Self Portrait of Sankara Narayana Sathiraju
దర్శకుడు బాపు తమ్ముడైన చిత్రకారుడు సత్తిరాజు శంకర నారాయణ (శంకర్),1936 లో నర్సాపురంలో జన్మించారు. లయోలా కాలేజ్, మద్రాసు లో ఎకానమిక్స్ లో హానర్స్ చేశాక, అక్కడి ఆకాశవాణి లో 1963 లో చేరారు. రేడియోలో, అనేక విభాగాలలో సేవలందించి 1995 లో చెన్నై స్టేషన్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు ముందు, చిత్రకళపై ఆసక్తి తో ఆకాశవాణి వెలువరించే, పలు ప్రచురణలకు తనే ముఖపత్ర రచన చేసేవారు. పదవీ విరమణ తరువాత తనకు ఆసక్తి ఉన్న చిత్రకళా రంగం లో కృషి చేస్తున్నారు. కట్టెబొగ్గు, ఇండియన్ ఇంక్ మరియు పెన్సిల్ మాధ్యమాల లో ఇప్పటిదాకా సుమారు 1500 చిత్రాలు గీశారు. 1992లో తిరుపతి లో భారత జాతీయ కాంగ్రెస్ సదస్సు నిర్వహించిన సమయంలో శంకర్ తొలిగా చిత్రించిన స్వర్గీయ పి.వి.నరసింహారావు చిత్రం ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధమ పేజీలో ముద్రితమయ్యింది. తదుపరి పలు రంగాలలో ఉన్న, ప్రఖ్యాత భారతీయ వ్యక్తుల చిత్రాలను గీస్తూ, పలువురి మన్ననలందుకున్నారు.
శంకర్ చిత్రాలు Samudra, Sruthi, Splendour, Post Noon ఆంగ్ల పత్రికలు, ఆంధ్ర ప్రదేష్, స్వప్న, జగతి మాస పత్రికలు, నవ్య వార పత్రిక, ఈనాడు,వార్త, సూర్య, ఉదయవాణి (కర్నాటక) మొదలగు దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి. శంకర్ చిత్రించిన కన్నడ జ్ఞానపీఠ్ బహుమతి గ్రహీతల చిత్రాల ప్రదర్శన, 2007 లో మైసూరు పట్టణం లో జరిగింది. కర్ణాటక చిత్ర కళాపరిషత్ , బెంగలూరు లో 2011 లో శంకర్ చిత్రాలు (భారతదేశ ప్రముఖులవి) తొలిసారిగా ప్రదర్శించబడ్డాయి. ఈ సందర్భం లో మైసూర్ టర్బన్ తో శంకర్ ను సత్కరించారు.
SriRamana
2008 లో హాసరేఖలు అనే పుస్తకం, శంకర్ గీసిన 80 మంది ప్రఖ్యాత భారతీయుల చిత్రాలతో, హాసం ప్రచురణలు వారిచే ప్రచురించబడింది.108 చిత్రాల తో కూడిన ధృవతారలు అనే శంకర్ చిత్రాల పుస్తకాన్ని ముఖి మీడియా వారు అక్టొబర్ 2011 లో ప్రచురించారు. ఈ సందర్భం లో శంకర్ బొమ్మల కొలువు అనే పేరుతో, శంకర్ చిత్రాలు, హైదరాబాదు లోని ICCR Art Gallery రవీంద్రభారతి లో ప్రదర్శించబడ్డాయి. శంకర్ గీచిన కర్ణాటక సంగీతకారుల చిత్ర ప్రదర్శన డిసంబర్ 2011 లో చెన్నై సంగీత అకాడెమి లో జరిగింది.
ఉద్యోగ విరమణ తర్వాత తన భార్య కీ.శే. శాంత ప్రోత్సాహంతో తాను చిత్రకళ చేపట్టినట్లు చెప్తారు. అన్న బాపు, వియ్యంకుడు కీ.శే. ముళ్ళపూడి వెంకట రమణ కళాత్మక రంగంలో కృషి చేయటానికి మంచి ప్రేరణ ఇచ్చారంటారు శంకర్. శంకర్ చిత్రాలు మరిన్ని చూడాలంటే శంకర్ వెబ్సైట్ www.sankarportraits.com చూడవచ్చు. శంకర్ ప్రస్తుత నివాసం చెన్నై.
తాజా కలం: ఈ వ్యాసం లో ప్రచురించిన చిత్రాల కాపీరైట్ హక్కులు చిత్రకారుడు శంకర్ గారివి. ఈ చిత్రాలు అనుమతి తో ప్రచురించబడ్డవి.
4 కామెంట్‌లు:
Wow, బాపు గారి తమ్ముడు శంకర్ గారు మంచి చిత్రకారుడని తెలుసు, ఇప్పుడు మరికొంచెం తెలియజెప్తూ వారి వెబ్ సైటూ ఇచ్చారు. చాలా సంతోషం.
very good artist.
Dear CB Rao garu ప్రముఖ చిత్రకారులు శ్రీ శంకర్ గారి గురించి యీ వ్యాసం ద్వారా విపులంగా తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు....Sreyobhilashi ..Nutakki Raghavendra Rao (kanakambaram)
ఒక మంచి చిత్రకారుడి గురించి చక్కటి పోస్ట్ రాసారు. చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి