
బుధవారం, జూన్ 29, 2011
మాట్లాడే చిలుక
సమయానికి తగు మాటలాడి మన మనసు దోచే ఈ చిలుక పలుకులు విని మనము ముగ్ధులం కాకుండా ఉండగలమా? ఈ కింది చిత్రం పై మీ మౌస్ తో నొక్కగలరు.

బుధవారం, జూన్ 22, 2011
యువ ఛాయాచిత్రకారులకు ఉపకార వేతనాలు
Let us build the nest Photo:cbrao
మీ వయస్సు 24 సం||లు కంటే తక్కువగా ఉండి, స్మృజనాత్మక ఛాయాచిత్రకారులయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధమ బహుమతి: UK£3000/- (US$4900) ద్వితీయ బహుమతి $UK£500 (about US$820)
త్వరపడండి - చివరి తేది: 30/06/11.
మరిన్ని వివరాలు దిగువన చూడండి.
Scholarship for young photojournalists
Ian Parry Scholarship
Full-time photography students and photographers age 24 or under can apply for a scholarship.
The Ian Parry Scholarship is designed to help young documentary photographers undertake a chosen project and raise their profile in the international photography community. It is named after photographer Ian Parry, who died on assignment in Romania at the age of 24.
The top prize is UK£3,000 (about US$4900) and UK£500 (about US$820) for runners-up. The Sunday Times Magazine publishes a selection of images from the competition and World Press Photo automatically nominates the winner for the Joop Swart Masterclass.
For more information, use this URL: http://www.ianparry.org/main/?
Deadline: 30/06/11
బుధవారం, జూన్ 15, 2011
నైకాన్ ఛాయాచిత్ర పోటీలో పాల్గొనండి
Pinhole Camera Photo: cbrao
నైకాన్ వారి కొత్త కెమేరా D5100 ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీ స్మృజనాత్మకత ఉన్న ఛాయాచిత్రకారుల కోసం. మీరు చెయ్యవలసినదల్లా మీకు తెలిసిన విషయాలు, వస్తువులు లేక దృశ్యాలను కొత్తకోణలోంచి చిత్రం తీసి పంపించటమే. ఈ కొత్తకోణం కొంత వినోదాత్మకంగా మరికొంత ఆలొచింపచేసిదిగా ఉంటే మరీ బాగు.
వివరాలు దిగువన చూడగలరు.
http://d5100.nikon-asia.com/competition
త్వరపడండి - చివరి తేది: Weekly Prize: జూన్ 15, 2011, Special Prize జూన్ 22, 2011
శనివారం, జూన్ 11, 2011
భూమిక పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారితో ముఖాముఖి
Bhumika Monthly Magazine
మన సమాజంలో స్త్రీల సమస్యలు బహు విధాలుగా వున్నాయి. ఈవ్ టీజింగ్ మొదలుకొని వరకట్న సమస్య, గృహహింస, ఉద్యోగినుల సమస్యలు,కార్యాలయాలలో లైంగిక వేధింపులు వగైరా స్త్రీల సమస్యలకు, సలహా చెప్పేవారు, సహాయం అందించే వారు లేక స్త్రీలు మొన్నటి దాకా మౌనంగానే బాధ భరిస్తూ వచ్చారు.
ఆంధ్రదేశం లో స్త్రీవాద ఉద్యమం మొదలయ్యాక బాధిత స్త్రీల గోడు వినే వారు వచ్చాక చీకటిలో ఒక చిరుదీపం వెలిగింది. ఆ దీపమే భూమిక సహాయ కేంద్రం. భూమిక - స్త్రీవాద పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సహాయ కేంద్రం ఎందరో స్త్రీల కన్నీళ్లు తుడిచింది. వెన్ను తట్టి, పీడిత స్త్రీల వెనుక తామున్నామని భరొసా ఇచ్చింది. 2008 మార్చ్ నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ భూమిక సహాయ కేంద్రం ప్రారంభించబడింది.
Bhumika Editor - Kondaviti Sathyavathi
మీకు తెలుసా! సత్యవతి గారు తమ మిత్రులతో కలిసి కార్యాలయాల లో పనిచేసే స్త్రీల సమస్యలపై పోరాడి, మహిళలకు ప్రసూతి సెలవు 90 రోజుల నుంచి 120 రోజులు సాధించారు.
Bhumika Helpline
భూమిక సహాయ కేంద్రం ఆదివారం మినహాయించి ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా అనుభవజ్ఞులైన సామాజిక కార్యకర్తలచే నిర్వహించబడుతూ ఉంది. శనివారం న్యాయవాది ద్వారా చట్టపరమైన సలహాలు (Legal advices) కూడా లభ్యమవుతాయి. భూమిక సహాయకేంద్ర టెలిఫోన్ సంఖ్య: 1800 425 2908 (Toll free). ఇతర రాష్ట్రాలనుంచి ఫోన్ చెయ్యాలంటే 040 - 27605316 కు చెయ్యాలి. http://helpline.bhumika.org/
భూమిక స్త్రీవాద పత్రిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారితో ముఖాముఖి జూన్ 8, 2011 న ఆకాశవాణి, రైన్‌బో
FM ఛానెల్ లో ప్రసారమైంది. వీరిని ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీమతి వసుమతి శర్మ. ఈ ఇంటర్వ్యూ కింద వినవచ్చును.
http://dl.dropbox.com/u/31976678/Interview%20with%20Kondaveeti%20Satyavathi.MP3
దీప్తిధారలో గతంలో భూమిక, కొండవీటి సత్యవతి లపై ఈ కింది వ్యాసాలు వెలువడ్డాయి. ఆసక్తి కలవారు వీటిని చూడవచ్చు.
భూమిక మూలికా డైరి 2008
http://deeptidhaara.blogspot.com/2008/01/2008.html
ఆకుపచ్చ లోయల్లో, ఆనందపు హేలల్లో , తలకోన అడవిలో
http://deeptidhaara.blogspot.com/2008/05/9.html
ఉద్వేగంగా జరిగిన భూమిక బహుమతుల ప్రదానోత్సవం
http://deeptidhaara.blogspot.com/2008/06/3.html
భూమిక సత్యవతి గారిని కలుపుకొని, తెలుగు బ్లాగరుల ప్రత్యేక విహార యాత్ర చేద్దామా?
http://deeptidhaara.blogspot.com/2008/10/9.html
భూమిక Helpline కి ప్రచారం కల్పించేలా ప్రమదావనం తరపున ఎవరైనా ఒక టపా రాయటం అవసరం.
http://deeptidhaara.blogspot.com/2009/01/2.html