బుధవారం, డిసెంబర్ 26, 2007

సాహితీపరులతో సరసాలు


Jandhyala Papayya Sastry's first photo in internet.


కొత్త బ్లాగ్ సీరియల్ సాహితీపరులతో సరసాలు ప్రారంభించబోతున్నామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము.ఇన్నయ్య గారి మిత్రులలో సాహితీపరులెంతమందో వున్నారు. వారి రచనల విశ్లేషణ కాక, తనకు పరిచయమైన వారి వ్యక్తిగత కోణంలోంచి చూస్తూ,మనకు తెలిసిన వ్యక్తుల, తెలియని కోణాలను ఆవిష్కరింప చేసేవి ఈ రచనలు.ఇంకో మాటలో చెప్పాలంటే, రచయితల నిజ జీవితంలోని,కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు, ఈ వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇది. మొదటగా కీర్తిశేషులయిన వారితో ప్రారంభమయ్యే ఈ రచనలు,పాఠకుల ఆసక్తి పై ఆధార పడి జీవించి వున్న వారిపై కూడా రాయాలని సంకల్పం.ఈ రచనలన్నీ అముద్రితాలు. మొదటగా, నా ప్రపంచం బ్లాగు ద్వారా ప్రచురితమవబోతున్నాయి.

ఈ వ్యాస పరంపరలో వున్న అనేక రచయితల పై రాసిన వ్యాసాల లోంచి, కొందరి రచయితల లోంచి,మచ్చుతునకలను మీకు అందిస్తున్నాము.

రాచకొండ విశ్వనాథశాస్త్రి

రాచకొండకు ఇరువురు భార్యలు, విశాఖపట్నంలో రిక్షా వాళ్ళందరికీ ఆపద్భాంధవుడైన రాచకొండ తాగినప్పుడు ఎక్కడకు తీసుకెళ్ళాలో వారందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన ఒక రిక్షావాడు ఒకనాడు రాచకొండను అలాంటి దశలో పెద్ద భార్య దగ్గరకు తీసుకెళ్ళి తలుపు తడితే. “ఏరా, ఆసికాలా ఏసికాలా” అంటూ, తలుపేసుకున్నదట. అప్పుడు రెండో భార్య దగ్గరకు చేరేశాడట. స్వవిషయం చెప్పికూడా రాచకొండ నవ్వించాడు.

పురాణం సుబ్రహ్మణ్య శర్మ

విషయాల్ని కొత్త కోణం నుంచి కూడా పురాణం చూచేవాడు. తిట్లు రెండు రకాలని, బ్రాహ్మణులతిట్లు శాపనార్థాలతో వుంటాయనేవాడు, ఇలా. నీపాడె, పచ్చిబద్ధాలు, తలపండు పగల-యిత్యాదులు.

శూద్రులతిట్లు సృష్టి కార్యానికి చెందాయట!


జంధ్యాల పాపయ్య శాస్త్రి

పాపయ్యశాస్త్రి గురువు జమ్మల మడక మాధవ రాయశర్మ ఎ.సి. కాలేజీలోనే మాకు తెలుగు పాఠాలు చెప్పారు. ఆయన సంస్కృత పండితుడైనా, తెలుగు నాటకం చక్కగా, హృద్యంగా చెప్పేవారు. ఆయన పాపయ్య శాస్త్రికి పాఠాలు చెప్పారని తరువాత తెలుసుకున్నాం.
ఆవుల గోపాలకృష్ణ మూర్తి ఉపన్యాసం ఎ.సి. కాలేజీలో ఏర్పాటు చేస్తే, పాపయ్య శాస్త్రి కూడా వచ్చి, మెచ్చుకున్నారు. అది విశేషం.
చెట్లకు ప్రాణం వుంది, అవి స్పందిస్తాయనే జగదీష్ చంద్ర, సైంటిస్టు ఎంత వరకు పాపయ్య శాస్త్రిని ప్రభావితం చేశాడో తెలియదు. కాని ఆయన కవితల్లో పూలపట్ల కదలించే తీరు గొప్పది.

కాళోజి నారాయణరావు

ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నారని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు.
వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట ఇంట్లో ఫోను లేనందున కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు రమ్మంటే, సరేనని జీపు ఎక్కి, అడిగారట. నన్ను ఎన్ కౌంటర్ చేయడానికి తీసుకెడుతున్నారా అని. ఆయన నవ్వి. లేదండీ, ఢిల్లీ నుండి మీకు ఫోను వచ్చిందట, అందుకని అన్నారట. కలెక్టరేట్ లో సాదరంగా ఆయన్ను కూర్చోబెట్టి, ప్రధాని నరసింహారావుకు ఫోను కలిపారట. కాళన్నా, నీవు అన్నీ వద్దంటావు. కాని యీ సారి అలా అనొద్దు. పద్మ విభూషణ్ స్వీకరించడానికి ఒప్పుకో అంటే, కాళోజీ సరే అన్నారట.

ఇంకా నార్ల,G.V.కృష్ణా రావు,అబ్బూరి రామకృష్ణారావు,చలసాని ప్రసాదరావు, సంజీవదేవ్, మొదలగు ఎందరో సాహితీపరులపై, ఎన్నో ఆసక్తి కరమైన విషయాలతో ఈ వ్యాసాలున్నాయి. నూతన సంవత్సర కానుకగా, నా ప్రపంచం లో త్వరలో ఇవి వెలువడనున్నాయి.

http://naprapamcham.blogspot.com/

-cbrao




మంగళవారం, డిసెంబర్ 11, 2007

మా పెళ్ళికి రండి



ఈ మధ్య మరో వైవిధ్య భరిత పెండ్లి పత్రిక వచ్చింది. మన బ్లాగరులలో పెళ్ళికాని ప్రసాదులు చాలానే వున్నారు కనుక వారికి ఈ పెళ్ళి పిలుపు ఆసక్తి కరంగా, ఉండగలదని ఆశిస్తాను.

ఆంఖోం మె తేరి అజబ్సీ,అజబ్సీ అదాయే హై అంటూ మొదలయ్యే ఈ వెబ్ సైట్ music video skip option ఇవ్వలేదు.Movie download అయ్యేదాక నిరీక్షించాల్సిందే. Updated photos చూడాలనుకునే వారు మరలా ఈ హిందీ పాట ఆసాంతం వినాల్సిందే.అంతా flash లో design చేశారు, సంగీత భరితంగా. chetana weds Shravan అనే main menu పెళ్ళి మంత్రాలతో మొదలవుతుంది. పెళ్ళి ఆహ్వానం,మూడు చోట్ల జరిగే.వివిధ కార్యక్రమాల వివరణలతో కూడిన పత్రిక, ఈ పేజీ లో కనబడుతుంది. ఇదే పేజీ లో కల, వివరణ పట్టిక లోని profiles కి వెళితే మనకు ఒక ఆసక్తి కరమైన అంశం కనిపిస్తుంది.



పెళ్ళి కొడుకు జీవిత,చదువు వివరాలతో బాటుగా ఈ పెండ్లి తేదికి వున్న ప్రాముఖ్యతను హాస్యపూరకంగా వివరించారు.వివాహతేదిని మరిచి,భవిష్యత్తు లో marriage anniversary సమయంలో భార్యను నిరాశ పరచకుండా వుండటానికి, వరుడు, తన పుట్టిన తేదీనే వివాహ తేదీగా ఎంచుకోవటం జరిగింది. మనలో ఎంతమంది భార్య పుట్టిన తేదీలు, వివాహ తేదీలు గుర్తుంచుకుని, మన జీవిత భాగస్వాములకు శుభాకాంక్షలు తెలుపుకోగలుగుతున్నాము? ఈ విషయంలో, వర్జీనియా (USA) లో, ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రవణ్ ( B.Tech) ముందు చూపును అభినందించాలి.

పాతికేళ్ళ చేతన profile కూడా ఆసక్తి భరితం. London లో International business laws ను The London School of Economics లో చదివింది. చదువే కాకుండా ఆట, పాట కూడా నేర్చిందీమె.కూచిపూడి,కథక్,జాజ్ ఇంకా ఇప్పటి ఫాషన్ అయిన సల్సా నృత్యాలు నేర్చుకుంది. సికందరాబాదు సైలింగ్ క్లబ్ లో జరిగిన సంగీత్ కార్యక్రమంలో నాట్యం పై తన కున్న పట్టును చక్కగా ప్రదర్శించింది.

చేతన అవ్వాలనుకున్నది: ఫాషన్ డిజైనర్. హైదరాబాదు NIFT లో చదివాకా, ఉన్నత చదువులకు ఫాషన్ల పుట్టిల్లయిన పారిస్ వెళ్ళాలని, నృత్యాన్నే, వృత్తిగా మలచుకోవాలని.

అయ్యింది: హైదరాబాదు లోని నల్సార్ విస్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రంలో చదువు, ఆ పై లండన్ లో అంతర్జాతీయ న్యాయ శాస్త్రం.

వెళ్ళబోయేది: The land of opportunities గా భావించబడే USA.


ఈ వెబ్ సైట్ మెనులో ఇంకా Photo Gallery, Venues, Menu (Food) ఇంకా Feedback వున్నాయి.ఈ వెబ్ ఆహ్వాన పత్రిక, ఆహ్లాదంగా,కళాత్మకంగా వుండటానికి చేసిన కృషి కనిపిస్తోంది.వధువు తండ్రి గాంధీ గారు, సహృదయులైన హేతువాది, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్యోగి. సాంప్రదాయక వివాహం కావాలని, చేతన ముచ్చట పడితే, గాంధీ గారు హేతువాది అయినప్పటికీ, ఆమె అభీష్టాన్ని మన్నించి,ఆమె కోరుకున్న రీతిలో వివాహం జరిపించారు. వధువు తల్లి న్యాయ శాస్త్ర పట్టభద్రురాలు, Law practice చేస్తున్నారు. వరుని తండ్రి real estate వ్యాపారం లో వున్నారు.

నూతన వధూ వరుల వైవాహిక జీవితం, ఆనంద ప్రదాయంగా వుండాలని కోరుకుందాం. వీరి వివాహ వెబ్ సైట్ ను ఈ దిగువ ఇచ్చిన చిరునామాలో చూడండి.

http://www.chetanashravanwedding.com/

సోమవారం, డిసెంబర్ 10, 2007

రైతుల వెతలు


బొప్పాయి తోటలు, కురుగోడు (బెళ్ళారి జిల్లా),కర్ణాటక. Photo:cbrao

వ్యవసాయ పంటలకు, ప్రభుత్వం వారు ఇస్తున్న మద్ధతు ధర గిట్టుబాటు కాక రైతు సతమవుతున్నాడు.అప్పుల పాలవుతున్నాడు.అప్పులు తీర్చలేక,గత్యతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు.ఈ పద్ధతి మారాలి.రైతు కి మద్ధతు ధర కాక గిట్టుబాటు ధర ఇచ్చి, ప్రభుత్వం రైతుల స్థితిగతులను మెరుగు పర్చాలి.

మంగళవారం, డిసెంబర్ 04, 2007

ఉచిత హృద్రోగ శస్త్రచికిత్స

For any kind of heart surgery free of cost ..
Contact : Sri Sathya Sai Institute Higher Medical Sciences, E.P.I.P. Area, WhiteField, Bangalore
Write to
Sri Sathya Sai Institute of Higher Medical Sciences
EPIP Area, Whitefield,
Bangalore 560 066,
Karnataka, INDIA.
Call
Telephone: +91- 080- 28411500
Fax +91 - 080- 28411502
Employment related +91- 080- 28411500 Ext. 415
Email
General Queries: adminblr@sssihms.org.in

For more info visit

http://www.sssihms.org.in/

శుక్రవారం, నవంబర్ 30, 2007

ఒక పడకగది అపార్ట్‌మెంట్


ఉత్తర కర్ణాటక, కురుగోడు గ్రామంలో పిల్లలు, Photo:cbrao

A Real Story.....As the dream of most parents I had acquired a degree in SoftwareEngineering and joined a company based in USA , the land of braves and opportunity.When I arrived in the USA , it was as if a dream had come true. Here at last I was in the place where I want to be. I decided I would be staying in this country for about Five years in which time I would have earned enough money to settle down in India . My father was a government employee and after his retirement, the only asset he could acquire was a decent one bedroom flat. I wanted to do some thing more than him. I started feeling homesick and lonely as the time passed. I used to call home and speak to my parents every week using cheap international phone cards. Two years passed, two years of Burgers at McDonald's and pizzas and discos and 2 years watching the foreign exchange rate getting happy whenever the Rupee value went down.

Finally I decided to get married. Told my parents that I have only 10 days of holidays and everything must be done within these 10 days. I got my ticket booked in the cheapest flight. Was jubilant and was actually enjoying hopping for gifts for all my friends back home. If I miss anyone then there will be talks. After reaching home I spent home one week going through all the photographs of girls and as the time was getting shorter I was forced to select one candidate. In-laws told me, to my surprise, that I would have to get married in 2-3 days, as I will not get anymore holidays. After the marriage, it was time to return to USA , after giving some money to my parents and telling the neighbors to look after them, we returned to USA .

My wife enjoyed this country for about two months and then she started feeling lonely. The frequency of calling India increased to twice in a week sometimes 3 times a week. Our savings started diminishing. After two more years we started to have kids. Two lovely kids, a boy and a girl, were gifted to us by the almighty. Every time I spoke to my parents, they asked me to come to India so that they can see their grand-children. Every year I decide to go to India .. But part work part monetary conditions prevented it. Years went by and visiting India was a distant dream. Then suddenly one day I got a message that my parents were seriously sick. I tried but I couldn't get any holidays and thus could not go to India .. The next message I got was my parents had passed away and as there was no one to do the last rights the society members had done whatever they could. I was depressed. My parents had passed away without seeing their grand children.

After couple more years passed away, much to my children's dislike and my wife's joy we returned to India to settle down. I started to look for a suitable property, but to my dismay my savings were short and the property prices had gone up during all these years. I had to return to the USA ..My wife refused to come back with me and my children refused to stay in India .. My 2 children and I returned to USA after promising my wife I would be back for good after two years. Time passed by, my daughter decided to get married to an American and my son was happy living in USA .. I decided that had enough and wound-up everything and returned to India . I had just enough money to buy a decent 02 bedroom flat in a well-developed locality.

Now I am 60 years old and the only time I go out of the flat is for the routine visit to the nearby temple. My faithful wife has also left me and gone to the holy abode. Sometimes I wondered was it worth all this? My father, even after staying in India , had a house to his name and I too have the same nothing more. I lost my parents and children for just ONE EXTRA BEDROOM. Looking out from the window I see a lot of children dancing. This damned cable TV has spoiled our new generation and these Children are losing their values and culture because of it. I get Occasional cards from my children asking I am alright. Well at least they remember me. Now perhaps after I die it will be the neighbors again who will be Performing my last rights, God Bless them. But the question still remains 'was all this worth it?' I am still searching for an answer................!!! .

-Written by an Indian Software Engineer
-A forwarded mail, received from a friend

ఆదివారం, నవంబర్ 25, 2007

చిత్రకారుడు భరత్ భూషణ్


Invitation to Painting Exhibition Picture Courtesy: Bharat Bhushan


Inaguration of Exhibition Photo:cbrao

శుక్రవారం, 23 నవంబరు 2007 సాయంత్రం ఆరున్నర గంటలకు, మాసాబ్ టాంక్ లోని లక్ష్మన్ ఆర్ట్ గాలరి లో, ఒక విచిత్రం జరిగింది. ఇంతవరకు ఛాయా చిత్రకారుడిగా చిరపరిచితమైన భరత్ భూషణ్ గుడిమిల్ల, రంగుల కాన్వాస్ తో కూడిన చిత్రకారుడిగా పరిచయ మయ్యారు. ఈ మార్పు ఆశ్చర్యకరమైనా, ఆహ్వానించతగినది. కొంతకాలం అనారోగ్యం, బయటకు కదల నీయక పోవటం తో, ఆ సమయాన్ని, సృజనాత్మకంగా, చిత్రలేఖనానికి ఉపయోగించారు భరత్ భూషణ్.


Bharat Bhushan at Painting Exhibition Photo: cbrao

ఓరుగల్లు లో పుట్టి పెరిగిన, భరత్ భూషణ్ కు బాల్యం నుంచీ, తెలంగాణా పండగలు, సంస్కృతి పై మక్కువ ఎక్కువ. బతుకమ్మ పండుగలో బొడ్డెమ్మ దేవత చుట్టూ గ్రామీణ యువతులు చేసే ఆట - పాట, రంగుల పూలు, పండుగకు భూషణ్ అమ్ముమ్మ చేసే మిఠాయిలు, కొనిచ్చే బూరలు,ఇవన్నీ భూషణ్ మదిలో చెరగని ముద్ర వేశాయి. ఆ రంగుల పూల పై మమకారాం, భూషణ్ ను తరువాతి జీవితంలో ఒక మంచి ఛాయ చిత్రకారుడిగా మలిచింది.బతుకమ్మ పండగ ఉత్సవాలపై వరుసగా నాలుగేళ్లు చిత్రాలు తీసి, పండగలో కాల క్రమేణా సహజ పూల స్థానం లో ప్లాస్టిక్ పూలు రావటాన్ని వేదనతో గమనించారు. బతుకమ్మ పండగ గురించి భూషణ్ మాటల్లో వినండి.


Video Courtesy: Bharat Bhushan

ఆంధ్ర జ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం పత్రికలలో భూషణ్ పని చేశారు. ఇండియా టుడే, హిందూ (ఫొలియో),ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా,ఏసియన్ ఫొటోగ్రఫీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వగైరా పత్రికలలో భూషణ్ చిత్రాలు వచ్చాయి.తెలంగాణా పండగలు, జాతరల్లకు వీరి చిత్రాలు జాతీయ గుర్తింపు తెస్తే, బతకమ్మ పండగపై వీరి వ్యాసం, చిత్రాలు, ప్రదర్శన ఆ పండగకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం లో భాగమైన ఈ పండగను ప్రస్తుతం అంతర్జాతీయంగా, అమెరికా లోని ముఖ్య పట్టణాలలో జరుపుకుంటం వెనుక వీరి కృషి వుంది. మా భూమి(గౌతం ఘోష్),కాంచన సీత(జి అరవిందన్),రంగుల కల(బి నర్సింగ రావు) వగైరా చిత్రాలకు నిశ్చల చాయా చిత్రాలు తీశారు.

`Bathukamma: a Photographic Journey Into Telangana’s Water Festival’ అనే బతుకమ్మ పండగపై చిత్రాల ప్రదర్శన, ఇక్రిశాట్ వారు, వారి కార్యాలయం, పఠాన్‌చెరువులో 2005 లో ఏర్పాటు చేశారు.వోల్గా ఆధ్వర్యం లో Asmita-Resource Centre for Women వారు, Girl -child అనే భావనపై Y.W.C.A., Secunderabad లో,2002 లో భరత్ భూషణ్ చిత్రాలు కొని, ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇదే సంస్థ వారు గతం లో మహిళావరణం అనే పుస్తకానికి భరత్ తీసిన నలుపు తెలుపు చిత్రాలు వాడారు. వివిధ రంగాలలో ప్రముఖులైన మహిళామణుల జీవిత చిత్రణలతో నిండి వుందీ పుస్తకం.ఈ పుస్తకం కోసం, సారా వ్యతిరేకోద్యమానికి నాంది పలికిన దూబగుంట రోశమ్మ మొదలు, సినీ నటి శారద నుంచి కోనేరు హంపీ దాక భిన్న రంగాలు లో ప్రసిద్ధులైన వారందరి చిత్రాలు భూషణ్ ఎంతో సృజనాత్మకంగా తీసారు. స్త్రీ దృక్కొణం లో స్త్రీల సమస్యలను అధ్యయనం చేసే అవకాశం అస్మిత ద్వారా భరత్ కు కలిగింది.భరత్ కాన్సర్ బారిన పడినప్పుడు అస్మిత ఆర్థికంగా ఆదుకొంది. వీరు, 2007 లో, ఆంధ్రప్రదేష్ ప్రెస్ ఫొటోగ్రాఫర్స్ సంఘం వారు నిర్వహించిన, రాష్ట్ర స్థాయి ప్రెస్ ఫొటోగ్రాఫర్ల పోటీకి న్యాయనిర్ణెతలలో ఒకరిగా వ్యవహరించారు.

భరత్ చిత్రకళ తన ఛాయాచిత్రగ్రహణలోంచి ప్రేరణ పొందినదే.ఈ దిగువ చిత్రాలు గమనించండి.


Image Courtesy: Bharat Bhushan

ఒకటి దూబగుంట రోశమ్మ చేటలో బియ్యం ఏరుకుంటూ వుండగా తీసిన గ్రామీణ నేపధ్యం లోని చిత్రం.


Image courtesy: Bharat Bhushan

ఆ తదుపరి పెయింటింగ్ మరల గ్రామీణ నేపధ్యం ఆధారంగా చిత్రీకరించినదే. ఈ రెండింటిలోను ఎంత సామ్యం వుందో గమనించారా? ఈ రోజు ప్రదర్శనకు వుంచినవన్నీ, గ్రామీణ నేపధ్యాన్ని కంటికి కట్టినట్టుగా చూపిస్తాయి. మనలను తెలంగాణాలోని పల్లెకు తీసుకెళ్తాయా చిత్రాలు.


Director B.Narsing Rao of Daasi & Rangula kala fame with cbrao Photo:cbrao

ఈ చిత్రాల ప్రదర్శనను, జ్యోతి ప్రజ్వలనం గావించి, ప్రముఖ కళా విమర్శకుడు జగదీష్ మిట్టల్ ప్రారంభించారు.పలువురు సాహితీ మిత్రులు, చిత్రకారులు ఈ ప్రదర్శనకు వచ్చినవారిలో వున్నారు.చాయాగ్రహణం వలే, భరత్ భూషణ్ చిత్రకళ కూడా,పలువురి మన్నలను పొందగలదు.

బుధవారం, నవంబర్ 21, 2007

కొత్త సాఫ్ట్వేర్: మైక్రొసాఫ్ట్ గాడ్


Image courtesy MSN

Humor: భక్తుడిని, భగవంతుడిని అనుసంధానం చేసేదేమిటి? మీ సమాధానం అంబికా దర్బార్ అగర్బత్తీ ఐతే అది తప్పని మైక్రొసాఫ్ట్ అంటుంది. మీకు ముక్తి ప్రదాయిని తమ కొత్త సాఫ్ట్వేర్ మైక్రొసాఫ్ట్ గాడ్ అని వారు ప్రకటిస్తున్నారు. పూర్తి వివరాలకు కింది వార్తా కథనం చూడండి.

Microsoft to Buy God

REDMOND, WA Microsoft Corporation today announced its intent to purchase, copyright, and upgrade God Himself. The new product would be named, predictably enough, "Microsoft God," and would be available to consumers sometime in late 1998, well before the millennium.

"Too many people feel separated from God in today's world," said Dave McCavaugh, director of Microsoft's new Religions division. "Microsoft God will make our Lord more accessible, and will add an easy, intuitive user interface to Him, making Him not only easier to find, but easier to communicate with."

The new Microsoft Religions line will be expanded to include a multitude of add-on products to Microsoft God, including:

Microsoft Crusades: This conversion product will bring all worshiper accounts and prayer files over from previous versions of God, or from competing products like Buddha or Allah.

Microsoft God for the World Wide Web: This product ties Microsoft God with Microsoft Internet Information Server, making our Lord accessible from the World Wide Web using a standard Web browser interface. It introduces several new Web technologies, including Dynamic Salvation and Active Prayer Pages (APP). Donations for the poor can be donated via a Secure Alms Server.

Microsoft Prayers: Using a Windows-based WYSIWYG interface, this product will allow worshipers to construct effective prayers in a minimum of time. A Secure Prayer Channel technology allows guaranteed delivery of the prayer to Microsoft God servers, and Prayer Wizards enable users to construct new types of prayers with a minimum learning curve.

Microsoft Savior: This product will allow worshipers to transfer their sins to its internal Vice Database. After a preset interval, the product will erase itself from the user's system and establish a clear line of secure communications to the user's Microsoft God server. Additionally, Microsoft is expected to announce a line of complimentary products for the new Religions line, which will enhance the functionality of the Microsoft God server product by providing a customized user interface. These interfaces will be based on popular religious sects, allowing worshipers to interact with the new God product in much the same way as the previous version. This line is expected to include Microsoft Protestant, Microsoft Catholicism, Microsoft Judaism (incompatible with Microsoft Savior), etc.

Competitor Netscape Communications denies rumors that it is planning to release a competing product, Netscape Satan that would attempt to render Microsoft God installations inoperable.

Found on CyberCheeze.com

Source:http://atheistalliance.org/humor/microsoft_god.php

మంగళవారం, నవంబర్ 20, 2007

సమీక్ష: క్రైస్తవం ఇంత అమానుషమా?


జులై 8, 2007 న ప్రెస్ క్లబ్ లో,పుస్తకాన్ని విడుదల చేసిన టి.వి.9 రవి ప్రకాష్ Photo:cbrao

శాం హారిస్ రాసిన 'A Letter to Christian Nation" అనే పుస్తకాన్ని ఇన్నయ్య గారు “క్రైస్తవం ఇంత అమానుషమా?” అనే పేరుతో తెలుగీకరించారు.


మతం మానవాళికి మత్తుమందన్నాడు కార్ల్ మార్క్స్. ఎవరికి వారు తమ మతం గొప్పదంటే తమ మతం గొప్పదంటూ యుద్ధాలు సృష్టిస్తున్నారు; మూఢనమ్మకాలకు తమ వంతు చేయూతనిస్తున్నారు.

ఈ భూమిపై జరిగే ప్రతి పనీ, దేవుని అనుజ్ఞతోనే జరుగుతుందని క్రిష్టియన్ల విశ్వాసం. 2004 సునామిలో కొన్ని వేల మంది పిల్లలు తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. తమిళ్‌నాడు లోని వెళ్లంకన్ని మేరి మాత చర్చ్ కు, క్రిస్ట్మస్ పర్వదినాన వెళ్లిన భక్తులు, ఆ మరుసటి దినం వుదయాన చర్చ్ పక్కనే గల బీచ్ లో వాహ్యాళి కెళ్లిన సందర్భంలో, సునామి వాత పడి సుమారు 2000 మంది చనిపోయారు;120 వ్యాపార అంగళ్లు కొట్టుకు పోయాయి. చర్చ్ కు ఏమి కాలేదు. ఆసియ ఖండంలో సునామి దెబ్బకు ఎంతో మంది అనాధలయ్యారు. దేవుడే వుంటే ఇలాంటి అరాజకపు పని జరగనిస్తాడా?

ఏసు దయామయుడని క్రిస్టియన్ల విశ్వాసం. బైబుల్ లో పరమత సహనం: దేవుని యందు విశ్వాసం లేని వారిని చిత్రహింస చెయ్యాలని (సెయింట్ ఆగస్టీన్), చంపెయ్యాలని(అక్వినాస్) చెప్పారు.బైబుల్ బానిసత్వాన్ని, జంతుబలిని ప్రోత్సహిస్తుంది.ఆఫ్రికా ఖండం ఎయిడ్స్ తో సతమతమౌతుంటే, సహారా ఎడారి ప్రాంతంలో కండోం లు వాడవద్దన్న క్రైస్తవుల ప్రచారంతో, ఎయిడ్స్ అక్కడ ఒక పెద్ద సామాజిక సమస్యై కూర్చుంది. క్రిస్టియానిటి గర్భస్రావాన్ని అనుమతించక పోవటం తో , పెళ్లి కాని తల్లులు, పెక్కు సమస్యలు, కొన్ని దేశాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది.బైబుల్ లో పరస్పర విరూద్ధాంశాలు చాల ఉన్నాయి. ఆ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

బైబుల్ దేవవాక్కయితే, ఇందు లో గణితానికి సంబంధించి తప్పులెలా వుంటాయి? బైబుల్ సర్వస్వం కాదు.వైజ్ఞానిక విషయాలను చెప్పటంలో విఫలమయ్యింది. ఉదాహరణకు విద్యుత్, జీవాణువు (DNA), విశ్వ పరిమాణం, విశ్వ వయస్సు ఇంకా కాన్సర్ చికిత్స గురించి బైబుల్ చెప్పలేదు. ఈ విశాల జగత్తులో బాల్య మరణాలు అధికం. బాప్టిజం పుచ్చుకోకుండా చనిపోతున్న ఈ బాలలంతా, శాశ్వతంగా నరకంలో వుండి పోతారని,సెయింట్ ఆగస్టీన్ బాష్యం చెప్పారు.క్రైస్తవంలో,అనంత విస్ఫోటనాన్ని (Big Bang theory) అంగీకరించక, అంతా దేవుడి తెలివైన నమూనా (Intelligent Design) అని నమ్మి, ఆ సిద్ధాంత ప్రచారానికై, అశాస్త్రీయ పాఠ్య పుస్తకాలను పిల్లలపై రుద్దుతున్నారు.

మత సంఘర్షణలు: కాథొలిక్స్కు, ప్రొటెస్టంట్లకు పడదు.సున్నీ, షియాలకు పడదు.శైవులకూ, వైష్ణవులకూ పడదు. వీరంతా ఒకే మతంలో వుంటూ, ఆ మతానికి పరస్పర విరుద్ధ భాష్యాలు చెపుతూ కలహించు కొంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా భిన్న మతస్తులు పరస్పరం యుద్ధాలు చేసుకొంటున్నారు.

1775 లో అమెరికా లో బానిసత్వాన్ని తొలగించాలని కొందరు వాదిస్తే, అలా వాదించే వారు తమ సమయాన్ని వృధా చేసుకొంటున్నారని తలిచారు. ఈ మతం వలన మానవాళికి ఒరిగిందేమిటి? పరస్పర యుద్ధాలు, మనిషిని అంధ విశ్వాసాల లోకి నెట్టి వేయటం తప్ప. విద్య,శాస్త్రీయ దృక్పధం,హేతువాదం పెంపొందిన నాడు , దేవుడనే ఇప్పటి ప్రజల విశ్వాసం చూసి, భవిష్య మానవుడు నవ్వుకుంటాడు.


మూల రచయిత శాం హారిస్ తో ఇన్నయ్య

సాంకేతికాంశాలు: అనువాదం సరళంగా చదివించేదిగా వుంది.ముఖచిత్ర గెటప్ బాగుంది.అక్షరాల ఫాంట్ బాగుంది కాని అక్కడక్కడా అచ్చుతప్పులు ఇబ్బంది పెడతాయి. పుస్తక ధర కేవలం Rs.30/- అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుంది.

ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో చాలా వున్నాయి. మీ సౌలభ్యం కోసం ఈ పుస్తకాన్ని e-book గా ఇస్తున్నాము.

Christianity by Sam
Christianity by Sa...
Hosted by eSnips

సోమవారం, నవంబర్ 19, 2007

కృష్ణకాంత్ ఉద్యానవనము,యూసఫ్‌గూడా,హైదరాబాదు

ప్రతినెలా తెలుగుబ్లాగరులు ఇక్కడ సమావేశమౌతుంటారు.హైదరాబాదులో ఉంటూ కూడా సమావేశానికి రాని వాళ్లు ఏమి కొల్పోతున్నారో తెలియచెప్పేలా వున్న వీడియో ను మీకు చూపించపోతున్నాను. Park లోని అందాలను ఈ చిత్రం మనకు అందించటంలో కొంతవరకు సఫలీకృతమైందని చెప్పవచ్చు.



ఈ చిత్రాలను తీసినది,తెలుగు పేర్లు పెట్టినది,తెలుగు ప్రేమికుడైన మిత్రుడు కొత్త రవికిరణ్. రవికిరణ్ మన తెలుగుబ్లాగు గుంపు సభ్యులు.

విహారి - The Tourist సమీక్ష



నేనే విహారిని (Traveller/Tourist).అందుకే విహారి అన్న పేరు నన్నాకట్టుకుంది.కొన్ని నెలల క్రితం విహారి విడుదలయినప్పుడు, ధీయేటర్ లో చూద్దామనుకొన్నా. వీలుపడలేదు.అనుకోకుండా ఈ ఆదివారం (18 Nov 2007) జీ టీవి చానెల్ లో ప్రసారితమయితే, చూడకుండా వుండగలనా?

పాత్రలు - నటీ నటులు
చందూ - మిథున్ (కన్నడ హేరో)
ఆరతి సలీనా - పోలిన్ మిషా
కవిత - నికీషా
సముద్ర - రవిప్రకాష్
రాజ్ - వాసు
Guides - L.B.శ్రీరాం, ధర్మవరపు సుబ్రమణ్యం,కృష్ణ భగవాన్,కాదంబరి కిరణ్ కుమార్
సంగీతం - రమణీ భరద్వాజ్
Cinematography - రమణ రాజు
దర్శకత్వం - R.తులసీ కుమార్ (సత్య హరిశ్చంద్ర చిత్రం ఫేం)

కథ: ఆరతి సలీనా పాశ్చాత్య నాగరికతలో పెరిగిన అమ్మాయి. అక్కడి సంస్కృతి, దురలవాట్లు రెండూ అబ్బి,అక్కడి జీవితం తో విసుగెత్తి కొన్నాళ్లు ప్రపంచ యాత్ర చెయ్యాలన్న తలంపుతో భారత దేశం వస్తుంది. పర్యటనలో భాగంగా కన్యాకుమారి వెళ్లినప్పుడు చందూ అనే టూరిస్ట్ గైడ్ ప్రవర్తన, సౌశీల్యం తో ఆకర్షితురాలై అతన్ని ప్రెమిస్తుంది, కోరుకుంటుంది.చందూ మనసంతా కవిత జ్ఞాపకాలతో నిండి వుండటం వలన ఆరతీ ప్రేమను నిరాకరిస్తాడు.


మిత్రులతో చందూ కన్యాకుమారిలో, చేతిలో నెమలి ఈకలు

చందూ ధనవంతుల అబ్బాయి.Visual Communication Course చేస్తూ, మిత్రులతో కన్యాకుమారికి విహారానికి వచ్చి కళాదృష్టి కల కవిత ప్రేమలో పడి అక్కడే వుండి పోతాడు.


కవిత తో చందూ,తొలి పరిచయం

కవితను వివాహం చేసుకోవాలనే ఆలోచనతో వున్న కవిత మామ సముద్ర చేతిలో పిచ్చ దెబ్బలు తిన్నా,వెరువక కవితను వివాహమాడతాడు. కుటుంబ పోషణకై టూరిస్ట్ అయిన తనే, గైడ్ గా మారి, తన తోటి గైడ్ల ప్రేమాభిమానాలను కూడా పొందగలుగుతాడు.ఉత్తమ గైడ్ గా మంచి పేరు సంపాదిస్తాడు.


Coracle Boat లో సముద్రంలో ప్రయాణం

సముద్రం లో ఒక రోజు చందూ, కవిత బుట్ట పడవలో షికారు చేస్తున్నప్పుడు,ఆకస్మిక వాయుగుణ్డం వలన ఏర్పడిన సుడిగుండం లో పడవ మునిగి కవిత మరణిస్తుంది.


చందూని వెదుకుతూ ఆరతి

ఆరతి కి లలితకళలపై గల ప్రేమను గుర్తించాక చందూ ఆమెను అభిమానించి కవిత ఇంట్లో ఆమెకు స్థానం కలిపిస్తాడు.ఆరతి సలీనా ప్రేమికుడైన రాజ్ ఆమెను వెతుక్కుంటూ కన్యాకుమారి వస్తాడు. రాజ్ సముద్రను కలిసి చందూ తననుంచి ఆరతిను దూరం చేస్తున్నాడనీ, అతన్ని తప్పించి తననూ ఆరతిను ఒకటి చెయ్యాల్సిందింగా కోరుతాడు.కవితను తనకు కాకుండా చేసిన చందూ పై పీకలదాకా కోపం వున్న సముద్ర, చందూ తో ఘర్షణ పడతాడు. దురదృష్టవశాత్తు,పెనగులాటలో సముద్ర మరణిస్తాడు. చందూ జైల్ కెళ్తాడు.ఆరతి కవిత ఇంట్లో వుంటూ కవిత ఆశయమైన లలిత కళల ఉద్ధరణకు, తన శాయశక్తులా కృషి చేస్తుంది.జైల్ నుంచి చందు తిరిగి వస్తాడు.ఆరతి చందూ తో తనను ఇప్పటికైనా స్వీకరించాలని కోరుతుంది.కవిత కోరికైన లలికళోద్ధరణ జరిగిందని చందూ తృప్తిగా మరణిస్తాడు. కవిత చనిపోయిన నీళ్లలోనే చందూని జలసమాధి చేస్తారు.
సాంకేతికం: రమణ రాజు ఛాయాగ్రహణం బాగుంది. కన్యాకుమారి, అమెరికా దృశ్యాల చిత్రీకరణ బాగుంది. సముద్రంలో twister వచ్చినప్పుడు, నీటి సుడిగుండం లో పడవ చిక్కుకున్న దృశ్యాలు చాల బాగా వచ్చాయి.కన్యాకుమారి ఇంత బాగుంటుందా అనిపించేలా వుంది ఛాయాగ్రహణం. చిత్రానువాదం (Screenplay) కథను వేగంగా నడిపించలేక పోయింది. సంగీతం వింటున్నంత సేపూ బాగానే వున్నట్లనిపించినా, పాటలు పెద్దగా గుర్తుండవు. ఎడిటింగ్ బాగుంది.

అభినయం, చిత్ర విశ్లేషణ: మిథున్ (కన్నడ హేరో) అభినయం బాగుంది. అందంగా వున్నాడు. కవిత గా నికీషా నటన O.K. ఆరతి గా, పోలిన్ భారతీయ దుస్తుల్లో బాగుంది.పాశ్చాత్య, తడి దుస్తులలో తన అందాలు ప్రదర్శించింది. వున్నంతలో,L.B.శ్రీరాం, ధర్మవరపు సుబ్రమణ్యం,కృష్ణ భగవాన్,కాదంబరి కృష్ణ కుమార్ గైడ్స్ గా తమ పాత్రలకు న్యాయం చేసారు.టైం ఉంటే, ఒక సారి DVD లో చూడొచ్చు.


చిత్రం ముగింపు సందేశం
Photos: cbrao
Courtesy: Zee TV

గురువారం, నవంబర్ 08, 2007

బ్లాగరు కష్టాలు


సంధ్యా సమయం, కురుగోడు (బళ్లారి తాలూకా/జిల్లా,కర్ణాటక) -Photo:cbrao

దీపావళి శుభాకాంషలు

పండగలలో ఇంత చైతన్యవంతమైన మరో పండగ లేదు. ఇది ఇంత ఆకర్షణీయమైనది కనుక, హిందువులే కాక అన్యమతస్థులు కూడా దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పండగను ఆనందించండి శుభప్రదంగా, సురక్షితం గా. టపాసులు కాల్చే సమయాన నూలు దుస్తులు ధరించండి.పిల్లలను మీ పర్యవేక్షణలో దీపావళి వేడుకలలో పాల్గొనేలా చూడండి.

ఈ దీపావళి కి నేను కర్ణాటక లోని కురుగోడు వెళ్తున్నాను. అక్కడి సింధనూరు,బెళ్లారి, కురుగోడు ఇంకా అసంఖ్యాకమైన ఊళ్లకు తెలుగు వారు వెళ్లి, అక్కడి పొలాలు కొని, వ్యవసాయం చేస్తున్నారు. అలా వెళ్లిన వాళ్లలో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారు ఎక్కువ. మన తెలుగు వారి వ్యవసాయ పద్ధతులు చూసి, అక్కడి స్థానికులు కూడా వ్యవసాయం పై ఆసక్తి కనపరుస్తున్నారు. కురుగోడు నుంచి అనిగొందె వెళ్లే దారిలోనే మన తెలుగు హీరో శ్రీకాంత్ ఊరు గంగావతి(కొప్పాల్ జిల్లా)కూడా ఉంది.

శ్రీశ్రీ అంటాడు పీత కష్టాలు పీతవని. నేనంటాను,కష్టాలు పీతకేనా, బ్లాగర్లకు లేవా అని. బ్లాగరు కష్టాలు బ్లాగరువి. ఈ సంవత్సరం ఎన్నో అనుకున్న, అనుకోని పర్యటనలో నాకు. పర్యటన అయ్యాక దాని గురించి రాద్దామనుకునేసరికి, మరో ప్రయాణం.మొదటగా ఆరంభం పాపికొండలు, ఆ తదుపరి చెన్నై, బెంగళూరు, కూర్గ్,నంది కొండలు, మారేడుమిల్లి,గుంటూరు,కోటప్పకొండ,తెనాలి,రాజమండ్రి, మరల మారేడుమిల్లి,ఒంగోలు,కావూరు వగైరా. ఈ సంవత్సరపు జాబితా ఇంకా పూర్తి కాలేదు. చాలా ఊళ్లకు రాసిన travelogues అసంపూర్తిగానే వున్నాయి. నాకూ ఒక ghost writer లభ్యమైతే ఎంత బాగో!ఊరినించి వచ్చాక ప్రఖ్యాత రచయిత సోదరులను అడగాలి నాకూ ఒక ghost writer కావాలని.Travelogues మాత్రమే కాక ఇతర విషయాలపై రాసిన వ్యాసాలు కూడా ఈ యాత్రల వలన అసంపూర్తిగా మిగిలి, మమ్ములను ఎప్పుడు పూర్తి చేస్తావు అని అడుగుతుంటాయి నిద్రలో.

ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఇంటిదగ్గర కొంత కుదురుగా ఉండబట్టి, సాహితీవనం 1 నుంచి 12 భాగాలు రాయగలిగాను. సాహితీవనం 12 భాగానికి ఇంకా జవాబులు రాయనే లేదు. మధ్యలో కంప్యూటర్ కు, నాకు అనారోగ్యం. ఉత్తరాలు పోస్ట్ చెయ్యటమంటే నాకు కొంత బద్ధకం. అయినా, సాహితీవన ప్రశ్నల విజేతలయిన సౌమ్య, కారణి నారాయణరావు గార్లకు సంజీవదేవ్ జీవితం, రచనలు పై పుస్తకాన్ని పోస్ట్ చెయ్యగలిగాను. విజేత పరుచూరి శ్రీనివాస్ గారు సంజీవదేవ్ పుస్తకం తన వద్ద వున్నందున,తనకు బదులుగా తరువాతి ఉత్తమ జవాబులిచ్చిన వారికి పంపమని సూచించారు.వారి కోరిక మేరకు ఉత్తమ సమాధానాలిచ్చిన నారాయణరావు గారిని ఎంపిక చెయ్యటం జరిగింది. తదుపరి విజేతలు. ఇస్మాయిల్ చిరునామా కోసం రాసాను; కామెంట్ ఆయన శ్రీ కృష్ణదేవరాయలు బ్లాగు లో. చూసినట్లు లేదు. జవాబు లేదు.వీరి e-mail తెలిసినవారు నాకు తెలియపర్చగలరు. సిరి -వీరి e-mail చిరునామ తెలిసిన వారు నాకు రాయగలరు. వీరికి, నేనుసైతం కు రసమయి మాసపత్రికలు పంపవలసి ఉన్నది.

మనమంతా పండగను సురక్షితంగా జరుపుకొందాం. నేను హైదరాబాదు తిరిగివచ్చాక మరల ముచ్చటించుకొందాం.

మంగళవారం, అక్టోబర్ 23, 2007

శుభలేఖ

నాకు గతంలో వచ్చిన ఒక వివాహ ఆహ్వానపత్రాన్ని మీ ముందుంచాను http://deeptidhaara.blogspot.com/2007/02/blog-post_07.html. అది మీకు నచ్చిందన్నారు. శుభలేఖ చలనచిత్రంగా ఉండటం అందులోని ప్రత్యేకత.

కొత్తగా నాకు ఇంకో శుభలేఖ వచ్చింది.ఇది కులాంతర, ప్రెమవివాహం అయినా, ఇరువైపులా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ క్రింది ఆహ్వాన పత్రాన్ని చూసి, అందులోని లింక్ ను అనుసరించితే, పెళ్లి వెబ్ సైట్ కు అది దారితీస్తుంది.మీ స్పీకర్ లో సరైన శబ్దంలో, సంగీతాన్ని ఆనందించండి. వెబ్ సైట్ లో,పెళ్లి వివరాలు, ఎంగేజ్‌మెంట్ ఫొటోలు వగైరా చూడవచ్చు. వధూవరులకు మీ సందేశం పంపే సౌకర్యం కూడా వుంది. వధూ,వరులిద్దరూ బెంగళూరు లో Software Engineers గా పనిచేస్తున్నారు. మీ శుభాంక్షలు, ఈ ప్రేమజంటకు పంపవచ్చు.

నేను ఈ వివాహానికి, గుంటూరు వెళ్తున్నాను. గుంటూరు లో తెలుగు బ్లాగరులు, బ్లాగు అభిమానులు ఎవరైనా వుంటే నన్ను కలువవొచ్చు. నా సెల్ నంబరు:93973 48531

With new dreams,new hopes,new aspiration
and a desire to achieve new horizons
we are stepping into a new beginning of wedded life
Together with our parents
We
Sri Harsha
and
Ujwala
Cordially inviting you along with your family to our wedding




Click on image to enlarge

http://www.UjwalaWedsSriharsha.com

Put on Your Head phones please

Warm Regards,

Sriharsha & Ujwala

శనివారం, అక్టోబర్ 20, 2007

సాహితీవనం -12


పాతాళగంగ కు ఆకాశమార్గం, శ్రీశైలం Photo:cbrao

చివరి ప్రశ్నావళి

సాహితీవనం శీర్షికలో, ఇది చివరి ప్రశ్నావళి. సూర్యతేజ (Solarflare), తెలుగు వీర సూచనల ప్రకారం,పాఠకుల జవాబులు ప్రచురించబడవు.సరైన సమాధానాలు (key) తో మాత్రమే, పాఠకుల జవాబులు కలిసి ప్రచురించబడతాయి. పాఠకులను చివరి ప్రశ్నావళి లో ఉత్సాహంగా పాల్గొనకోరుతాను.

A) క్రికెట్ ఆస్ట్రేలియన్ కెప్టన్ రికీ పాంటింగ్ పై వచ్చిన “Inning with Panting" పుస్తకం ఖరీదు

1) Rs.2000/-
2) Rs.5000/-
3) Rs.8000/-
4) Rs.10, 000/-


B) పెళ్లైన కొత్తలో, సినిమాలో, అందరి మెప్పూ పొందిన, నటి ప్రియమణి నటించని చిత్రం.

1) ఎవరే అతగాడు
2) టాస్
3) భయ్యా
4) ఒక ఊరిలో

C) సుప్రసిద్ధ గాయని ఎమ్మెస్.సుబ్బలక్ష్మి గారి మాతృభాష
1) తెలుగు
2) తమిళ్
3) మలయాళం
4) కన్నడం

D) వీరు తెలంగాణ యాసలో వ్రాసిన కథలను విస్తృతంగా చదవటం వలన, తెలంగాణా భాష అంటే చాలామందికి వీరే గుర్తుకు వస్తారు.
1) అంపశయ్య నవీన్
2) పాకాల యశోదారెడ్డి
3) వాసిరెడ్డి నవీన్
4) కొండేపూడి నిర్మల

E) కె.వి.రెడ్డి, పింగళిల సమిష్టి కృషి, కళాఖండమైన మాయా బజార్ చిత్రం చూశారా? ఈ చిత్రం
1) పౌరాణికం
2) జానపదం
3) పింగళి మాయ
4) విష్ణు మాయ

F) తత్వమసి అంటే

1) దేవుడు నీలోనే ఉన్నాడు
2) బద్రీనాథ్ లో దొరికే పవిత్ర భస్మం
3) ఉపనిషత్‌లకు వక్రభాష్యం చెప్పటం
4) పైన చెప్పినవి ఏవీ కావు

G) నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో, రాజాలింగొ అంటూ S.P.శైలజ పాడిన, ప్రజాదరణ పొందిన పాట ఏ చిత్రం లోనిది?

1) యువతరం కదిలింది
2) ప్రజా శక్తి
3) ఎర్ర మల్లెలు
4) చలి చీమలు

H) ప్రొలయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు?

1) ఎర్రాప్రెగడ
2) పోతన
3) తిక్కన
4) నన్నయ

I) ఎన్నో మధుర గీతాలున్న, జగ్గయ్య,కాంతారావు,గుమ్మడి ఇంకా క్రిష్ణకుమారి నటించిన కానిస్టేబుల్ కూతురు (1962) చిత్రానికి సంగీతం సమకూర్చినది

1) రమేష్ నాయుడు
2) ఆర్. గోవర్ధన్
3) సత్యం
4) ఆదినారాయణ రావు

J) “God of small things” నవలకు బూకర్ బహుమతి పొందిన, అరుంధతీ రాయ్ రాసిన “An ordinary person's guide to empire" అనే పుస్తకానికి ' సామ్రాజ్యం పై సమరం ' పేరుతో తెలుగులో అనువదించిన వారు

1) నాగసూరి వేణు గోపాల్
2) తెలకపల్లి రవి
3) రంగనాయకమ్మ
4) కొణతం దిలీప్


గుర్తుంచుకోండి - మీ సమాధానాలు కామెంట్స్ లో కనిపించవు. Key తో కలిసి ప్రచురించబడతాయి.

శుక్రవారం, అక్టోబర్ 19, 2007

సాహితీవనం -11


కూటి కోసం కోటి తిప్పలు, శ్రీశైలం Photo: cbrao


సాహితీవనం -9 లో మిగిలిన సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత

!) విశ్వనాధ సత్యనారాయణ
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి శిష్యుడు. వీరు రాసిన వేయి పడగలను స్వర్గీయ పి.వి.నరసింహారావు గారు హిందీలోకి 'సహస్ర ఫణ్‌' పేర అనువదించారు. వీరు రాసిన ఏకవీర ఆధారంగా ఏకవీర చిత్రం వచ్చింది.

F) యాత్రాస్మృతి -స్వీయచరిత్ర రాసినది

2) దాశరధి కృష్ణమాచార్య
స్వాతంత్ర సమరయోధుడు, కవి దాశరధి గారి స్వీయ చరిత్ర ఇది.దాశరధి రంగాచార్య వీరి తమ్ముడు.గాలిబ్ గీతాలకు కృష్ణమాచార్య తెలుగు అనువాదానికి బాపు బొమ్మలు వేశారు.నిజాం రాజు అకృత్యాలను, కాళోజీతో చేతులుకలిపి ఎలుగెత్తి చాటారు.

G) నూరేళ్ల తెలుగు నవల పుస్తకం (వ్యాసాలు) రాసినది



1) సహవాసి
జె.ఉమా మహేశ్వర రావు (సహవాసి) ఎన్నొ అద్భుతమైన రచనలందించారు.వాటిలో పంచతంత్రం,రాజశేఖర చరిత్ర(కందుకూరి నవలకు నవీకరణ),అనువాదాలు ఏడు తరాలు, అమ్మ మొదలైనవి. మరణించే దాకా,పీకాక్ క్లాసిక్స్ తో కలిసి పని చేసి, అద్భుతమైన పుస్తకాలను తెలుగు వారికందించారు.
H) సావిత్రి, జమున, ఎన్.టి.రామారావు నటించిన మిస్సమ్మ చిత్రం చూశారా? ఈ చిత్రంలో సావిత్రి అసలు పేరు

4) మహా లక్ష్మి
1955లో విడుదలైన, ఒక అద్భుతమైన, పూర్తినిడివి హాస్య చిత్రం ఇది.ఈనాటికీ నూతనంగా ఉంటుంది.ఎన్ని సార్లైనా చూడవచ్చు.


I) బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే వీరి సిద్ధాంత వ్యాసాన్ని (Ph.D కోసం) అమోదించి డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు పలు చిత్రాలలొ నటించారు.

2) జయమాల
కర్ణాటక లోని ఆల్మట్టీ డాం వలన నిర్వాసితులైన మహిళల, స్థితిగతుల పై చేసిన వీరి పరిశోధనకు డాక్టరేట్ లభించింది. శబరిమలై వెళ్లి స్వామిని పొరబాటుగా తాకినట్లు ప్రకటించి వార్తలలోకెక్కారు.

వివరాలకు చూడండి
http://www.koumudi.net/General/heroine_phd.html


J) హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి
చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మణి కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే
పి.సుశీల పాడిన ఈ పాట ఏ చిత్రం లోనిది?

2) తెనాలి రామకృష్ణ
ఎక్కువమంది అభిప్రాయపడినట్లు ఇది భక్త జయదేవ చిత్రంలోంచి కాదు. ఈ జయదేవుని అష్టపది తెనాలి రామక్రిష్ణ చిత్రం లోది. మధురమైన ఈ పాట చూడండి.పాటవింటూ మైమరుస్తారు.



ఇప్పుడు పాఠకుల స్పందన చూద్దాము. ప్రశ్నలైతే చాలామంది చూశారు కాని కొద్దిమంది మాత్రమే ధైర్యంగా సమాధానాలు పంపారు. ధన్యవాదాలు.సమాధానాలు పంపిన వారి పేర్లు, వారి స్కోర్ ఇవిగో.

1) గిరి 4
2) వికటకవి 5
3) సిరి 8
4) నేను సైతం 9

ప్రశ్నలు కఠినంగా ఉన్నా ఉత్తమసమాధానాలు పంపిన నేను సైతం, సిరి వీరిద్దరినీ దీప్తిధార అభినందిస్తున్నది;వీరతాడు వెస్తున్నది. హై!హై!!నాయకా.వీరిరువిరికీ, రసమయి మాసపత్రిక సంచిక దీప్తిధార నుంచి అందుతుంది.వారి చిరునామాలు,ఫోన్ నంబర్ వివరాలు cbraoin at gmail.com కు పంపవలసినదిగా మనవి.

బుధవారం, అక్టోబర్ 17, 2007

సాహితీవనం -10



రామా కనవేమిరా! శ్రీ రఘురామ కనవేమిరా!

సుషేణుడు వారధి కట్టినట్లు వ్రాసారు. సుషేణుడు సుగ్రీవునికి వైద్యుడని చదివానొకచోట (ఎంత వరకు నిజమో తెలియదు :-) )! వారధి కట్టినట్లున్న సమాచారం మీకెక్కడ లభ్యమైనదో చెప్పగలరా, దయచేసి? శ్రీదేవి తన ఉత్తరంలో, e-mail చిరునామా ఇవ్వలేదు.

వాల్మీకి రామాయణం యుద్ధకాండ లో, రామసేతు నిర్మాణం గురించిన వివరాలు వున్నాయి. లంక వెళ్లటానికి, అడ్డుగా ఉన్న సముద్రునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి రాముడు సిద్ధం కాగా, సముద్రుడు ప్రత్యక్షమై,రామునికి అభివందనం చేస్తూ అంటాడు

అయం సౌమ్యనలో నామ తనయో విశ్వకర్మణహః
పిత్రా దత్తవరః శ్రీమాన్ ప్రీతిమాన్ విశ్వకర్మణహః
ఏష సేతుం మహొత్సాహః కరోతు మయివానరహః
తమ హం ధారయిష్యామి యథాహ్యేష పితా తథా

ఓ! సౌమ్య రామా! నీ సైన్యంలోనే విశ్వకర్మ వరపుతృడైన నలుడున్నాడు.నా పై సేతువు నిర్మాణానికి నేను సహకరించెదను.ఇతని తండ్రివలే ఇతను కూడా నాకు ఇష్టుడు.నీవతని సేవలు వినియోగించుకొనుము.(యుద్ధ కాండ 22-45,46)

ఇతిహాసాలలో ప్రక్షిప్తాలు చాలా ఉంటాయి.మూలకవి రాసిన దాంట్లో, మధ్యన, కవులు, తమ సొంత కవిత్వాన్ని ఇరికించి ఉంచే రచనలను ప్రక్షిప్తాలంటారు. రామాయణ మహాభారతలలో ప్రక్షిప్తాలు కోకొల్లలు. ఇతిహాసాలలో ఎక్కడన్న వైరుధ్య విషయాలుంటే, దానికి ఈ ప్రక్షిప్తాలు కొంతవరకు కారణం అవుతాయి.

సుషేణుడు అంటే విష్ణువు, సుగ్రీవుని వైద్యుడు అనే రెండు అర్థాలు నిఘంటువులో కనిపిస్తాయి. వేదాలకు భాష్యం చెప్పిన దాశరధి రంగాచార్యులుగారు రామసేతు నిర్మాణం సుషేణుడనే వానర ఇంజనీర్ కావించాడని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. రామాయణం అంతా చదివాక రాముడికి సీత ఏమవవుతుంది అనే విషయం పైనే ఇంతవరకూ ఏకాభిప్రాయం లేదు(చూడండి రాముడికి సీత ఏమవుతుంది? –ఆరుద్ర). రామసేతు ఎవరు కట్టారనే విషయం పై సందేహాలుండటం సహజమే మరి.

రామసేతు ఎవరు కట్టారు అనే విషయం పై చర్చ అయ్యాక,దీని గురించి ఇంకొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి మనం.
దశయోజన విస్తీర్ణం శతయోజనమాయతం
దదృశుర్దేవ గంధర్వాః నలసేతుం సుదుష్కరం
(యుద్ధకాండ 22-75)
10 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవు వుంది; నలుడు కట్టిన ఈ సేతువు.దేవతలు, గంధర్వులేమిటి మనం కూడా ఆశ్చర్య పోవలసిందే ఈ కట్టడాన్ని చూస్తే. వాస్తవంలో భారతదేశానికి, లంకకు మధ్య వున్నది కేవలం 23 మైళ్లే కాని 800 మైళ్లు (100 యోజనాలు) కాదు. దీనికి రామభక్తులు రామసేతు కట్టినప్పుడు అంత దూరంలో ఉన్నవని వాదించవచ్చు.ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంది.

భూగోళ శాస్త్ర రీత్యా, 10 కోట్ల సంవత్సరాల క్రితం, భారతదేశం, ఆస్ట్రేలియ ఇంకా దక్షిణ ఆఫ్రికా కలిసి వుండేవి. అంతే కాక మొదట లంక, భారతదేశంతో అవిభాజ్యంగా, కలిసే వుండేది.వెగ్నార్ ప్రతిపాదించిన,continental drift సిద్ధాంతం ప్రకారం, భూమి లోపలి రాతిపొరల (Plate tectonics) కదలిక వలన, ఖండాలు విడివడి. ఆ తదుపరి లంక, భారత్‌ల మధ్య ఖాళీ ఏర్పడింది. భూమి ఇప్పటి భౌతిక పరిస్థితికి ఇంకా ముందు, ఒక మండె అగ్నిగొళం లా వుండేది. అది చల్లబడి ఇప్పటి రూపానికొచ్చినా, భూమి లోపలి రాతిపొరల కింద ఇంకా ద్రవరూపం లోనే వుంది భూమి. ఈ ద్రవాల కదలికవలనే, ఖండాలు విడిపోయాయి.భూమి లోపలి కదలికలు,భూకంపాలు,జ్వాలముఖుల (volcanoes)విస్ఫొఠనాలు పర్వతాలకు,సముద్రంలో తేలే లావా రాళ్లకు కారణ భూతాలయ్యాయి. తేలే ఈ సున్నపు రాళ్లు, లావా రాళ్లే Adams bridge గా రూపాంతరం చెందాయి. ఈ విషయం పై మరిన్ని వివరాలకు చూడండి
http://en.wikipedia.org/wiki/Plate_tectonics

http://en.wikipedia.org/wiki/Adam%27s_Bridge

http://www.laputanlogic.com/articles/2002/11/03-83975630.html


కర్బన పరిశోధన కావిస్తే ఈ రాళ్లకు 10 కోట్ల సంవత్సరాల వయస్సు వుందో లేదో నిర్ధారితం కాగలదు.17లక్షల సంవత్సరాల క్రితం, రాముడు దీనిని కట్టివుండే అవకాశం లేదని శాస్త్రజ్ఞుల వాదన.

ఆశ్చర్యకరమైన సంగతేమంటే మదరాసు హైకోర్ట్ ఈ రామసేతును మానవ నిర్మిత కట్టడంగా గుర్తించింది. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్ట్ పరిధిలో చర్చలో వుంది.

Further Reading:
1) నరావతారం - నండూరి రామమోహన రావు
2) The Blind Watchmaker: Why the Evidence of Evolution Reveals a Universe Without Design by Richard Dawkins
3) Why Darwin Matters: The Case Against Intelligent Design (Paperback)
by Michael Shermer (Author)
4) The scientific dating of the Ramayana & the Vedas -Dr Padmakar Vishnu Vartak

Discussions on the topic:
http://sodhana.blogspot.com/2007/05/blog-post_9061.html
http://churumuri.wordpress.com/2007/08/02/churmuri-poll-was-there-really-a-ram-sethu/

శనివారం, అక్టోబర్ 13, 2007

హిట్ల కోసం టపాలు


కృష్ణవేణికి భక్తితో సమర్పణకు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద అమ్మకానికి వుంచిన పూలు Photo:cbrao

ప్రజా రంజకమైన విషయాలపై రాస్తే హిట్లు బాగా వస్తాయి. ఏ విషయాలపై రాస్తే ప్రజారంజకమౌతాయో, విహారి తమ “మీర్రాసిన టపా హిట్టా ఫట్టా �“ విశ్లేషణాత్మక వ్యాసం “లో విపులీకరించారు. బ్లాగరు తొలినాళ్లలో హిట్లకోసం వెంపర్లాడినా,తరువాత వాటిని పట్టించుకోక, విశ్వనాథ్ లా కళాత్మకంగా ఉండటం అభిలషణీయం. కామెంట్స్ వ్యామోహం నుంచి కూడా బయటపడటం కష్ట సాధ్యమైన విషయమే. తెలుగు వికిపెడియ కు మన మిత్రులు, నిజంగా చాలా కష్టపడి, అమూల్యమైన సమాచారాన్ని అందిస్తున్నారు.వీరంతా హిట్ల కోసం రాయటం లేదు.పేరుకోసం అసలే కాదు. వికీ లో వ్యాసకర్తలెవరో,పాఠకుడికి తెలియదు. తెలుగు పాఠకులకు కొత్త రచనలందించాలన్న తపనే, వీరిచేత రాయిస్తుంది. ఇది సామాజిక సేవా దృక్పధం కింద వస్తుంది.వీరందిరికీ నా వందనాలు. సంగీతంలో A.R.Rehman గొప్ప హిట్, నిస్సందేహంగా. కాని చరిత్రలో నిలిచే పాటలు కొద్ది మాత్రమే ఐతే,ఇళయ్ రాజా, కె.వి.మహాదేవన్, సి.ఆర్.సుబ్బరామన్,సుసర్ల, పెండ్యాల, రాజేశ్వరరావు వగైరా ప్రముఖులు స్వరపరచిన పాటలు సంగీతాభిమానుల మదిలో చిరస్మరణీయాలు. వీరి పాటలు కాల పరీక్షకు నిలిచే అణిముత్యాలు.

సాహితీ విషయాలపై గంభీరంగా టపాలు రాస్తే పాఠకులు కొంచెం దూరంగా వుంటారు.గంభీరంగా కాక, జనార్క్షణీయంగా కాక మధ్యస్తం గా రాస్తే, జటిలమైన విషయాలు కూడా పాఠకుడిని చేరతాయి.కొన్ని సాహిత్య విషయాల బ్లాగ్ టపాలకు, హిట్స్ రాకపోయినా, తరువాత చదివేవారి సమాచారం నిమిత్తం కొన్ని విషయాలు నేను నా బ్లాగులో రాస్తున్నాను. కర్ణాటక సంగీతకారిణి సౌమ్య పై నేను రాసిన టపా కొద్దిమందిని మాత్రమే ఆకర్షించగలిగింది. ఇవ్వాల్టి బ్లాగరులు మరో 15 సంవత్సరాల తరువాత ఈ టపా చూస్తే,అందులోని విషయాలు వారికి ఇష్టం కావచ్చు.ద్రాక్ష సార, శాస్త్రీయ సంగీతం వయస్సు పెరిగే కొలదీ మధురమౌతాయి.

హిట్స్ తో నిమిత్తం లేకుండా, తెలుగు వికిపిడియ వారి శోధన కు ఉపయోగపడే విధంగా,పుస్తక రూపం లొ వచ్చినా నిలవదగ్గ, టపాలు రాయాలని నా అకాంక్ష.నా రచనలలో, తెలుగు వికీ వారికి ఉపయోగపడేవి ఏవైనా,వారు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.

శుక్రవారం, అక్టోబర్ 12, 2007

సాహితీవనం -9



తెలుగులో లేఖా సాహిత్యం

వైజాగ్ నుంచి మిత్రులు కవికుమార్, సుంకర చలపతిరావు కు, వడ్డాది పాపయ్య, సంజీవదేవ్ రాసిన ఉత్తరారలను ' లేఖలు ' గా ప్రచురించిన పుస్తకాన్ని పంపారు.అది చూస్తుంటే ఉత్తరాలు గురించిన నా అనుభూతి, మిత్రులు చరసాల తన అంతరంగాలు బ్లాగులో, ఉత్తరాలు అనే వ్యాసం,December 12, 2006 న ప్రకటించినప్పుడు, చదివి, స్పందిస్తూ రాసిన విషయం గుర్తుకొచ్చింది.అప్పుడు నేను రాసాను "ఆంగ్లంలో , తెలుగులో, లేఖా సాహిత్యం కొన్ని కొత్త గవాక్షాలను తెరిచింది; జ్ఞాన ప్రపంచానికి. సంజీవదెవ్ లేఖలంటే నాకు ప్రాణం".

లేఖా సాహిత్యం ఆంగ్లంలో ఉన్నంతగా తెలుగులో లేదు. తండ్రి (జవహర్ లాల్) తనయ (ఇందిరా గాంధి) కు రాసిన ఉత్తరాలు జగత్‌ప్రసిద్ధం.జవహర్ జైలు గోడల మధ్య నుంచి రాసిన ఈ ఉత్తరాలు, ప్రపంచ నాగరికతను, చరిత్రను వివరిస్తాయి. ఇవి Two Alone, Two Together: Letters between Indira Gandhi and Jawaharlal Nehru 1922-64 గా పెంగ్విన్ వారు ప్రచురించారు.

కొడవటిగంటి కుటుంబరావు ఉత్తరాలు,శ్రీశ్రీ ఉత్తరాలు, చలం ఉత్తరాలు, సంజీవదేవ్ ఉత్తరాలు పుస్తక రూపం లో గతం లో వెలువడ్డాయి. ఇంకా మరుగున బడ్డ మాణిక్యాలెన్నో? వీటిలో ఎవరి శైలి వారిది. సంజీవదేవ్ ఉత్తరాలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఎన్నో ఆసక్తికరమైన చర్చలతో నిండి ఉంటాయి. చాలామంది, నాతో కలుపుకుని, ఈ ఉత్తరాలు చదివాకే సంజీవదేవ్ కు ఉత్తరాలు రాయటం, వారి జవాబులకోసం నిరీక్షించటం జరిగాయి. దేవ్ తన ఉత్తరాలలో ఒక చిన్న కవితనో లేక తను వేసిన painting నో అదనంగా పంపే వారు. వాటిని మేము బోనస్ గా భావించేవారము. ఈ paintings, miniature landscapes అయి ఉండేవి. వీటిలో, తెలిసిన రూపాలను,అస్పష్ట రూపాలుగా చిత్రించే వారు. కొన్నింటిలో మానవాకారాలు సూచన ప్రాయంగా గోచరించేవి. సంజీవదేవ్ రసరేఖలు, రూపా రూపాలు, దీప్తిధార వగైరా వ్యాస సంకలనాలలో భారతీయ చిత్రకళ, శిల్ప కళ గురించి, కళాకారుల గురించి పరిచయ వ్యాసాలు రాస్తుండే వారు. చిత్రకళ, శిల్పకళల గురించి తెలుసుకోవటానికి అవి ఒక విజ్ఞాన ఖని.

‘ లేఖలు ' పుస్తకం లో వడ్డాది సంజీవదేవ్ పై వెలిబుచ్చిన అభిప్రాయాలు సత్య దూరమని, సంజీవదేవ్ గురించి ఎరిగినవారెవరైనా చెపుతారు. లలిత కళల పై సాధికారత ఉన్న సంజీవదేవ్ కు కళలు గురించి తెలియవని వడ్డాది అనటం విడ్డూరంగా ఉంది. (చూ. పజీలు 8,9 ఇంకా 10)
సంజీవదేవ్ ఉత్తరాలు, ఇంతవరకూ చదవని వారి కోసం, దేవ్ శైలి చూడటానికి, వారి ఉత్తరం లోంచి, ఒక పారాగ్రాఫు ఇస్తున్నాను.
“ ప్రస్తుతం ఏమీ వ్రాయటం లేదు.ఏమీ చిత్రించటం లేదు.ఎక్కడా ప్రసంగించటం లేదు.కొన్నాళ్లపాటు వీటన్నంటినీ చేయకపోవటం లో ఉంటుంది ఆనందం. ఏమైన చేయటం లో ఆనందం వున్నట్లే,ఏమీ చేయక పోవటంలో కూడా ఆనందం ఉంటుంది.ఆ చేయక పోవటం అనేది, చేయటానికి ఉత్సాహాన్నిస్తుంది.ఉల్లాసాన్నిస్తుంది.ఏమీ చేయకపోవటం అనేది the passive aspect of creativity అవుతుంది.అయితే, ఏదో ఒకటి చేయటానికి అలవాటయిన మనిషి ఎలా చేయకుండా వుండలేడు.ఏమీ చెయ్యకుండా వున్నప్పుడు కూడా ఎదో చేస్తున్న భ్రమలో, జీవిస్తాడు. భ్రమలన్నీ మంచివి కాకపోవచ్చు కాని కొన్ని భ్రమలు మాత్రం వాస్తవానికంటే,ఎక్కువ వాస్తవమేమో అనిపిస్తుంది. సరే, ఉంటాను.

మీ,
సంజీవ దేవ్ "

పుస్తకం వెల రూ.10/- మాత్రమే. ప్రతులకై

Smt Sunkara Jhansi Lakshmi,
Flat no: 201, R.R.Enclave,
Near Zinc Gate,Gajuvaka Post,
Visakhapatnam -26

సాహితీవనం -7 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

A) సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

3) ఎనిమిది అధ్యాయాలు

B) అల్పజీవి నవల, ఆరు సారా కథలు, ఆరు సారో కథలు రాసిన ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి వృత్తి రీత్యా

4) న్యాయవాది

C) Romancing with Life స్వీయ చరిత్ర రాసిన వారు

2) దేవ్ ఆనంద్
దేవ్ ఆనంద్ తీసిన గైడ్ సినిమా, ఉత్తమ హిందీ చిత్రాలలో ఒకటి. R.K.Narayan రాసిన Guide ఆధారంగా ఈ చిత్రం తీశారు.దేవానంద్ ద్విపాత్రాభినయం చేసిన నలుపు - తెలుపు చిత్రం, హందోనో ను రంగులలోకి మార్చటానికి ప్రయత్నాలు జరుగుతున్నై.జీనత్ అమన్, టీనామునింలను తెరకు పరిచయం చేశారు. దర్శకుడు శేఖర్ కపూర్ కి మేన మామ ఇంకా చేతన్, విజయానంద్ లకు సోదరుడు. 1946 నుంచి 2005 దాక 110 చిత్రాలలో నటించారు.

D) భారతదేశము, శ్రీలంక ల మధ్య రామసేతు నిర్మాణం గావించిన కట్టడ నిపుణుడు

2) సుషేణుడు
రామసేతు నిర్మాణాన్ని నలుడు, సుషేణుదు అనే ఇద్దరు వానర ఇంజనీర్లు కావించారు. చారిత్రాత్మక ఆధారాలు అడగొద్దు. హిందువుల ఇతిహాసం, రామాయణం పై ఈ జవాబు ఆధారపడి ఉంది.

ఇంకా వుంది.

ఆదివారం, అక్టోబర్ 07, 2007

సాహితీవనం -8



పరుచూరి శ్రీనివాస్ గారు రసమయి లో రాసిన "1948 లో ప్రభాకరశాస్త్రిగారు తిరుమల ఆలయ ఆవరణలోని ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించి, దేవస్థానం చేత వాటిని ప్రచురింప చేశారు." విషయం పై తమ అభిప్రాయం వెలిబుచ్చుతూ, అన్నమాచార్య కృతుల రాగిరేకుల గురించి, 1815 ప్రాంతంలో, ఆ రాగిరేకులు, గుడి ప్రాంగణంలోనే వున్నట్లు మనకాధారాలున్నాయి అని తమ ఉత్తరంలో రాశారు. మరిన్ని వివరాలకు పాఠకులను కింద ఇచ్చిన లింక్, దాని అనుబంధ ప్రశ్నలు చూడ కోరుతాను.

http://groups.yahoo.com/group/racchabanda/message/17476

ఈ విషయమై పెక్కు వివాదాలున్న మాట వాస్తవమే. విషయ నిర్ధారణ కోసము మీ ఉత్తరాన్ని వెటూరి ఆనందమూర్తి గారికి పంపిస్తున్నాము. నవంబరు రసమయి లో తగు ప్రత్యుత్తరము ఉండగలదని ఆశిస్తున్నాము. అందులో విశేషాంశములు దీప్తిధార లో కూడా ప్రకటింపబడగలవు.

జులై 6 2007 న తెనాలిలో,తెలుగు రచయితలతో, ప్రధమ తెలుగు యునికోడ్ వర్క్ షాప్ నిర్వహించటానికి, తెలుగుభాషాబిమానుల సంఘం కార్యదర్శి సాయి లక్కరాజు గారు నాకు తోడ్పడినారు.వారి ఆధ్వర్యంలో వస్తున్న, శ్రీ స్వరలయ మాసపత్రిక అక్టోబర్ సంచిక వెలువడింది. ఇందులో మీ పిల్లలను మీరు ఎలా పెంచుతున్నారు అనే విషయం పై డా.దుగ్గరాజు శ్రీనివాసరావు, బెంగళూరిలోని, తెలుగు విజ్ఞాన సమితి విద్యాట్రస్ట్ చైర్మన్,ఏట్రియ,చాణ్యుక్య, కళింగ హోటళ్ల యజమాని ఐన చిన్నస్వామిరాజు పై ప్రత్యేక కథనం,డాక్టర్ యెల్లా వెంకటేశ్వర రావు పై వ్యాసం, చందమామ చిత్ర సమీక్ష,దసరా ప్రత్యేక వ్యాసం వగైరా కథనాలున్నాయి. శ్రీ స్వరలయ తాజా సంచికను ఇక్కడనుంచి ఉచితంగా download చేసుకోండి. http://www.swaralaya.net/swaralaya_oct_2007.zip

సాహితీవనం -5 ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలిచ్చిన స్మైల్ గారికి అభినందనలు. ఆశ్చర్యకరంగా వీరొకరే సమాధానాలు పంపారు. అదీ తన బ్లాగులో, సమాధానాలతో పాటుగా వివరణ తో. ఇది చూసినవాళ్లు, ఇంక మేము సమాధానాలు పంపటానికి ఏముంది అని తలిచినట్లున్నారు. దానిని చూడని వారికోసం ఆ లింక్ దిగువన ఇస్తున్నాను. http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html
సాహితీవనం -5 ప్రశ్నలకు సమాధానాలు దిగువ ఇస్తున్నాను.

A) రష్యన్ సీత కథా సంపుటి రచయిత్రి

3) కందుకూరి వెంకట మహాలక్ష్మి
ఈ పుస్తకం గురించి ఇక్కడ చదవండి.
http://tinyurl.com/2ygdje ఈ పుస్తకం పేరు విచిత్రంగా ఉంది కదూ? ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

B) "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు" అని శ్రీశ్రీ రాసిన పాటకు ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండుతాటాకుల్" అని పారొడి రాసిన కవి

4) ఆరుద్ర
స్వతంత్ర పత్రిక లో ఇది అచ్చయ్యింది. ఇంకా ఎన్నో అమూల్య రచనలు స్వతంత్ర లో ప్రచురితమయ్యాయి.

C) ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి

3) శ్రీత్యాగరాజ, తిరువాయూరు
1847 లో పరమపదించిన, వాగ్గేయకారుడు త్యాగరాజ సమాధి, తిరువాయూరు లో కావేరి నది ఒడ్డున ఆలనా, పాలనా లేకుంటే, దేవదాసి బెంగళూరు నాగరత్నమ్మ తన ఆస్తిని త్యాగరాజు సమాధి, ఆశ్రమం నిర్మాణానికి వినియోగించారు. త్యాగరాయ కృతులను సమాధి గోడలపై తెలుగులో చెక్కించి, సంగీత ప్రపంచానికి జనవరి25, 1925 న అంకితం చేశారు.నాగరత్నమ్మ సేవకు గుర్తుగా, ఆమె విగ్రహాన్ని, త్యాగరాజ మంటపానికి ఎదురుగా, ప్రతిష్టించారు.ఇప్పుడు ప్రతి సంవత్సరము అక్కడ, జనవరి,ఫెబ్రవరి మాసాలలో త్యాగరాజ ఉత్సవాలు సంగీతాభిమానులు, భక్తి శ్రద్ధలతో జరుపుతారు.


D) సుగాత్రి అంటే ఏమిటి?

2) మంచి శరీరం ఉన్నది
పెక్కుమంది దీని అర్థం మంచి గాత్రము గలది గా, తప్పుగా, అభిప్రాయ పడ్డారు.


E) కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం

3) కవి సేన
1999 లో, కెంద్ర సాహిత్య అకాడమి బహుమతి గ్రహీత ఐన శేషేంద్ర శర్మ గారు, 1978 లో తన కవిసేన మానిఫెస్టో (ఆధునిక కావ్యశాస్త్ర) ను రచించారు. కవిత్వంపై ఒక గొప్ప విమర్శనా గ్రంధంగా ఇది పేరు పొందింది.

F) పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి

1) శిలాలోలిత
ఈ కవయిత్రి అసలు పేరు ' లక్ష్మి '.రేవతీదేవి రాసిన శిలాలోలిత అనే పుస్తక నామాన్నే,తన కలం పేరుగా స్వీకరించారు.

G) ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి.

1) వెల్చేరు నారాయణ రావు
ఉత్తర అమెరికాలో,విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, మేడిసన్ లో తెలుగు సంస్కృతీచరిత్రలో ప్రధాన ఆచార్యుడిగా పనిచేస్తున్నారు.కొన్ని ప్రఖ్యాత తెలుగు రచనలను, ఆంగ్లంలోకి తర్జుమా చేశారు.


H) ఆలాపన రాసిన రచయిత

3) వి.ఎ.కె.రంగారావు
రంగారావు గారు గొప్ప సంగీతాభిమాని.ముళ్ళపూడి వెంకటరమణ మాటల్లో, "తినడం కోసం కాకుండా, వినడం కోసం బ్రతికే ఋషి". పెక్కు అరుదైన గ్రామఫోను రికార్డులు వీరు సేకరించారు. కొన్ని నాట్య ప్రదర్శనలిచ్చారు. కవి మల్లాది,సంగీతకారుడు సి.రామచంద్ర అభిమాని.చిక్కవరం జమీందారు, పలు పత్రికలలో సంగీతం పై క్రమంగా శీర్షికలు నిర్వహించారు.కృష్ణుడన్నా, కృష్ణతత్వం అన్నా మిక్కిలి ఇష్టం. పెక్కు గ్రామఫోన్ రెకార్డులకు sleeve notes రాసారు. ఆలాపన పేరుతో వార్త దిన పత్రికలో ఒక సంగీత శీర్షికను నిర్వహించారు. సినిమా, సంగీత విమర్శకుడిగా హైదరాబాదు వగైరా ప్రదేశాలలో ఉపన్యాసాలిచ్చారు.


I) చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు.

3) పెళ్లి పుస్తకం
రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం లో చీరల రూపకల్పిగా నటించారు.


J) "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు" అని గర్జించిన రచయిత

2) దాశరధి కృష్ణమాచార్య
డాక్టర్ దాశరధి కవి, విమర్శకుడు, స్వాతంత్ర సమర యోధుడు.నిజామాబాద్ జైల్లో ఉండి " మా నిజాం రాజు, జన్మ,జన్మల బూజు " అని గర్జించాడు.

ఉత్తమ సమాధానాలిచ్చిన స్మైల్ గారికి దీప్తిధార వీరతాడు వేస్తున్నది. హై!హై! నాయకా.వీరికి రసమయి మాసపత్రిక సంచిక, దీప్తిధార అభినందనలతో అందగలదు.

గురువారం, అక్టోబర్ 04, 2007

సాహితీవనం -7

A) సింధూ నది నాగరికతలో జన్మించిన,పాణిని 520–460 BC సంస్కృత భాషా పండితుడు. సంస్కృత భాషా వ్యాకరణాన్ని వివరిస్తూ అష్టాధ్యాయి అనే పుస్తకం రాసారు.అష్టాధ్యాయి అంటే

1) ఎనిమిది దేవతలు
2) ఎనిమిది పండితులతో రాయబడినది
3) ఎనిమిది అధ్యాయాలు
4) ఎనిమదవ తరగతి నుంచి చదవ వలసినది

B) అల్పజీవి నవల, ఆరు సారా కథలు, ఆరు సారో కథలు రాసిన ప్రఖ్యాత రచయిత రాచకొండ విశ్వనాధ శాస్త్రి వృత్తి రీత్యా

1) డాక్టర్
2) Bar Owner
3) అధ్యాపకుడు
4) న్యాయవాది


Gladiola flowers at my home Photo:cbrao

C) Romancing with Life స్వీయ చరిత్ర రాసిన వారు

1) సునీల్ దత్
2) దేవ్ ఆనంద్
3) రాజ్ కపూర్
4) గురు దత్

D) భారతదేశము, శ్రీలంక ల మధ్య రామసేతు నిర్మాణం గావించిన ఇద్దరు కట్టడ నిపుణుల లో ఒకరు

1) విభీషణుడు
2) సుషేణుడు
3) హనుమంతుడు
4) సుగ్రీవ

E) స్వర్గానికి నిచ్చెనలు రాసిన రచయిత

!) విశ్వనాధ సత్యనారాయణ
2) చలం
3) దేవులపల్లి
4) కట్టమంచి రామలింగా రెడ్డి

F) యాత్రాస్మృతి -స్వీయచరిత్ర రాసినది

!) కందుకూరి వీరేశలింగం
2) దాశరధి కృష్ణమాచార్య
3) చిలకమర్తి లక్ష్మినరసింహం
4) టంగుటూరి ప్రకాశం

G) నూరేళ్ల తెలుగు నవల పుస్తకం (వ్యాసాలు) రాసినది

1) సహవాసి
2) డి.వెంకట్రామయ్య
3) వల్లంపాటి వెంకట సుబ్బయ్య
4) పెద్దిభొట్ల సుబ్బరామయ్య

H) సావిత్రి, జమున, ఎన్.టి.రామారావు నటించిన మిస్సమ్మ చిత్రం చూశారా? ఈ చిత్రంలో, మేరీ గా నటించిన, సావిత్రి పాత్ర అసలు పేరు

1) కమల
2) కనక లక్ష్మి
3) వెంకట లక్ష్మి
4) మహా లక్ష్మి

I) బెంగళూరు విశ్వవిద్యాలయం వారు ఇటీవలనే వీరి సిద్ధాంత వ్యాసాన్ని (Ph.D కోసం) అమోదించి డాక్టరేట్ ప్రదానం చేశారు. వీరు పలు చిత్రాలలొ నటించారు.

1) మోహన్ బాబు
2) జయమాల
3) సుమలత
4) జయంతి

J) హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీత వసన వనమాలి
కేళి చలన్మని కుండల మండిత గండయు గస్మిత సాలి
హరివిహముఘ్ధవ ధూని కరే విలాసిని విలసతి కేలిపరే

పి.సుశీల పాడిన ఈ పాట ఏ చిత్రం లోనిది?

1) భక్త జయదేవ
2) తెనాలి రామకృష్ణ
3) విప్రనారాయణ
4) మహాకవి కాళిదాసు

షరా మాములే! మీ జవాబులు దీప్తిధారకు ఎప్పటిలాగే పంపండి.

బుధవారం, అక్టోబర్ 03, 2007

సాహితీవనం -6


Click on photo to enlarge.

కొత్తపాళిగారు, తమ ఉత్తరంలో " టైటిలు మీరు వనం 2, 3, 4 అని పెడుతూ పోతే కొత్త క్విజ్జులు పెట్టారేమో అని ఆత్రంగా చూసి ప్రతిసారీ నిరాశ పొందాను ", అని రాస్తున్నారు.సాహితీవనం ఉద్దేశాలు తెలుపటానికి ఇది సరైన సమయమని తలుస్తాను. నేటి యువతరంలో పఠనాసక్తి తగ్గి పోతుంది. ప్రశ్నల సాకుతో,పాత, కొత్త పుస్తకాలపై, సాహితీ విషయాలపై , యువతరం దృష్టిని ఆకర్షించాలని చేసిన కుతంత్రమే, ఈ సాహితీవనం. ఇక్కడ,ప్రశ్నలు, జవాబుల కోసం కాకుండా, జవాబుల కోసం ప్రశ్నలు ఉంటాయి. దానర్ధం, జవాబుల రూపంలో, ఆసక్తికరమైన సాహితీ విషయాలు చర్చించటం. ఇంకోలా చెప్పాలి అంటే,ఒక ప్రశ్నకు జవాబు వెనుక కథ చెప్పటం. ఇందులో పెక్కు విషయాలు, ఇప్పటివారికి తెలియనివి కూడా వుంటాయి. కేవలం ప్రశ్నలు, జవాబులు అంటే, సాహితీవనం ఒక పరీక్షాకేంద్రంగా మిగిలిపోయే ప్రమాదముంది.పాఠకులు పరీక్షలు రాసే విధ్యార్థులు కారు. దీప్తిధార పాఠకులు విజ్ఞులు . నాకు తెలిసిన విషయాలు వారికి చెప్పే ఈ విధానంలో, నాకు తెలియని విషయాలను పాఠకులూ చెప్తున్నారు. ఈ ప్రక్రియ, ఇరువురికీ లాభదాయకమని తలంపు.

కొత్తపాళి గారు ఇంకో ఉత్తరంలో సాహితీవనం -5 ప్రశ్నలకు స్పందిస్తూ, ప్రశ్నలు కష్టంగా ఉన్నాయి అన్నారు. ఇది వాస్తవమే.సాహితీవనం -1(Set I) ప్రశ్నలకు జవాబులు,త్వర త్వరగా వస్తుంటే,ప్రశ్నలు సులభంగా ఉన్నాయని తలచి, (Set II లో) కొంచం కష్టమైన ప్రశ్నలు ఉంచాను. నా అంచనాలను తలకిందులు చేస్తూ, స్మైల్ (http://krishnadevarayalu.blogspot.com/2007/09/5.html) వాయువేగంతో జవాబులు పంపారు. నేను కఠినమనుకున్న ప్రశ్నలకు గూగుల్ అన్వేషణ యంత్ర సహాయం తో , సులభంగా జవాబిచ్చి, నన్ను ఆశ్చర్యం లో ముంచేసారు.ప్రశ్నలు రాసే సమయంలో, పాఠకుడు గూగుల్ వాడవచ్చన్న ఆలోచన నాకు తట్ట లేదు. కొత్తపాళీగారికీ తట్టి ఉండదు. Hats off to Google.

రసమయి

ఒక మంచి అభిరుచి గల పత్రికను మీకు పరిచయం చేయటానికి సంతోషిస్తున్నాను. ఈ పత్రిక పేరు రసమయి. నెల నెలా వస్తుంది. సంపాదకులు నండూరి పార్థసారథి. వీరు గతంలో ఆంధ్ర ప్రభ దిన, వార పత్రికలలో పని చేశారు.Journalist గా, రచయితగా వీరికున్న అనుభవం ఈ పత్రికను ఉత్తమ అభిరుచిగల పత్రికగా తీర్చి దిద్దింది.నేను గతంలో తెలుగు బ్లాగులో రాసినట్లు వీరు ఎంకిపాటల, నండూరి సుబ్బారావు గారి కుమారుడు కాదు. విశ్వరూపం, నరావతారం రచనలు,రాజు - పేద, టామ్‌సాయర్ వగైరా అనువాదాలు చేసిన నండూరి రామమోహనరావు గారి తమ్ముడు.


Nanduri Partha Sarathi Photo:cbrao

నంపాసా (నండూరి పార్థసారథి గారు) మంచి హాస్య రచయిత. సాహిత్య హింసావలోకనం, పిబరే హ్యుమరసం వగైరా పుస్తకాలు వీరివే. సంగీతం అంటే ప్రాణం. గ్రాంఫోన్ రికార్డులు 78 rpm, 33 1/3 వేగం గల రెకార్డులు వీరి వద్ద చాలా వున్నాయి.ఇప్పటికీ ఇంకా సేకరిస్తూనే వున్నారు. సంగీతం, సాహిత్యం, వాఙ్మయాలు,కవితలు,ప్రబంధాలు, చిత్రలేఖనం, శిల్పం,నాట్యం,సినీ పాటలు, సినిమాలు వగైరా అన్ని విషాయలపై వీరికి అవగాహన ఉంది.అందుకే రసమయిలో మనకు ఇన్ని వైవివిధ్యమైన విషయాలపై వ్యాసాలు గోచరిస్తాయి. రసమయి ప్రతి ఒక్క సంచికా collectors issue లా రూపొందిస్తారు.

ప్రతి సంచిక లో ఎదో ఒక విషయం పై ప్రత్యేక కేంద్రీకరణ (focus) ఉంటుంది.ఉదాహరణకు సెప్టెంబర్ 2007 నెల లో, దృష్టి, వేటూరి ప్రభాకర శాస్త్రి ఇంకా వారి కుమారుడు వేటూరి ఆనంద మూర్తి గార్ల పరిశోధనలు, రచనలపై ఉంది. 1948 లో ప్రభాకరశాస్త్రిగారు తిరుమల ఆలయ ఆవరణలోని ఒక నేలమాళిగ లో నాలుగు శతాబ్దాల పైగా దాగివున్న తాళ్లపాక వాగ్గేయకారుల సంకీర్తనలు గల రాగిరేకులను గుర్తించి బైటికి తీయించి, దేవస్థానం చేత వాటిని ప్రచురింప చేశారు.1949 ప్రాంతంలో ప్రభాకర శాస్త్రి గారు, ఆయన శిష్యుడు అర్చకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులవారు తాళ్లపాక కవుల సాహిత్య పరిశోధన సాగిస్తున్న తరుణంలోనే తిరుమల ఆలయ చంపక ప్రదక్షిణ ప్రాకారం వద్ద స్వరసహితంగా కొన్ని వాగ్గేయ రచనలు చెక్కిఉన్న రెండు పెద్ద రాతిబండలు వారి దృష్టికి వచ్చాయి. ఆ రచనలు తాళ్లపాక వారివిగా శాస్త్రి గారు గుర్తించారు. వాటిని పరిశీలించి, పరిష్కరించి ప్రకటించగలమని ఆయన చెప్పారు. కాని కొద్దికాలానికే దివంగతులు కావడంతో ఆ పని ముందుకు సాగలేదు.ఆయన తనయుడైన ఆనందమూర్తిగారి పూనికతో ఆ పని పూర్తయ్యింది. ఆసక్తికరమైన పెక్కు విశేషాలతో కూడిన, వీరి పరిశోధన వివరాలు ఈ సంచికలో చూడగలరు.

ఇంకా గుంటూరు శేషేంద్ర శర్మ రచనలపై కోవెల సంపత్కుమారాచార్య విశ్లేషణ, అరవిందుల సావిత్రి పై యజ్ఞన్న,హిందీ కవి ప్రదీప్ పై జానమద్ది హనుమచ్చాస్త్రి , షకీల్-నౌషాద్ క్లాసిక్స్ పై కస్తూరి మురళీ కృష్ణ వగైరా రచనలున్నాయి. ఇంకా బాలలకై కొన్ని ప్రత్యేక పేజీలున్నాయి.

షడ్రుచులతో కూడిన ఇలాంటి పత్రిక తెలుగు లో మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. అక్టొబర్ '07 సంచికతో 8 వ సంవత్సరం లోకి, అడుగుపెడుతున్నది. ఈ పత్రిక పాత సంచికలు కూడా చదవతగ్గ అణిముత్యాలే. వాటి వివరాలు ఇక్కడ చూడండి.
http://rasamayi.com/50915/50157.html#issue

ఈ పత్రిక హైదరాబాదు లో విశాలాంధ్ర,నవయుగ,నవోదయ,గోపాల్ పబ్లికేషన్స్,తెలుగు బుక్ హౌస్ విక్రయశాలల లో మాత్రమే లభ్యమవుతుంది.బయటింకెక్కడా కానరాదు. ఆసక్తిగలవారు
చందాదారులవటమే ఉత్తమ మార్గంలా కనిపిస్తుంది.

విడి ప్రతి రూ.30/- వార్షిక చందా రూ.300/-

చిరునామా:

Rasamayi,
Nanduri Publications,
A-21, Journalist colony,
Jubilee Hills,
Hyderabad- 500 033

అమెరికాలో వార్షిక చందా $40/- సంప్రదించవలసిన చిరునామా:
డాక్టర్ మధుసారధి నండూరి
madhu@nanduri.com

తెలుగుబ్లాగు చరిత్ర -2



ఈ విషయంపై, నా మొదటి టపా చదవని వారు దానిని ఇక్కడ http://deeptidhaara.blogspot.com/2007/05/blog-post_21.html చదవవొచ్చు.మీకు తెలుసా,ఘనత వహించిన బ్రిటీష్ రాజ్యానికి లిఖిత రాజ్యాంగం లేదని? తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో? తాజ్‌మహల్ మార్పు చెందిన ఒక హిందూ కట్టడమని? తిరుమల(తిరుపతి) 250 కోట్ల సంవత్సరాల క్రితం నీళ్లలో ఉండేదని? సముద్రంలో పెరిగే మొక్కలు కొన్ని, తిరుమల కొండల పై పెరుగుతున్నాయని? తిరుమల కొండపై గల ఈ మొక్కలు అక్కడ ఎలా వచ్చాయంటే, ఆ ప్రాంతం ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదన్న చరిత్ర తెలియక పోతే, ఎలా బదులివ్వగలరు?
1493 లో ఉత్తర అమెరికా లో కాలిడిన క్రిస్టాఫర్ కొలొంబస్ తరువాతే అమెరికా చరిత్ర మొదలయ్యింది. అంతకు క్రితం అక్కడే ఉంటున్న తెగలవారిని కొలొంబస్ ఇండియన్స్ గా భావించాడు. అమెరికానే హిందూ దేశం గా కొలొంబస్ పొరబడటం వలన అమెరికా లో తెగలవారు ఇండియన్స్ గా గుర్తించబడ్డారు. కొలొంబస్ ముందు అమెరికా చరిత్ర అతి కొద్దిగా నమోదయ్యింది. ఈ 500 సంవత్సరాలు గానే అమెరికా చరిత్ర ఉంది. ఈ నేపధ్యంలో ఈ మధ్యనే మొదలయిన,చారిత్రాత్మక విషయాలను మనకు వివరించే ఈ తెలుగు బ్లాగు చూడండి.
http://theuntoldhistory.blogspot.com/

చరిత్ర ఒక సారి రాస్తే అయ్యేది కాదు. ఇది నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది.దీనికి భారత దేశ చరిత్రే ఒక ఉదాహరణ.స్వాతంత్ర్యం వచ్చిందాకా భారత దేశ చరిత్ర రాస్తే సరిపోతుందా? ఆ తరువాత చరిత్ర లేదా? తెలుగు బ్లాగుల చరిత్ర ఇప్పటి దాకా ఉన్నది సరిపోతుందా? తెలుగుబ్లాగు మొదట ఉన్నట్లుగానే ఇప్పుడు ఉందా? భవిష్యత్ లో కూడా ఇలాగే ఉంటుందా? మనం ఊహించే దానికన్నా తలదన్నే మార్పులు వస్తాయి. ఈ చరిత్ర మనం పదిలం గా సంరక్షించు కోపోతే, చరిత్ర హీనులము కామా?
తెలుగుబ్లాగు చరిత్ర విషయాలకై మీకు
1)కొత్త గుంపు కావాలా?
2) చరిత్ర లేకపోతే, తరువాత వారికి మన బ్లాగు చరిత్ర ఎలా తెలుస్తోంది? తెలుగు బ్లాగు గుంపు లోనే ఈ విషయాలు నమోదు చేద్దాము.
3) ఈ చరిత్ర వలన ఏమిటి ఉపయోగం? తెలుగు బ్లాగు గుంపులో రాయవద్దు. ఇంకెక్కడా అవసరం లేదు.
4) కొత్త బ్లాగు ప్రారంభించి, అందులో తెలుగు బ్లాగుల చరిత్ర రాద్దాము.

మీ అభిప్రాయాలు తెలియ చేయండి.

శనివారం, సెప్టెంబర్ 29, 2007

సాహితీవనం -5



శ్రీశ్రీ గారు కమ్యూనిస్టు కదా? రామ భక్త హనుమాన్ కు పాటలు రాయడమేమిటి? అని గిరి విస్మయం వెలిబుస్తున్నారు. రామభక్త హనుమన్ ఫేం శ్రీశ్రీ అన్న విషయం చేరా గారిని బాధించి,"మరో ప్రపంచ మహాకవి రామభక్త హనుమాన్ ఫేం?" అని అక్రొశిస్తూ,"వారం,వారం నీ రచనల శరవర్షం కురిపించవయా " అంటూ శ్రీశ్రీని అభ్యర్దిస్తూ, స్వతంత్ర పత్రిక లో గేయం రాశారు. అది చదివి,వరవరరావు స్వతంత్ర లో ఒక వ్యాసం రాస్తూ "శ్రీశ్రీ వైపు దేబె మొగాలు వేసుకు చూస్తుండకపోతే, మీరంతా ఎందుకు రాయకూడదూ?" అని ప్రశ్నించాడు. (చూ.స్మృతికిణాంకం.పే 24.)

దేవుళ్లను స్మరించిన మాత్రాన, శ్రీశ్రీ కమ్యూనిస్ట్ కాకుండా పోడు. వస్తున్నాయ్,వస్తున్నాయ్ జగన్నాధ రధ చక్రాల్ అని రాయటం వెనుక జగన్నాధుడు దేవుడని కాక, మన సంస్కృతి లో భాగమైన జగన్నాధుని, తన భావాలను ప్రజల దరిచేర్చే అవసరం కోసం వారికి సుపరిచితమైన జగన్నాధుని, వాడటం జరిగిందని భావిస్తాను. శ్రీశ్రీ జీవితంలో ఎన్నో వైరుధ్యాలున్నై. సినిమాల లో నెహ్రూ ని పొగిడి ఆ తరువాత నాలుక్కరుచుకున్నాడు."ఒక పక్క సోషలిస్ట్ విలువలు పొగడుతూనే,తన సెక్సు విజయాలను చాటుకునే ఫ్యూడల్ మనస్తత్వమూ ఉంది." -చేరా. శ్రీశ్రీ లోనూ మనుషులకుండే కొన్ని లోపాలు లేక పోలేదు. శ్రీశ్రీ లోని కవి, అతను సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం కావించిన తీరు, ఈ లోపాలను సులభంగా అధిగమిస్తాయి.

సాహితీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న, రెండవ విడత ప్రశ్నలివిగో.ఇవి మీకు ఆసక్తికరంగా ఉండగలవని ఆశ.

సాహితీవనం ప్రశ్నలు

A) రష్యన్ సీత కథా సంపుటి రచయిత్రి

1) వాసిరెడ్డి సీతా దేవి
2) వసుంధర
3) కందుకూరి వెంకట మహాలక్ష్మి
4) కొండేపూడి నిర్మల

B) "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు" అని శ్రీశ్రీ రాసిన పాటకు ''ఏవి తల్లీ,నిరుడు మండిన ఎండు తాటాకుల్" అని పారడి రాసిన కవి

1) చలం
2) ఝరుక్ శాస్త్రి
3) శ్రీ రమణ
4) ఆరుద్ర

C) ఇది ఒక భక్తుడి, సాహితీకారుడి సమాధి



1) అన్నమాచార్య, తాళ్లపాక
2) తిరు వాళ్లువార్, కన్యాకుమారి
3) శ్రీత్యాగరాజ, తిరువాయూరు
4) స్వాతి తిరుణాల్, తిరువనంతపురం

D) సుగాత్రి అంటే ఏమిటి?

1) మంచి శీలం ఉన్నది
2) మంచి శరీరం ఉన్నది
3) మంచి చూపు ఉన్నది
4) పైన పేర్కొన్నవి ఏవీ కావు

E) కవి శేషెంద్ర శర్మ అభిమాన సంఘం

!) గుంటూరు సేన
2) శివ సేన
3) కవి సేన
4) ముత్యాల సేన

F) పంజరాన్ని నేనే, పక్షిని నెనే -కవితా సంపుటి రచయిత్రి

1) శిలాలోలిత
2) సావిత్రి
3) యస్.జయ
4) డా.పి.సుమతీ నరేంద్ర

G) ఈ చిత్రం లో ఉన్నవారిని గుర్తించండి.



1) వెల్చేరు నారాయణ రావు
2) ఆరి సీతారామయ్య
3) బి.నర్సింగరావు
4) చిత్రకారుడు చంద్ర

H) ఆలాపన రాసిన రచయిత

1) మంగళంపల్లి బాలమురళీక్రిష్ణ
2) నూకల చిన సత్యనారాయణ
3) వి.ఎ.కె.రంగారావు
4) యస్.సౌమ్య

I) చిత్రకారుడు, దర్శకుడు బాపు రూపొందించిన చీరలు ఈ చిత్రం లో వాడారు.

1) రాధా గోపాలం
2) ముత్యాల ముగ్గు
3) పెళ్లి పుస్తకం
4) మిస్టర్ పెళ్లాం

J) "మా నిజాం రాజు, జన్మ జన్మల బూజు " అని గర్జించిన రచయిత

1) మాడపాటి హనుమంతరావు
2) దాశరధి కృష్ణమాచార్య
3) వట్టికోట ఆళ్వార్ స్వామి
4) సురవరం ప్రతాప్ రెడ్డి

షరా మాములే. మీ సమాధానాలు,ప్రశ్నలకు సంబంధించిన, ఆసక్తికరమైన విషయాలు దీప్తిధారకు పంపండి.

శుక్రవారం, సెప్టెంబర్ 28, 2007

సాహితీవనం -4


Maredumilli forest,E.G.dt.,A.P. Photo -cbrao

లత, సంతానం చిత్రం లో మాత్రమే కాక ఆఖరిపోరాటం చిత్రం లో కూడా పాడారని సిరి గారు రాశారు.అమూల్యమైన సమాచారాన్నిచ్చిన సిరి గారికి నా ధన్య వాదాలు. లత పాడిన ఆఖరిపోరాటం చిత్రం లో పాటలు మీరు ఇక్కడ వినవచ్చు.

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే భూదేవి అని ఇంకో అర్థం కూడా ఉందని తెలుస్తూంది.ఆసక్తి గలవారు, DTLC Group ఇంకా TELUSA గుంపు చర్చలలో చూడవచ్చు.

ఊ) ప్రకృతి అందాలకు నిలయం తుమ్మపూడి.పచ్చని చేలు, ఆ పక్కనే బకింగ్‌హాం కాలువ, అందులో వెళ్తూండే తెరచాప పడవలు, చెట్లూ, వాటి పై పక్షులూ,మనకు చక్కటి గ్రామీణ వాతావరణాన్ని అందిస్తాయి. చనిపోయే వరకూ సంజీవదేవ్ ఇక్కడే, ప్రకృతిని ఆస్వాదిస్తూ,చిత్ర పటాలు గీస్తూ గడిపారు.

ఎ) పారడీ రచనలైనా, కటుంబ సంబంధ బాంధవ్యాల కథలైనా శ్రీరమణకు కొట్టిన పిండి.

ఏ)భారత రత్న సుబ్బలక్ష్మి గారి గాత్రం అనితర సాధ్యం. గాంధి గారు వైష్ణవ జనతో పాటను వీరి ముహతా వినటానికి ఇష్ట పడే వారు.భక్త మీరా (1945) చిత్రం లో నటించి మీరా భజన్లను పాడారు.ఇంకా సేవాసదనం, సావిత్రి, మీరా(తమిళ్) చిత్రాలలో నటించినా, అవి తన ప్రవృత్తికి సరి పోక పోవటం తో గాయనిగానే కృషి చేశారు.

ఐ) వివిధ రామాయణాలలో గల వ్యత్సాసాలను వివరిస్తూ రాసిన పుస్తకమిది.వీటిలో రాముడికి, సీతకు గల సంబంధాన్ని ఏ రామాయణం లో ఎట్లా రాశారు అని తులనాత్మకంగా పరిశీలించిన గ్రంధం.

ఒ) కారులో షికారు కెళ్లే -ఈ పాట సినిమాలో సందర్భాన్ని బట్టి గాక, పాటకై సందర్భాన్ని సృష్టించినట్లుగా ఉంటుంది. సొషలిస్ట్ భావాలతొ నిండిన ఈ పాట పాఠకులను బాగా తికమక పెట్టింది. చాల మంది దీనిని శ్రీశ్రీ రాసినట్లుగా పొరబడ్డారు. ఈ పాట పై చాలా విశ్లేషణలు కూడా వచ్చాయి. బుచ్చిబాబు గారు దీని పై ఆంధ్ర ప్రభ లేక జ్యొతిలో ప్రత్యేక వ్యాసం రాసినట్లు గుర్తు. ఆత్రేయ గారు శ్రీశ్రీ లో పరకాయ ప్రవేశం చేసి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. అద్భుతమైన పాట.అందుకే ఇంతకాలమైనా మన మదిలో నిలిచిపోయిందీ పాట.

పాఠకుల స్పందన చూద్దాము ఇప్పుడు.
1) నేను సైతం 5 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు. 5 మార్కులు
2) కారణి నారాయణ రావు గారు సినీవాలికి ఒకే సమాధానం ఇచ్చి 0.5 మార్కులు పొందారు. మొత్తం మార్కులు 5.5 మార్కులు
3) సినీవాలి కి రెండు అర్థాలు ఇచ్చారు సౌమ్య. మొత్తం స్కోరు 6 మార్కులు.
4) శ్రీనివాస్ పరుచూరి చివరలో రాసిన ఎనిమిదవ జవాబులో ఆరుద్ర అని రాసారు. కాని ఏ ప్రశ్నకు జవాబుగా రాసారో చెప్పలేదు.సాహితీవనం లో చివరగా ఉన్న ఐ,ఒ ప్రశ్నలు రెండింటిలో ఆరుద్ర అన్న option ఉంది.ఆరుద్ర అన్న జవాబు ఒక ప్రశ్నకు సరైనది.వెరే ప్రశ్నకు కాదు.కావున జవాబు invalid vote కింద జమయ్యింది.ప్రశ్న, జవాబు రెండూ రాసుంటే, శ్రీనివాస్ గారికి ఇంకో అదనపు మార్కు వచ్చేదేమో.Topper అయ్యుండే వారు. రామ భక్త హనుమాన్ గా శ్రీశ్రీని గుర్తించింది వీరే.శ్రీనివాస్ గారి స్కోర్ 6 మార్కులు.

సినీవాలికి రెండవ సమాధానం రాసుంటే నారాయాణరావు గారికి 6 మార్కులు వచ్చుండేవి. 5 మార్కులు సాధించిన నేను సైతం ఇంకొంచం శ్రద్ధ పెట్టి జవాబులు రాసుంటే,అందరికీ సమానంగా నిలిచే వారు.సాహితీవనం ప్రశ్నలకు ఉత్సాహంగా జాబులు, జవాబులు రాసిన అందరికీ ధన్యవాదాలు.చివరగా శ్రీనివాస్ పరుచూరి, సౌమ్య ఇద్దరూ చెరి 6 మార్కులతో సమ ఉజ్జీ అయ్యారు.ఉత్తమ సమాధానాలిచ్చిన వీరిరువురికీ దీప్తిధార వీరతాడు వేస్తున్నది.హై, హై నాయకా! హై, హై,నాయకా! సంజీవదేవ్ రచనల సమీక్ష,విశ్లేషణ,జీవితం సంకలన కర్త శ్రీ పారుపల్లి కవికుమార్ సౌజన్యంతో, సంజీవదేవ్ గురించిన పుస్తకం వీరిరువురికీ దీప్తిధార నుంచి అందుతుంది.

సోమవారం, సెప్టెంబర్ 24, 2007

సాహితీవనం -3




సాహితీవనం ప్రశ్నలకు ఉత్సాహంగా బదులిచ్చిన అందరికీ నెనర్లు. జవాబులే కాకుండా ప్రశ్నలకు సంబంధించిన అమూల్యమైన సమాచారం అందించారు.మరో సారి నెనర్లు. ఈ నెనర్లు అంటో ఏమిటో తెలియని వారికి, దీని అర్థం, ధన్యవాదాలు,కృతజ్ఞతలు, అని తెలియజేసిన తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారికి నెనర్లు. గురజాడ ' ప్రేమ ' అనే అర్థం లో వాడారు.నెనరు కున్న అర్థాలులో ఇవి కొన్ని.అవీ కొత్త తెలుగు పదం ముచ్చట్లు.కొత్త తెలుగు పదాలను తెలుసుకోవాలనే ఆసక్తి కల వారు ' తెలుగుపదం ' గుంపులో చేరితే ఉపయుక్తకరంగా ఉండగలదు. సరే, ఇహ మనం సాహితీవనం లో ప్రవేశిద్దాము. మొదటగా ప్రశ్నలకు సరైన సమాధానాలు, దిగువ ఇస్తున్నాను.

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి

శ్రీశ్రీ

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

స్వతంత్ర

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు

శ్రీశ్రీ

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు

యస్.దక్షిణామూర్తి

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం

1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
2) లక్ష్మి

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.

తుమ్మపూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత

శ్రీరమణ

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం

మీరా

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత

ఆరుద్ర

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి

ఆత్రేయ

అ) François Villon - 15 శతాబ్దపు ఫ్రెంచ్ కవి రాసిన "Where are the snows of yesteryear?", ప్రేరణగా శ్రీశ్రీ రాసిన కవితే ఏవి తల్లి. ఇది ఖడ్గసృష్టి లో ఉంది.
ఆ) డాక్టర్ శ్రీదేవి స్వతంత్ర పత్రికకు సహాయ సంపాదకరాలుగా పని చేశారు. సంపాదకుడు -గోరా శాస్త్రి.
ఇ) రామభక్త హనుమాన్ కు మాటలు పాటలు రాసినది శ్రీశ్రీ. బషీర్‌బాగ్ నుంచి అబిడ్స్ నడుస్తున్నప్పుడు, మహాదేవి అనే డబ్బింగ్ చిత్రం తాలూకు పెద్ద పోస్టర్ కంపించింది చేరా గారికి.పోస్టర్ కింద మాటలు పాటలు శ్రీశ్రీ అని బ్రాకెట్ లో రామభక్త హనుమన్ ఫేం అని రాసుందని చేరా గారు తమ స్మృతికిణాంకం పుస్తకం లో రాశారు.రామ భక్త హనుమాన్ శ్రీ శ్రీ అన్న విషయం చేరా గారిని బాధించిందట.అప్పుడు వారేం చేశారో ఆ కథ తెలుసుకోవాలంటే స్మృతికిణాంకం పుస్తకం చదవండి. మీకు పుస్తకం లభ్యం కాకుంటే, దీప్తిధార కు రాయండి.

ఈ) లతమంగేష్కర్ తో తొలిగా పాట పాడించిన సుసర్ల గారికి ఆంధ్రదేశం రుణపడి ఉంటుంది. ఇది లత ఒంటి గొంతుతో పాడే పాట. ఈ పాట చిత్రం లో రెండు సార్లు వస్తుంది.జునియర్ శ్రీరంజని. నాగెశ్వర రావు, చలం చిన్నప్పుడు, మొదటి సారి,మరలా వారు పెద్దయినప్పుడు. రెండో సారి పాట ప్రధమార్థం లత పాడితే, మిగతా పాట ఘంటసాల పాడారు. లత పాట సినిమా లో theme song గా bits, bits గా పెక్కు సార్లు వస్తుంది.

ఈ పాట విన్నవాళ్లు లతకు తెలుగు రాదంటే నమ్మలేనంత చక్కగా పాడారు. లత అప్పటికే ప్రఖ్యాత గాయని. లత తో తెలుగు లో పాట పాడించటానికి ప్రత్యేక కారణం కనపడదు. మేమే లత తొ మొదటగా తెలుగు లో పాడించాం అన్న ఘనత కోసం తప్ప,వెరే కారణం లేదు. ఇది తలత్ మొహమ్మద్ చేత రమెష్ నాయుడు మనోరమ లో, టి.వి.రాజు రఫీ చేత తెలుగు లో పాడించటానికి ఈ పాట ఆద్య మయ్యింది.అప్పుడు అది వింతే మరి. ఈ రోజు హిందీ గాయకుల తో తెలుగు లో పాడించటం సాధారణ మయ్యింది. లత పాడిన ఎకైక తెలుగు పాట చూసి ఆనందించండి.



(సశేషం)

బుధవారం, సెప్టెంబర్ 19, 2007

సాహితీ వనం -2



సాహితీ వనం ప్రశ్నలకు సమాధానాలు పంపిన మీ అందరికీ ధన్యవాదాలు. యువతరాన్ని ఉద్దేసించిన ఈ ప్రశ్నలు కఠినమేమోనని తొలుత సందేహ పడినాను.అడగగానే టక టక చెప్పిన మీకు అభినందనలు.కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడిదానా అనే పాట సొషలిస్ట్ భావజాలంతో నిండి వుండటం వలన రచయిత పేరు చెప్పటం కష్టమే. ఈ పాట ఔచిత్యాన్ని, ఇందులోని భావ గంభీరతనూ వివరిస్తూ కొన్ని వ్యాసాలు ప్రకటితమయాయి గతంలో. ఈ పాట పై ఈ మాట లో వ్యాసం చదివిన గుర్తు. మీకు లింక్ తెలిస్తే పంపండి. ఈ పాట పై మీకు తెలిసిన ఇతర వ్యాసాల లింకులు కూడా పంపండి. మిగతా ప్రశ్నలకు సంబంధించి, మీకు తెలిసిన విషయాలను కూడా పంపండి. సినీవాలి పై గతంలో DTLCgroup లో చర్చ జరిగింది. ఈ పదానికి ఒకటి కంటే ఎక్కువే అర్థాలు ఉన్నాయి.

ఇంతకీ శ్రీ శ్రీ గారు "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" ఏ పుస్తకం లొ రాశారు? అన్న RSG ప్రశ్నకు ప్రస్తుతానికి అది ఏ పాటలో భాగమో చెపుతాను. పుస్తకం పేరు చెప్పేస్తె రచయిత పేరు మీరు ఇట్టే కనుక్కుంటారు.

చక్రవర్తి అశోకుదెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు

కాళిదాస మహాకవీంద్రుని
కవనవాహినిలో కరంగిన
ఉజ్జయినీ నేడెక్కడమ్మా?
ఉంది: చూపించు

షాజహాన్ అంతఃపురంలో
షట్పదీ శింజాన మెక్కడ
ఝాన్సీ లక్ష్మీదేవి యెక్కిన
సైంధవం నేడేది తల్లీ

సరైన సమాధానాలతో ఇంకో జాబు రాస్తాను.ఈ ప్రశ్నలు సాహిత్యంలోని గతవైభవాన్ని ఒక సారి గుర్తుకు తేగలవని ఆశ.

గత వ్యాసానికి ముఖ చిత్రంగా వేసిన పుస్తకం పేరు అడవిగాచిన వెన్నెల -ఈ పుస్తకానికి మాత్రుక జంగ్ చాంగ్ రాసిన Wild Swans. ఇది కోటి కాపీలు పైగానే అమ్ముడైన పుస్తకం. 30 భాషలలో అనువదించబడింది. చైనాలో నిషెదించబడినది. చైనా సాంస్కృతిక ఉద్యమంలో కష్టాలు పాలయిన మూడు తరాల స్త్రీల వెతలే ఈ పుస్తకం.జంగ్ చాంగ్ కుటుంబ స్వీయ చరిత్ర ఇది.రచయిత్రి, తన, అమ్మ, అమ్మమ్మ ల కథ చెప్తుందీ పుస్తకంలో. 1992 లో NCR Book Award ఇంకా 1994 లో British Book of the Year బహుమతులు వచ్చాయి. చిత్ర రూపంలో రావటానికి ప్రస్తుతం పని జరుగుతున్నది. రచయిత్రి ప్రస్తుత నివాసం బ్రిటన్ దేశం అని విన్నాను. ఈ మధ్యనే విడుదలయిన ఈ పుస్తకం హైదరాబాదు లోని ప్రముఖ పుస్తకాల షాపులలో లభ్యమవుతుంది. కొత్త, పాత పుస్తకాలను పరిచయం చేయటం సాహితీ వనం లక్ష్యాలలో ఒకటి. ఆ ఉద్దేశం తోనే సాహితీ వనం వ్యాసానికి ఈ పుస్తకాన్ని ముఖ చిత్రంగా వేయటం జరిగింది.

ఈ వ్యాసానికి ముఖచిత్రంగా వస్తున్నది సంజీవదేవ్ గురించిన పుస్తకం. పారుపల్లి కవికుమార్ సంకలనం ఇది. పలువురు మేధావులు సంజీవదేవ్ జీవితం, రచనల గురించి చేసిన విశ్లేషణ పుస్తకం ఇది.మరిన్ని వివరాలకు చూడండి

http://www.bitingsparrow.com/sanjivadev/sanjivatelu2.htm

ఈ పుస్తకం కూడా హైదరాబాదు లోని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుంది.

మంగళవారం, సెప్టెంబర్ 18, 2007

సాహితీ వనం



సాహిత్య విషయాలన్నా, సాహితీ కారులన్నా మిత్రుడు పొద్దు త్రివిక్రమ్ కు అభిమానం,గౌరవం. గతంలో నేనేదో ఊసుపోక సాహిత్యం గుంపుకు కొన్ని సార్లు రెండు ప్రశ్నలు అంటూ సాహిత్యం పై అడిగే ప్రశ్నలను తను ఆసక్తిగా చూడటం జరిగింది.సాహితీ అభిమానులనుంచీ దానికి మంచి స్పందన వచ్చింది.ఎందుకు రెండు ప్రశ్నలు రాయటంలేదని గుర్తు పెట్టుకుకుని నన్ను అడగటం జరిగింది.అదే ఈ వ్యాసానికి ప్రేరణ.


నా వద్ద ప్రశ్నల అమ్ముల పొది సిద్ధంగా ఉంది.తూణీరాలను కాచుకోండి మరి. సాహిత్యాభిమానులకు,
ఈ శరాలు తీయని బాధనే కలుగ చేస్తాయని ఆశ.

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి

1) ఆరుద్ర
2) ఆత్రేయ
3) శ్రీశ్రీ
4) దేవులపల్లి

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

1) ఆంధ్ర ప్రభ
2) ఆంధ్ర పత్రిక
3) స్వతంత్ర
4) భారతి

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు

1) శ్రీశ్రీ
2) సముద్రాల
3) పింగళి
4) ముళ్లపూడి

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు

1) యస్.దక్షిణామూర్తి
2) ఆదినారాయణరావ్
3) ఘంటసాల
4) సి.ఆర్.సుబ్బరామన్

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం

1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
2) లక్ష్మి
3) భూదేవి
4) సినీ జగత్తుతో సంబంధం కల వ్యక్తి

ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలుంటే, అవన్నీ సరైన సమాధానాలుగా రాయవచ్చు.

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.

1) వీరుల పాడు
2) తుమ్మపూడి
3) తెనాలి
4) సంగం జాగర్లమూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత

1) ఆదివిష్ణు
2) శ్రీరమణ
3) నండూరి పార్థసారధి
4) శంకరనారాయణ

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం

1) సతీ సావిత్రి
2) మీరా
3) అవ్వైయ్యార్
4) చంద్రలేఖ


ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత

1) తాపీ ధర్మారావు
2) త్రిపురనేని రామస్వామి
3) ఆరుద్ర
4) మహారధి

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి

1) ఆత్రేయ
2) కొసరాజు
3) శ్రీశ్రీ
4) ఆరుద్ర

ఇటీవలే వివాహమైన,సాహిత్యాభిమాని, మిత్రుడు త్రివిక్రమ్ కు ఈ వ్యాసాన్నే పెళ్లికానుక గా ఇస్తున్నా. పాఠకులు ఈ వ్యాసంపై మీ స్పందనను,మీ జవాబులను కామెంట్స్ లో తెలియజేయగలరు. మీకు వ్యక్తిగత జవాబులపై ఆసక్తి ఉన్నట్లైతే మీ జాబులో మీ e-mail చిరునామా ఇవ్వటం మరువకండి.