గురువారం, నవంబర్ 20, 2008

స్లండాగ్ మిలియనేర్ సమీక్షAll pictures courtesy: Fox

టొరొంటో లో People's Choice award వచ్చాక, Slumdog Millionaire చిత్రం ఆస్కార్ కు కూడా పరిగణింపబడే అవకాశాలున్నాయని, పలు పత్రిక్లలో విమర్శకులు ఊహాగానాలు చేస్తున్నారు. అంతే కాదు తమ పత్రికలలో అద్భుతమైన సమీక్షలు రాసి 10 కి 8 లేక 9 మార్కులు ఇచ్చి ఈ చిత్రానికి అగ్రస్థానం ఇస్తున్నారు. విమర్శకులను ఇంతగా మెప్పించిన ఈ చిత్రంలో ఏముంది?


ఈ చిత్రం లో, కటిక దారిద్ర్యం, వ్యభిచారం, పిల్లలపై అత్యాచారాలు, మురికి వాడలు, చెత్త నింపే స్థలం (dumping yard) లో పనికివచ్చే కాగితం వగైరా ఏరుకునే పిల్లలు వగైరా లాంటి అతి వాస్తవిక దృశ్యాలతో కూడిన జీవితాన్ని, నగ్నంగా చూపెట్టడం మనలను దిగ్భ్రమకు గురి చేస్తుంది.బురదలోంచి పద్మం వికసించినట్లుగా ఇలాంటి వాతావరణం లోంచే ఎదిగిన, జమాల్ మాలిక్ (ఇంగ్లాండ్ నటుడు దేవ్ పటేల్) , కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో రెండు కోట్లు గెల్చుకున్నాడంటే, ఆశ్చర్యం కలుగక మానదు. ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా నడుస్తుంది. ఒక హాలీవుడ్ చిత్రానికి సగటు నిర్మాణ ఖర్చు 80 మిలియన్ డాలర్ల ఖర్చువుతున్న సమయంలో, బ్రిటీష్ దర్శకుడు డాని బాయిల్ రూపొందించిన ఈ చిత్రం కేవలం 15 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడింది.ఇంత తక్కువ బడ్జెట్ లో నిర్మిచిన ఈ చిత్రం, కేవలం ఐదు రోజులలో, ఉత్తర అమెరికా లోని 10 సినిమాహాళ్లకు కలిపి, $420,000 వసూలు చెయ్యడం విశేషం.వికాస్ స్వరూప్ రాసిన Q & A నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్ర కథా నాయకుడు రాం మొహమ్మద్ థామస్ (చిత్రంలో జమాల్ మాలిక్ గా మార్చారు) ని పొలీస్ స్టేషన్ లో ఇంటరాగేషన్ చేస్తున్న సన్నివేశం తో చిత్రం ప్రారంభమవుతుంది. Call Centre లో కేవలం చాయ్ అమ్మే కుర్రవాడు ఇన్ని ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పగలుగుతున్నాడు? ఇందులో ఏదో మోసం ఉందని అనుమానించిన క్విజ్ నిర్వాహకుడు అనిల్ కపూర్, జమాల్ మాలిక్ ను పొలీసులకు అప్పచెప్పి నిజం కనుక్కునే ప్రయత్నం చేస్తుంటాడు.

చిత్ర దర్శకుడు, పొలీస్ ఇనస్పెక్టర్ ఇర్ఫాన్ ఖాన్ అడిగే ప్రశ్నలకు, నాయకుడితో జవాబులు చెప్పిస్తూనే, కథను ముందుకు నడపటం జరిగింది. కథ ఇలాగా భూత, వర్తమానాల మధ్య నడుపుతూ, కథ చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒక ప్రశ్న దూరంలో గేం షో యొక్క బహుమతి మొత్తాన్ని గెలుచుకునే సమయంలో కూడా తన బాల్య స్నేహితురాలు లతిక (ముంబాయి మోడల్ Freida Pinto ప్రధమ చిత్రం) ఆపదలోంచి బయటపడి క్షేమంగా వుందన్న వార్త తెలియటమే పెద్ద బహుమతిగా భావిస్తాడు నాయకుడు. అనిల్ కపూర్ అడిగే ప్రతి ప్రశ్నకూ తన జీవితం లో ఎదో ఒక ఘట్టానికి దగ్గర సంబంధముడటం వలన సమాధానాలు కష్టపడకుండా చెప్పగలగడం ఒక విధి వైచిత్రం కావచ్చు. ఈ ఆటలో పాల్గొంటున్న సమయంలో తప్పి పోయిన తన బాల్య స్నేహితురాలు, ఈ ఆట ఎక్కడినుంచైనా చూసి తనను కలుస్తుందేమోనన్న ఆశ, నాయకుడి కళ్లలో మెరుపుగా కనిపిస్తుంది. ఇదంతా చదివి ఇది మరో ప్రేమ కధ అనుకునేరు. ప్రేమ అంతర్లీనంగా ఉంటుందే కాని,దారిద్ర్య రేఖకు దిగువన వున్న కుర్రవాడి జీవితం లోని ఎత్తుపల్లాలు చూపిందీ చిత్రం. దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం మనలను ఆకట్టుకొంటుంది. ఈ చిత్రానికి Casting Director గా పని చేసిన లవ్లీన్ టాండన్ కు సహ దర్శకురాలిగా దర్శకుడు చిత్రం టైటిల్స్లో గౌరవం ఇవ్వటం కొనియాడతగ్గది. ఈ చిత్రంలో ఆమె పనితనం కూడా మనకు కనిపిస్తుంది.మొదట ఈ చిత్రంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమ నిర్వాహకుడిగా నటించటానికి అమితాబ్, షారుఖ్లను అడిగితే, వారు కాదనటం వలన అనిల్ కపూర్ కు ఈ పాత్ర దక్కింది. అనిల్ కపూర్ తన పాత్రలో జీవించారని చెప్పటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్ర నాయకి ఫ్రైడా పింటో తొలి చిత్రం తోనే ఎంతో పేరు తెచ్చుకుంది. రాబోయే చిత్రాలలో ఈమె నాయికగా కనిపించగలదు.ఈ చిత్రంతో దేవ్ పటేల్ మంచి నటుడిగా నిరూపించుకున్నాడు.

Anthony Dod Mantel ఛాయగ్రహణం కనుల కింపుగా ఉంది. ముంబాయి లోని బహుళ అంతస్తుల భవనాలు, వాటికి వైరుధ్యంగా మురికి వాడలు,అక్కడ నివసించే వారి జీవన విధానం లో మనకు తెలియని కొన్ని కొత్త విషయాలు ఆవిష్కరించగలిగాడు. Simon Beaufoy చిత్రానువాదం బాగుంది. Chris Dickens కూర్పు పదునుగా ఉండి కథను వేగంగా నడిపించింది. A.R.Rahman సంగీతం సందర్భొచితంగా ఉంది.


Loveleen Tandan

భారతదేశం లో నిర్మించిన చిత్రం లో ఒక duet/group song లేక పోతే బాగోదని లవ్లీన్ చిత్రం చివరలో నాయికా నాయకుల మధ్య ఒక నృత్య సన్నివేశం ఉంచటం ఒక విశేషం. చిత్రం చివరలో Credits చూపే సమయం లో కనిపిస్తుందీ నృత్యం. ఈ చిత్రానికి దర్శకత్వం లేక ఉత్తమ చిత్రం శాఖలలో ఆస్కార్ బహుమతి రావచ్చని సినీ విమర్శకుల ఊహాగానం. చూడతగ్గదీ చిత్రం.

2 వ్యాఖ్యలు:

రవి చెప్పారు...

అర్థం పర్థం లేని రొటీన్ తెలుగు సినిమాలతో విసుగెత్తాం. ఓ కొత్త సినిమా పరిచయం చేశారు. డీ వీ డీ దొరికితే ప్రయత్నించాలి.

Sai Brahmanandam చెప్పారు...

Bhaskar Rao garu,

Here is the link on dEvulapalli:

http://navatarangam.com/2008/07/devulapalli-part1

http://navatarangam.com/2008/07/devulapalli-part2/

-Sai Brahamanandam

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి