మంగళవారం, జూన్ 22, 2010

బ్లాగులు- వ్యాఖ్యలు -2


Aspen (Colorado) హిమపాతంలో మంచు బొమ్మలు Photo: cbrao

ఏవియస్ ఎక్కిళ్ళు...

నాకు తెలిసి రెండవ తెలుగు సినిమా ప్రముఖుడి బ్లాగు ఇది. మన తారలు ట్వీట్ చేస్తున్నారు కాని బ్లాగ్ తెరవరేమిటి అనుకుంటున్న తరుణంలో వెలువడుతున్న మీ బ్లాగుకు హార్దికస్వాగతం. గ్లామర్ ప్రపంచంలోని వెలుగు నీడలు మీ బ్లాగు ద్వారా ఆవిష్కారం కాగలవని ఆశిస్తాను.

http://avsfilm.blogspot.com/2010/06/blog-post.html


దళిత ఉద్యమానికి ‘కమ్మ మోడల్’ కావాలా !

This is what happened in 1951-52.
Here are the historical incidents accurately.Before first national elections 1952, the Andhra congress elected the president of Pradesh congress. The contest was between Sanjeeva Reddy and Ranga.

Prakasam at that time was with Ranga and not opposed him as depicted. V.V.Giri, Vennelakanti Raghavaiah, Nadimpalli Narasimharao, A.Nageswara rao, Tenneti Viswanadham (all brahmins) supported Ranga during election.Sanjivreddi was supported by Kala Venkatarao who played major role. He was supported by congress kamma leaders like kalluri Chandramouli. In the last minute Kakani Venkataratnam supported Sanjiv reddi.

The congress party also stopped voting power of congress delegates from Guntur district where Ranga had majority. Thus defeat of Ranga was tactically managed.Prominent Reddis like Kandula Obul Reddi and Chegireddi Balireddi were with Ranga.

After the defeat both Ranga and Prakasam followers met in Ayyadevara Kaleswararao`s residence in Bezwada and decided to form seperate party. Thus they left congress and formed Praja party. Ranga was strongly supported by Goutu Latchanna during the fight with Sanjiv Reddi. Anne Anjaiah also opposed Ranga.Hence it is not just Kamma -Reddi fight but two factions in congress.

At that time all India Kisan Majdoor Prajaparty was formed at Patna and Ranga, Prakasam joined in it. A little later Ranga came out and formed Krishikar Lok Party.

In the first general elections 1952, Prakasam and Ranga opposed congress and defeated several congress leaders including Sanjiv Reddi ( who lost to his brother in law Tarimela nagireddi from Anantapur and never contested again from Anantapur!)

Hence it is simplistic to say Kamma-Reddi fight thought was wrong since prominent people are in both sides.The Dalit movement was not strong at that time. Not even the backward classes movement. They came much later.

It is interesting to note that later in 1955 Ranga and Sanjivareddi joined hands to fight against communists.

http://parnashaala.blogspot.com/2010/06/blog-post_10.html

మాకు కరెంటు పోయిందోచ్చ్.. కొన్ని రోజులదాకా రాదోచ్చ్!

కరంట్ పోవటమా! ఇక్కడ కరంట్ ఒక నిమిషం పోతే మరుసటి రోజు పేపర్లో మొదటి పేజీ వార్త అవుతందది. కరంట్ లేకపోవటాన్ని ఆనందించగలగటం గొప్ప విషయమే. అభినందనలు.
cbrao
Mountain View (CA)

http://sarath-kaalam.blogspot.com/2010/06/blog-post_19.html

1894 సంవత్సరానికే 156,000 కాపీలు అమ్ముడుపోయిన తెలుగు పుస్తకం

1894లో ముద్రించిన పుస్తకం అట్ట మీద తెలుగు పాఠముల మొదటి పుస్తకం అని స్పష్టం గా ఉంది కాబట్టి అందులోని విషయముల గురించి ఎలాంటి అయోమయం లేదు. అరుదైన పుస్తకం పరిచయం చేసిన వంశీకి అభినందనలు.

http://janatenugu.blogspot.com/2010/06/1894-156000.html

ఇందిర ఒక సాహసం! ఇందిర ఒక అద్భుతం!

నవలలను చిత్రం గా తీయటంలో ప్రధాన పాత్రల రూపు రేఖలు మారిపోయి వాటి స్వభావ స్వరూపాలు మారాక పాత్రలను గుర్తు పట్టడం కష్టమే అవుతుంది. గైడ్ సినిమా చూశాక, ఆ చిత్ర కధా రచయిత ఆర్.కె. నారాయణ్ ఎంతో అసంతృప్తికి లోనై, "The Misguided Guide!" అని లైఫ్ పత్రికలో వ్యాసం వ్రాశాడు. ఆ వ్యాసం గైడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్లను ప్రభావితం చేసిందని ఆ చిత్ర కధా నాయకుడు దేవ్ ఆనంద్ అభిప్రాయ పడ్డాడు. అయితే జీవన తరంగాలు నవలలో కన్నా చిత్రంలో సన్నివేశాలు బాగా చిత్రీకరించిన సంఘటనలు కూడా లేక పోలేదు. ఆ చిత్రంలో కృష్ణం రాజు ఒక దొంగ. పారిపోతూ, పోలీసులనుంచి తప్పిచ్చుకొందుకు, ఒక శవ ఊరేగింపులో తన తండ్రి శవాన్నే మోయటం జరుగుతుంది. తన నవల కన్నా సినిమాలో ఈ సన్నివేశ చిత్రీకరణ చాలా బాగుందని ఆ నవలా రచయిత్రి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇది అరుదనే చెప్పుకోవాలి. కాలాతీత వ్యక్తులు సమీక్ష చదివాక నవల లోని ప్రధాన పాత్ర ఇందిర చిత్రీకరణలో సినిమాలో ఎంత అన్యాయం జరిగిందో అర్ధమవుతుంది. బాగా ప్రాచుర్యం పొందిన నవలలు సెక్రెటరి, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు చిత్రీకరణలో ప్రధాన పాత్రల మానసిక సంఘర్షణలను ఆవిష్కరించటంలో, సెక్రెటరి, ఛాలెంజ్ చిత్రాలు విఫలమయ్యాయి. ఇందుకు కాలాతీత వ్యక్తులు కూడా మినహాయింపు కాలేకపోయింది. అది మన దురదృష్టం.

cbrao
Mountain View (CA)

http://manishi-manasulomaata.blogspot.com/2010/06/blog-post_21.html

"Paulo Coelho" - గొప్ప రచయిత

మనము అభిమానించే రచయిత నుంచి మన ఉత్తరానికి జవాబు వస్తే సహజంగానే మది ఉల్లాసభరితమవుతుంది. మన తెలుగుదేశాన రచయిత, కళావిమర్శకుడు, స్రష్ట సంజీవదేవ్ కూడ పాఠకుల ఉత్తరాలకు తక్కువ వ్యవధిలో బదులిచ్చేవారు. తన ఉత్తరం తో తాను చిత్రించిన ఒక లఘు చిత్రాన్ని కూడా పంపేవారు బోనస్ గా. ఇహ Paulo Coelho వంటి అంతర్జాతీయ రచయిత నుంచి జవాబు అందుకోవటం ఆనందమే మరి.

cbrao
Mountain View (CA)


http://radhikayadav.blogspot.com/2010/05/paulo-coelho.html

1 వ్యాఖ్య:

సినిమా అభిమాని చెప్పారు...

మీవల్ల ఏవీయస్ గారి బ్లాగు పరిచయమైంది ధన్యవాదాలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి