'సంజీవదేవ్' జీవితమే ఓ కళ..
రసదృష్టితో సాహిత్యాన్ని, అపురూప చిత్రాలను సృజించారు ఆయన.రచనా వ్యాసంగంలో కొనసాగుతూనే చిత్రకళనూ జీవితంలోకి ఆహ్వానించారాయన. ఆయనలోని సాంస్కృతిక, సాహిత్య స్రవంతి ఎన్నో పాయలుగా ప్రవహించింది. గాఢమైన సౌందర్య తృష్ణ, రసదృష్టి ఆయన రచనలలో, చిత్రాల్లో కనిపిస్తుంది. ఆయనే 'సంజీవదేవ్' సంజీవ్ దేవ్ శత జయంతోత్సవాల సందర్భంగా.. ఆయనను ఒకసారి స్మరించుకుందాం..
మనిషికి - ప్రకృతికి, మనిషికి - సమాజానికి మధ్య గల సంబంధాన్ని సంజీవ్ దేవ్ రచనలు తెలుపుతాయి. అవి కళాత్మకంగా ఉంటాయి. ఇవి శాస్త్రీయ దృక్పథంతో ఉంటాయి. సంజీవ్ దేవ్ గారి కవిత్వం ఆలోచింపచేస్తుంది. భావానికి, రూపానికి చక్కని సమన్వయం వలన కవితా ప్రయోజనం చేకూరుతుంది. ఆయన క్రీడోకరించకున్న జీవితపు విలువలకు ఆత్మ సౌందర్యమే ఆధారం. గడ్డి పూవునలంకరించిన మంచు బిందువు, మెడని మృదువుగా ముద్దాడిన చల్లగాలి. వర్షపు చినుకులో నిండిన అపారమైన ప్రేమ.. ఇవన్నీ ఎందర్ని ఆకట్టుకుంటాయి? అంతటి సౌందర్య పిపాస, రసదృష్టి ఉన్నవారు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తికి తన భావుకతను వ్యక్తీకరించే ప్రతిభ కూడా ఉంటే అరుదైన సన్నివేశాలు అపురూప కళాఖండాలు తయారవుతాయి. అలాంటి సౌందర్య ప్రేమికుడు సంజీవ్ దేవ్.
సంజీవ్ దేవ్ 1914 సంవత్సరంలో గుంటూరు జిల్లా తుమ్మపూడిలో జన్మించారు. అనుభవాలను, అనుభూతులను అక్షరీకరించడం తెలిసిన ప్రజ్ఞాశీలి ఆయన. మేజికల్ థింకింగ్ లో హెర్మన్ హెస్ తోనూ, ఫ్రీ థింకింగ్ లో జిడ్డు కృష్ణమూర్తి గారితోనూ, కళోపాసనలో ఆనందకుమార స్వామితో ఏ మాత్రం తీసిపోడు. సంజీవ్ దేవ్ స్వేచ్ఛా చింతకుడు. ఆచారాలకు, మూఢ నమ్మకాలకు అతీతుడు. తండ్రికి సైతం ఉత్తర క్రియలు జరుపని ఆచార విరోధి. విలక్షణ శైలి, తార్కిక వాక్య నిర్మాణం తో రచనలు చేశారు. చిత్ర కళా రంగంలోనూ, రచనా రంగంలోనూ, లేఖా రచనా పరంగానూ, ఆయన ఎందరికో స్ఫూర్తిప్రధాత. 'బయో సింఫనీ' దేవ్ గారి ఆంగ్ల అద్బుత సృష్టి. అది ఏడు అధ్యాయాల ఆంగ్ల గ్రంథం. ఇందులో జీవితాన్ని అద్భుతంగా విశ్లేషించారు. తన దృష్టిలో మనిషి అంటే ఏమిటో చర్చించారు. మానవ మేథస్సుకు ముద్రవేస్తూ మానవవాదం విలువ ఇస్తుంది. అదే విధంగా రమణీయతకు సైకోమానవవాదవం విలువ ఇస్తుంది. మానవ మేథస్సుపై ముద్రవేస్తూ మానవజీవితం రమణీయతను విస్మరించని ధోరణిలో సాగిపోవాలని అంటుంటారు 'సంజీవ దేవ్'అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ 'గతంలోకి','స్మృతిబింబాలు', 'తెగిన జ్ఞాపకాలు' పేరుతో రచనలు వెలువరించారు. రచనల్లో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నతను చూపారు.
సంజీవదేవ్ పై రూపొందించిన ప్రత్యేక చలనచిత్రాన్ని చూడండి.
Courtesy: 10 TV
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి