ఆదివారం, మే 23, 2010

నగరంలో సింహం

Portola State Redwoods Park

మన సికిందరాబాదు -మారేడ్ పల్లి,సీతాఫల్ మండి, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం లేక విశాఖ చుట్టుపక్కలకు అప్పుడప్పుడూ చిరుత పులో లేక పులో రావాడం చాలా సార్లు కన్నాము, విన్నాము. కాని ఉత్తర అమెరికా,శాన్ ఫ్రాన్సిస్కొ దిగువనున్న సిలికాన్ వాలీకి దగ్గరగా ఒక కొండ సింహం రావటం గురించి మీరెరుగుదురా? ఇదేమీ కొత్త సాఫ్ట్వేర్ గేం కాదు. నిజంగా ఒక కొండ సింహం (Mountain Lion) మొన్న (మే 18, 2010) మంగళవారం ఉదయం 6 గంటలకు పోర్టోల లోయ లో కనపడినట్లు శాన్ మేటియో అత్యవసర సేవల విభాగం వారు ప్రకటించారు.గూగుల్ ప్రధాన కార్యాలం వుండే కొండ దృశ్యానికి (Mountain view) కు సింహాన్ని కనుగొన్న ప్రదేశం సుమారు 16 మైళ్ళు ఉంటుంది. ఈ సింహాలు సూర్యోదయ,సంధ్య సమయాలు మరియు రాత్రివేళ చురుగ్గా తిరుగుతుంటవి కనుక ఆ సమయంలో సింహం చుట్టు పక్కల వుండేవారు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర సేవల విభాగం వారు ప్రజలను హెచ్చరించారు.Old Redwood Tree aged about 1200 years.

ఈ పోటోలా లోయకు 12 మైళ్ల దూరంలో Portola State Redwoods Park ఉంది. దీనిని నేను 2008 లో దర్శించాను. చాలా ఎత్తైన ఎర్ర కలప చెట్లు ఈ వన్యప్రాణి రక్షిత ప్రాంతంలో ఉన్నాయి. శాన్ హోజె (San Jose) పట్టణానికి సుమారు గంటా ముప్పది నిముషాల దూరంలో ఉందీ సుందర వనం. ఆసక్తికరమైన నడిచే దారులు 18 మైళ్ల పైనే ఉన్నాయిక్కడ. చాలా ఎత్తైన, ఎక్కువ వయస్సున్న (600 నుంచి 1200 సంవత్సరాలు) ఎర్ర కలప చెట్లు ఈ వన్యప్రాణి రక్షిత ప్రాంతంలో ఉన్నాయి. Bay Area లో వుండేవాళ్లు చాల సులభంగా దర్శించవచ్చు ఈ ప్రశాంత, గంభీర, సుందర వనాన్ని.A deer just outside of the park.

కొండ సింహాల ఆహారమైన దుప్పులు (spotted deer) ఈ వనంలో ఉన్నాయి. ఇక్కడ అడవిలో నడిచేవారు (Hikers) కొందరు కొండ సింహాలను చూడటం జరిగింది గతంలో. ఇవి తాము కనపడకుండా అడవిలో కదిలే ప్రాణులను గమనించటం ఆసక్తిగా చేస్తాయి. మనుషులనుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి.Clouds in Portola Valley

అయితే వాటి అహార అన్వేషణ సమయాలలో కాకతాళీయంగా, అరుదుగా మనుషులకు ఎదువరటం జరిగిన సంఘటనలున్నాయి. అవి ఎదురైతే వెను తిరిగి పరిగెత్తరాదు. అవును వెనుతిరిగి పరిగెత్తరాదు. దాన్ని చూసి భయపడినట్లుగా కనపడరాదు. ఎదురుగా, ఎత్తుగా నిలిచి, కోటు తెరిచి మనము పెద్ద ఆకృతిలో ఉన్న భ్రమ కలిగిస్తూ, చేతులు గాలిలో తిప్పుతూ, శబ్దం చేస్తూ ఎదుర్కొనాలి. వాటిని కళ్లల్లోకి చూస్తూ, పళ్లు చూపిస్తూ, శబ్దం చేస్తూ, మన చేతి వేళ్లతో దాని కంట్లో పొడిచే విధంగా తయారుగా ఉండాలి. సింహం దగ్గరగా ఉన్నప్పుడు ఒంగకూడదు. మన శబ్దాలకు, అరుపులకు అవి వెనుతిరుగుతాయి. దానికి వీపు చూపకుండా, అవకాశాన్నిబట్టి మెల్లగా వెనక్కు నడవాలి. మనము తోడుగా కుక్కలను తెస్తే, అవే కొండ సింహాలకు ఆకర్షణగా (ఆహరంగా) మారే ప్రమాదముంది. వివరణాత్మక రక్షణ సలహాలకై ఈ కింది గొలుసులోని బొమ్మలను గమనించండి.
http://www.cougarinfo.org/cartoons.htm

ఈ కొండ సింహాలు ఎంత శబ్దరహితంగా ఉంటాయంటే ఒక ఉదాహరణ చెప్తాను. Olympia National Park లో కొందరు కొండ సింహం తో కలిపి పిక్నిక్ చేసుకున్నారు. వారి పిక్నిక్ బల్ల పైనున్న చెట్లో కొండ సింహం ఉన్న విషయం ఛాయాచిత్రాలలో చూసేదాకా వారు గమనించలేకపోయారు. అదీ కొండ సింహాల క్రమశిక్షణ. మన జాగ్రత్త కొరకు కొండ సింహం తిరుగాడే ప్రాంతాలలో ఒంటరిగా వెళ్లరాదు. సంధ్య సమయం నుంచి, సూర్యోదయ వేళవరకు కొండ సింహం తిరుగాడే ప్రాంతంలోకి వెళ్లకపోవటం క్షేమం. తలకు ఒక హెల్మెట్, నడవటానికి వాడే కర్ర ఇంకా మిరియాల పిచికారి డబ్బా వెంట తీసుకెళ్లాలి. గుంపుగా వెళ్తూ పైన, పక్కలా గమనిస్తూ నడవాలి.

కొండ సింహాలు చూడాలనే ఆసక్తి ఉన్నవారు Bay Area లోనే ఉన్న
Rancho San Antonio

కూడా చూడవచ్చు. ఈ వనం పై ప్రజాభిప్రాయం దిగువ గొలుసులో చూడవచ్చును.

http://www.yelp.com/biz/rancho-san-antonio-open-space-preserve-los-altos

ఇది క్యుపర్టినో ఊరు బయటే, నగరానికి ఆనుకుని ఉంది. చక్కటి నడక దారులుతో పాటు తోడేళ్ళు (Coyotes), పూరీడుపిట్టలు (Quails), అడవిపిల్లి (Bobcat), దుప్పులు (deer), ఎర్ర తోక డేగ ( Red tailed hawk),టర్కీ పక్షులు ( Turkeys) ఇంకా కొండ సింహం (Mountain Lion, Puma concolor) వగైరా వన్య ప్రాణులున్నాయిక్కడ. Rancho San Antonio లో నేను తీసిన ఛాయచిత్రాలు ఈ దిగువ గొలుసులో చూడగలరు.
http://picasaweb.google.com/cbraoin/RanchoSanAntonioStateParkCA#

నడిచే, పరిగెత్తే వారికి ఇది చాలా ప్రసిద్ది గాంచిన వనం. ఈ వన చిత్రపటంలో కొండ సింహం అయితే ఉంది కాని అది చూసినవారు అరుదనే చెప్పాలి. అయితే పార్క్ నిర్వహణ బాగుండి అందరి మన్ననలూ పొందుతుంది. ఈ మధ్యనే నేను కూడా దర్శించాను. ఎక్కువ సమయం గడిపే అవకాశం లేక పోయినా, ఈ వనం చాలా నచ్చింది.

ఇంకా బే ప్రాంతంలోని వనాలు, దర్శనం, కాంపుల వివరాల కోసం ఈ కింది పుస్తకం చూడవచ్చు.
Camping and Backpacking San Francisco Bay Area (Paperback)
ఇది మీ దగ్గరి పుస్తకాల షాపులో లేక అమజాన్ లో కొనవచ్చు.

సరే ఇంతకీ అసలు విషయానికి వద్దాము. ఈ కాలిఫోర్నియా లో వుంటూ, ఛాయగ్రహణం పై మీకు ఆసక్తి ఉంటే మీ కిదే ఆహ్వానం. ఇక్కడి సుందరమైన వనాలలో తిరుగుతూ ఇక్కడి వణ్య ప్రాణుల, పక్షుల ఛాయాచిత్రాలు తీద్దాము.పసిఫిక్ మహా సముద్రంలో విహరిస్తూ జలచరాల (
Humpback Whales, Blue Whales, and Dolphins) ఛాయాచిత్రాలు తీద్దాము. ఇక్కడి అడవులలో కొండ సింహాలు అరుదైనా, ఎలుగుబంట్లు ఎక్కువే. మీరు పెళ్లైన వారైతే మీ భార్య లేక భర్తల నుంచి అనుమతి పత్రం తీసుకు రావాలి. మైనర్ పిల్లలయితే మీ తల్లి తండ్రుల అనుమతి పత్రం కావాలి. మీరు నాతో ఉన్నప్పుడు తేనెటీగలు,సాలీడు, పిడుగులు ఇంకా వన్యప్రాణుల దాడి వలన గాయం లేక మృత్యువు గానీ సంభవిస్తే నాదేమీ పూచీకత్తు కాదని దీనర్ధం. ఉత్తర అమెరికా అంతా వ్యాజమయమే కదా! నా జాగ్రత్తలో నేను ఉండవద్దా?

I am ready. Are you ready?

Photos & Text: cbrao

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

Dear C.B.Rao gaaroo,How are you? I appreciate Your presentation.It is Really a wonderful detailed forest Trip.
Regards ...Nutakki Raghavendra rao.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి