గురువారం, అక్టోబర్ 09, 2008

అమెరికా కబుర్లు

అమెరికాలో, ఉద్యోగస్తులలో, ఉద్యోగ అభత్రతాభావం ఎక్కువయ్యింది ఈమధ్య; ఇక్కడి ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వలన. సబ్‌ప్రైం సంక్షోభం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ల లో ఎడతెగని యుద్ధాలు ఈ ఆర్థికమాంద్యానికి దోహదపడ్దాయి. 2008 జనవరి నుంచి ఆగస్ట్ దాకా ప్రతి నెలా 75000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సెప్టెంబర్ మాసంలో 159,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. పొయిన సంవత్సరం 2.2 మిలియన్ల నిరుద్యోగులు, ఈ సంవత్సరం 9.5 మిలియన్ల నిరుద్యోగులయ్యారు. సెప్టంబర్ లో 6.1 ఉన్న నిరుద్యోగ శాతం, వచ్చే సంవత్సరం ఆఖరికి 8 శాతం కాగలదని ఆర్థిక నిపుణుల అంచనా. లెహమాన్ సోదరులు, వకోవియా బాంక్ వంటి ఆర్థిక సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షొభంలో పడిపోయి, యాజమాన్యం చేతులు మారుతుంది. కొన్ని ఆర్థిక సంస్థలను ఆదుకోవటానికి ఫెడరల్ ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ, సబ్‌ప్రైంలో ఇరుక్కున్న పెక్కు ఆర్థిక సంస్థల పరిస్థితి దిక్కు తోచకుండా వుంది. మిలియన్ డాలర్ విలువ గల ఇల్లు, 750,000 డాలర్లకు లభ్యమవుతుంది. గత పాతికేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.ఆర్థిక మాంద్యం వలన ఇదివరలా ఇంక్రిమెంట్లు, ప్రొమోషన్లు తగ్గిపోయాయి. జీతభత్యాలలో పెరుగుదల 2.8 శాతముంటే, ఆహారం, గాస్ (పెట్రోల్) ధరల పెరుగుదల నిరాశ కలుగ చేస్తుంది. స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా అంతంత మాత్రం గానే ఉంది.డౌజోన్స్ కర్మాగార సగటు సంవత్సరం మొత్తం మీద మూడవ వంతు విలువ కోల్పోయింది. గత 5 పనిదినాలలో డౌ సుమారుగా 1400 పాయింట్లు కోల్పోవటంతో, ఇక్కడి వాల్ స్ట్రీట్ కళావిహీనంగా ఉంది.

అమెరికాలో ఇల్లు కొనాలంటే ఇదే సరైన తరుణమనిపిస్తుంది. కానీ మీ Social Security పత్రం లోని FICO SCORE ఎంతా బాగున్నా, బాంకు లలో కారు కొనటానికే, అప్పు దొరకటం కష్టంగా ఉంటుంది. కారణం బాంకులలో liquidity సరైనంతగా లేక పోవటమే. స్టాక్ మార్కెట్ల పరిస్థితి మారి, బాంకులు ఇళ్ల అప్పులు మరల ఇవ్వటం మొదలయ్యే దాకా, ఇళ్లు కొనటం అమ్మటమనే లావాదేవీలకు గడ్డు కాలమే. ఇక్కడ కరెన్సీ నోట్ల వెనక IN GOD WE TRUST అనే వాక్యం ముద్రించబడి ఉంటుంది. దేవుడే దిగివచ్చి పరిస్థితి చక్కబెట్టాల్సిన కాలమే ఇది. ఎదైనా అద్భుతం జరిగేదాకా, పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది.

ఇక్కడి వారు, సోమవారం నుంచి శుక్రవారం దాకా కష్టించి పనిచేస్తారు. రోజూ ఇంట్లోంచి ఉదయం 7 గంటలకే తమ తమ కార్యాలయాలకు బయలుదేరుతారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి 6 లేక 7 గంటలవుతుంది.శుక్రవారం రాత్రయితే, రోజులా రాత్రి 9 - 10 గంటల మధ్య నిద్ర పోనవసరం లేదు. మందు ప్రియులయితే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లటమో లేక ఇంట్లోనే పార్టీ చేసుకోవటమో చేస్తుంటారు. ఉద్యోగ పరమైన అనిశ్చిత పరిస్థితి, ఉద్యోగులలో నిస్పృహ కలుగచేస్తుంది. బాస్ పై కోపంతో, హడావుడిగా, తిడ్తూ, ఉత్తరం బాస్ కు పంపి, తీరికగా పశ్చాత్తాప పడేవారినీ మనము ఇక్కడ చూడవచ్చు.

మందు ప్రభావంతో ఇలా బాస్ కు ఉత్తరం పంపి, తరువాత అగచాట్లు పడే దురవస్థ నుంచి ఉద్యోగులను తప్పించటానికి గూగుల్ తన వంతుగా, కొత్తగా Mail Goggles అనే సదుపాయాన్ని జీ-మెయిల్ వాడేవారికి కలిపించింది. శుక్ర,శని వారాలు రాత్రులలో ఇలాంటి ఉత్తరాలు బాస్ కు రాస్తే, గూగుల్ పసిగట్టి గణితంలో చిన్న పరీక్ష పెడ్తుంది. మందు ఎక్కువయితే ఈ గణిత పరీక్షలో గెలుపొందకపోతే, ఆ ఉత్తరం బాస్ కు జీ-మైల్ పంపించదు. ఆ తరువాతి రోజు ఉదయం, ఆ ఉత్తరం రాసిన వారు అది చదువుకొని, నాలుక కరుచుకొని, తీసివెయ్యటం జరుగుతుంది. జీ-మైల్ లో ఈ సదుపాయానికై మీరు Settings-Labs కు వెళ్లి అక్కడి Mail Goggles ను enable చేస్తే చాలు. మీ ఉద్యోగం భద్రం. మీరు settings లో ఇప్పటికే తెలుగు enable చేసి ఉంటే ఈ Labs_ Mail Goggles కనిపించవు. జీ-మెయిల్ తెలుగు అనువాదకులు, తెలుగు అనువాదంలో ఈ Labs బొత్తాన్ని settings లో ఉంచలేదెందుకనో.మన e-తెలుగు వారు ఈ తప్పును సరిదిద్దాల్సి ఉన్నది.

-cbrao
Atlanta,Georgia,USA.

7 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఈ పరిస్థితితో నైనా అమెరికా యుద్ధాలు చేయడంమానివేసి తన పని తాను చూసుకుంటే ప్రపంచం బాగుపడుతుందేమో !
విజయదశమి శుభాకాంకాంక్షలు.ఆ లోకమాత మీకు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ....

అజ్ఞాత చెప్పారు...

అమెరికా చేసిన యుద్దాల్లో కొన్ని అది చేయకుండా ఉన్నట్లయితే, ప్రపంచం ఇంకా దుర్భర పరిస్థుతులల్లో ఉండి ఉండేది విజయమొహన్ గారూ. గుడ్డిగా ప్రపంచంలో ఉన్న సమస్యలకి అన్నింటికీ, అమెరికానే మూలకారణం అనే ఆలోచన లేని వాదం లోంచి బయటకొచ్చి, కొంచెం ఓపెన్ మైండ్ తో చరిత్ర చదివితే అమెరికా చేసిన మంచి పనులు చాలా కనబడతాయి. కావల్సిందల్లా ప్రాపగాండా బారిన పడకుండా ప్రతి వాదానికి రెండు వైపులా ఉన్న పుస్తకాలు చదివితే చాలు.

సబ్ ప్రైం సంక్షోభానికీ, యుద్దాలకీ ఏ సంభందమూ లేదు.

ఈ క్రైసిస్ కి ఉన్న మూల కారణాల్లో, loosening standards of lending practises in community reinvestment act(CRA) ఒకటి, wall street greed రెండవది.


అన్ని చోట్లా రాజకీయాలు ఎలా ఉంటాయో, ఇక్కడా అలాగే పొలిటికల్ పార్టీస్ ఎజెండా లు చాలా పాత్ర పోషిస్తాయి. 1977లో స్థాపించిన CRAలో రూల్స్ ప్రకారం ఇళ్ళకి లోన్లు ఇవ్వాలంటే, కస్టమర్స్ కొన్ని మినిమం స్టాండర్డ్స్ మీట్ అవ్వాల్సి వచ్చేది , 90ల్లోకి వచ్చేసరికి డెమొక్రటిక్ పార్టీ ఎజెండా ప్రకారం, తక్కువ ఆదాయ వర్గాలకి హోం ఓనర్షిప్ పెంచాలీ అన్న సదుద్దేశం తో వాళ్ళు రూల్స్ ని బాగా సడలించారు (ఈ పార్టీ వాళ్ళకి లో ఇన్ కం గ్రూప్స్ లో బాగా కనబడే బ్లాక్స్ ఓ పెద్ద వొటింగ్ బ్లాకు ఉదా: ప్రతి ఎలక్షన్ లో 85-90% అఫ్ బ్లాక్స్ డెమొక్రటిక్ పార్టీకి వోటెస్తారు. ఈ శాతం 60-65%కు పడిపోయినా చాలు ఈ పార్టీ వాళ్ళు ఎలక్షన్స్ గెలవలేరు). ఆ సడలించిన దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకొని, 2000 ల్లో కొచ్చేసరికి, చాలా లెండింగ్ కంపెనీలు, ఇష్టం వచ్చినట్లుగా లోన్లు ఇచ్చేసి వాటిని తిరిగి సెక్యూరిటీస్ చేసి అమ్మి పడేసారు. In the words of american radical Malcom X, "The chikens came home to roost now".

ఇంకా రాయాలంటే చాలా ఉంది. Fannie mae, Freddie mac ల గురించీ, House Financial Services Committee chairman Barney Frank, Chairman of the Senate Banking Committee Chris Dodd ల గురించీ, ఈయన biggest receipient of political contributions from Fannie Mae అన్న విషయం గురించీ, ఇంకా ఇతర సెనెటర్ల గురించీ(వెరే పార్టీ), lobbying groups గురించీ, ఇవ్వాల్టి రాజకీయ నాయకులు, రేపటి లాబీయర్స్ గా ఎలా రూపాంతరం చెందుతారనేదాని గురించీ, wall streetకీ , lobbying firms కీ ఉన్న దగ్గరి సంబంధం గురించీ చాలా రాయాలి. కానీ ఓపిక లేదు. కావాలిస్తే మీరు గూగుల్ చేసుకోండి.
CRA గురించి చదవాలంటే ఈ లింకు చూడండి, చివరి దాకా, లేక కనీసం చివరి సెక్షన్స్ అన్నా చదవండి. ఇంకా గూగుల్ చేస్తే, పార్టీల ఎజెండాలు (ముఖ్యంగా డెమొక్రటిక్ పార్టీ నల్ల వాళ్ళని ప్లీజ్ చేయడం, రిపబ్లికన్ పార్టీ డీరెగ్యులషన్ ప్రిన్సిపుల్స్) ఎంత ప్రభావితం చేసాయో తెలుస్తుంది.

Tony Morrison(Nobel Laurette in Lit) called Clinton as the first black president of america. He was the president in 90s, during which the loosening started. I am not blaming him. This problem is too big and the blame goes across two parties. All these big-ass fat cats in Republican Party also contributed to this problem. By the way, blacks fought hard for Clinton during his impeachment trial in Ms Lewinsky scandal.

Anyway I take rest now, coz I can't stop. The point I am trying to make is, 'please don't be so gullible to believe all the crap that is thrown on America'. America is a good country and a very decent one. Certainly better than vast majorities out there.

http://en.wikipedia.org/wiki/Community_Reinvestment_Act

Anil Dasari చెప్పారు...

ఇండిపెండెంట్,

మిగతా యుద్ధాల గొడవ వదిలేద్దాం. ఇరాక్ యుద్ధంతో మాత్రం అమెరికా సాధించింది ఏమీ లేదు - ఆ ప్రాంతాన్ని మరింత అస్థిర పరచటం తప్ప. ఇప్పుడున్న సంక్షోభానికి యుద్ధాలు కారణం కాకపోవచ్చు కానీ అమెరికా మిగతా ప్రపంచంలో ఎంతో కొంత క్రెడిబిలిటీ కోల్పోవటానికి, చాలా దేశాల్లో అమెరికా అంటే వ్యతిరేకత ప్రబలటానికి అది కారణమయిన మాట వాస్తవం. అయితే, మిగతావారి సంగతేమో కానీ, అమెరికా చేస్తున్న యుద్ధాల వల్ల చాలామంది భారతీయులు పునర్నిర్మాణ ప్రాజెక్టుల పేరుతో లబ్ది పొందుతున్నారన్నదీ నిజమే. దేన్దోవ దాన్దే :-).

బాటసారి చెప్పారు...

ఇండిపెండెంట్ చెప్పింది ఇంకా బాగా అర్ధం అవ్వాలంటే ఈ వ్యాసం చదవండి..

http://www.hindu.com/mag/2008/10/05/stories/2008100550010100.htm

@ఇండిపెండెంట్

ప్రపంచానికి అమెరికా వల్ల చాలా మంచి జరుగుతుంది అనేది ఎంత నిజమో, చాలా చెడు జరుగుతుంది అనేది కూడా అంతే నిజం. మంచి జరిగినప్పుడు మరిచిపోయి, చెడు జరిగినప్పుడు విరుచుకు పడటం మానవ నైజం.

Purnima చెప్పారు...

@independent / బాటసారి

Thanks for the info!

Ramani Rao చెప్పారు...

మంచి ఇంఫర్మేషన్.

అజ్ఞాత చెప్పారు...

మీరు అమెరికా నుంచి టపా చేస్తున్నారని తెలుస్తోంది, ఈ యెటూ కాని భాషాశైలిని బట్టి !

కామెంట్‌ను పోస్ట్ చేయండి