Mountain View (CA) Photo: cbrao
గూగుల్ ఫోటోలతో జాగ్రత్త..
మన తెలుగు బ్లాగర్లకు ఇదో కొత్త పాఠం. బ్లాగులలో ఇతర వెబ్సైట్లనుంచి చిత్రాలు వాడుకునే సమయాన, వాటికి క్రెడిట్ ఇవ్వటం, మూల వెబ్ సైట్ల నుంచి అనుమతి తీసుకోవటం యొక్క అవసరం ఈ సంఘటన ద్వారా తేటతెల్లమవుతుంది. యుట్యూబ్ లోని కొన్ని వేల వీడియోలు కూడా వాటి కాపీరైట్ దారులు గూగుల్ కు తమ అభ్యంతరం వెల్లడించాక తొలగించటం జరిగింది.
http://gurivindaginja.blogspot.com/2010/06/blog-post_24.html
101 things i would like to do before i die
Your list of things to do appear to have inspired the heroine of Telugu film Kotta Bangarulokam.
http://sunshinearoundme.wordpress.com/2007/05/05/101-things-i-would-like-to-do-before-i-die/
P.S: ఈ టపా తప్పక చదవ కోరుతాను. ఈ బ్లాగరి చెయ్యాలనుకుంటున్న పనులు మిమ్ములను ఆశ్చర్యచకితులను చేయక మానవు. చదవండి. మీరే అరె బాప్రె అంటారు.
ఇవి చాలా బావున్నాయి
"Boy friend : kal tumhare ghar gaya tha… mujhe nahi lagta hamari shadi hogi……
Girl friend : kyu ? papa se mila?
Boy friend : nahi tumhari behen se mila……… ;) "
Ha ha ha! This post is full of jokes. I can't stop laughing.
http://mssjdbhavani2009.wordpress.com/2010/06/01/%E0%B0%87%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF/
సమయానికి తగు… కవిత్వం
ఈ పుస్తకం లోని కవితల ఆంగ్లానువాదాలు చాలా సరళంగా, భావయుక్తంగా వెంటాడేవిగా ఉన్నాయి.
"Condemn me, O Creator,
to any punishment you see fit
for all the sins I’ve committed.
But the hell of reading poetry
to those who have no taste for it—
not that, not that!"
ఈ పద్యానువాదం తమాషాగా కవిత్వం చదవటం ఒక శిక్షగా చెప్తుంటే, ఒక పాత సంఘటన గుర్తుకొస్తుంది. నా మిత్రుడైన ఒక చిత్రకారుడు తనకి కోపం వచ్చినప్పుడు అవతలవ్యక్తిని ఇలా అంటారు 'నువ్వు మనిషివా కవివా?" అని. నిత్య జీవితంలో కవులను అడ్డం పెట్టుకుని ఇలా కూడా తిట్టవచ్చా అని నాకు ఆశ్చర్యం కలిగిందప్పుడు. ఈ పుస్తకం సమీక్షింపదగ్గ పుస్తకం. చక్కగా, సోదాహరణలతో పరిచయం చేసిన బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు.
http://pustakam.net/?p=4770
"చికాగో నుండి లాస్ వేగాస్ దాకా ..."
మీ ప్రయాణానుభవాలు కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ సారి వెళ్లినప్పుడు Dance show -Jubilee at Bally's Hotel, Las Vegas చూడటం మరువవొద్దు. ఒక గొప్ప అనుభూతిని కోల్పోతారు. Word verification తీసివెయ్యగలరు.
http://saradagaa.blogspot.com/2010/03/blog-post.html
పరిచయం
గమ్యస్థానాన్ని కాక ప్రయాణాన్ని ఆనందించే వాడే నిజమైన ప్రయాణీకుడు. విశాఖ నుంచి అరకు లేక కోయంబత్తూర్ నుంచి ఊటీ రైలు ప్రయాణం ఎంత మధురంగా ఉంటుందో కదా! కొడైకెనాల్ లో మబ్బుల్లో ప్రయాణం ఉర్రూతలూగిస్తుంది కదా! తెలుగులో వచ్చే ట్రావెలాగులు చాలా తక్కువ. మీ బ్లాగు ఈ లోటును భర్తీ చేస్తుందని ఆశిస్తాను. మీ గురించి about లో వ్రాయగలరు.cbrao
Mountain View (CA)
P.S: ఈ బ్లాగులో వ్యాఖ్య పోస్ట్ చెయ్యటానికి, word verification తరువాత Post Comment link లేనందువలన ఈ వ్యాఖ్య ఆ బ్లాగులో పోస్ట్ చెయ్యలేకపోయాను. బ్లాగు రచయిత విహారి తన e-mail చిరునామా ఇవ్వలేదు -కావున వారికి ఉత్తరం వ్రాయటం సాధ్యపడలేదు.విహారి తన బ్లాగులోని ఈ లోపాలను సరిదిద్ద కోరుతాను. బ్లాగు లోకంలో విహారి పేరు కలవారు ఇప్పటికే ఇద్దరున్నారు. ఈ విహారి తన పేరు మార్చుకుంటే కొంత అయోమయ నివారణ కాగలదు.
http://vihaarii.blogspot.com/2010/06/blog-post.html
1 కామెంట్:
మంచి విషయం చెప్పారు . ఇక నుంచి జాగ్రత్తగా వుంటాము . థాంక్ యు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి