభ్యం కోసం ఇక్కడ పోస్ట్ చేశాను. ఈ రచయిత గురించి రెండు మాటలు. రామకృష్ణ పెరుగు కవితలు ఫ్లెమింగో 7 భాషలలో అనువాదమయ్యింది. దినచర్య కవిత కూడా ఆంగ్లంలో అనువాదమయి ప్రచురించబడింది. కవిత్వం పై ఆసక్తి కలవారు ఫేస్ బుక్ లోని సాహిత్యనిధి లో సభ్యులు కావచ్చును.
@RK : నైకాన్ డి90 (Nikon D90) కొన్న కొత్తల్లో, ఇంకా ఆ కెమేరా ను పూర్తిగా అధ్యయనం చేయకముందే హవాయ్ వెళ్లటం జరిగింది. మావి, బిగ్ ఐలాండ్ (హవాయ్) ల లో నేను తీసిన ఛాయాచిత్రాలు తృప్తికరంగా వచ్చాయి. ఛాయాగ్రహణం, పక్షులను చూడటం (Bird Watching -Ornithology) నాకు ఇష్టమైన విషయాలు. Big Island (Hawaii) లోని జ్వాలా ముఖి చిత్రం బ్లాగులు- వ్యాఖ్యలు -6 లో చూడవచ్చును.
http://deeptidhaara.blogspot.com/2011/01/blog-post_27.html
వీధి పిల్లలు - మహె జబీన్
జాన్ కీట్స్, వర్డ్స్‌వర్త్ వంటి మహనీయుల కవితలను మన విద్యార్థులు 10 వ, ఇంటర్మీడియట్ తరగతులలో చదువుతున్నారు. ఈ Stree Children కవితను 10 వ తరగతి పిల్లలు అర్థం చేసుకోగలరనే తలంపు. వీధి బాలల లను అర్థం చేసుకోవటానికి, వారి సమస్యలపై సానుభూతితో స్పందించటానికి ఈ కవిత దోహద పడగలదని నమ్మే ఈ కవితను పాఠ్యాంశంగా ఉంచారని తలుస్తాను.
http://deeptidhaara.blogspot.com/2011/02/blog-post.html
నాకు దొరికిన అరుదైన పాతపుస్తకాలు
మంచి పుస్తకాల సేకరణ. మీ అభిరుచికి అభినందనలు. బెజవాడ లో పాత పుస్తకాలు వారాంతంలోనా లేక ప్రతిరోజూ లభ్యమవుతాయా? ఈ పుస్తకాలకై ఎక్కడ వెదకాలి?http://pustakam.net/?p=6418
గైడ్ హిందీ సినిమా - ఆకాశమే హద్దు!
తన కధ గైడ్ కు చేసిన మార్పులు, చేర్పులకు వ్యధ చెంది ఆర్.కె.నారాయణ్ ఆ సినిమాను disown చేశారు. మీ వ్యాసం ద్వారా దెబ్బతిన్న రచయిత మనోభావాలు తెలిశాయి. నిర్మాతలు రచయితకు ఏమీ ఇవ్వకపోవటం అన్యాయమే. అయితే ఈ సినిమా ద్వారా రచయిత జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.
http://saahitya-abhimaani.blogspot.com/2011/03/blog-post_17.html
"గొరుమార నేషనల్ పార్క్ లో రెండు రోజులు !"
గోరుమార అడవి సౌందర్యాన్ని మా ముందు నిలిపారు. నీలాకాశం నిండిన చిత్రం ఐతే మనొహరంగా ఉంది. అటు అడవి, ఇటు వనవాసి సాహితీ సొబగులను చక్కగా అందించారు. త్వరలో జల్దా పారా వైల్డ్ లైఫ్ సాన్క్చురీ విశేషాలు కూడా అందించగలరు.
http://paapaai.blogspot.com/2011/03/blog-post_28.html
"ప్రయాణంలో పదనిసలు - 1"
వా! చిత్రాలతో ఒక కధ చెప్పేసారే! అభినందనలు.
http://4psmlakshmi.blogspot.com/2011/03/1.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి