శనివారం, ఏప్రిల్ 04, 2009

ఒక స్నేహితుడిని కోల్పోకుండా వుండటం ఎలా?

ఉదాహరణకు మీ స్నేహితుడికి ఒక బ్లాగు ఉందనుకోండి. ఆయన స్వంత రచనలు, సేకరణలు కలిపి తన బ్లాగులో ప్రచురిస్తూ ఈ కింద విధంగా ' disclaimer ' ఇచ్చారనుకుందాం.
"ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి. కొన్ని సేకరణలు ఉన్నాయి. చదవండి.. ఆనందించండి. ఇష్టం లేకపోతే ముందుకెళ్ళండి...జైహింద్.."
ఇందులో అహంభావం వ్యక్తమవుతున్నా, ఈ అహంభావిత కైఫీయత్ వలన తను ఇతరుల విమర్శలకు, కోపానికి కారణమవుతున్నారన్న విషయం మీ మిత్రుడితో చెప్పవద్దు. చెప్పి స్నేహితుడిని కోల్పోవద్దు.

అలాగే ఒక సేకరణ అంతా మీ మిత్రుడి రచనే అన్న భ్రమలో చదివి, చివరన అది సేకరణ అని తెలిశాక మీకు కోపం రావటం సహజమే అయినా, ఆ ముక్క మొదలే (వ్యాసానికి ముందుమాటలో) రాయచ్చుగా అని మీ మిత్రుడితో అనవద్దు. ఆయనపై అసూయతో ఇలా విసుక్కుంటున్నావని మీ పై అపోహపడవచ్చు. ఎంతో మంది మీ మిత్రుడి గురించి ఎంత చెడ్డగా అనుకున్నా, మీ మిత్రుడి గురించి వారి రచనలలో వెక్కిరించినా, మీ మిత్రుడితో పద్ధతి బాగాలేదని చెప్పవద్దు. ఎవరేమనుకున్నా, మీకు మీ మిత్రుడే ముఖ్యం.

18 వ్యాఖ్యలు:

శ్రీనివాస్ చెప్పారు...

avunu ilanti post lu kooda cheyoddu tondara padi .... rendu rojula tarvata malla paschaatapta padoddu

Dr. నరహరి చెప్పారు...

ఏంటి....మీరు కూడా మొదలెట్టారా

అజ్ఞాత చెప్పారు...

cheppEdi direct gaa cheppachchugaa..

మనోహర్ చెనికల చెప్పారు...

ఇంతకీ ఇది రాయడంలో మీ ఉద్దేశ్యం ఏంటో అర్ధం కావడంలేదు.

శరత్ 'కాలం' చెప్పారు...

నాకేమీ అర్ధం కాలేదండీ. అంతా కంఫ్యూజింగుగా వుంది మీ పోస్ట్.

శరత్ 'కాలం' చెప్పారు...

మరో సారి జాగ్రత్తగా చదివితే కొద్దిగా అర్ధమయినట్లు అయ్యింది. మీరు ఒక్కర్నో లేక ఇద్దరినో పోగొట్టుకున్నారల్లేవుంది!

అబ్రకదబ్ర చెప్పారు...

????

ఈ మధ్య బ్లాగుల్లో నిగూఢార్ధాల టపాలెక్కువైపోయాయి. సెరిత్ర తెలీందే ఇసయం అర్దం కాటంలా.

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

అర్థంగాలే!

అనురాగ్ చెప్పారు...

అతిథి దేవోభవః
నా గురించి

View my complete profile

ఈ బ్లాగులో ఉన్న రచనలన్నీ నా సొంతమన్న భ్రమలో ఉండకండి. కొన్ని సేకరణలు ఉన్నాయి. చదవండి.. ఆనందించండి. ఇష్టం లేకపోతే ముందుకెళ్ళండి...జైహింద్..
http://jyothivalaboju.blogspot.com indulo artham kaakapoanikemundi abrakadabra meeru marii eemi teliyani vaallalla maatladutunnaru rao gariki aavidaki koodaa emanna poga pettaremo paapam anuduke ilaa.

శరత్ 'కాలం' చెప్పారు...

@ అనురాగ్,
రావు గారు చెప్పీ చెప్పనట్లు చెప్పిన రెండో వ్యక్తి అనిల్ అనుకుంటున్నాను.

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

మొత్తానికి మీరు ఈ టపా రాసి మిత్రురాలిని కోల్పోతున్నారన్నమాట!

cbrao చెప్పారు...

ఒక కుటుంబంలో అన్నా తమ్ముళ్ల, అక్కా చెళ్లెల్ల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, బాంధవ్యం తెగిపోతుందా? భేదాలున్నంత మాత్రాన ప్రేమలెక్కడికి పోతాయి?

నాగన్న చెప్పారు...

>>ఒక కుటుంబంలో అన్నా తమ్ముళ్ల, అక్కా చెళ్లెల్ల మధ్య అభిప్రాయ >>భేదాలు వస్తే, బాంధవ్యం తెగిపోతుందా?
తెగిపోకపోవచ్చు కానీ, బలహీనంగా అవుతుంది. వెంటనే రిపేరింగ్ పని మొదలుపెట్టాలి... పనిచెయ్యకపోతే, దండం పెట్టి వదిలెయ్యాలి... ఆస్తికులైతే, తూరుపు తిరిగి, నాస్తికులైతే పశ్చిమానికి తిరిగి!!!

>>భేదాలున్నంత మాత్రాన ప్రేమలెక్కడికి పోతాయి?
అంధకారంలోనికి... మళ్ళీ వెలుగుపడేంత వరకు అక్కడే నీలుగుతూ ఉంటాయి.

చైతన్య చెప్పారు...

ఎక్కడ చూసినా ఇలాంటి అర్థం అయి అవని పోస్టులే కనిపిస్తున్నాయి ఈ మధ్య... ప్రస్తుతం ఇదేదో హాట్ టాపిక్ లాగా ఉంది
hmm

అబ్రకదబ్ర చెప్పారు...

సరే. ఇప్పుడు కుంచెం కుంచెం అర్ధమయింది :-)

ఐనా - ఆ మాత్రానికే తెంచుకునేది స్నేహమెలా అవుతుంది?

cbrao చెప్పారు...

@అబ్రకదబ్ర: ఒక సారి చెప్పండి. స్పందన చూడండి. ఏవి స్వీయ రచనలో, ఏవి సేకరణలో చెప్పవలసిన బాధ్యత మిత్రుడికి ఉందా లేదా?

Dheeraj Sayala చెప్పారు...

Snehitudiki NIJAM chepte taatkalikam ga alajadi regachemo kaani, okka 3 rojulu aagi choodandi..
Mitrulu vidiporu.. Mitrulamanukuni midhaylo unde vaalla gurinchi teliyadu.. Sneham lo aham undakapothe manchidi..
Mee aa friends repu vachi "Edanna unte naatho cheppalsindi kadara, alaa veedhi loki velli gola cheyyaalaa" ante appudu maatram meeru ippatilaa "badhapadavaddu"..

అజ్ఞాత చెప్పారు...

ఎందుకో తెలియదు గాని All that Jazz లో ఈ సంభాషణ "..anger, denial, bargaining, depression and acceptance.." గుర్తొస్తున్నవి. నిజమే - నాయకుడి మరణాన్ని గురించే అనుకోండీ..దానికి 4/5 ఆస్కార్లు వచ్చినవండి. చూసారా?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి