గురువారం, జనవరి 17, 2008

భూమిక మూలికా డైరి 2008


Bhumika Herbal Diary - 2008

పెరటి చెట్టు వైద్యానికి పనికి వస్తుందా? వంటింటి చిట్కాలు పనిచేస్తాయా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం గా అవును అంటున్నారు భూమిక పత్రికా నిర్వాహకులు. శోధిని సంస్థ వారు, భారతదేశం లో, ఐదు రాష్ట్రాలలో, పది సంవత్సరాలుగా, ఔషధ మొక్కలపై, వివిధ పరిశోధనలు చేశారు. పలు స్త్రీల case studies ఆధారంగా, ఈ మూలికా వైద్యం లో, వారి పరిశీలన, అనుభవాలను, ఈ చిన్న పుస్తకం ద్వారా మనకు అందిస్తున్నారు,ఉమామహెశ్వరి.

కురుల రక్షణకై మందార పూలను, కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి, వడగట్టి తలకు రాసుకోవటం మన ఇళ్లలో సాధారణంగా ఎరిగినదే.ఇలాంటివే,మరి కొన్ని మన ఇళ్లలో పెద్దవారు చేస్తూడటం మీరు గమనించే వుంటారు. ఇలాంటి వంటింటి చిట్కాలన్నీ, మాలగుచ్చి ఒక పూలదండ గా అందిస్తున్నదీ భూమిక హెర్బల్ డైరి.

ఇందులో ఇచ్చిన కొన్ని చిట్కాలు చెప్తాను.
వడదెబ్బ తగిలితే ఏమి చెయ్యాలి?
ఉల్లిగడ్డలు ఎక్కువ తినాలి.ఉల్లిరసం తాగించాలి.వడదెబ్బ తగిలిన వెంటనే,ఉల్లిగడ్డ వాసన చూపాలి.ఉల్లిగడ్డ దగ్గరే వుంచుకోవాలి.నిమ్మరసం ఎక్కువ తాగాలి.ఆముదం ఆకులు తలకు కట్టుకోవాలి.

పెదాలు పగిలితే

స్నానం చేసిన తరువాత,కొంచం ఆవనూనె (ఆవాల నూనె) ని బొడ్డు లోపల వెయ్యాలి. దీనివల్ల పెదాల పగుళ్లు తగ్గడం తో బాటు, ముఖం మీది పెళుసుతనం (dryness) తగ్గుతుంది.ఇలాగా సుమారు అరవై రకాల ఆరొగ్య సమస్యలకు ఈ డైరి లో పరిష్కారం చెప్పారు. పల్లెలలో ఈ రోజుకీ, పెద్దవారు, పిల్లల చెవిలో, ఆముదం నూనె చుక్కలు పొయ్యటం ఉంది. అయితే, పోషణ (maintenance) కు, చెవిలో నూనె చుక్కలు వెయ్యటం,చెవిలో పుల్లబెట్టి గుబిలి తియ్యటం లాంటి పనులను అల్లోపతి సమర్ధించదు. దీనివలన చెవిలో infection సోకే ప్రమాదముంది.చెవి తన నిర్వహణ తానే చూసుకుంటుంది.ఏదైనా సమస్య వస్తే మాత్రం వైద్యుని కలవాలని అల్లొపతి చెప్తుంది. ఆయుర్వేదం, అల్లోపతి కొన్ని విషయాలలో విభేదిస్తాయి.అన్ని సమస్యలకు ఈ డైరి, సర్వస్వం కాదు.

ఈ గృహవైద్యంలో, ఒక మంచి ఏమంటే, ఇందులో దుష్ఫలితాలు ఏమీ వుండవు.ఈ మందులను వాడుతూనే, అవసరమైనప్పుడు, వైద్యులని సంప్రదించాలని, ప్రకాశకులు చెప్తున్నారు. మూలికా మందులు ఎలా తయారు చెయ్యాలో, వివరంగా ఇచ్చారు. ఈ డైరి చివర, notes, addresses & telephone nos కు తగినన్ని పుటలు అదనంగా ఇచ్చారు.
ఈ చిట్కాలన్నీ ఆంగ్ల, తెలుగు భాషలలో, ఒకే పుస్తకంలో ప్రచురించారు.చక్కటి ముఖచిత్రం,అందమైన ముద్రణతో ఈ డైరి పాఠకులకు ఉపయుక్తంగా వుండగలదు. ధర యాభై రూపాయలు.

ప్రతులు దొరకు చోటు
Bhooika,
HIG II,Block-8,Flat 1,
Baghlingampally,
Hyderabad- 500 044.
Tel: 040-27660173
e-mail: bhumikahyd@yahoo.com

5 వ్యాఖ్యలు:

తెలుగు'వాడి'ని చెప్పారు...

బహుధా ప్రశంసనీయమైన వారి ప్రయత్నానికీ, మీ బ్లాగు ద్వారా వారి గురించి నలుగురికీ తెలియజేసిన మీ ఆసక్తికీ ఇవే నా హృదయపూర్వక అభినందనలు....

KK చెప్పారు...

Bagundandi...Mee PANDU kuda

Satyavati చెప్పారు...

సిబిరావ్ గారూ
ధన్యవాదాలు.భూమిక మూలికా డైరీ గురించి మీ బ్లాగులో పరిచయం చేసినందుకు థాంక్స్.నిజానికి భూమిక పత్రిక నిర్వహణ కోసం, నిధుల సమీకరణ కోసం మేము ఈ పుస్తకాన్ని ప్రచురించాము.దీని అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ము భూమిక ప్రచురణకి వెళుతుంది.మిత్రులు ఈ పుస్తకాన్ని కొనడం ద్వారా భూమికకు చాలా సహాయం చేసినవారుతారు.మీ అందరికి పుస్తకాన్ని పరిచయం చేసిన రావు గారికి క్రుతఙతలు తెలియచేస్తున్నాను.

Suresh చెప్పారు...

మీ ప్రయత్నం బహు ప్రసంసనీయం, మీకు ఎవే మా జొహార్లు.

ramperugu చెప్పారు...

Rao gaaru..
mee blog dwara manchi vishyalni paduguriki cheravesthunnanduku
dhanyavaadaalu..
Perugu.Ramakrishna

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి