బుధవారం, ఏప్రిల్ 15, 2009

e-తెలుగు


e-తెలుగు కార్యకర్తలకు రాజకీయ ఉద్దేశాలు, Hidden Agenda ఉన్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. e-తెలుగు ఉద్దేశాల పై కూడా పాఠకులకు సరైన అవగాహన లేనందున, వారు సందేహాలకు లోను కాకుండా e-తెలుగు గురించి కొన్ని వివరణలు ఇచ్చే అవసరం కలుగుతుంది. e-తెలుగు అనేది మొదటి నుంచి ఒక తెరిచిన పుస్తకం. ఒక లిఖిత నియమావళి ప్రకారం ఇది పని చేస్తుంది. e-తెలుగు ఉద్దేశాలు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నాయి. e-తెలుగు గురించి వివరిస్తూ గతంలో కొన్ని వ్యాసాలు ప్రచురించబడ్డాయి. e-తెలుగు గురించి దాని కార్యకర్తల గురించి తెలుకోవటానికి ఈ కింది వ్యాసాలు మీకు దోహదపడగలవు.

e-తెలుగు ఎలా ఏర్పడింది?
e-తెలుగు ప్రశ్నలు & జవాబులు
తరచూ అడిగే ప్రశ్నలు


అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై చేసే కృషిలో భాగంగా బ్లాగులను, వికీపీడియాను, వెబ్ పత్రికలను, ఇతర తెలుగు వెబ్‌సైట్లను తెలుగువారికి పరిచయం చేస్తోంది. ఇంతే కాకుండా పెక్కు వెబ్ సైట్లలో అనువాద కార్యక్రమాలను సభ్యుల సహకారంతో నిర్వహిస్తుంది. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అశ్లీల రాతలకు దూరంగా ఉంటుంది, ప్రోత్సహించదు. e-తెలుగు కార్యక్రమాలు మొదటి నుంచీ పారదర్శకంగా ఉంటున్నవి, ఉంటాయి. బ్లాగుల, బ్లాగరుల చర్చా గోష్టులు , యునికోడ్ ప్రచార కార్యక్రమాలు అన్నీ అందరికీ తెలిసేలా నిర్వహించబడతాయి.

తెలుగు బ్లాగరుల మొదటి సమావేశం నుంచి ఈ రోజు దాకా జరిగిన అన్ని బ్లాగరుల సమావేశ నివేదికలు మీరు దీప్తిధార బ్లాగు, e-telugu.org వెబ్సైట్ లో చూడవచ్చును. బ్లాగరుల సమావేశాలన్నీ గతంలో నమోదు చేసి, పైన చెప్పిన ప్రదేశాలలో ప్రచురించటం జరిగింది. ఏవీ రహస్యాలు లేవు. e-తెలుగు లో సభ్యులు కానివారు కూడా ఇవి చూడవచ్చు, చదవవచ్చు. బ్లాగర్ల సాధక బాధకాలు, సాంకేతిక సమస్యలు, ఆకాశరామన్న ఉత్తరాలు, టపాలు వగైరా అన్నీ ఇక్కడ చర్చించబడతాయి, ఆ చర్చల వివరాలు ప్రచురించబడతాయి కూడా. కొందరు బ్లాగర్లు అనుకున్నట్లుగా ఇవి ఆంతరంగిక, రహస్య సమావేశాలు కావు. పలు ఉత్తరాలు, ఫోన్స్ కు సమాధానంగా పై వివరణ ఇస్తున్నాను.

సమావేశ వివరాలు వ్రాయవద్దంటే ఎలా? ఇన్నాళ్ల మన పారదర్శకతకు భంగం వాటిల్లదా, ఇలా చేస్తే?


5 వ్యాఖ్యలు:

యోగి చెప్పారు...

"అసాంఘిక.....రాతలకు దూరంగా ఉంటుంది, ప్రోత్సహించదు."

ఐ సీ...!

" బ్లాగరుల చర్చా ఘోస్టులు.."

హహ్హహ్హా! అచ్చుతప్పు అయినా అర్థం తప్పు కాని సందర్భాలు అరుదుగా ఉంటాయేమో :) :)

cbrao చెప్పారు...

@యోగి: అచ్చుతప్పుకు విచారం.

చక్రం చెప్పారు...

hmmmm

Praveen's talks చెప్పారు...

నాకు కూడా ఈ-తెలుగులో సభ్యునిగా చేరాలని ఉంది కానీ ఈ తెలుగు వారు ఎక్కువగా హైదరాబాద్ లోనే మీటింగులు పెట్టడం, వైజాగ్ లాంటి ప్రదేశాలలోనైనా మీటింగులు పెట్టకపోవడం వల్ల ఈ-తెలుగులో ఎక్కువ మంది చేరలేకపోతున్నారు. దీని వల్ల ఈ-తెలుగు కేవలం హైదరాబాద్ కే పరిమితం అని అభిప్రాయం కలిగే అవకాశం ఉంది.

Praveen's talks చెప్పారు...

ఈ టపా కూడా చదవండి CB గారు. మీ బ్లాగ్ చదివే ఈ-తెలుగు గురించి మరింత తెలుసుకున్నాను.

http://etelugu.org/node/247

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి