మంగళవారం, నవంబర్ 25, 2008

అమెరికా నుంచి ఉత్తరంఅమెరికా ప్రజలు తమ జీవితాలలో మార్పు రావాలనుకుంటున్నారు. ఉద్యోగ అభద్రత, నిరుద్యోగం ఇంకా మొన్నటి దాకా గట్టుమీదున్న గాస్ (పెట్రోల్) ధరల సమస్యలతో, ఇక్కడి వారు విసిగి వేసారుతున్నారు. గాలన్ (1 US gallon = 3.78 liters) గాస్ నాలుగు డాలర్లు మించితే,కారు వాడకం తగ్గించారు. హైబ్రిడ్ కార్ల గురించిన అవగాహన పెంచుకుంటున్నారిక్కడ. బుష్ ప్రభుత్వ విధానాలే తమ దేశ ఆర్థిక స్థితిని ఇలా నెట్టివేసిందని, ఒబామా వస్తే పూర్వ వైభవం పునరావృతం కాగలదని పెద్ద ఆశలో ఉన్నారు. చాలా చోట్ల భారతీయులలో ఒబామా పట్ల అనుకూల వైఖరి కనిపించింది. ఒబామా ఎన్నికల ఖర్చుల నిమిత్తం పలు భారతీయులు తమ విరాళాలు అందచేశారు. బుష్ కు ఆయిల్ కంపనీల లో పెట్టుబడులున్నవి కనుక చమురు ధర పెరిగినా పట్టించుకోవటం లేదని, వాల్ స్ట్రీట్ (US Stock exchange) లో జరుగుతున్న futures trading లోని మితిమీరిన speculation కు ఒబామా రాకతో, సంకెళ్లు పడి, చమురు ధరలు తగ్గి, ప్రస్తుతం గాలన్ గాస్ ధర రెండు డాలర్ల లోపు రావటం, ప్రజలకు ఊరట నిచ్చింది. రాబోయే మూడేళ్లలో 2.5 మిలియన్ కొత్త ఉద్యోగాల సృజనకై, ఒబామ ఆర్థికవేత్తలతో కలిపి ప్రణాళికలు రచిస్తున్నాడు.

ఇంత ఆర్థిక మాంద్యం లో కూడా అమెరికా డాలరు గట్టిపడటం పెద్ద విశేషంగా చెప్పాలి. బ్రిటన్ పౌండ్, భారతీయ రూపాయ తో పోలిస్తే, డాలర్ పటిష్టంగా ఉంది. ఇది అమెరికా కు ఆశాజనకమైన విషయం. ఇక్కడ చాలా ఉత్పత్తుల పై చైనా లో తయారయినవి అనే లేబుల్ కనిపించటం మామూలు. వినియోగ వస్తువులన్నీ అమెరికా దిగుమతి చేసుకొంటుంది. దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమారాలు, ఆహార వస్తువులు ఎన్నో వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు ఉభయ దేశాలకూ లాభమే.

అమెరికాను అతలాకుతలం చేసిన Sub Prime Crisis నుంచి తెరుకోవటానికి ఇంకో సంవత్సరం పట్టవచ్చు. కొత్త అప్పులు ఇచ్చే విషయంలో చేతులు కాలాక, ప్రస్తుతం ఇక్కడి బాంకులు జాగరూకతో వ్యవహరిస్తున్నాయి. అమెరికాను సాంకేతికంగా, ఆర్థికంగా పరిపుష్టి చెయ్యటానికి ఒబామా ఎన్నో కలలు కంటున్నాడు. ఆ కలలు (The Blueprint for Change) ను ఇక్కడ నుంచి దిగుమతిచేసుకోవచ్చు. కలలు ఫలించాలని, ఇక్కడి ప్రజల సంబరం, కలకాలం నిలవాలనీ ఆశిద్దాం. ఈ ప్రపంచీకరణలో, వసుధైక కుటుంబం అనే భావన, అన్ని దేశాలు సుఖ, సంతోషాలతో ఉండటం లోనే మన భారతీయుల అభ్యున్నతి ఉంటుంది.

10 వ్యాఖ్యలు:

kumar చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
kumar చెప్పారు...

I had to delete because the format of paragraphs wasn't good enough

రావు గారూ,
గత ఆరు నెలలుగా మీర్రాసిన ప్రతి అక్షరం చదివాను. మీరంటే నాకు చాలా గౌరవం. అది ఈ టపా వల్ల ఒక్కింత కూడా పొల్లు పోలేదు.
మీ ర్రాసింది చూస్తుంటే, ఇండియాలో వాళ్ళు అమెరికా అంతా ఇలాగే ఆలోచిస్తుంది అనుకుంటారు. (ఒబామా కావాలని 63 మిలియన్లు ఓటెస్తే, వద్దని 56 మిలియన్లు ఓటెసారు. వద్దని కాకపోయినా, ఆయనకి వ్యతిరేకంగా నిలపడిన వ్యక్తికేశారు)


ఎవరైనా మీకు ఒబామా రాకతో గ్యాస్ ధరలు తగ్గాయి అని చెపితే, వాళ్ళకో ఉచిత సలహా పడేయండి. "బ్రెయిన్ చెక్ అప్ టైం" అని చెప్పండి వాళ్ళకి :-)


అది ఎంత తెలివి తక్కువ తనంగా ఉందంటే, ఒబామా గెల్చిన తర్వాత, ఇక్కడ స్టాక్ మార్కెట్ 1500లో , 1800లో పడిపోయింది. ఆయన మార్కెట్ కు అన్ ప్రెండ్లీ కారక్టర్(కమ్యూనిస్టు, వెల్త్ re-డిస్ట్రిబ్యూటర్ వగైరా, వగైరా) కాబట్టే అలా పడిపోయింది అని ఆపోజిట్ పార్టీ టాక్ షో హోష్ట్ లే కాదు, కొన్ని లక్షల మంది ప్రజలు నిజంగా నమ్ముతున్నారు ఆ విషయాన్ని.

హౌ ఫూలిష్!!

పై రెండు గ్రూపుల వాళ్ళని ఐడియాలాగ్స్ అంటారు. వాళ్ళు ప్రపంచాన్ని ఒక పొగ మంచు లోంచి చూట్టనికే ఇష్టపడతారు. తద్వారా వాళ్ళెంత తెలివి తక్కువ వాళ్ళయ్యి, అవి విని నమ్మే వాళ్ళని ఎంత తెలివి తక్కువ వాళ్ళని చేస్తున్నాము అనేది ఆలోచించరు.

ఉదా: నేను మెక్ కెయిన్ కి ఓటేశాను. ( కాని నా 8yrs కూతురు ఒబామా కి ఓటేస్తానని, తనకే ఓటెసింది(స్కూల్లో మాక్ ఓటింగ్ లెండి), నేను తనతో ఒబామా పాజిటివ్ సైడ్ గురించి చాలా చెప్పానే కాని, ఒక్క మాట కూడా నెగటివ్ గా చెప్పలేదు, ఎందుకంటే నా భావ జాలాన్ని, తన నెత్తిన ఎప్పుడూ రుద్దను నేను).

ఇలా అమెరికా గురించీ, ఈ అవతార పురుషుల గురించీ ఒక్క సైడ్ మాత్రమే చెప్పే వాళ్ళ దగ్గర నుంచి మీరు పూర్తి విషయాలు ఎప్పటికీ నేర్చుకోరు సార్..

ఇవన్నీ ఎందుక్కానిండీ, అమెరికా టూర్ లో ఉన్నట్లున్నారు మీరు..మా ఇంటికి వచ్చేయండి సార్. కాస్త వైన్ తాగుతూ రాత్రంతా మాట్లాడుకుందాము. నాకు తెలిసిన అమెరికా గురించి, మీరు ఎప్పుడూ ఎక్స్ పోజ్ కాబడ్తున్న ఇండియన్ కమ్యూనిటీ లో ప్రొ-డెమొక్రటిక్ పార్టీ వ్యూస్ కి, ఆపొజిట్ కోణం కూడా పరిచయం చేస్తా..అలా అని నా ఐడియాస్ ని మీ మీద రుద్దను, కాని గత నలభై సంవత్సారాల అమెరికన్ రాజకీయాల్ని చెప్పగలను.

ఈ సారి మీకు ఎవరన్నా, బుష్ ఓ కర్కోటకుడూ, ఒబామా ఓ పదకొండో అవతారము అని చొంగ కార్చుకుంటూ మాట్లాడుతూంటే, వాళ్ళని ఓ ప్రశ్న అడగండి. గత పది ఎన్నికల్లో రిపబ్లికన్స్ ఎన్ని సార్లు గెలిచారు, డెమొక్రట్స్ ఎన్ని సార్లు గెలిచారు అని? ఒకవేళ దానికి కరక్ట్ సమాధానం వస్తే, సెకంట్ వరల్డ్ వార్ దగ్గర నుంచీ, వరసగా ప్రసిడెంట్ల పేర్లు చెప్పమనండి. కనీసం కెనెడీ దగ్గరి నుంచీ, లేక కనీసం జాన్సన్ దగ్గర నుంచీ ఎవరు ఏ స్టేట్స్ గెలిచారు, ఎందుకు గెలిచారు..ఏ పార్టీ కున్న గుర్తింపు..అంటే ఎవరు ఎలాంటి విషయాల గురించి ఎక్కువ ఫైట్ చేస్తారు? ఎవరి వోటింగ బేస్ ఎలాంటిది.. ఏ సంవత్సరం లో ఎలాంటి మేజర్ షిఫ్ట్స్ అయ్యాయి, ఎందుకయ్యాయి.

అసలు రీగన్ ని అమెరికన్స్ ఎందుకు అంత ప్రేమిస్తారు? గత పది సార్లల్లో, 7 సార్లు రిపబ్లికన్స్ ఎందుకు గెలవగలిగారు? ఇక ముందు అమెరికా డెమొగ్రఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి. ముఖ్యంగా 2050 కల్లా..దాని వల్ల ఏ పబ్లిక్ పాలసీ ఇష్యూస్, చాలా ఫోకస్ లోకి రాబోతున్నాయి? ఏవి వెనక పడపోతున్నాయి? అంతెందుకు? ప్రతీ ఎలక్షన్స్ లో విపరీతంగ డిస్కస్ చేయబడి, ఎప్పుడూ పరిష్కారం లేకుండా ఏ ఏ విషయాలు మిగిలి పోతున్నాయి? ఇవన్నీ ఎందుకు లెండి..

అస్సలు "బే ఆఫ్ పిగ్స్ సంక్షోబం" ఏంటి? అని ఒక్క ప్రశ్న అడగండి చాలు.కనీసం అదయినప్పుడు ఎవరు ప్రసిడెంటో అడగండి చాలు? హారీ ట్రూమన్ ఎవరో, ఆయన ఎంత అన్ పాపులర్ ప్రసిడెంట్ అయ్యి, తిరిగి రీ రన్ చేయడానికి కూడా ఇష్టపడక(ఓడి పోతాడని తెలుసు), ఇంటికి వెళ్ళిపోయాడో, అదే ఆయన్ని ఈ రోజున చరిత్ర ఎలా చూస్తుందో అడగండి.

ఇలాంటి ప్రశ్నలు వేయండి? వాళ్ళు చెప్పలేకపోతె, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎమోషన్స్ మాత్రమె నేర్చుకుంటున్నారన్న మాట..విషయాల్ని కాదు.

సరే మరి ఎప్పుడొస్తున్నారు? :-)...సీరియస్..
ఎన్ కుమార్ టెల్(స్పేసెస్ లేవు) ఎట్ జీమయిల్

kumar చెప్పారు...

"బుష్ కు ఆయిల్ కంపనీల లో పెట్టుబడులున్నవి కనుక చమురు ధర పెరిగినా పట్టించుకోవటం లేదని,..."

Really!!!!!!

ఎవరు చెపుతున్నారు సార్ మీకివన్నీ? :-)

మరి అది నిజమయితే ఈ క్రింద చార్ట్ లో 6 ఈయర్స్ ఆప్షన్ తీసుకొని చూడండి. బుష్ అంత స్వార్ధ-భూతమే అయితే, ఆయన 2000 నవంబర్ లో ఎన్నికయ్యాడు. మరి 2006 నవంబర్ దాకా కూడా, గ్యాస్ ధర 2 డాలర్స్ దగ్గరే ఎందుకుందో? జనవరి 2004 లో కూడా $1.40య్యే ఉందే?
http://www.gasbuddy.com/gb_retail_price_chart.aspx

మీ అమెరికా ట్రిప్ లో మీకీ విశేషాలు చెపుతున్న వాళ్ళందర్నీ, 1973 oil crisis గురించి రెండు ముక్కలు చెప్పమనండి? కనీసం గ్యాస్ దొరుకుతోంది ఇప్పుడు. అప్పుడు రేషనింగ్ ఉండేది..నమ్మక పోతే, వికీ చూడండి.
http://en.wikipedia.org/wiki/1973_oil_crisis
మరి అప్పుడు కూడా బుష్షే ప్రసిడెంటా?

ఇంత తెలివి తక్కువగా బుష్ ని తిట్టే జనాలు, ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగినప్పుడు , బుష్ మిడిల్ ఈస్ట్ కెళ్ళి ఆల్ మోస్ట్ అడుక్కున్నాడు. క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచండి ప్లీజ్ అని. వాళ్ళాయనతో డాన్స్ చేసి, వెనక్కి రాగానో వెనక భాగం చూపించారు.

మరి అదే "ఒపెక్" ఇప్పుడు ధరలు పడిపోతుంటే, ఒక్క ఉదుటున ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేసిపాడేసిందే...వాళ్ళు కనపడరు..ఇలా ప్రపంచంలో ఎవ్వరు తుమ్మినా బుష్ దే, అమెరికాదే కుట్ర అనే కాన్స్పిరసీ థియరిస్టులకి?

నా కడుపుకు ఇంత బాధ ఎందుకంటే రావు గారూ..బాగా చదూకొని, జీవితాన్ని చూసిన మీలాంటి వాళ్ళని కూడా, ఈ ప్రపంచం ఇంత ఈజీగా మాయలోకి నెట్టగలుగుతుందే అని?

ప్రశ్నించండి సార్ ప్లీజ్? చూపించే TV వాళ్ళనీ, చెప్పే Media వాళ్ళనీ..propandists nii.

I have seen how history becomes history..and needless to say anymore...

కొత్త పాళీ చెప్పారు...

good questions Kumar!

శ్రీ చెప్పారు...

చాలా బాగా చెప్పారు కుమార్. మీ సమాధానాల్లోనుండి అసలు విషయాలు రాబట్టాలంతే నేను చాలా "వీకీ" చెయ్యాలి.

అబ్రకదబ్ర చెప్పారు...

కుమార్,

2000 ఎన్నికల గందరగోళంలో ఫలితం అటై ఉంటే అప్పుడూ, 2004 కలిపి పది సార్లలో చెరి ఐదు సార్లు చెరో పార్టీ గెలిచినట్లయేది. (నేటి విజేత ఒబామాని వద్దన్న వాళ్లకన్నా 2000లో గెలిచిన బుష్‌ని వద్దన్న వాళ్ల సంఖ్య ఎక్కువ అని మీకు తెలిసిందే కదా). రిపబ్లికన్ పార్టీ పేరుకి గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఐనా డెమొక్రటిక్ పార్టీది దాన్ని మించిన చరిత్ర. మీరు చెబుతున్నంత పనికిమాలిన పార్టీ ఐతే రెండొందలేళ్లపాటు ఓ పార్టీగా అది మనగలిగేది కాదు. రిపబ్లికన్ రీగన్‌ని ఆరాధించే జనాలే డెమొక్రాట్లు కెన్నడీ, క్లింటన్లనీ ఆరాధిస్తారు. కాబట్టి ఎన్ని సార్లు ఎవరు గెలిచారు లాంటివి దేనికీ కొలబద్దలు కావు.

ఆయిల్ ప్రైసెస్ గురించి మీరు చెప్పింది నిజం. ఆ విషయంలో బుష్‌ని సమర్ధించటమూ సరైనదే. ఐతే, మిగిలిన వ్యాఖ్యల్లో బ్యాలన్స్ లోపించింది. రావుగారికి మిగతా భారతీయులు ఓ వైపు కధ చెబితే మీరు మరోవైపు చెప్పినట్లుందే కానీ మీరు కూడా నిష్పాక్షికంగా రాయలేదు. పైగా ఆయనతో మాట్లాడినవారికి అమెరికా చరిత్రగురించి తెలిసింది శూన్యమన్నట్లు వ్యాఖ్యలు! అలా అనకుండా ఉండాల్సింది.

kumar చెప్పారు...

అబ్రకదబ్ర,
ధన్యవాదాలు మీ కామెంట్ కి. మీకు నేను చాలా సార్లు విన్నవించుకున్నట్లున్నాను. ఊరికే తల ఊపే కామెంట్లే కాకుండా, వ్యతిరేక కోణాన్ని ప్రజెంట్ చేసే వ్యక్తులుగా, మరియు ఒక well-informed బ్లాగరు గా నేను విలువ నిచ్చే కొద్ది మంది బ్లాగర్లల్లో మీరొకరు అని. కాని అది మోతాదు మించినప్పుడు కూడా మీ మీద ఉన్న అభిమానంతో నా అభిప్రాయాన్ని కూడా తెలియచేసా మీకు.

ఇది మరో ఉదాహరణ.

అయ్యా, నేనేదో ఒకే పార్టీ కి మెదడు లేకుండా బాకా ఊదే వ్యక్తి లాగా మీరు చిత్రీకరించిన వైనం విచిత్రం. పోయిన సారి మీరిలాగే అంటే, మీకు రిపబ్లికన్ పార్టీ లో ఉన్న గలీజు గురించి, వ్యక్తుల పేర్లతో సహా నేను మీకో రెండు పేజీలు రాసా..ఇక్కడ https://www.blogger.com/comment.g?blogID=18944501&postID=5459596576674400909(మూడో కామెంట్ పూర్తిగా చదవండి మళ్ళీ.).


అది చదివీ, మళ్ళీ మీరిక్కడ పాడిందే పాడరా.. పాట పాడితే, ఐ ఫీల్ సారీ ఫర్ యు. ఒకవేళ అది చదవక పోతే, ఇప్పుడు చదవండి.

అక్కడే కాదు, పాళీ గారితో ఒబామా గురించి నా అభిప్రాయాలు కూడా క్రింద చదవొచ్చు. http://andam.blogspot.com/2008/11/blog-post.html?showComment=1226973600000. I have few more examples, but I am not going to search for them now.

మీరు ఓ రకమయిన కళ్ళద్దాలు పెట్టుకొని నా వ్యాఖ్యలు చూడ్డానికలవాటు పడ్డట్లున్నారు, లేకపోతే పైన నా వ్యాఖ్యల్లో నేను డెమొక్రటికి పార్టీ ని పనికి మాలిన పార్టీ గా చూపించిన వ్యఖ్యలేవీ లేవక్కడ. స్పష్టంగా రాసా. రెండు పక్కలా ఐడియాలాగ్స్ ఉదా: లు మొదట్లోనే చెప్పా. నిజాయితీగా నేను ఎవరికి ఓటెసానో చెప్పి మరీ మొదలెట్టా కామెంట్ ని.

ఎవరు ఎక్కువ సార్లు గెలిచారన్నది, నేను వాళ్ళ గొప్ప కోసం చెప్పలేదన్నది సుస్పష్టం. రంగుల కళ్ళ జోడులు పెట్టుకుంటే తప్ప.

ఆ ఒక్క ప్రశ్న కాకుండా, పదుల సంఖ్యల్లో వేరే ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. అవి మెన్షన్ చేసిన ఉద్దేశం, మీ లాంటి knowledged, un-biased people దగ్గర నుంచి నేర్చుకొమ్మని రావు గారికి చెప్పడం నా ఉద్దేశం. వాటిల్లో కొన్నైనా ఆన్సర్ చేయలేని వాళ్ళ దగ్గరనుంచి వద్దని.
మీరు దాన్నేదో దృష్టిలో చూసారు. అది మీ తప్పు.


చివరగా నేను అభ్యర్థించేదంటంటే, మీరు నేను తప్పు రాస్తే సరి చేయండి, మీకు కృతజ్ఞున్నయ్యి ఉంటాను. అంతే కాని, అయిన దానికీ, కాని దానికీ, ఇలా హై రోడ్ తీసుకొని(ex: "అలా అనకుండా ఉండాల్సింది", "..ఇదేం బాలేదు") అంటూ, ఓ ప్రీచింగ్ టోన్ తీసుకుంటే నేను సహించేది లేదని, మిమ్మల్ని సదా గౌరవించే వ్యక్తిగా తెలియచేసుకుంటున్నాను. (మీకే కాదు కదండీ..నాలుక పదునెక్కగలిగేది).

And you already know me well that I don't shy away from apologizing people, when I don't choose my choice of words properly on a perticular person. I proved that to you once.


ఇకపోతే మీరేదో అభిప్రాయాలు చెప్పారు. అవి మీ ఒపినీయన్స్ మాత్రమే..ఫాక్ట్స్ సపోర్ట్ చెయ్యవు వాటిని.
1. మీరు చెప్పిన లాజిక్ ప్రకారం..1992 లో Russ Perot పోటీలో లేకుంటే, క్లింటన్ సోది లోకి లేకుండా పొయేవాడు. అప్పుడు ఆయన 2 times కూడా తీసేస్తే, రిపబ్లికన్స్ 9/10 గెల్చినట్లయ్యేది.
OR Dukakis యుద్ద టాంక్ మీద కూర్చుని ఫోటో దిగకుండా ఉంటే, Jane Fonda వియత్నాం లో ఆ వేషాలు వేయకుండా ఉంటే Dukakis, గెలిచేవాడు. etc., etc.,

ఒకవేళ అలాగయితే, ఇలాగయితే..అంటూ..పనికి రాని ఉదా:ల వళ్ళ సాధించేదేమీ లేదని మీకు తెలుసు. I am surprised that it came from YOU!!

2. You are DEAD wrong on Reagan. Show me one President who won 49 out of 50 states in modern history of America. There is a reason why a term called "Reagan Democrats" exist in American Politics. Democrats have been dying to get that "voting block"(which is their own to start with) ever since Reagan popped up.

And one more thing..yes if people are giving an impression to Rao gaaru that gas prices have come down because of Obama, then not only that they do not know anything about America, but they lack common sense too.
I stand by my comments. So, please check your comments (పైగా ఆయనతో మాట్లాడినవారికి అమెరికా చరిత్రగురించి తెలిసింది శూన్యమన్నట్లు వ్యాఖ్యలు! అలా అనకుండా ఉండాల్సింది.)

cbrao చెప్పారు...

మీ ఊరు రమ్మన్న ఆహ్వానానికి ధన్యవాదాలు. మీరు మధురా నగరిలో (Kansas City) లో, నేను సాధు హోజేపురం (San Jose) లో ఉండటం వలన, ఈ రెండు ఊళ్ల మధ్య ఉన్న భౌతిక దూరంవలన, మీ ఆహ్వానం మేరకు కలవటానికి, ఎదైనా మాంత్రిక తివాసీ లేక ఆకు పసరు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. వీలు కుదిరినప్పుడు, మీ ఊరొస్తా తప్పకుండా. ఒబామా, మెకెయిన్, ఈ ఇద్దరూ నాకు అపరిచితులే. మీలాంటి మితృలతో, చేసే చర్చలు ద్వారా తెలిసిన , ఇక్కడి ప్రజల మనోభావాలే, మీ ముందుంచా. అయితే అందరికీ మీ అంతగా అమెరికన్ పార్టీల చరిత్ర తెలిసియుండక పోవచ్చు. చరిత్ర సరే, ఇంతకూ ఏ కారణం వలన గాస్ ధరలు తగ్గాయని మీరు తలుస్తున్నారో వివరించి ఉంటే సమస్యను అర్థం చేసుకోవటానికి ఒక కొత్తకోణం దొరికిఉండేది. డెమొక్రాట్ల పరిపాలన బాగుండదని మీరు ఎందుకు భావిస్తున్నారో తెలియటం లేదు. మీ బ్లాగు చిరునామా ఇవ్వగలరు.

అబ్రకదబ్ర చెప్పారు...

కుమార్,

నా తప్పులు దిద్దినందుకు ధన్యవాదాలు. అప్పుడెప్పుడో నా వ్యాఖ్యకి సమాధానంగా మీరు రిపబ్లికన్ల గలీజుతనాన్ని ఎత్తిచూపుతూ రాశానని చెప్పిన ప్రతివ్యాఖ్య నేనింకా చదవలేదు.

'మీరలా అనకుండా ఉంటే బాగుండేది' అని నేనంటే బాధ పడ్డారు. మీరు నొచ్చుకోటంలో తప్పులేదు. కానీ మీకు వ్యతిరేక భావాలు కలిగిన వాళ్లని పట్టుకుని తెలివి తక్కువ దద్దమ్మలు ("హౌ ఫూలిష్"), వాళ్లకి బ్రెయిన్ చెకప్ టైమయ్యింది, వాళ్ల జెనెరల్ నాలెడ్జ్ ఎంత ("ఫలానా ఫలానా తెలుసా అనడగండి") లాంటి వ్యాఖ్యలు చెయ్యొచ్చా?

>> "Show me one President who won 49 out of 50 states in modern history of America"

రిచర్డ్ నిక్సన్, 1972లో. మీ లెక్క ప్రకారం ఇది మోడర్నో కాదో నాకు తెలీదు.

kumar చెప్పారు...

అక్కడ ముంబాయిలో అలా ఉన్నప్పుడు, ఈకలు పీక్కునే సమయం కాదిది..కాని, మీ హ్రస్వ దృష్టిని(నా కామెంట్ల విషయంలో)..మళ్ళీ మీకు చూపించక తప్పని పరిస్థితి కలిపించుతున్నారు నాకు..

1. నాకు వ్యతిరేక భావాలా!! నవ్వు రావట్లేదా మీకు. అస్సలు చదివారా. హౌ ఫూలిష్ అని అన్నది, ఒబామా రాక వల్ల గ్యాస్ ధరలు పడిపొయాయి అన్న వాళ్ళనీ, మరియు ఒబామా ఎలక్ట్ అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్ భీకరంగా జారిపోయింది అని నమ్మే లక్షల మందినీ..

రెండు పక్కలా ఎగ్జాంపుల్స్ చూపించానే అంత క్లియర్ గా.

మీ ప్రాబ్లం ఏంటంటే, నా కామెంట్లు పూర్తిగా చదవకుండానే, నేను ఒకే పార్టీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నని, ఆటో పైలట్ లోకి వెళ్ళిపోవడం.

మీ సమస్యలని మీ దగ్గరే ఉంచుకోండి. నామీద రుద్దకండి.

2. ఇకపోతే, సత్యానికి ఏ మాత్రం దరిదాపుల్లో లేకుండా ఉండే విషయాలని నమ్మే వాళ్ళని, ఆ విషయాలకి సంబంధించినంత వరకూ 'హౌ ఫూలిష్' అనే అంటారు, అంటాను.

9/11 అమెరికా ఇన్ సైడ్ జాబ్ అని నమ్మే వాళ్ళు, అమెరికా లోనే కొన్ని వేల మంది ఉన్నారు. ఇలాంటి పిచ్చి వెధవలని నేనూ చూసాను. ఇంతియాజ్(last name is hidden) అని 26 సం. ల మద్రాస్ కుర్రవాడు మా ఆఫీస్ లో పని చేసే వాడు. ఒక 4 సం ల క్రితం. అతనితో నేను 6 నెలలు వాదించి, అతన్ని కన్విన్స్ చేయగలిగింది నేనొక్కటే.ఏంటో తెలుసా...WTC మీదవి మాత్రం నిజమయినవని!!. పెంటగాన్ మీదది మాత్రం నిజంగా ఇన్సైడ్ జాబ్ అన్న ఇంప్రెష్షన్ తో వెళ్ళిపోయాడు చివరకి మా ఆఫీస్ లోంచి. How sad..(not even foolish). ఇప్పటికీ నేను పని చేసే దగ్గర, నిఖిల్ అని అమెరికా ని హేట్ చేసే ఒక 27 సం. ల కుర్రాడు, నాకు చాలా క్లోజ్ ఫ్రెండు అయిన మూర్ఖ శిఖామణి ఉన్నాడు. తనూ అంతే. We have had countless arguments over 9/11. He still believes it is an inside job and provides scores of material to prove it.

నేను చెప్పిన పై గ్రూపుల వాళ్ళు ఇంత దారుణం కాదు, కాని భావ స్రవంతి ఏ జారుడు బండ మీద నిలబడి ఉందో అర్ధమవుతోంది కదా.

3. ఇకపోతే, నిక్సన్.. Phew..I can't believe you came up with that. మీకు నా భావం అర్ధం కాలేదా..లేక మీకు ఇగో ప్రాబ్లంసా? Or do you think I don't know that. నాకు మీ అంత భాష రాదు కాని, గొంగళిలో వెంట్రుకలు ఏరే పని అంటే అదే!! నేను రీగన్ ఉద:ని ఇచ్చింది, సెపరేట్ చేసింది..మీరు చెప్పిన ప్రేమించే వాళ్ళ జాబితా లోంచి(clintons kennedy). నిక్సన్ ప్రేమించే వాళ్ళ జాబితాలో ఉంటాడా !!!!

There are no clintonicans, kennedycons..but there are Reagon Democrats అని చెప్పడం నా ఉద్దేశం. They are so powerful that they influence PA, OH, WV, KY results and even MI to some extent. Needless to mention that when Democrats get their votes, they win elections(ex: Clinton, Obama)

Finally, మనమిక్కడితో వదిలేయడం మనిద్దరికీ మంచిది అనుకుంటున్నాను. నాకు వాదన లు ఇష్టం ఉండవు, అవో జారుడు బండలు..అందులో మీతో అస్సలు ఇష్టం లేదు, కాని..మీరు అయ్యిందానికీ, కాని దానికీ నా వెంట పడితే ఊరుకునేది లేదని చెప్పడం కోసమే ఇంతా రాయాల్సి వచ్చింది.

Please read what I wrote, which you said you haven't read yet.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి