గురువారం, డిసెంబర్ 08, 2011

అస్లి-నక్లీ చిత్రం లోని ఒక మధురగీతం

ఈ మధ్యనే ప్రఖ్యాత నటుడు దేవానంద్ మరణించటం జరిగినా, అభిమానుల హృదయాలలో దేవ్ జీవించే ఉన్నాడు. దేవ్ పై ఎన్నో వ్యాసాలు వెలువడ్డాయి. దేవ్ ఉత్తమ చిత్రాలు, దేవ్ ఉత్తమ గీతాలు అంటూ కొన్ని చిట్టాలు కూడా వచ్చాయి. ఆశ్చర్యకరంగా నాకు ఎంతో నచ్చిన, అస్లి-నక్లీ (Asli -Naqli) చిత్రం లోని , తేరా మేరా ప్యార్ అమర్, ఫిర్ క్యోం లగ్తా హై డర్ పాట ఏ చిట్టా లో లేదు. ఈ పాట గతం లో మీరు చూడనట్లయితే ఇప్పుడు చూడండి. మీ గుండెల్లో కలకాలం నిలిచే పాట ఇది. సాధన అందమైన అభినయం, శంకర్ జైకిషన్ సంగీతం, శైలేంద్ర సాహిత్యం , లతా మంగేశ్కర్ శ్రావ్యమైన గొంతులో. ఈ చిత్రం 1962 లో విడుదలయ్యింది. సులభంగా మీరు పాడుగొనగలిగే పాట. చూస్తూ, మీరూ గొంతు కలపండి. 

2 వ్యాఖ్యలు:

చిన్ని ఆశ చెప్పారు...

చాలా మంచి పాట, ఎప్పుడూ వినలేదు, చూడనూ లేదు. మొదటి రెండు లైన్లలో ఎంతో సత్యం ఉంది...థ్యాంక్స్ అండీ, ఇంత మంచి పాటకి ఇలా వెలుగు చూపినందుకు...

Suresh చెప్పారు...

nice song andi Rao garu, its been a while I heard slow & melodious songs. Thanks for sharing this son in your blog.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి