శుక్రవారం, ఫిబ్రవరి 11, 2011

అభిమానుల ఉత్తరాలు

అశ్హ్రిత, న్యూ జెర్సి

పగలంతా పెద్ద పనేమి ఉండదిక్కడ. ఎక్కువసేపు టివి చూస్తాను.ఇక్కడకు వచ్చాక, తెలుగు వారు కనిపిస్తే ప్రాణం లేసొస్తుంది. http://tlca.com/ వారు నిర్వహించే కార్యక్రమాలకు, క్రమం తప్పకుండా వెళ్తున్నాము. మీరు మావూరొచ్చినప్పుడు, తెలుగు పత్రికలు, పుస్తకాలు తీసుకొస్తారా? నాకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. మంచి తెలుగు పత్రికల URL లు పంపండి. నా రచనలు ఎవరికి పంపితే బాగుంటుంది?

చందన, అట్లాంటా
నాకు దేవులపల్లి కవితలంటే ఇష్టం. వాటిని నా బ్లాగులో వాడుకోవచ్చా?

దేవలత, హూస్టన్
నా బ్లాగులో, చిత్రాల కోసం internet లో దొరికే చిత్రాలు వాడుకుంటే , కాపీ రైట్ ఉల్లంఘన అని తెలుగు బ్లాగు గుంపులో ఎవరో రాసారు. నా బ్లాగు నేను సరదాగా రాస్తున్నాను. వ్యాపార దృక్పధం నాకు లేదు కాబట్టి, ఆ సూత్రాలు నాకు వర్తించవని అనుకొంటున్నాను.నా వాదనలో తప్పుందా?

ధన్యత,శాన్ జోస్,కాలి ఫోర్నియ
రావు గారు - మీరు చావా కిరణ్ ను తొలి బ్లాగరంటున్నారు.కృష్ణదాస కవిరాజు అన్న కలం పేరుతో కిరణ్ బ్లాగు ఇది.
http://krsnadasakaviraju.rediffblogs.com/2004_02_05_krsnadasakaviraju_ar...
ఈ టపా ప్రచురణ తేది: 04/11/2004
rajapiduri వారి అన్వేషణ - ఒక ప్రవాహం
http://rajapiduri.blogspot.com/2000_03_01_archive.html
ఈ టపా ప్రచురణ తేది 2000-03-11
ఈ లెక్క ప్రకారం రాజ పిడూరి కదా మొదటి బ్లాగరు?
ఏది సరైనది?

అజిత్,ఫీనిక్స్, అరిజోనా
నాకు సాహస క్రీడలు,romantic కథలు ఇష్టం. Dr.సమరం, కుటుంబ పత్రికలలో, శృంగార సంబంధిత వ్యాసాలు రాస్తారు.తెలుగు బ్లాగులలో sex సంబంధిత, educative విషయాలపై, వ్యాసాలు ఎవరూ రాయరెందుకని? అలా రాయాలంటే, ఎలాంటి జాగ్రత్తలు, తీసుకొని రాయాలి?

నీహరిక, కొలంబస్
రావు గారికి -తెలుగుబ్లాగు గుంపునకు అసంఖ్యాకంగా జాబులు వస్తున్నవి.కూడలికి వచ్చే టపాలు కూడా పెరిగి పోయాయి. ఇవన్నీ చదివికా, నా బ్లాగు రాద్దామంటే, ఓపిక ఉండటంలేదు, సమయం చాలటం లేదు. ఇన్ని బ్లాగులు నా బుర్రనిండా ఉంటే , నా బ్లాగు ఎట్లా రాయటం?

ఏకావళి, ఓమహా, నెబ్రాస్కా
పనిమనిషి రాదేమోనన్న బెంగ ఇక్కడ లేదు. ఇంటిపనులన్నీ నేనే చేస్తున్నా నంటే నమ్ముతారా? ఇక్కడ పలకరించే దిక్కే లేదు. ఇక్కడ తెలుగువారు ఉన్నారని, మా వారంటారు. ఏమీ తోచటం లేదు. జీవితమంటేనే విసుగ్గా ఉంది.భారతదేశంలో ఎంతో మంది చుట్టాలు, స్నేహితులు. ఏమిటో తెలియని వెలితి, మనసంతా భారంగా. ఇండియా వచ్చేద్దామనుంది.

గగన,లండన్.ఓంటారియో, కెనడా.
ఇక్కడనుంచి ఒక గంట ప్రయాణం చేస్తే నయాగర జలపాతం. అవును అంత దగ్గర మాకు.కెనడా లో లండన్ ఏంటని చాలా మంది అడుగుతారు. బ్రిటీష్ దేశం నుంచి వచ్చిన వలసవారు, మాతృదేశం, లండన్ పై అభిమానంతో, ఈ పేరు పెట్టుకున్నారు. ఇక్కడకు రావాలంటే, మీకు కెనడా వీసా కూడా కావాలి.

జూన్ 13, 2007 న ఈ తెలుగు లో మొదటి ప్రచురణ. -ఈ తెలుగు సౌజన్యంతో.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి