మంగళవారం, అక్టోబర్ 10, 2006

తెలుగు బ్లాగరుల సమావేశం అక్టోబర్ ‘06
Photo by cbrao ఎడమనుంచి కుడికి శ్రిహర్ష, శ్రీనివాసరాజు, చదువరి.

అక్టొబర్ నెల 8వ తారీకు సాయంత్రం వెంగళరావు నగర్ హంగ్రీజాక్స్ బేకరి వద్ద వీవెన్, చదువరి నాకోసం నిరీక్షిస్తూ కనిపించారు. వారిద్దరితొ బాటు ఒక నూతన వ్యక్తి కనిపించారు. ఎవరబ్బా అని అలోచిస్తుంటే వీవెన్ పరిచయం చేశారు త్రివిక్రం అని. త్రివిక్రం బ్లాగుపై నేను సమీక్ష రాసి ఉన్నాను. (చూడండి - https://paradarsi.wordpress.com). ఊహలకు భిన్నంగా త్రివిక్రం త్రివిక్రముడంతటివాడు కాడు, అట్లని వామనుడు కాదు. ఆలోచనలో, రాయటంలో పెద్ద కాని త్రివిక్రం ఉండటానికి మధ్యస్తంగా ఉన్నారు. మితభాషి.

ఇంతలో శ్రినివాస రాజు వచ్చారు. వీరి బ్లాగులు http://dsrinivasaraju.blogspot.com
http://harivillu.blogspot.com/index.html హరివిల్లు బ్లాగు బానర్ design స్వయంగా అందంగా చేశారు. స్వస్థలం విశాఖపట్టణం ఉద్యొగం హైదరాబాద్‌లో. శ్రినివాస రాజు ‘అందాల రాముడు’ అని, చూసే వారి feeling.
Photo by cbrao ఎడమనుంచి కుడికి సి.బి.రావు, వీవెన్, త్రివిక్రం.


వీవెన్ గురించిన పరిచయం Telugu Lover’s Meet on 24-09-‘06 http://deeptidhaara.blogspot.com లో రాసి ఉన్నాను. cbrao పరిచయంకూడ ఇదే వ్యాసంలో రాశాను. చదువరి ఊహించిన దానికన్నా స్ఫురద్రూపి. వీరి బ్లాగు http://chaduvari.blogspot.com/index.html
వీరి అసలు పేరు తుమ్మల శిరిష్ కుమార్. sirishtummala@gmail.com ఒక Software సంస్థలో యాజమాన్య బాధ్యతలో ఉన్నారు. తెలుగు బ్లాగరులు 'ఆకలి తొడేళ్ల బేకరి ' కి 0 నుంచి 3 కిలొమేటర్ల దూరంలో ఉంటే శిరిష్ ఒక్కరూ దూరంగా వివేకానందనగర్ కాలనిలో నివాసం. తెలుగు వికిపిడియ కార్యక్రమాల్లొ చురుగ్గా ఉంటారు. మిగతావారిని ప్రోత్సాహిస్తారు. వీరి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని కావూరు.

సరే, కోరం ఉంది కదా! ఇక కార్యోన్ముఖులవుదామని వెంగళరావు నగర్ తోటకు వెళ్తే, అది తాళము వేసివుండుట వలన సిద్ధార్థ నగర్ తోటకు, చదువరి చతుష్చక్ర వాహనములో వెళ్లాము. ఇష్టా - గోష్టికి అనువైన బల్లలుపై కూర్చొనడమే తరువాయి, హర్ష నుంచి cell phone call వచ్చింది- హర్ష కొద్దిగా ఆలస్యం అవటంతో మమ్మల్ని miss అయ్యారు. ఎక్కడున్నారంటూ? అన్న ప్రశ్నకు వివరంగా బదులిచ్చి మేమున్న park కు రావటానికి కావలిసిన సూచనలిచ్చాను. అతను మన తెలుగుబ్లాగులో నూతన సభ్యుడట. ఇంతవరకూ ఎలంటి mails మన గుంపుకు పంపకపోవటంతో అతను అందరికీ కొత్తే. నేను రచ్చబండ లో రాసిన mails చూసి మన తెలుగుబ్లాగ్ గుంపు లో చేరినట్లుగా చెప్పారు. ఆశ్చర్యం ఏమంటే శ్రిహర్ష గుంపుకు కొత్త కాని కూడలికికి కాదు. శ్రిహర్ష బ్లాగు మీరు చూసే ఉంటారు. http://kinnerasani.blogspot.com/
హర్ష తీసిన ఈ చాయా చిత్రం చూడండి.
ఇందులో focal point నడిచే వ్యక్తి. స్థిర చిత్రంలో కూడా చలనం కనిపిస్తోంది. మంచి composition. harsha.pvss@gmail.com


మన బ్లాగర్ల సమావేశంలో ఎప్పుడూ నూతనంగా సమావేశంకు వచ్చినవారికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వటం అలవాటు. ఈ విధానంలో పరస్పర అవగాహనకు అవకాశం ఉంటుంది. ఈ నివేదికలో హర్షగురించి ఇంత రాయటానికి ఇదే కారణం. హర్ష స్నేహితుడు గ్రిద్దలూరు విజయకృష్ణ, గూగుల్, ఉత్తర అమెరికా లో పనిచేస్తున్నారు. చర్చ యునికోడ్‌పైన గూగుల్ అన్వేషణ
పైన మరలటంలో ఆశ్చర్యం లేదు. పలు పత్రికలు, కొన్ని తెలుగు వెబ్‌సైట్లు యునికోడ్‌ లో కాక ఇతర fonts వాడటం వలన పలు అంశాలు గూగుల్ అన్వేషణ లో రాలేక పోతున్నాయి.
తెలుగులో ఇంత సమాచారం లభ్యం అవుతున్నప్పుడు గూడా, అన్వేషణకు అందకపొవటమనే విచిత్ర పరిస్థిలో ఉన్నాం మనం. ఈ సందర్భంలో నాకు Samuel Taylor Coleridge రాసిన The Rime of the Ancient Mariner లోని కవిత గుర్తుకొచ్చింది.
"Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink."

పడవ నడిసంద్రంలో నిలువడినప్పుడు ఒక నావికుని మనస్పందన, కాలరిడ్జ్ ఎంత చక్కగా చెప్పారో; సమాచార వెల్లువలో కొట్టుకపోతున్న మనకు ఈ సమాచార లేమి, నావికునికి మనకూ ఉన్న దగ్గర సామీప్యాన్ని చెప్పకనే చెప్తుంది. ఈ సందర్భంలో ఎంతో ముందుచూపుతో Unicode వ్యాప్తికై చావా కిరణ్ చేసిన, చేస్తున్న కృషిని అందరమూ అభినందించాము.

ఇష్టా గోష్టిలో పలు అంశాలు మా దృష్టిలోకి వచ్చాయి. http://www.archive.org/details/millionbooks
లో 2248 తెలుగు పుస్తకాలు లభ్యమౌతున్నాయి, ఉచితంగా. చూడండి. http://tinyurl.com/owpsz
పుస్తకాలకు www.amazon.com పెట్టింది పేరు. తెలుగులో కూడా అమజాన్ లాంటిది ఉంది తెలుసా? చూడండి - http://www.avkf.org ఇక్కడ ఎన్నో తెలుగు పుస్తకాల సమీక్షలు కూడా ఉన్నాయి. మీ అభిమాన రచయితల పుస్తకాలకై ఇక్కడ order చేసే సదుపాయం ఉంది. పుస్తక సమీక్షలన్నీ image .jpg లో వుండటం వలన search కి దొరకవు. అన్వేషణకి Unicode తప్పనిసరి అని మీకు తెలుసు. హర్ష ఈ avkf వారిని కలిసి Unicode గురించి చెపితే, వారు ఆసక్తి కనిపించారని చెప్పారు. మరి మనం ready యా?
http://eemaata.com/em ఈ-మాట electronic bi-monthly చూసారా? ఇది తెలుగులోని ఏకైక Unicode పత్రిక. తెలుగు బ్లాగరుల తరపున ఈ-మాట వారికి అభినందనలు తెలుపుదామా?
Unicodeలో లేని తెలుగు వెబ్సైట్లు, మాసపత్రికల విషయమై ఏమి చేద్దాము?

హర్ష ఆగమననికి ముందు చదువరి, సి.బి.రావు మధ్య తెలంగాణ విషయమై లఘు చర్చ జరిగింది. కొద్దిరొజులైనా తెలంగాణా ని పక్కకు పెట్టి వెరే విషయంపై చదువరి బ్లాగురాయటం అనే సక్రియ (మంచి పని) అభినందనలు అందుకొన్నాక సి.బి.రావు చర్చను కొనసాగిస్తూ అన్నారు. ప్రత్యేక తెలంగాణ కావాలనుట తప్పు. అసలు బాష ప్రాతిపదికపై రాష్ట్రం కావాలనుట ఒక చారిత్రాత్మక తప్పు. దేశము పరిపాలనా సౌలభ్యానికై, మాత్రమే విభజింపబడాలని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఈ నదీ జలాల పంపిణి గొడవలు, రాష్ట్రాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండవన్నారు.

అసలు నాకైతే మానవజాతి విశ్వాన్ని, ఇట్లా దేశాలుగా విభజించుకొవటమే ఈ సరిహద్దు తగాదాలు, యుద్ధాలకు మూలకారణమనిపిస్తుంది. ఈ స్వార్థ పూరిత అభిమానాలు వదిలేసి , ఎప్పుడైతే మనం విశ్వ మానవులం అవుతామో అప్పుడే మనకు నిజమైన శాంతి దొరుకుతుందనే గట్టి భావన ఉంది. ఈ విశ్వశాంతి ఎప్పుడు సాధ్యపడేను?

సాయంత్రపు చీకటి మెల్ల మెల్లగా విస్తరిస్తూంది. చర్చలో పడితే పొద్దే తెలియదు. ఎంతటి మంచి విషయాలకైనా ముగింపు తప్పదు కదా! మరల వచ్చే నెల కలుద్దామంటూ, ఆనంద హ్రుదయాలతో - సమావేశం కంచికి -మనమింటికి.

7 వ్యాఖ్యలు:

Sowmya చెప్పారు...

baagundanDi rao gaaroo mee MOM.

సుధాకర్ చెప్పారు...

..నేను ఈ బ్లాగు ప్రతి కోసమే ఎదురు చూస్తున్నా:-)
మంచి సమావేశం తప్పిపోయా :-( ఏంటో ఈ కంప్యూటర్ కూలీ బతుకులు, పగలు, రాత్రి , ఆదివారం అనే తేడా లేకుండా పోయింది. http://www.archive.org/details/millionbooks చాల బాగుంది. ధన్యవాదాలు.

నాగరాజా చెప్పారు...

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టపా ఇది. అందరిని ఒకసారి చూడాలనిపించింది. ప్రచురణకు కృతజ్ఞతలు రావు గారూ.

చంద్రశేఖర్ వల్లభనేని చెప్పారు...

చాలా బాగుంది రావు గారూ...
ధన్యవాదములు...I am missing these meetings.
నేను ఇంకా వొక నెల దాకా రాలేనేమో....
ఇక్కడ Finland చలిలో ఇబ్బందులు పడుతూ ఇంకా వో నెల గడపాలి...

రవి వైజాసత్య చెప్పారు...

అర్రే ఇది కూడలిలో రాలేదేంటి. ఈ రోజు ఉదయం శ్రీనివాస రాజుతో మాట్లాడుతుంటే ఆయన చెప్పేదాక తెలియలేదు. రావు గారు మన మిత్రులందరిని చిత్రాలలో బంధించి ఈ టపాలో పెట్టినందుకు చాలా కృతజ్ఞతలు.

Ramanadha Reddy చెప్పారు...

Thank you for all the details and informations, Sir.

-Rananre

siva చెప్పారు...

meeru samavesam ayytappadiki neneu tirupati lo unnanu.
ippudu koncham kaali dorikindi.


vishayanni samagramga ,sachitraroopamgaa
cheppinandulaku
danyavaadamulu

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి