సోమవారం, జనవరి 26, 2009
స్పందన -2
Western gulls on North California sea coast photo-cbrao
అవిడియాలు
"అవిడియాలు" అనే పద ప్రయోగం సరైనదేనా? తెలుగు పదమేనా?
http://palakabalapam.blogspot.com/2008/12/blog-post_26.html
కోడీహళ్ళి మురళీ మోహన్:తురుపుముక్క
మీ పరిచయానికి చాలా సంతోషం. బ్లాగ్లోకానికి స్వాగతం. ప్రతి నెలా రెండవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్నకాంత్ పార్క్ (యూసఫ్‌గూడా) లో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం.
మీ గురించిన వివరాలతో "నా పరిచయం" అనే టపా ఒకటి ప్రచురించగలరు. మీ బ్లాగు చూసేవారికి మీరెవరో తెలియగలదు.
http://turupumukka.blogspot.com/2008/12/sameeksha.html
చూస్తుండు, ఇప్పుడే వస్తా
జీవితానికి మరణానికి దూరమెంత?
http://oohalanni-oosulai.blogspot.com/2008/12/brb.html
చివరి ఉత్తరం
భూమిక Helpline కి ప్రచారం కల్పించేలా ప్రమదావనం తరపున ఎవరైనా ఒక టపా రాయటం అవసరం. జ్యోతక్కా వినిపిస్తుందా?
http://muralidharnamala.wordpress.com/2008/12/28/lastletter/
మంచి పిల్లలు
జీవని constitution ఏమిటి? Aided or unaided?. జీవని గురించిన వివరాలతో, సచిత్రంగా మరొక టపా రాయండి. మన తెలుగు బ్లాగరులు సహృదయులు. స్పందించే గుణం ఉంది వారికి.
http://jeevani2009.blogspot.com/2008/12/blog-post.html
ది క్యూరియస్ కేస్ ఆఫ్ 'బెంజిమన్ బటన్'
ఈ చిత్ర సమీక్ష, చదవటానికి ముందు, ఎవరు రాసేరు అని ఒక పర్యాయం తల పై కెత్తి చూస్తే అతిధి అని కనిపించింది. ఎవరైతే మనకేంటి, మనకు కావలసినది ఈ చిత్రం గురించిన సమాచారం అనుకుని చదవడం, మొదటి వాక్యంతో మొదలు పెడ్తే, చివరంటా అలా ఆసక్తికరంగా చదివింపచేసిందీ వ్యాసం. చివరన, సమీక్షకుడి పేరు చూసి, డిటెక్టివ్ సినిమాలో వంటవాడే హంతకుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయినంతగా, ఆశ్చర్యపడ్డా. ఈ రచయిత తెలుగు బ్లాగు పాఠకులకు సుపరిచితుడే. అయితే నవతరంగం పాఠకులకు సరికొత్త. మరిన్ని సమీక్షలు డాక్టర్ గారు రాయాలని కోరుకుందాము.
http://navatarangam.com/2008/12/the-curious-case-of-benjamin-button/
శీతాకాల సొగసులు
ఒకటే కారు ఉన్న చిత్రం తక్కువ distraction తో రమ్యంగా ఉంది. శాన్ హోజే పురంలో fall ఆలస్యమే, తూర్పు తీరం తో పోలిస్తే.
http://anilroyal.wordpress.com/2008/12/28/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%95%e0%b0%b2%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d/
కలయా! నిజమా?
క్రిస్మస్ రోజు పుస్తక ప్రదర్శన: మన e- తెలుగు స్టాల్ కు నేను కూడా వచ్చా. మీ అందరి హడావుడి చూసి ఆనందించాను. మీరు నన్ను చూడలేక పోయారు - కారణం నేను సూక్ష్మ రూపంలో రావటం వలన.
డిసెంబర్ మాసం 2008 తెలుగు బ్లాగుల చరిత్రలో మరువలేనిది. బ్లాగరులు ప్రత్యక్షంగా ఒకరినొకరు కలుసుకోవటమే కాక, తెలుగు బ్లాగుల, కంప్యూటర్లో తెలుగు వాడకానికి, ఎంతో శ్రమించి మిక్కిలి ప్రచారం కావించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభినందనీయులే. తెలుగు బ్లాగు చరిత్రలో వీరందరి పేరు, చిరస్థాయిగా ఉంటుంది.
http://manalomanamaata.blogspot.com/2008/12/blog-post_25.html
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి