సోమవారం, ఏప్రిల్ 13, 2009

వాడిగా, వేడిగా తెలుగు బ్లాగర్ల సమావేశం

ఈ వేసవి వేడిగా ఉంది. ఎలెక్షన్ జ్వరం, శేఖర్ కమ్ముల గోదావరి లాంటి చిత్రం (గుర్తుందా! ఈ వేసవి చల్లగా ఉంటుంది అన్న Caption) విడుదల కాకపోవటం కూడా కారణాలు కావచ్చు. వీటికి అదనంగా నిజం పేరుతో బ్లాగులు రాయటానికి వెనుకాడే పిరికిపందల అసభ్య బ్లాగురాతలు తోడయ్యాయి.

12th April 2009: 10 నిమిషాలు ఆలస్యంగా నేను కృష్ణకాంత్ ఉద్యానవనానికి వెళ్లేసరికి అక్కడ శ్రీనివాస్ దాట్ల (blog.harivillu.org), శ్రీనివాసకుమార్ గుళ్లపూడి (http://worthlife.blogspot.com/) ఇంకా సతీష్ కుమార్ యనమండ్ర (http://vedabharathi.blogspot.com/) ఎండవేడినుంచి ఉపశమనానికై ఆంధ్రా గోలీ సోడా నిమ్మరసంతో కలిపి తాగుతూ కనిపించారు. అప్పటికే పార్క్ లోపల చక్రవర్తి (http://bhavadeeyudu.blogspot.com) ఇంకా శ్రీమతి మాలా కుమార్ (http://sahiti-mala.blogspot.com/) మాకోసం వేచియున్నారని తెలియటంతో అందరమూ లోనికి వెళ్లి శ్రీమతి మాల, చక్రవర్తి గార్లను కలుపుకొని, ఎప్పుడూ సమావేశాలు జరిపే పచ్చికబయలు వద్దకు వెళ్లి, కూర్చున్నాము. ఒకరినొకరు పరిచయం చేసుకునే కార్యక్రమంలో ఉన్నప్పుడు, వీవెన్ (http://veeven.wordpress.com), సతీష్ కుమార్ యెర్రంశెట్టి (http://blaagu.com/sateesh/) ఇంకా అరుణ పప్పు (http://arunam.blogspot.com/) వచ్చారు.

అప్పటికి ఒకసారి పరిచయాలయినా, కొత్తగా వచ్చిన వారి కోసం మరలా పరిచయ కార్యక్రమాలు మొదలుపెట్టాము. పరిచయం చక్రవర్తి తో మొదలుపెట్టాము. చక్రవర్తి తనని పరిచయం చేసుకుంటూ తేలిక విషయాలు ఉబుసు (http://ubusu.blogspot.com/) బ్లాగులోను, కొంచెం బరువైనవి తన భవదీయుడు బ్లాగులో రాస్తుంటానని, తన బ్లాగులోని నిందాస్తుతి ఎవరైనా బ్లాగరులను బాధిస్తే క్షమించాలని కోరారు. వీరి శ్రీమతి స్వాతి బ్లాగరి. ఆమె బ్లాగు ఊసులు (http://oosulu.blogspot.com/). ఆమె రాలేదేమన్న మిత్రుల ప్రశ్నలకు తను అడిగానని, తనకు ఈరోజు సమావేశానికొచ్చే మూడ్ లేదని బదులిచ్చారు. ఆ తరువాత సతీష్ కుమార్ యెర్రంశెట్టి తన పరిచయం చేసుకున్నారు. సతీష్ ఈనాడు జర్నలిజ్మ్ స్కూల్ లో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు. అసభ్యరాతకారులకు భయపడి, తమ బ్లాగులు మూసేసిన అక్కలు, చెళ్లెళ్ల పట్ల ఆవేదన వ్యక్త పరుస్తూ వారు, ఆడో మగో తెలియని, పేరు చెప్పుకొలేని పిరికిపందల రాతలకు వెరవక తమ బ్లాగులు పునః ప్రారంభించాలంటూ రాసిన వీరి కవిత ఇక్కడ http://blaagu.com/sateesh/2009/04/13/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%80-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b1%81/ చూడండి. ఆ తరువాత వీవెన్ తనను పరిచయం చేసుకుటూ తన పేరులోని (వీర వెంకట చౌదరి) చౌదరి తీసివేయగా మిగిలిన పేరును సంక్షింప్తం చేసి వీవెన్ గా లోకానికి పరిచయమవుతున్నానన్నారు. వీవెన్ సాధారణంగా ఉంటూ, అసాధారణమైన లేఖిని, కూడలి సృష్టికర్తగా బ్లాగులోకానికి తెలుసు.శ్రీనివాసకుమార్ గుళ్లపూడి మాట్లాడుతూ నలుగురికీ పనికివచ్చే, ఒక మంచి పనికి ప్రేరణ కలిగించే కథలు తన బ్లాగు "జీవితంలో కొత్త కోణం" లో వ్రాస్తుంటానన్నారు. వీరి బ్లాగులోని తాజా కథనం Homes for the Hungry కథనం ఇక్కడ http://worthlife.blogspot.com/2009/03/blog-post_28.html చదవవచ్చు.కుడి నుంచి యెడమకు: శ్రీయుతులు సతీష్ కుమార్ యెర్రంశెట్టి, వీవెన్, శ్రీనివాసకుమార్ గుళ్లపూడి, సతీష్ కుమార్ యనమండ్ర, శ్రీనివాస్ దాట్ల , cbrao, అరుణ పప్పు ఇంకా మాలా కుమార్.

ఆ తరువాత పరిచయమయిన వారు సతీష్ కుమార్ యనమండ్ర. వీరు తన బ్లాగు sky-astram.blogspot.com లో సంభ్రమం కలిగించేలా ధూం ఎవరో తనకు తెలుసంటూ, ధూం గురించిన ఆధారాలు తనవద్ద వున్నాయంటూ టపాలు రాసి పాఠకులను అచ్చెరువొందించారు. వీరి సాక్ష్యధారాలు ఇంకా బయటపెట్టలేదు. ఆ తరువాత శ్రీనివాస్ దాట్ల మాట్లాడుతూ తన బ్లాగు హరివిల్లులో రాస్తుంటానని తెలిపారు. Blog home page decoration లో కిటుకులు తెలిసిన శ్రీనివాస్ దాట్ల, ఒక అందమైన eligible bachelor. మీకు తెలిసిన అమ్మాయుంటే చెప్పండి. దాట్ల ముక్కుకు తాడెయ్యాలి. ఆ పై cbrao మాట్లాడుతూ తాను ఎక్కువగా దీప్తిధార (http://deeptidhaara.blogspot.com/) లో రాస్తుంటానని, సమీక్షలు, విమర్శలు పారదర్శి (http://paradarsi.wordpress.com/)లో రాస్తానని చెప్పారు. అరుణ పప్పు మాట్లాడుతూ తాను ఆంధ్రజ్యోతి లోని నవ్య స్త్రీల శీర్షికలు వగైరా నిర్వహిస్తామని చెప్పారు. డిసంబర్, జనవరి మాసాలలో e-telugu.org కార్యక్రమాలలో వీరు చురుకుగా పాల్గొన్నారు. తెలుగు బ్లాగుల గురించి జ్యోతిలో విపులమైన వ్యాసం వ్రాశారు. తెలుగు బ్లాగులకు తమ నవ్యలో విస్త్రుత ప్రచారం కల్గించారు. తెలుగు బ్లాగులకు ఎంతో సేవ చేసిన అరుణ ప్రస్తుతం తానే ధూం అనే పేరుతో రచనలు చేస్తున్నారనే అపవాదు ఎదుర్కుంటున్నారు. శ్రీమతి మాలా కుమార్ మాట్లాడుతూ తన అసలు పేరు కమల అయినా బ్లాగ్లోకానికి మాలగా పరిచమయ్యి, యాత్రా స్మృతులు, వైవాహిక జీవితం, పుస్తకాలు, రచయిత్రులు వగైరా విషయాలపై తన బ్లాగు సాహితి -మాల బ్లాగులో వ్రాస్తుంటానని పరిచయం చేసుకున్నారు. బ్లాగ్లోకంలోని కల్మషం తెలియదు వీరికి.

To be continued .....

తరువాయి భాగంలో
చర్చా కార్యక్రమం
మూతబడిన బ్లాగుల బ్లాగరిల ఆత్మస్థైర్యం పెంచేదెలా?
అసభ్య రాతలు రాసే ధూం, కాగడ శర్మలనేమి చెయ్యాలి?
నేను ధూం ను కానన్న అరుణ.

33 వ్యాఖ్యలు:

చైతన్య చెప్పారు...

ఈసారి బ్లాగరుల సమావేశానికి నేను కుడా రావాలని అనుకున్నాను కానీ... రాలేకపోయాను...

krishna rao jallipalli చెప్పారు...

వీరి సాక్ష్యధారాలు ఇంకా బయటపెట్టలేదు... మరి అడగక పోయారా??

ISP Administrator చెప్పారు...

హైదరాబాద్ బ్లాగర్లు యూనియన్ అయినట్టే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల బ్లాగర్లు కూడా యూనియన్ గా ఏర్పడితే బాగుంటుందనుకుంటాను. వైజాగ్ కైలాసగిరి మీదో రుషికొండ దగ్గరో మీటింగ్ పెట్టి బ్లాగింగ్ కి సంబంధించిన విషయాలు ప్రత్యక్షంగా చర్చించుకోవచ్చు. శ్రీకాకుళంలో ఉంటున్న నేను గతంలో బిజినెస్ కి సెలవు పెట్టి విజయనగరం జిల్లాలో జరిగిన నాస్తిక మీటింగులకి కూడా వెళ్ళేవాడిని. బ్లాగర్ల మీటింగులు హైదరాబాద్ లో జరుగుతున్నాయి కాబట్టి నేను రాలేను. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉంటున్న నా బ్లాగ్మిత్రుడు సుబ్బారెడ్డి గారితో ఈ-మెయిల్ కాంటాక్ట్స్ చేస్తుంటాను. మా శ్రీకాకుళం పట్టణంలో నాకు తెలిసినంతవరకు ముగ్గురు బ్లాగర్లు ఉన్నారు. నేను, దుప్పల రవి గారు, వండాన శేషగిరి రావు గారు. దుప్పల రవి గారు గతంలో నా ఆఫీస్ కి వచ్చేవారు కాబట్టి అతను నాకు పరిచయం. వండాన శేషగిరి రావు గారు మా పట్టణంలోని ఒక డాక్టర్ గా నాకు పరిచయం. పొరుగు జిల్లాలకి చెందిన బ్లాగర్లతో పరిచయం పెంచుకుంటే మంచిదనిపిస్తోంది.

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

durgeswara చెప్పారు...

amrutam kosam madhiMcheppudu haalaahalam pudutuMdi.amtatito bhayapadi aagipote amrutamelaa udbhavistumdi? telugu nu bratimkimchu kovatam kosam blogarlu chestunna prayatnaalaku maalaamtivaaramdaramu manaspoortigaa abhinamdanalanamdajestunnaamu.

ISP Administrator చెప్పారు...

హైదరాబాద్ బ్లాగర్లు ఒకసారి హాలీడే ట్రిప్ వేసి వైజాగ్ లో మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది? వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం బ్లాగర్లు కూడా ఆ మీటింగ్ లో కలిసి మాట్లాడుకోవచ్చు. ఒక వైపు హాలీడే గడిపినట్టు ఉంటుంది, మరో వైపు దూర ప్రాంతంలో ఉన్న బ్లాగర్లని కలిసినట్టు కూడా ఉంటుంది.

cbrao చెప్పారు...

@ISP Administrator: హైదరాబాదు బ్లాగరుల యునియన్ కాదు. e-telugu కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ తెలుగు భాషకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు వికీపీడియా, బ్లాగులు, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి ఇవన్నీ e-telugu చేపట్టిన పనులే. e-telugu కు అనుబంధంగా మీరు శ్రీకాకుళం శాఖను స్థాపించి ఈ కార్యక్రమాలను, అక్కడకూ విస్తరింపచేయవచ్చు.

cbrao చెప్పారు...

@krishna rao jallipalli: సమయం ఇంకా ఆసన్నం కాలేదోమో! కడుపు మీద కొట్టడం తన అభిమతం కాదని సతీష్ సెలవిస్తున్నారు.

cbrao చెప్పారు...

@చైతన్య: అనుకున్నవి చెయ్యాలంటే ఒక ప్రణాళిక, నియబద్ధత కావాల్సుంటుంది. ఇది కేవలం అభ్యాసం, గమ్యం చేరుకోవాలన్న తపన మీదే వస్తుంది.

cbrao చెప్పారు...

@durgeswara : అవును తెలుగుబ్లాగుల అమృతమధనం లో అశ్లీలబ్లాగులనే హాలాహలం ఉద్భవించింది. ఈ హాలాహలాన్ని హరించటానికి తెలుగు బ్లాగరుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ దొంగలు ఇంటి దొంగలే. వీరి బండారం బయటపడినప్పుడు చూడాలి వీరి మొహం.

ISP Administrator చెప్పారు...

ఈ-తెలుగుకి అనుబంధంగా శ్రీకాకుళం శాఖ తెరవడానికి నాకు అభ్యంతరం లేదు. బూతు కథలు రాసే బ్లాగులు చూస్తే మాత్రం భయమేసేస్తోంది. నా ఇంటర్నెట్ కేఫ్ లో బూతు వెబ్ సైట్లు చూస్తున్న కొంత మంది కస్టమర్లని బయటకి గెంటెయ్యడం జరిగింది. ఇక వీళ్ళు కొత్తగా తెలుగు బూతు బ్లాగులు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుందా అని భయం వేసింది. ఈ లింకు చదవండి: http://telugu-blog.pkmct.net/2009/04/blog-post_08.html బ్లాగింగ్ లాంటి ఫ్రీ సర్వీసులలో కూడా బూతు చేరింది. తెలుగు బ్లాగుల్లో కూడా బూతు కనిపించడం వల్ల మరింత భయమేసింది.

---మార్తాండ

సుజాత చెప్పారు...

ప్రత్యక్ష పరిచయాలు తక్కువైన ఈ బ్లాగ్లోకంలో "అక్కలు చెల్లెళ్ళు" "అన్నలు తమ్ముళ్ళు" వంటి చుట్టరికాలు కలపడమే అసలు అనర్ధానికి హేతువు.virtual ప్రపంచంలో ఇటువంటి బంధాలు అవి ఆ అవసరమా కాదా అనేది మొదలెట్టేముందు ఆలోచించుకోవాలని (కేవలం)నా వ్యక్తిగతాభిప్రాయం.

తర్వాత విషయం, అసభ్య రాతల వల్ల మూత పడిన బ్లాగులేవీ లేవు. రమణి గారు తీవ్ర ఆవేదనకు గురై తన బ్లాగును మొదట మూసివేసినా, తర్వాత మరో బ్లాగును ప్రారంభించి యథా తధంగా బ్లాగింగ్ కొనసాగిస్తున్నారు. మరో మహిళా బ్లాగర్ కూడా తన బ్లాగు తాత్కాలికంగా మూసే ముందు "తనకు ఉద్యోగంలో పదోన్నతి లభించడం వల్ల సాంకేతికంగా తనను తాను మెరుగు పరిచే ఉద్దేశంతోనే బ్లాగు కు తాత్కాలికమగా సెలవు ప్రకటిస్తున్నాని" చెప్పారు. మంచి నెరేషన్ తో రాసే ఆమె తన బ్లాగుకు తాళం వేయలేదని రావు గారు గ్రహించాలి. ఆ బ్లాగు నుంచి మరెన్నో మంచి టపాలు మనం ఆశించవచ్చు. అసభ్య రాతల వల్ల ఏ బ్లాగూ మూతపడలేదని ఈ పేరా సారాంశం.

తర్వాత భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

మీరందరూ వైజాగ్ వెళ్ళిరండి సార్. ప్లీజ్.

cbrao చెప్పారు...

@సుజాత: " "అక్కలు చెల్లెళ్ళు" "అన్నలు తమ్ముళ్ళు" వంటి చుట్టరికాలు కలపడమే అసలు అనర్ధానికి హేతువు."- ఎలా? ఎంటివోడు మహిళలను ఆడపడచులనలేదా? వారి ఆదరణతో వెండితెరపైనుంచి, రాజకీయ తెర పై ఆరంగేట్రం చెయ్యలేదా?
"అసభ్య రాతల వల్ల మూత పడిన బ్లాగులేవీ లేవు." - వేసవిలో ఎంత చల్లని కబురు! ధూం. కాగడా శర్మ రాతలు జుగుప్స కలిగిస్తున్నాయంటూ లక్ష్మి రాసిన టపాయే, దాదాపుగా నేను - లక్ష్మి http://nenu-laxmi.blogspot.com/ బ్లాగులో చివరి టపా. ఆ తరువాత అది మూత పడింది.
"రమణి గారు మరో బ్లాగును ప్రారంభించి యథా తధంగా బ్లాగింగ్ కొనసాగిస్తున్నారు. " - సువార్త. ఆ బ్లాగు చిరునామా తెలుపగలరు. ఇది ఆహ్వానితులకు మాత్రమేనా?

లక్ష్మి చెప్పారు...

ముందుగా నన్ను ఇంకా గుర్తుచుకున్ననందుకు నా సహ బ్లాగరులకు ధన్యవాదాలు. కాకపోతే ఒక చిన్న మనవి, రావు గారు, నేను ఎప్పుడూ ధూం గురించి కానీ మరి ఏ ఇతర బ్లాగరు గురించి కానీ నా బ్లాగులో రాయలేదు. మీరు ఎక్కడో పొరపడ్డట్టున్నారు, నేను రాసిన చివరి టపా నా వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం బ్లాగ్లోకానికి దూరం అవుతున్నా మళ్ళా వస్తా అని చాలా విపులంగా రాసాను. అందులో జుగుప్స లూ, వ్యతిరేకతలూ లేవు. వ్యక్తిగత వైరాలకి నేను దూరం. దయచేసి ఈ వివాదాల్లోకి నా పేరుని తీసుకుని రావద్దని నా మనవి. ఇదంతా చూస్తుంటే ఊరి పిడుగు వచ్చి వీరిశెట్టి ని కొట్టుకుపోయింది అన్నట్టుగా ఉంది. పెద్దలు అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నా

సూర్యుడు చెప్పారు...

@ISP Administrator:

బూతు బూతు అని తెలియని వాళ్లకి కూడా తెలిసేలా పలవరించడం మానేసి హాయిగా వేరే ఏమైనా కబుర్లు చెప్తే బాగుంటుందేమో ఆలోచించండి ;)

jagruti చెప్పారు...

రావు గారు..

అరుణ పుప్పు గారు అపనింద ఎదుర్కొంటున్నారు అని రాశారు..దీని అర్థం కొందరు నమ్ముతున్నారనే కదా.. మీరు నమ్ముతున్నారా? అసలు ధూం గురించి ఎందుకింత గొడవ? అతన్ని పట్టుకుంటే మీకేం వస్తుంది? పట్టుకోపోతే ఏం జరుగుతుంది? మీ వ్యక్తిగత సమస్యలను బ్లాగ్‌ లోకంపైకి ఎందుకు ఆపాదిస్తున్నారు?

యనమండ్ర సతీష్‌ ఆధారాలు బయటపెడతానని ప్రగల్భాలు పలికి.. బ్లాగ్‌ను ఎందుకు మూసేశాడు.. మళ్లీ అతనిని మీరేందుకు వెనకేసుకు వస్తున్నారు? కడుపు కొట్టడం ఎందుకని జాలి పడుతున్నాడు కదా.. «అందరికి వాయిస్‌ రికార్డింగ్‌లు పంపుతానన్నాడు కదా.. ఇప్పటి దాకా ఎందుకు పంపలేదు? ఏం అడొచ్చింది? ఆయనకు మీకు ఉన్న సంబంధం ఏమిటి? లేకపోతే ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? లక్ష్మీ గారి కామెంట్‌ చూసిన తర్వాత మీరు కూడా యనమండ్ర సతీష్‌ మాదిరిగానే అబద్ధాలు ఆడుతున్నారని మేము ఎందుకు అనుకోకూడదు?

మీకు ప్రమదావనం గొడవ ఎందుకు? అస్తమాను మహిళా బ్లాగర్లను ఎందుకు రంగంలోకి లాగుతున్నారు. దీని వల్ల మీకు వచ్చే పైచాచిక ఆనందం ఏమిటి? (మీరైనా..కాగడా అయినా )..
ప్లీజ్‌.. మమల్ని వదిలేయండి.. ఈ-తెలుగుకి బ్లాగ్‌ లోకానికి సంబంధం లేదు.. మీ మీటింగ్‌లు మీరు పెట్టుకోండి. సోడాలు తాగండి. విహార యాత్రలకు వెళ్లండి. మమల్ని దయుంచి మీ గొడవల్లోకి లాగద్దు..

ఓ ప్రమద

ISP Administrator చెప్పారు...

I am not encouraging profanity. నిజం మాట్లాడకు, పరువు పోతుంది అనడం వల్ల profanity పెరుగుతుంది కానీ తగ్గదు.

అజ్ఞాత చెప్పారు...

I partially concur with jagruti.(first para)

I think we need little maturity in bloggers. May be I dont have to expect also. Because we are not just one small world of telugu bloggers. Every blog is one of its own kind.

Why do you all planning something like an action on a blogger? Question yourself the following

01. Does that blogger has asked you to read his blog?
02. Requested you to comment on his blog?
03. Do you own any responsibility to all the telugu bloggers in this world?
04. Under what context we can make our writing as standard and his/her writing are ODD? Any standard is there for content ?
05. Do you think only the telugu blogs you know are existent in this world?

If you have clear cut answers for these questions, I think the discussion would have been better.

Vepaaku

మంచు పల్లకీ చెప్పారు...

I totally agree with above vepaaku post.

cbrao చెప్పారు...

@లక్ష్మి: మీ భయం అర్థం చేసుకోగలను. మీ ఫోన్ నంబర్ తో నాకు ఒక జాబు రాయగలరు. నా చిరునామా cbraoin at gmail.com

cbrao చెప్పారు...

@jagruti: "అరుణ పుప్పు గారు అపనింద ఎదుర్కొంటున్నారు అని రాశారు..దీని అర్థం కొందరు నమ్ముతున్నారనే కదా.. మీరు నమ్ముతున్నారా? " -మీరు నమ్ముతున్నారా? నా నమ్మకం మీకు ఎలా ఉపయోగిస్తుంది? ఈ టపా రాసినది కేవలం నా అభిప్రాయాలు వెళ్లడించటానికి కాదు కద. నెల నెలా జరిగే బ్లాగర్ల సమావేశ నివేదిక మాత్రమే ఇది. మీ ముందున్న యదార్ధాలు, స్థితిగతులు, సాక్ష్యాలు బట్టి మీ నిర్ణయానికి మీరు రావచ్చు. నా అభిప్రాయాలు చెప్పి మిమ్మల్ని ప్రభావితం చేసే ఉద్దేశం నాకు లేదు.
"లక్ష్మీ గారి కామెంట్‌ చూసిన తర్వాత మీరు కూడా యనమండ్ర సతీష్‌ మాదిరిగానే అబద్ధాలు ఆడుతున్నారని మేము ఎందుకు అనుకోకూడదు?" - నేను అబద్ధం ఆడుతున్నానని మీరు ఋజువు చెయ్యగలరా? నేను వెళ్లడించిన అవాస్తవమేమిటి?
"మీకు ప్రమదావనం గొడవ ఎందుకు? అస్తమాను మహిళా బ్లాగర్లను ఎందుకు రంగంలోకి లాగుతున్నారు. దీని వల్ల మీకు వచ్చే పైశాచిక ఆనందం ఏమిటి? (మీరైనా..కాగడా అయినా ).. - ఎవరు ఎవరిని రంగంలోకి లాగారు? నా మానాన నేను నాకు ఇష్టమైన సాహితీ వ్యాసంగంలో ఉంటే, అసభ్య రాతకారులనుంచి రక్షించమని ఎవరు ఎవరికి ఉత్తరాలు రాశారు? మహిళల ఆక్రందనలు వినే, ఈ వ్యవహారం లో నేను వేలు పెట్టి, ఆ నలుగురి చేతా మాట పడవలసి వచ్చింది. చరిత్ర తెలుసుకుని ఈ ప్రశ్న అడగవలసింది.
"మమల్ని దయుంచి మీ గొడవల్లోకి లాగద్దు.. ఓ ప్రమద" - ఇవి నా గొడవలు కావు. మీరు తెచ్చుకున్న గొడవలే. మీలాగే భయపడి, అజ్ఞాతంగా రాసిన మహిళల ఉత్తరాలకు స్పందించే ఈ రొంపిలో దిగా. మీరు అజ్ఞాతంగా ఉత్తరం రాయవలసిన అవసరమేమిటి? మీ అసలు పేరు వెళ్లడించగలరా?

cbrao చెప్పారు...

@jagruti: "ధూంన్ని పట్టుకుంటే మీకేం వస్తుంది? మీ వ్యక్తిగత సమస్యలను బ్లాగ్‌ లోకం పైకి ఎందుకు ఆపాదిస్తున్నారు?"- ఇది నా వ్యక్తిగత సమస్య కాదు. మూతబడిన బ్లాగుల మహిళల ఆక్రందన ఇది. బ్లాగులోకాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఇది. మహిళా బ్లాగరులపై వచ్చిన, వస్తున్న అశ్లీల రాతలు చదివి వుంటే ఇలాంటి ప్రశ్న మీ నుంచి ఉత్పన్నం అయ్యేది కాదు. మీమీద కాగడా ఎక్కడ రాస్తాడో అన్న భయంతోనే కదా మీరు ముసుగు వేసుకుని మాట్లాడుతున్నది? స్త్రీల మర్యాదను కాపాడటానికి నేను పోరాడుతుంటే అది మీకు వ్యక్తిగత సమస్యలా కనపడుతుందా? ధూం ను ఎరుగుదురా మీరు?

cbrao చెప్పారు...

@Vepaaku: I do not know whether you are male or female. Women are very sensitive. When a women is linked to a male, unscrupulously, the pain she undergoes will not be understood by you unless you are woman. The bloggers under reference in the article have resorted to obscene writings. When you write an article, which you can show to your sister, brother and parents without hesitation then that article can be read by everyone.

యోగి చెప్పారు...

Vepaaku, I agree. Its as if you stole those words from the tip of my tongue.

I used to think that telugu bloggers are still in their infancy (obvious exceptions apply). Not *ALL* the telugu bloggers are clueless but some of them are and whats worse is that they think they OWN telugu blogosphere.

Am I generalizing? ofcourse not, if the observer is a decent man with his head in the right place and has observed telugu blogs for a while.

1. X attacked Y via his/her blog. Y happens to be a woman. Is X attacking the whole of womanhood? What the heck!

2. X has problems with Y organization(etelugu). Y happens to be the namby-pamby, hely-welpy group of people. So X's attack in itself becomes blasphemous just because Y happens to be a group of people with good intentions? What the heck!!

3. some really bright enthusiasts formed a certain Y group to help regeneration of telugu on internet. In the process Y contributes to the growth of blogs and webzines, does that give the Y the moral high ground to judge people? whom are ya kiddin dude?

4. If it is help that Y offers, so be it! but let it stop *right there*. That does not entail that Y (or a self hallucinated member of Y) has *any kind* of moral high ground on anyone! One must be smoking crack to point out people, stand on a pedestal and pass judgments.

cbrao చెప్పారు...

@మంచు పల్లకీ : జాగృతి, వేపాకు లకు రాసిన జవాబులు చదవగలరు.

cbrao చెప్పారు...

@యోగి: స్త్రీలపై అసభ్య రాతలను మీరు సమర్ధిస్తున్నారా? స్త్రీలపై దాడులను ఖండించటానికి e-తెలుగు సభ్యులే కానక్కర లేదు. సహృదయులెవరైనా ముందుకు రావచ్చు.

మంచు పల్లకీ చెప్పారు...

ముందు జరిగిన సంఘటనల మీద నాకు సరైన అవగాహన లేక మీ సమాదానాలు నాకు పూర్తి గా అర్థం కాలెదు .అది వదిలెయండి, నా కన్సర్న్ యెమిటంటె ఈ దొంగ-పొలిసు ఆట ఎప్పుడు పూర్తి అవుతుందా అని. ఒక సగటు బారతీయుడిలా ఒకె .. వాడి పాపాన వాడె పొతాడు అని అందరు ధూం గురించొ ఇంకొకరు గురించొ అనుకుని ఒక నెల వదిలెసి చూడండి. అప్పటికి మీరు అనె రాతలు తగ్గక పొతె అందరు మీ వెనుకె వుంటారు. మీరు వదిలెసారని వాళ్ళు తగ్గితె ఇంక గొడవె లేదు. అందరు హెపిసు. వాళ్ళని శిక్షించాలని ప్రయత్నించి పరొక్షంగా వాళ్ళని మరింత రెచ్చగొడుతున్నరెమొ ?
సుజాత గారు అన్న మాటల్లొ కూడా నిజం లెకపొలెదు .

యోగి చెప్పారు...

@cbrao -

Which part of my comment above gives you the impression that I support/endorse obscene and libelous writings against women?

If the earlier comment was too difficult to understand, lets give it a try again. To make things easier for you, note this I am not making this comment as an idle onlooker, but as a lifetime member of etelugu, the organization.

A blogger writes stuff about another blogger (be it male or female) - Its blogger to blogger issue.

A blogger picks up a few other bloggers, and assumes them to be a group, writes against them.. it is then a blogger to the group of bloggers issue. It is in no way an issue of ALL of the Telugu blogs, it is no way an issue of a man attacking the sacred womanhood, and those who rebel does NOT automatically become blasphemous, as you seem to suggest.

Even if it is the burning issue of the whole of the telugu blogs, what kind of right do you have to *resolve* it? Who gives you that right?

What are *good* writings and what are *bad* writings? Who decides good and bad here?

Out of respect for what etelugu achieved and out of the affiliation a genuine appreciative feeling gives rise to, here goes my suggestion for etelugu(whether people view it as constructive or the other way around): You guys are doing great, I take my hat off in due respect.. make no mistake on that. If helping something gives the moral high ground to judge people standing on a pedestal, I would rather choose to be unaffiliated. I guess many people here echo with this sentiment. Kindly ask CB Rao and others who are self hallucinated to:

1. Stop worrying about the sacred womanhood. Woman do NOT need any support from you, they are strong enough to conduct themselves in a way they want to.

2. Stop claiming that the etelugu is the raison d'être behind the growth of telugu internet. Those who make that claim would make themselves pathetic in public's view.

3. People are free to hold any number of views they want to, and clashes are inevitable. People are not stupids, they are all grown up here and they perfectly know what to do with their time. Stop policing, some hothead like dhoom may turn back and ask you "who the heck are you dude?" - If you wanna police and control, do not cry when someone says "who the hell are you?"

4. It is my sincere advise that if you dont get rid of people with idiocy of himalayan proportions by your side, by the guilt of association, you are sure to face these situations again and again.

Ok, prosecution rests now. Let the show begin :)

Yogi

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

రావుగారూ
ఎందుకు మీరు ఈ విషయాలన్నీ తిరగతోడుతున్నారు? మీరు మీ బ్లాగు పోస్తులో ఉదహరించిన వారు కొందరు తమంతట తాము పైన తాము వ్రాసిన కామెంట్స్ చూస్తే మీరు ఏదో ఊహించుకొని బాధపడుతున్నట్టున్నారు. మీరు అనవసరంగా అందరి తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నట్టున్నారు. ఇది అవసరమా? ఇది శ్రేయస్కరమా?

అజ్ఞాత చెప్పారు...

Mr Rao,

Is it required that every comment should hold a "gender" tag to express a concern? Do you have any syndrome in your thought process based on gender?

I would like to clarify few things here.

01. I know you respect the bloggers, especially women bloggers.In fact many of us DO as well ! There is no doubt.

02. I know you respect the freedom of voice (I can see you not stopping any comments even if it's against you, which is good. Thanks for that.

03. Now back to the actual point : I personally love e-telugu and thier activities (I, myself learn a lot and used their help too) but do not speak behalf of e-Telugu with out taking their consent on the same.

04. I am now confused on your role or e-Telugu role in protecting few bloggers from attacks. Is it part of e-Telugu or your agenda? I don't think e-Telugu has anything mentioned in anywhere on their website.

05. I am not sure who wrote mails to you to save them, but they did a bad job by doing so. This is utterly bad on any spirit of blogger. A blogger better be individual rather than a group of some known people around.

06. Please STOP this non-sence. Nobody for sure liking this (including those wrote mails to you if I am not wrong.).Let's stop this focusing on individual concerns from a group perspective.

Thanks
Vepaaku.com

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

మహిళా బ్లాగర్లని కించపరిచేలా (పేర్లు పెట్టిమరీ)బూతు రాతలు రాసినప్పుడు ఆ బ్లాగుల పద్దతిని కనీసం ఖండించడానికి కూడా తయారవని అందరూ, ఇప్పుడు ఇక్కడ గుమిగూడి తమ సాధికారతను తెలియజెప్పడం చిత్రంగా ఉంది.

ఈ-తెలుగుకు బ్లాగుల నియంత్రణతో ఎటువంటి సంబంధం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అధికారికంగా ఈ-తెలుగు విధానం అదే అనుకుంటాను. కాబట్టి సమస్య ఎక్కడుందో!

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

రావుగారూ
ఇక్కడితో ఈ "మీరు నిర్వహించిన బ్లాగర్ల సమావేశవివరాలు" ఆపితే మంచిది. ఎందుకంటారా. మీ తదుపరి పోస్టులో ఉన్నవి
1."మూతబడిన బ్లాగుల బ్లాగరిల ఆత్మస్థైర్యం పెంచేదెలా?"
వాళ్ళు బ్లాగులు మూతపడలేదు మొర్రో అని మొత్తుకుంటున్నారు.ఆత్మస్థైర్యం ఉంది బాబో మీ సలహాలు, సహాయమూ అక్కరలేదంటున్నారు.ఇది గమనించండి.
2."అసభ్య రాతలు రాసే ధూం, కాగడ శర్మలనేమి చెయ్యాలి"
ఏమీ చెయ్యనక్కరలేదు. ఈ విషయం ఇంక కెలక్కుండా ఉంటే అదే పది వేలు.
మహేష్ గారూ
"ఈ-తెలుగుకు బ్లాగుల నియంత్రణతో ఎటువంటి సంబంధం లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అధికారికంగా ఈ-తెలుగు విధానం అదే అనుకుంటాను."
అనుకోవడం కాదు - అక్షరాలా అదే. రావుగారి వ్రాతలన్నీ ఆయన స్వంత ఊహలే. అవి ఈ-తెలుగువి కావు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి