గురువారం, ఫిబ్రవరి 03, 2011

బ్లాగులు- వ్యాఖ్యలు -11

Spot-billed Pelicans (Pelecanus philippensis) at Uppalapadu Bird Sanctuary, Guntur District.  Photo: cbrao

:( నాకు సమ్మగా ఓ పుండు అయ్యిందోచ్ :)

ఇదేమిటిలాగా?  'నాకు పూజ చెయ్యకపోతే, నువ్వెంత మంచోడివైనా నాశనమైపోతావురేయ్' అని సత్యనారయణ స్వామి వారు బెదిరించినట్లుగా, మీరు కూడా దేవుడిలా, "వ్యాఖ్య వ్రాయకపోతే"  అని బ్లాక్ మెయిలింగ్ కు దిగారా?    దేవుడు భక్తులను బ్లాక్ మెయిల్ చేసే విధానం మీకు తెలియకపోతే సుజాత వ్రాసిన "ఎవరికి తెలియని కథలివిలే! "  

http://manishi-manasulomaata.blogspot.com/2009/01/blog-post.html

చదవగలరు.

http://sarath-kaalam.blogspot.com/2011/01/blog-post_1596.html


హైదరాబాద్ కబుర్లు, పుస్తక ప్రదర్శనా, ఎగ్సెట్రా ఎగ్సెట్రా..

అయ్యో! మిమ్ములను మిస్ అయి పోయామే.  మీ బ్లాగుకు  ఇదే నేను రావటం అనుకుంటాను. హైదరాబాదు గురించిన మీ పరిశీలన, అనుభూతి హృదయాన్ని తాకింది. ఫిబ్రవరి లో బహుశా నేను బెంగలూరు రావచ్చు. నేను ఎప్పుడు మీ ఊరొచ్చినా తెలుగు బ్లాగర్ల, వికీపిడియన్ల సమావేశం జరుపుతాను.

http://krishna-diary.blogspot.com/2011/01/blog-post.html

A Summer Evening - My Second Timelapse Experiment


Nikon D40 and video!  It is amazing  considering that D40 can't record video.  Best example for  amalgamation of stills made as  video slide show, which are shot in time lapse. Congratulations for the brilliant video.

http://www.youtube.com/watch?v=4Es6nN2p86A&feature=player_embedded


వినదగునెవ్వరు చెప్పిన

"చిన్న తాళం చెవితో పెద్ద తాళాన్ని తెరవగలుగుతున్నట్టే - చిరునవ్వుతో ఇతరుల హృదయాలలో సుస్తిర స్తానాన్ని సంపాదించుకోవచ్చు."
ఇంకొంచం పెద్ద తాళం చెవితో ప్రపంచాన్నే గెలవవచ్చు.

http://bhandarusrinivasarao.blogspot.com/2011/01/blog-post_15.html


అనగనగా ఒక మంచు ఐరేంద్రి !

కధా నాయకుడికి కళ్లు పోతే ధీరత్వం దెబ్బతింటుంది. ఇంక కధ లో మజా ఏముంటుంది? కండలు లేని సిద్ధార్ధను ధీరుడిగా ఊహించలేము. ఏమైనా తెలుగు సినిమా లో గ్రాఫిక్స్ లో ముందడుగు వేసిన ఈ సినిమా అభినందించతగ్గదే. చిత్ర కధ చెప్పీ చెప్పకుండా ఉండి ఆసక్తికరంగా చదివించిందీ సమీక్ష.

http://navatarangam.com/2011/01/anaganaga-o-dheerudu-review/


"వంశీ 'మా' పసలపూడి కథలు"

నాటకీకరణ సమయంలో, వ్యాపార సూత్రాల దృష్ట్యా,  ఆంధ్రదేశ ప్రజలంతా చూస్తారు అనే విషయయం  దృష్టిలో ఉంచుకుని భాష లో  గోదారి జిల్లా యాస కావాలని తగ్గించినట్లున్నారు. అయితే సుంకి పాత్రలో ఈ యాస వినిపిస్తుంది. ఇప్పుడొస్తున్న అనువాద ధారావాహికల మధ్య మా పసలపూడి కధలు ఎడారిలో ఒయాసిస్ లాంటిది.  గ్రామీణ దృశ్యాలు, గోదారి గలగలలు, కొబ్బరి తోటలు  ఇంకా  పిల్ల కాలువలు నయనానందకరంగా ఉన్నై. తప్పక ఆదరించతగ్గదీ  మా పసలపూడి కధలు ధారావాహిక.

http://nemalikannu.blogspot.com/2011/01/blog-post_21.html


వికీపీడియా దశాబ్ది వేడుక

@రమణ: బొమ్మలు/సంగీతం -వాటి హక్కుదారుల కాపీరైట్ కు భంగం వాటిల్లకుండా చూడాలి.  మీకు హక్కులేని వాటిని మీరు వికిపీడియాకు ఎగుమతి చేయరాదు. అట్లా చేసిన వాటిని వికీ సంపాదకులు తొలగిస్తారు. మీరు తీసిన ఛాయాచిత్రాలు, గీసిన బొమ్మలు, పాడిన పాటలు, సృజించిన సంగీతం వికీకు ఎగుమతి చెయ్యవచ్చు. మీరు ఎగుమతి చేసినవాటి ని  ఇతర వాడుకదారులు  మీకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వాడుకునేలా మీరు అనుమతిస్తున్నారు. ఏ పుస్తకం లేక సృజనాత్మక పని ఏదైనా  సృజనకర్త మరణించిన 60 సంవత్సరాల తరువాత ఆ రచనలను ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అయితే కాపీరైట్ ఉన్నవాటిని వ్యాపార కార్యక్రమాలు కాని వాటిలో  కొన్ని పరిమితులకు లోబడి, సమీక్ష వగైరాల కొసం  Fair usage కింద వాడవచ్చును. ఉదాహరణకు  ఈ బ్లాగ్ లోని చిత్రాలు కొందరు బ్లాగర్లు తమ తమ వ్యాసాలలో వాడుకోవటం జరిగింది. Fair  usage క్రింద ఈ వ్యాసం లోని  చిత్రాలు వాడే సమయంలో Photo Courtesy: cbrao అని ఉదహరించటం సత్సాంప్రదాయం.   వికీపీడియన్లకు ఇలా Photo Courtesy  అని ఉదహరించే  అలవాటు  ఈ రోజు జరిగిన అవగాహ సదస్సు లాంటివి ద్వారా తెలియచెయ్యాలి.    Fair usage గురించిన మరింత సమాచారం కోసం  ఇక్కడ చూడండి.  కాపీరైట్  హక్కుల చట్టం  1957  ను ఇక్కడ నుండి దిగుమతి చేసుకోండి.

http://deeptidhaara.blogspot.com/2011/01/blog-post_25.html

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి