బుధవారం, మే 20, 2009

తెలుగుదేశం ఓటమి

తెలుగుదేశం వారు కె.సి.ఆర్ తో చేతులు కలిపి తెలంగాణాలో స్వంతంగా గెలవగలిగే సీట్లను కోల్పోయారు. కె.సి.ఆర్. పార్టీ ఎన్నికల ఫలితాలు ఘోరం. తాము గతంలో గెలిచిన సీట్లు కూడా కోల్పోయారు. వలసదారులు (సెట్లర్స్) సహజంగానే ఈ రెండు పార్టీల కలయికను హర్షింపరు. వారినుంచి తెలుగుదేశం వ్యతిరేకత ఎదుర్కొంది.

ఇక నగదు బదిలీ పధకం. కార్మికులకంటే రైతుల వద్దకే ఈ సందేశం బాగా వెళ్లింది. ఈ పధకం అమలయితే,వ్యసాయపనులకు కూలీల కొరత పెరుగుతుందని వారు భయపడ్డారు. పని చెయ్యకుండా డబ్బులు పంచటం సొమరితనాన్ని పెంచుతుందని, ఖజానాను ఖాళీ చేస్తుందని మేధావులు అభిప్రాయ పడ్డారు. తెలంగాణా వస్తే, ఆంధ్రా వారు తెలంగాణాలో విదేశీయులవలే మెలగాలన్న ముఖ్యమంత్రి ప్రచారం, సమైక్యవాదులపై తీవ్ర ప్రభావాన్ని కలుగ చేసింది. వారు కాంగ్రెస్ వైపు ఆకర్షింపబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆకర్షణీయమైన జీతభత్యాల పెంపుతో వారిని తమవెంటే వుండేలా చేయగలిగింది కాంగ్రెస్. రైతులకు ఉచిత విద్యుచ్ఛక్తి, ఆరోగ్యశ్రీ, రాజీవ్ గృహయోజన ఇంకా 108 అంబులన్స్ సేవలు వైయసార్ కు ట్రంప్ కార్డుల లా ఎన్నికలలో ఉపయోగపడ్డాయి.

ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు తెలుగుదేశం ఓట్లను చీల్చటం వలన కొన్ని చోట్ల స్వల్ప తేడాతో తెలుగుదేశం ఓటమి చవిచూడటం జరిగింది. జూనియర్ ఎంటియార్, బాలకృష్ణల ప్రచారం వలన జరిగిన తెలుగుదేశ ప్రచార కార్యక్రమాలు ఓట్ల రూపం దాల్చలేదు.

5 వ్యాఖ్యలు:

సూర్యుడు చెప్పారు...

వలసదారులా, తెలంగాణాలో?. బెంగళూరులోనే మమ్మల్నలా అనలేదు / అనడంలేదు. ఇంతకీ మీరే"దారు"లో ;)

cbrao చెప్పారు...

బెంగలూరు లో అలా అనరులెండి. ఆంధ్రా ప్రాంతం వారు కర్ణాటక లో సింధనూరు, కురుగోడు వగైరా ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ వ్యవసాయ భూములు కొని వాటిలో పంటలు పండిస్తూ ఆ ప్రాంతాలను బాగా అభివృద్ధి చేశారు. అదే విధంగా తెలంగాణాలో బోధన్, వరంగల్, భద్రాచలం వగైరా ప్రాంతాలకు వెళ్లి అక్కడ వ్యవసాయ, వ్యాపారాలు చేస్తున్నారు. వీరిని వలసదారులంటారు. హైదరాబాదు జనాభాలో చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. ఉద్యోగరీత్యా నేను హైదరాబాదుకు వచ్చాను. ఇక్కడి వాతావరణం నచ్చి ఇక్కడే స్థిరపడ్డాను.

Srujana Ramanujan చెప్పారు...

enti? meeku Hyderabad nachhindaa?

cbrao చెప్పారు...

@Srujana Ramanujan : అప్పుడు ఇక్కడి చెమట పట్టని వాతావరణం నచ్చింది. ఇప్పుడు హైదరాబాదు చాలా మారింది. చెట్లు తగ్గాయి, ఇక్కడా వేసవిలో చెమటలు పడ్తున్నాయి.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

చెమట పట్టడమే మంచిలక్షణం. చర్మం నిత్యయౌవనంగా కళకళలాడుతుంది. అందుకనే మన హీరోలంతా చెమట బాగా పట్టే ప్రాంతాల నుంచి వచ్చినవాళ్ళు. వాళ్ళు త్వరగా ముదిరిపోరు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి