సోమవారం, మార్చి 14, 2011

నేను కలిసిన ముఖ్యమంత్రులు మానవవాదులు - పుస్తకావిష్కరణ

చిత్రంలో ఎడమనుంచి కుడివైపు: మాజీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్  పద్మాజారెడ్డి, మాజీ మంత్రి పురుషోత్తం రావు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య  మరియు ఎస్‌వి పంతులు (Indian Peasants Forum)
Photo:cbrao
హైదరాబాద్‌,(కెఎన్‌ఎన్‌): తెలంగాణ అంశం సున్నితమైనదని,దానికి పరిష్కారం హైదరా బాద్‌లో కూర్చుని మాట్లాడికుంటే పరిష్కారం అయ్యేది కాదని,కేంద్రమే అంశాన్ని తేల్చాల్సి ఉందని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని లోతుగా పరిశీలిస్తుందని, అందుకోసమే శ్రీకృష్ట కమిటీ రిపోర్టును సైతం పరిశీలనలో ఉంచుకుందని తెలిపారు. ఇప్పటికే ప్రజల మధ్య రాగద్వేషాలు పెరిగిపోయాయని, సమస్యను పరిష్కరించి,స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేందుకు కేంద్రం కృషి చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అదివారంబషీర్‌బాగ్‌ ప్రెస్‌కబ్ల్‌లో సీనియర్‌ పాత్రికేయుడు, మానవతావాది నరిశెట్టి ఇన్నయ్య రచించిన 'నేను కలిసిన ముఖ్యమంత్రులు, మానవవాదులు' అనేపుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆవిష్కరించాడు. అంధ్రప్రదేశ్‌ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని విభజనల పేరిట చెడ గొట్టు కోవద్దని సూచించారు. సాధారణ పౌరుడిగా ఆలోచిస్తే ఎవరి వాదనలను సహే తుకంగా చెప్పాల్సిన అవసరం ఉందని, అప్పుడే సమస్య పరిష్కారానికి ఆస్వారం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం వారికి నచ్చిన విధంగా ఉంటేనే తాము ఒప్పు కుంటామని మెండి పట్టుదలతో ఉన్నందున సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. నాడు విద్యార్ది స్ధాయి నుండి రాజకీయాల్లో పాల్గొన్నవారిమని,తాము రాజకీయ శిక్షణా తరగతులకు హజరయ్యేవారమని గతాన్ని గుర్త చేశారు. నేటి రాజకీయాల్లో డబ్బులు ఉంటే చాలు ఎలాంటి అనుభవం లేకున్న ఇష్టం వచ్చిన పార్టీలోకి చేరి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారంటు కడప ఎంపి జగన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. విద్యార్ధి దశనుండి ఇన్నయ్య తనకు దగ్గరగా ఉండేవాడని,తాను గుంటూరు హిందుకాలేజీ విద్యార్ధిగా ఉండగా ఇన్నయ్య ఎసికాలేజీ విద్యార్ధిగా ఉండేవాడని,ఇరువురు కలసి తాజా రాజకీయ పరిస్ధితులపై చర్చించుకునే వారి మని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తాము విద్యార్ధి దశలోనే detention విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలను చేశామని తెలిపారు. మాజీ మంత్రి పురుషోత్తం రావు మాట్లాడుతూ ఇన్నయ్య అప్పటితరం నేతల నుండినేటి తరం నేతల వరకు సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్‌ చెర్మన్‌ పద్మాజారెడ్డి, ఎస్‌వి పంతులు, వెంకటరత్నం, నాగలక్ష్మి, మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

News courtesy: Andhraprabha Online

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి