బుధవారం, సెప్టెంబర్ 24, 2008

ఈ జన్మ లో మరో జన్మ

కొన్ని సార్లు ఏమి జన్మరా బాబు, చస్తున్నాము, మరలా జీవితం పునః ప్రారంభిస్తే బాగుండును అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎదైనా కొత్త ప్రదేశానికి, ఇప్పుడు చుట్టూ ఉన్న వ్యక్తులకు దూరంగా వెళ్లి ప్రశాంతంగా బతకటం సాధ్యమా? ఇలా చేయాలంటే మీకొక కొత్త identity కావాలి. అదెలా? సాధ్యమేనంటున్నారు Barry Reid గారు తన కొత్త పుస్తకం How to Disappear in America లో.ఈ పుస్తకం గురించిన వివరాలు http://www.edenpress.com/showbook.asp?index=999@10@Agclid=CIKDsZm19JUCFQNfFQodq0jlhg లో చూడవచ్చు. మరి భారత దేశం లో మాయమవటం ఎలా అని మీ సందేహమా? ఎన్నో హైటెక్‌లున్న అమెరికా లో మాయమవగా లేంది,లంచగొండి భారతావనిలో ఈ పద్ధతులవలంబించి హుష్!కాకి అంటూ కళ్లు మూసే లోపు అదృశ్యం కావచ్చు. ఏవంటారు?

3 వ్యాఖ్యలు:

teresa చెప్పారు...

ప్రశాంతత సంగతి తెలీదు గానీ ఓ సా్ఫ్టువేర్‌ కంపెనీ్ మూసేసి ఇలా అదృశ్యమైన ఒకాయన భారతావనిలో FBI కి కూడా చిక్కకుండా బ్రతికేస్తున్నట్లు వినికిడి!

రమణి చెప్పారు...

ఇంకో జన్మ కాదు కాని, అబ్బా! జీవితం విసుగొస్తోంది అనే ఫీలింగ్ మటుకు నాకు ఈ మధ్యే మొదలయ్యింది,పిల్ల పరీక్షలు, ఆఫీసులో మీటింగ్స్, ఇంట్లో పనులు ఇవన్నీ ఒక్కసారిగా దాడి చేస్తుంటే, వత్తిడి ఎక్కువై ఈ జనారణ్యానికి దూరంగా ఎక్కడికన్నా పారిపోదామా.. అన్న ఫీలింగ్ కలుగుతోంది.హ.. హ.. హ కాని, ఈ బంధాలని, సంకెళ్ళను వదిలి ఎక్కడికీ వెళ్ళలేము కదా!

@తెరెసా: అలాంటి బతకలేని లేని అజ్ఞాతం... అమ్మో! వద్దులెండి.ఈ విసుగులాంటి జీవితమే బాగుంది.

srinivasa చెప్పారు...

శ్రీరామ్ రళీయ షడ్ వేదం
ఇక్కడ చూడవచ్చు,ramrali blog.co.uk
వీరి ఇతర రచనలకు
డా/పెయ్యేటి మురళీ మోహన రావు,రచయిత,
4-కె,వేల్ మాత్రే ప్లాజా,తిరుచానూరు రోడ్డు,
పద్మావతీ పురం,తిరుపతి- 517 503.
ఫోను:-0877/2284944; సెల్ :- 9885254670

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి