గురువారం, డిసెంబర్ 08, 2011

గైడ్ సినిమా తెర వెనుక కధ


 బాక్స్ ఆఫీస్ వద్ద విజయ దుందుభి మోగించిన గైడ్ చిత్రం పెక్కు విశేషాలను కలిగి ఉంది. ఈ చిత్రం లో నాయికగా నటించమని వహీదారెహమాన్ ను దేవానందే కాకుండా సత్యజిత్ రే కూడా అడగటం జరిగిందని కొందరు చెప్తారు. అయితే ఈ చిత్రం చిత్రీకరణ హక్కులను దేవానంద్ రచయిత ఆర్కె నారాయణ్ నుంచి ముందు పొందటం జరిగింది. ఈ చిత్రానికి అంకురార్పణే ఒక కధ. దేవ్, హం దొనో చిత్రం 1962 బెర్లిన్ చలనచిత్రోత్సవానికి, భారత దేశ అధికారిక చిత్రంగా ఎంపికయ్యింది. అక్కడే దేవానంద్ అమెరికా దర్శకుడు టాడ్ డేనియల్ (మాతృ దేశం పోలండ్ ) ను కలవటం జరిగింది. టాడ్, పెర్ల్ ఎస్ బక్ (నోబుల్ సాహిత్య గ్రహీత) ఆహ్వానం పై అమెరికా వెళ్లి వారితో వ్యాపార ఒప్పందం చేసుకొని గైడ్ చిత్రం లో నటించటానికి అంగీకరించాడు. గైడ్ చిత్రానికి ముగ్గురు దర్శకులు. మిగతా విశేషాలు ఇక్కడ చదవండి.

4 వ్యాఖ్యలు:

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

గైడ్ సినిమా తెర వెనుక అసలు కథ తెలుసుకోవాలంటే, ఆ సినిమాకు మూలమైన గైడ్ నవలా రచయిత శ్రీ ఆర్ కె నారాయణ్ వ్రాసుకున్న ఆత్మ కథ చదివి తీరాలి. ఆయన ఆత్మ కథలో ఈ విషయం గురించి వ్రాసిన అధ్యాయం నలుగురికీ తెలియటానికి తెలుగులోకి అనువదించి మునుపు నా బ్లాగులో ప్రచురించాను. ఈ కింది లింక్ సహాయంతో చదువవచ్చు.

http://saahitya-abhimaani.blogspot.com/2011/03/blog-post_17.html


ఆ నవలా రచయిత స్వయంగా చెప్పిన దానికన్నా నిజం మరే ఇతర సోర్స్ నుంచో వస్తుందని నేను అనుకోను.

cbrao చెప్పారు...

మీ స్పందనకు ధన్యవాదాలు. మీ వ్యాసాన్ని వికిపీడియా లో సంప్రదించే వ్యాసంగా చేరుస్తున్నాను.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

రావుగారూ. మీరు తెలుగు వికీపీడియాకు లింకు ఇస్తానని చెప్పినంధుకు ధన్యవాదాలు. కాని తెలుగు వికీపీడియాతో ఎటువంటి సంబంధమూ నాకు ఇష్టంలేదు.

అక్కడ ఒకప్పుడు అద్భుతమైన వ్యాసాలు వ్రాసి, మెడల్స్ సంపాయించిన వాణ్ణే కాని, అక్కడ ఉన్న నిరక్షరాశ్య, పొగరుబోతు, అహంభావులైన నిర్వాహకుల వ్యవహార శైలి చూసి అసహ్యం పుట్టి, ఏవగించుకుని అక్కడ నాలాంటి వాళ్ళు వ్రాయటం చెవిటి వాడి ముందు శంఖం ఊదటం వంటిది అని మానేశాను.

ఆటువంటి తెలుగు వికీపీడియాలో నా వ్యాసం "సంప్రదించే వ్యాసం" గా ఉంచటం నాకు ఇష్టం లేదు, నేను అనుమతించటం లేదు. ఇప్పటికే మీరు ఆ లింకు ఏర్పరిచి ఉంటే దయచేసి తొలగించగలరు.

శివరామప్రసాదు కప్పగంతు చెప్పారు...

రావుగారూ,

మీరు శ్రమపడాలిసిన పనిలేదు. ఆ లింకును నేనే తొలగించాను. ఆ అలింకును మళ్ళి ఎవరన్నా పునరుధ్ధరించకుండా చూడగలరు. అసలే వికీ నిండా నీయమాలంటె తెలియని నియమాల నీలకఠయ్యలుగా ఊరేగే వాళ్ళున్నారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి