సోమవారం, మార్చి 12, 2007

ఈ తెలుగు సంఘం సమావేశం March 2007


Laxminarayana Yadav Park, Entrance Gate.

ఈ నెల వేదిక: కంజెర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు, మోడల్ కాలనీ, ఎర్రగడ్డ. ఈ ఉద్యానవనము సుందరంగా ఉంది.
సమయం: సాయం కాలం 3.30 గంటలు. నేను, వెంకట రమణ, వీవెన్ వెళ్ళేసరికి, ఉద్యానవనం బయట చదువరి మాకోసం నిరీక్షిస్తూ కనిపించారు. ఆయన సమయ పాలన పాటించటంలో కరారైన వ్యక్తి. Park బయటే కబుర్లలో పడ్డ మమ్మల్ని మిగతా మిత్రులు ఒక్కరొక్కరుగా వచ్చి కలిశారు. ఈ సమావేశానికి కొంతమంది బ్లాగరులు తొలిసారిగా వచ్చారు. తెలుగు బ్లాగరుల సమావేశానికి ఊహించినదానికన్నా ఎక్కువమంది సభ్యులు రావటంతో సమావెశం లో నూతన ఉత్తెజం కనిపించింది. తొలిసారిగా సమావేశానికి వచ్చినవారు, ఉత్సాహంగా చర్చలలో పాల్గొన్నారు.

ప్రధమముగా వచ్చిన వారు


From left to right: Trivikram (Partly visible), Madanmohan, Narayana and Brahmam.

1) మదనమోహన్ యార్లగడ్డ వీరు secretariat ఉద్యోగి.
వీరి బ్లాగు 'నిజం'.
http://ymadanmohan.blogspot.com/

2) బ్రహ్మం వీరు C.A. చేస్తున్నారు.
వీరి బ్లాగు 'నా తీపి కలలు
పంచుకుంటారా…..'.
http://kandukuri.wordpress.com/
వీరితో వీరి మిత్రులు నారాయణ వచ్చారు. ఇద్దరూ (C.A.) సహధ్యాయులే.
బ్రహ్మం కవి. కనిపిస్తూ విసిగిస్తారా అన్న వ్యాఖ్యను సహృదయంతో స్వీకరించారు. అందరికీ తన స్వప్నాన్ని కవిత రూపంలో వినిపించారు. నేనన్నాను - మా మిత్రుడు ఒకరికి కవులంటే పడదని - అతన్ని ఎవరైన విసిగిస్తే అంటారు - నువ్వు మనిషివా లేక కవివా? అని. ఈ వాక్యం పూర్తవుతూనే నవ్వులు విరిశాయి సమావేశంలో.


L to R: Srinivasa Raju, Pavan and Venkata Ramana

3) ఫవన్ కొమ్మిరెడ్డి
B.Tech ఉత్తీర్ణుడయి, US లో M.S. కోసం నిరీక్షిస్తున్నాడు. తన బ్లాగు 'పవన్ గాడి ప్రపంచం... '
http://pavankommireddi.blogspot.com/
పవన్ అక్క చేతన తన బ్లాగు
http://naacamera.blogspot.com/index.html
ద్వారా మనకు పరిచితమే.

కొత్తగా వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ సమావేశానికై ఉద్యానవనంలో ఉన్న Globe దగ్గర పచ్చికపై ఆసనమయ్యాము. సమావేశం నవ్వులు కురిపించింది, సభ్యుల సరస సంభాషణలలో. e.తెలుగు సంఘం కార్యక్రమాలపై చర్చ తొలిగా వచ్చింది. భారత దేశంలో bureaucracy, red tape ఎక్కువ అనే విషయం సర్కారీ కార్యాలయానికి ఎదైనా పనిమీద వెళ్ళిన ప్రతి ఒక్కరికి అనుభవమే. మన society ని registration చెయ్యటం వలన చట్టపరిధి లో చెయ్యవలసిన కార్యక్రమాలు, reports, accounts, elections అనె చట్రం లో బిగించబడి మన సంఘ కార్యక్రమాలకై వెచ్చించవలసిన శక్తి అలా వృధా అవుతుంది కనుక unregistered society గా ఉంటే ఆ పనులకు కు దూరంగా, మన సంఘ కార్యక్రమాలకు దగ్గరగా ఉండవచ్చని వీవెన్ అభిప్రాయ పడినారు.

From L to R: Veeven. Chaduvari and Chandrasekhar

మన సభ్యులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం వెసులుబాటు కాదు కనుక కొంతకాలం unregistered society గానే నడుపుదామని c.b.rao సూచించారు. c.b.rao అప్పటికే registration కు కావలసిన documentation అంటే Memorandum of the Society, Rules & Regulations సిద్ధం చేసి ఉంచటం వలన registration చేస్తే బాగుండునని చదువరి అభిప్రాయపడినారు. ఆ దిశగా ఇక పనులు జరగాల్సిఉంది. ఇక విదేశి సభ్యులు, వారి విరాళాల విషయంలో Foreign Exchange Management Act కింద society పేరు మేద వచ్చే పైకం స్వీకరించవలసి ఉంటుంది. దీనికై Reserve Bank of India అనుమతి పొందవలసి ఉంటుంది. అక్కడ దరఖాస్తు కి ముందర ఆదాయపు పన్ను శాఖ నుంచి మినహాయింపు పత్రం పొందాలి. ఈ పనులకు ఒక సంవత్సరం పట్టగలదని అంచనా.

అమెరికా మిత్రుల విషయములో - మీకు కొన్ని సూచనలు ఇస్తాము. సాధ్యమయినవి పరిశీలించి ఆచరణలో పెట్టండి. ఈ తెలుగు అమెరికా శాఖ autonomous body గా వ్యవస్థీకరించండి. అమెరికా తెలుగు బ్లాగరులు, వికిపీడియన్లూ అందరూ కలిసి పనిచేయాలని, మా కోరిక. మీరు ఈ తెలుగు సంఘం ఆశయాల కనుగుణంగా పనిచేస్తే బాగుంటుంది. ఈ తెలుగు ఉత్తమ తెలుగు బ్లాగుల పుస్తక ప్రచురణలో ముద్రాపకుల bill, direct గా మీరు చెల్లించగలిగతే ఇక్కడ society accounts లో income tax - deduction at source-reports - returns filing తలనొప్పులు తగ్గుతాయి.మన సంఘం తలపెట్టే ఇతరపనులకూ మీరే direct గా payment చెయ్యవచ్చు.

ఇక తెలుగు బ్లాగుల విషయంలో వాటి సంఖ్య పెరిగిందనీ, చదవటానికి చాలా సమయం పడుతుందని కొందరు సభ్యులు తెలియచేసారు. బ్లాగులకు tags పెట్టడం, digg తరహాలో ఎక్కువ జనామోదం పొందిన బ్లాగులను ప్రధమ పేజీలో, మిగతావి రెండవ పేజీలోను కూడలి లో కనపడతాయి, ఆరు నెలల తరువాత. ఇలా మీరు ఎంపికచేసిన బ్లాగులే చదవటం వలన మీ సమయం ఆదా కాగలదు. మన website లో చర్చలకై ఒక forum పెట్టాలనే ఆలోచన ఉంది.మీ సూచనలు మాకు ఎప్పుడూ ఆమోదమే.

సమావేశ ప్రారంభంలో త్రివిక్రం ఇంత క్రితం శబ్ధార్ధచంద్రిక అందని తెలుగు విక్షనరీ వీరులకు మేత పత్రాలు అందచేశారు. ఇంకా చెయ్యవలసినవి

1. స్కయిప్ తెలుగీకరణ పూర్తి చేయాలి.
(http://wiki.etelugu.org/index.php?title=%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%AF%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B)
2. వర్డుప్రెస్సు తెలుగీకరణ పూర్తి చేయాలి
(http://wiki.etelugu.org/index.php?title=%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B)


From L to R: Sitting : Sudhakar, Venkata Ramana, Veeven, Chaduvari, Chandrasekhar, cbrao. Standing: Srinivasa Raju, Kasyap, Trivikram and Madan Mohan

మీ బ్లాగు కు పాఠకులు పెంచుకోవాలంటే regular గా రాస్తూ ఉండాలని ఇండీ బ్లాగరు విజెత శోధన సుధాకర్ tip ఇచ్చారు. ఛంద్రశేఖర్ తాను తెలుగులో digg లాంటి site తీసుకు వస్తానని చెప్పారు. అంతే కాక Finland నుంచి సమావెశానికి వస్తూ బ్లాగరులకు అక్కడి నుంచి మధురమైన, గమ్మత్తైన chocolates తెచ్చారు. మన సుధాకర్ చక్కటి మిఠాయి తెచ్చారు. అందరికీ తేనీరు, కాఫీలు అందాయి -సుధాకర్ సౌజన్యంతో. మాటల్లొ సమయమే తెలియ లేదు. సాయంకాలం 7 గంటలయినా కబుర్లు కొనసాగుతూనే ఉన్నాయి. నేనన్నాను all good things must come to an end అని కాదు ఇది good things కి begining అని రమణ సవరణతో సమావేశం ముగిసింది.

7 కామెంట్‌లు:

సత్యసాయి కొవ్వలి Satyasai చెప్పారు...

టపా చదువుతోంటే నేను కూడా ఆ సమావేశంలో ఉన్న అనుభూతి కల్గించారు మీ సహజ శైలిలో. ఫోటోలో standing ల తో పాటు కొంతమంది outstanding లు కన్పించారు, వాళ్ళని కూడా బ్లాగ్ప్రపంచంలోకి లాగేయ్యాల్సింది.

అజ్ఞాత చెప్పారు...

చాలా సంతోషం

కొత్త పాళీ చెప్పారు...

ఈ సమావేశాల గురించి బొమ్మలతో సహా రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
అక్కడా ఇక్కడా కొన్ని స్వఛ్ఛంద సంస్థలతో పనిచేసిన అనుభవం తో చెపుతున్న సలహాలివి:
1. డబ్బు ప్రసక్తి లేనంత సేపూ రైజిస్ట్రేషన్ తో పని లేదు. ఏ రూపంలోనైనా (విరాళం, చందా, సభ్యత్వ రుసుము, అమ్మకాలు, కొనుగోళ్ళు) డబ్బుతో పని వుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది.
2. బ్యూరోక్రసీ తలనెప్పే, కాదనను, కానీ ఆంధ్రలో సొసైటీ రిజిస్ట్రేషన్ పరమ ఈజీ.
3. ఈ రిజిస్ట్రేషన్ మిమ్మల్ని రక్షిస్తుంది కూడా.
4. సొసైటీ రిజిస్టరైన తరవాత సుమారు ఒక సంవత్సరానికి non-profit tax status వస్తుంది. రిజర్వ్ బాంక్ ఇచ్చే FCRA clearance రావటానికి ఇంకో మూడేళ్ళు పడుతుంది. ఈ సమయంలో కచ్చితంగా సొసైటీ తరపున ప్రతి యేడూ tax returns file చేస్తుండాలి.

రాధిక చెప్పారు...

మీకు అప్పుడే సమావేశం ముగిసిందా అనిపిస్తే మాకు ఈ టపా అప్పుడే అయిపోయిందా అని అనిపించింది.మంచి మంచి నిర్ణయాలతో,మంచి ప్రణాలికలతో ఈ సంఘం అభివ్రుద్ది చెందాలని కోరుకుంటున్నాను.

అజ్ఞాత చెప్పారు...

రావు గారు, ఒక సారి ఈ లింక్ చూడండి.

http://raju.wordpress.com/2007/03/14/digg-%e0%b0%ae%e0%b1%81%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%89%e0%b0%97%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b1%81%e0%b0%95/

అజ్ఞాత చెప్పారు...

క్షమించాలి...ఆ లింక్ సరిగా పోస్ట్ అవలేదనుకుంటా... దయ చేసి.. ఈ లింక్ చూడండి. ముద్ర - డిగ్ తెలుగులో

అజ్ఞాత చెప్పారు...

అన్నేసి స్వీట్లు మా కెవళ్ళకీ పెట్టకుండా తిన్న తరువాత కూడా మీకు కడుపు నొప్పి రాలేదా? రాక పోతే ఇప్పుడొస్తుంది చూడండి :-)

ఇక మీదట నుండి మాట్లాడిన మాటలు రికార్డు చేసి మరీ మాకు వినిపించండి.

ఈ సారి చాల మందే వచ్చినట్టున్నారు సమావేశానికి. చర్చలు మరింత లోతుగా వెళుతున్నాయి. ఇది ఇంకొక మంచి పరిణామం.

విహారి

కామెంట్‌ను పోస్ట్ చేయండి