సోమవారం, జులై 29, 2013

తుఫానులో కొంగ -సంజీవదేవ్
సంజీవదేవ్ కవితలు "తెల్ల మబ్బులు"' గా పుస్తక రూపంలో 1975 లో వెలువడ్డాయి. ఆ తరువాత వ్రాసిన కవితలు పుస్తక రూపం లో రాలేదు. సంజీవదేవ్ అముద్రిత కవితలు కొన్ని ఈ మధ్యనే నా దృష్టికొచ్చాయి. వాటిలో "తుఫానులో కొంగ" ఒకటి. చదివి ఆనందించగలరు.

తుఫానులో కొంగ


నిశీధపు
నిబిడ తిమిరంలో
వర్షధారల
వలయాన్ని చీల్చుక
ఎగిరిపోయింది
నల్ల తుఫానులో
తెల్లకొంగ
పొగడ చెట్టు గూటినుండి
ఎగిరిపోయింది
తెల్లకొంగ
అంతాలను దాటుతూ
అనంతాల వైపుకు
ఎగిరిపోయిన
తెల్లకొంగ
నల్ల తుఫాను
అంతరించినా
గూటికిరాలేదు తిరిగి
తెలతెల్లగా
తెల్లవారినా !

-డా||సంజీవదేవ్


2 వ్యాఖ్యలు:

surya prakash apkari చెప్పారు...

తెలతెల్లగా తెల్లవారినా ఎగిరిపోయిన తెల్లకొంగ నల్ల తుఫాను అంతరించినా గూటికి రాలేదు తిరిగి.....ఆహా ఎంత బాగుంది! డాక్టర్ సంజీవదేవ్ గారి కవితలన్నీ గుదిగుచ్చి ఒక సమగ్ర కవితాసంపుటి అందంగా వెలువరిస్తే ఎంత బాగుండును!

cbrao చెప్పారు...

డాక్టర్ సంజీవదేవ్ గారి కవితలు ఒక కవితాసంపుటి గా 1975 లో తెల్లమబ్బులుగా వచ్చాయి. అయితే తరువాతి కవితలు పుస్తక రూపంలో వెలువడలేదు. తెల్లమబ్బులు ఇప్పుడు అలభ్యం. కొత్త సంపుటి వెలువరించాల్సిన అవసరం ఉంది. సంజీవదేవ్ శతజయంతి సందర్భంగా వారి జ్ఞాపకాలు, రచనలు గురించిన ఊసులు పంచుకుందుకై ఒక ప్రత్యేక facebook page ప్రారంభించాను. ఆ గొలుసు దిగువ ఇస్తున్నా.
https://www.facebook.com/Sanjivadev
Sanjivadev పేజీలోవున్న ' LIKE ' పై ' క్లిక్ ' చేయండి. ఇంకా నచ్చితే ' SHARE ' కూడా చేసుకోండి!
మీరంతా ఆ ముఖపుస్తక పుట చూసి ఇష్టపడతారని (Like) , సంజీవదేవ్ గురించిన విశేషాలు తెలుసుకుని ఆనందించగలరని ఆశ.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి