కౌముది వెబ్ మ్యాగజైన్‌కి ఒక రోజున 5000 మంది unique visitors వచ్చారు. కొత్త పత్రిక ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలం ఉండటం సహజం.
కూడలికి daily visitors 300 దాకా వుంటారు. ఇవి కాకుండా 500 దాకా rss feeds ఉంటాయి. ఇవన్నీ home page కి వచ్చే hits. అన్ని పేజీల హిట్లంటే ఇంకా ఎక్కువుంటాయని మీరు తేలికగా ఊహించగలరు.
తేనెగూడు జనవరి నెల వీక్షకుల సంఖ్యా వివరాలు
Month Unique visitors Number of visits
Jan 2007 843 2487
తెలుగు బ్లాగుల బలాన్ని అంచనా వేయటానికి ఇలా మనము తులనాత్మకంగా పరిశీలన చెయ్యవచ్చు. వెబ్ పత్రికలు చదివేవారు కూడలి, తేనెగూడు కూడ చదువుతారనుకోవటము కేవలము wishful thinking. వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. ఈ -మాట, కౌముది, ప్రజా కళ వగైరా పత్రికలకు ఉత్తరాలు రాసేవారు మన కూడలి లోని బ్లాగులకు ఎన్నడూ రాయలేదనే విషయం గమనించారా? వెబ్ పత్రికల పాఠకులు భిన్నంగా ఉంటారని తెలుసుకోవటం అవసరం. మీ బ్లాగులో రాస్తే కూడలి పాఠకులు చదువుతారు కాని కౌముది పాఠకులు చదవరు. పాఠకులకు కొన్ని ఇష్టాలుంటాయి. వాటి ప్రకారం తాము బ్లాగులు చదవాలో, వెబ్ పత్రికలు చదవాలో, నిర్ణయించుకుంటారు. మీరు అన్ని వెబ్ పత్రికలు చదవనట్లే, ఆ పత్రికల పాఠకులు తెలుగు బ్లాగులు చదవరు. దీనికి కారణం వారికి మన బ్లాగుల గురించి సమాచారం లేకపోవటం ఒక ముఖ్య కారణం. ఈ లోపాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. మీరు కొత్త పాఠకులను పెంచుకోవాలంటే వెబ్ పత్రికలకు రాయక తప్పదు.
1 కామెంట్:
రావు గారు,
మీరన్నది నిజం మ్యాగజైన్ ప్రియులు ఉంటారు. దీనికి ఒక కారణం తెలుగు బ్లాగుల సంఖ్య. తేనెగూడు, కూడలి సంఖ్యలు చూస్తే దాదపు 250 పై చిలుకే. కాని వాటిలో రోజు రాసేవారు 20(average) వరకు ఉన్నరు. ఈ సంఖ్యలను తమిళ బ్లాగులతో పోలిస్తే - తేన్ కూడు లో 1200 పైగా తమిళ బ్లాగులు ఉన్నయి.
కాని బ్లాగులలో వస్తున్న వ్యాసముల సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతున్నది. తేనెగూడు february (20 రోజులలోనే) వీక్షకుల సంఖ్య january సంఖ్యను మించి పోయింది.
మన తెలుగు మిత్రులు ఎక్కువ మందిని ఈ రంగంలోకి దించాలి.
--గౌరి శంకర్
కామెంట్‌ను పోస్ట్ చేయండి