శుక్రవారం, మే 22, 2009

e-తెలుగు సమావేశం - May '09



ఎడమనుంచి కుడి వైపు: M.నరసింహా రావు, వీవెన్ మరియు సి.బి.రావు.

సాయంత్రం వీవెన్ నుంచి ఫోన్, తానుసమావేశానికి వస్తున్నట్లు. సరే, నేను మా ఇంటివద్ద నిరీక్షిస్తానని చెప్పాను. నిజానికి నాకుతెలిసి వీవెన్ నెలా సమావేశానికి రానిసందర్భం నేను ఎరగను. బయట ఊళ్లకు వెళ్లేపని ఉన్నా, సమావేశ సమయానికిహైదరాబాదులో ఉండేలా కార్యక్రమాన్ని ప్లాను చేసుకొంటారు. వీవెన్ మా ఇంటి కొస్తూనే బయలుదేరి కృష్ణకాంత్ఉద్యానవనానికి నిర్ణీత సమయానికి చేరుకున్నాము. ఎండలు మండే వేళ అది. మేము తప్ప వెరే ఎవరూ ఇంకారాలేదు. బ్లాగరు మిత్రులకోసం నిరీక్షిస్తూ ఉద్యానవనం బయటే ఉన్న సమయంలో, ఒక నడి వయస్సు పెద్దమనిషి మావద్దకు వచ్చి మీరు తెలుగు బ్లాగరులా అని అడిగారు. వారిని మేము ఎన్నడూ చూసి ఎరగము. వారు తమను తాముపరిచయం చేసుకున్నారు. వారి పేరు మల్లిన నరసింహా రావు. గిన్నిస్ రికార్డ్ తెచ్చిపెట్టిన, సికిందరాబాదు లో జరిగినఅన్నమయ్య లక్ష గళార్చన కార్యక్రమంలో పాల్గొనటానికి సామర్లకోట నుంచి వచ్చి, పనిలో పనిగా ఇక్కడి బ్లాగర్లనూకలవాలన్న సంకల్పంతో మమ్ములను కలిసారు. వారి రాకకు మేమూ సంతోషించాము. వారి బ్లాగు నరసింహhttp://kasstuuritilakam.blogspot.com ఇవే కాకుండా వీరికి ఇతర బ్లాగులు కూడా ఉన్నాయి. వాటివివరాలు ఇవిగో.

వేదుల--బాల
భారతీయం - అన్నమయ్య శృంగార సంకీర్తనలు
నరసింహ
సూక్తి ముక్తావళి
అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు
శ్రీమదాంధ్రమహాభా...


నరసింహా రావు గారు వృత్తి రీత్యా రసాయనిక యింజనీరు అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానులు; ప్రత్యేకించి అన్నమాచార్య కీర్తనలంటే ఆరాధన. వీరు బ్లాగులలో సేకరణలున్నప్పటికీ అక్కడక్కడా సొంత రచనలుకూడా తొంగి చూస్తుంటాయి. మచ్చుకు ఇది చూడండి.

ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,

.వె.
ఇందిరమ్మ దొకటి, చెంద్రబాబు దొకటి,
'చిరు'ది కొత్త పార్టి, జే.పి. దొకటి-
అన్ని పార్టిలకును ఆశయమొక్కటే
కోట్లు కూడ బెట్ట - కుర్చి నెక్కి.


వారు మాతో కాసేపు గడిపి, సికిందరాబాదులో కార్యక్రమ వేళ అయ్యిందని మా వద్ద సెలవు తీసుకున్నారు.

ఎండ ఇంకా తగ్గలేదు. బ్లాగరు మిత్రులకోసం నిరీక్షిస్తున్నాము. ఇంతలో వెంకటరమణ (e-తెలుగు కోశాధికారి) వస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి గురించి అడిగాను. లెక్కలు అన్నీ పక్కాగా ఉన్నాయని వాటిని http://wiki.etelugu.org/E-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%82%E0%B0%98_%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 లో చూడవచ్చని సెలవిచ్చారు. లెక్కలుచూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. 2007 తర్వాత, సభ్యుల నుంచి మరలా సభ్యత్వ రుసుము వసూలుచేయబడలేదు. సభ్యులులలో కొంతమంది తమ ఉద్యోగ వ్యవహారాలలో నిమగ్నమవటం వలన e-తెలుగుకై కాలంవెచ్చించ లేకపోతున్నారు. e తెలుగు కార్యక్రమాలలో ఆసక్తి కలవారు, ఇందులో సభ్యులుగా చేరి తెలుగుకార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించ కోరుతాను. -తెలుగులో చేరాలంటే ఏమి చెయ్యాలి? పుట చూడండి.
http://etelugu.org/node/247

సమావేశంపై ఎండ ప్రభావం కనిపించింది. కొద్దిమంది సభ్యులే హాజరయ్యారు.


ఎడమనుంచి కుడి వైపు: శ్రీనివాస్ రాజు దాట్ల, కిషోర్, శ్రీనివాసకుమార్. G, సి.బి.రావు, సతీష్కుమార్.Y మరియు వీవెన్.


సతీష్ కుమార్ యనమండ్ర (http://vedabharathi.blogspot.com): e తెలుగు లక్ష్యాల గురించి సభ్యులకు కూడా వివరంగా తెలిసినట్లులేదు. కొన్ని లక్ష్యాలు స్పష్టంగా లేవు.
cbrao: స్పష్టంగా లేని వాటి గురించి e తెలుగు కు వ్రాయవచ్చును. రానున్న సమావేశాలలో వాటి గురించి చర్చించి, సంఘ లక్ష్యాలు, నియమావళిలో మార్పు తీసుకు రావచ్చు.
సతీష్: తెలుగు భాషా వ్యాప్తికి, కంప్యూటర్లను మినహాయిస్తే, అంతకు మించి ముందుకు పోలేదు e తెలుగు.
శ్రీనివాస్ దాట్ల (http://blog.harivillu.org): కొన్ని వెబ్ సైట్లను e తెలుగు సభ్యులు తెలుగీకరణ చేస్తున్నారు.
వీవెన్: స్థానికీకరణ ఒక్కరు చేస్తే అవదు. ఒక్కరోజులో అవదు అంటూ Firefox,Word Press వగైరాలస్థానికీకరణ ఉదాహరించారు. C-doc వారి తెలుగు ఫాంట్లను అభివృద్ధి చెయ్యవలసిఉంది. అను ఫాంట్ల వారిని, వారిమిగతా ఫాంట్లతో పాటు తెలుగు యునికోడ్ ఫాంట్లను కూడా అభివృద్ధి పరచవలసిఉందని చెప్పాలి.
cbrao: గతంలో కొలిచాల సురేష్ గారు విషయంలో అనువారికి చెప్పియున్నారు. Followup సరిగా ఉన్నట్లులేదు. అను ఫాంట్లలో టైపు చేసిన వ్యాసాలను యునికోడ్లోకి మార్చే విషయంలో పరిశోధన అవసరం.
వీవెన్: దేశికాచారి గారు మూడవ తెలుగు అక్షరాలు తయారు చేస్తున్నారు. లినుక్స్ లో వలే తక్కువ ఖర్చులోఅయ్యేలా పని ముందుకు జరగాలి. Spellcheck విషయమై మరింత పరిశోధన అవసరం ఉంది (ఒక సంవత్సరంక్రితం వీవీన్ Spellcheck పై ప్రదర్శన ఇచ్చిఉన్నారు).
cbrao: e తెలుగు సభ్యులు విషయాలపై శ్రద్ధపెట్టి follow-up చెయ్యవలసిఉంది.
veeven: రావు గారు లేని సమయంలో జరిగిన పుస్తక ప్రదర్శనలో మన కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లటానికిమంచి అవకాశం కలిగింది.

ఘజల్ శ్రీనివాస్ తెలుగు బ్లాగు తయారుచేస్తున్న సతీష్, కంప్యూటర్లో తెలుగు వాడకం గురించి ఇటీవల ఒక స్కూల్ లోతను ఇచ్చిన ప్రదర్శన అనుభవాలు వివరించారు. తరువాత నెల నెలా సమావేశ తీరు తెన్నులపై కొంత చర్చ జరిగింది.
సతీష్ తమ సందేహం వెలిబుచ్చుతూ అడిగారు. సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు? ఇది సమావేశం?
cbrao: ఇది e-తెలుగు నిర్వహిస్తున్న, e తెలుగు సమావేశం. అయితే తెలుగు బ్లాగు గుంపుకు పంపిన సందేశం లోతెలుగు బ్లాగర్ల సమావేశం గా ఎలా వ్రాసారన్న సందేహం రావచ్చు. మిత్రులు ఇంకా అలవాటు పడనందువల్ల, e తెలుగు సమావేశం గా వ్రాస్తే, బ్లాగరులు ఇది తమ సమావేశం కాదని అపార్థం చేసుకునే ప్రమాదముందని అట్లా వ్రాయటం జరిగింది. నెలా నెలా జరిగేవి e తెలుగు సమావేశాలే కాని ఎక్కువగా బ్లాగరులు వస్తారు కావున వాటినిబ్లాగర్ల సమావేశాలుగానే బ్లాగర్లు తలుస్తారు.

సతీష్: అయితే కార్యక్రమాలకు అజెండా ఉండదా?
వీవెన్: ఇవి informal సమావేశాలు. e తెలుగు కార్యక్రమాల అమలులో, బయట వ్యక్తులను, సంస్థలను కలిసినప్పుడుమనలను ప్రభావశీలంగా నిరూపించుకొందుకు మనము ఒక సంఘంగా ఆవిర్భవిస్తే బాగుండగలదన్న ఆలోచనే e తెలుగు పుట్టుక కు నాందయ్యింది. కంప్యూటర్లో తెలుగు వ్యాప్తికై ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థగా e తెలుగు నుపేర్కొంటూ, సంస్థ ఆవిర్భాన్ని గురించి వివరించారు. మొదటగా సమావేశాలు తెలుగు బ్లాగర్ల సమావేశంగాప్రారంభమయి, వికీపీడియన్స్ కలిశాక వికీ + తెలుగు బ్లాగర్ల సంయుక్త సమావేశాలుగా నిర్వహించబడి తదుపరికంప్యూటర్లలో తెలుగు వ్యాప్తి అన్న ఆశయం తోడయి e తెలుగు గా స్థాపించబడి తన కార్యక్రమాలలో తెలుగుస్థానికీకరణ కూడా చేపట్టింది.
శ్రీనివాస్ రాజు దాట్ల : సమావేశాలలో బ్లాగుల గురించి ఎక్కువ చర్చిస్తున్నారు.
cbrao: ఇవి కార్పోరేట్ సమావేశాలు కావు. A.G.M. కాదు. సమావేశంలో అజెండా ప్రకారం కాకుండా, అన్నివిషయాలు మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా e తెలుగు కార్యక్రమాల అమలులో వచ్చే సాధక బాధకాలు, బ్లాగర్లసమస్యలు ఇక్కడ మనసువిప్పి మాట్లాడుకోవచ్చు. ఎలాంటి నియంత్రణలు లేవు.
సతీష్: మహిళా బ్లాగర్లపై దాడి ఫిబ్రవరిలో జరిగితే, దాని గురించిన చర్చ, ఖండన ఏప్రిల్ మాసంలో జరిగింది. విషయం పై చర్చ ఇంత ఆలస్యంగా ఎందుకు జరిగింది?
cbrao: ఫిబ్రవరి సమావేశంలో e తెలుగు సభ్యులు విషయంపై చర్చ వద్దని అభిప్రాయపడ్డారు. సమయంలో నేనుహైదరాబాదులో లేను. నాకు అందిన ఫిర్యాదుల దృష్ట్యా,ఇక్కడకు రాగానే, e తెలుగు సభ్యుడిగా కాకుండా ఒకహృదయమున్న వ్యక్తిలా స్పందించాను. బ్లాగర్ల సమస్యలు నా సమస్యగా భావించాను. అందుకే మహిళా బ్లాగర్లపైదాడి అనే అంశం పై చర్చకు తావివ్వటం జరిగింది. సమావేశాలలో ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలు వెళ్లడించే స్వాతంత్ర్యం ఉంటుంది.

సమావేశానికి
శ్రీనివాసకుమార్ గుళ్లపూడి (http://worthlife.blogspot.com) ఇంకా నువ్వుసెట్టి సోదరులలోని కిషోర్ (http://nuvvusetty.wordpress.com ) కూడా హాజరయ్యారు. తదుపరి సభ్యులు ఉద్యానవనంలోని ఫలాహారశాలలో తేనీరు సేవించటంతో సమావేశం ముగిసింది.

Photos: cbrao

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

సి.బి.రావు గారూ!
నన్నా కాశానికెత్తేస్తూ మీరు ఈ తెలుగు మే సమావేశ వివరాల్లో నా గురించి ప్రముఖంగా ప్రస్తావించి నా బ్లాగులను గురించి కూడా అందరికీ తెలియ జేసినందులకు మీకు నా శతాధిక వందనాలు.నేను వెళ్ళిన తరువాత వచ్చిన బ్లాగ్మిత్రులను కలుసుకోలేకపోయా నన్నదే నా బాధ. అన్నమయ్య సహస్ర గళ సంకీర్తనార్చన కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని గూర్చి చాలా మంది బ్లాగ్మిత్రులు వివరాలు ఇదివరకే తెలియ జేసారు. గత 10 -- 12 రోజులుగా నా ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేని కారణంగా మీ అందరితో బ్లాగ్ ముఖంగా కలియటం కుదరలేదు. ఈరోజే కనెక్షన్ సరి అయింది. అందరికీ ఈ తెలుగు మే నెల సమావేశం సందర్భంగా నా పరిచయం కావటం అదృష్టంగా భావిస్తూ అందరికీ ముఖ్యంగా సి.బి.రావు గారికీ, వీవెన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రావు గారూ, నా చిన్నప్పటి సహాధ్యాయుడు శీమకుర్తి మాణిక్యాలరావు ,అతనిది దమ్మెన్ను, మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడనుకుంటాను. అతను జ్ఞాపకం వచ్చాడు మిమ్మల్ని కలిసినపుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి