సోమవారం, మే 21, 2007
తెలుగు బ్లాగు చరిత్ర
ఎప్పటి కైనా తేల్చవలసిన ప్రశ్నలు
1) మొట్ట మొదటి తెలుగు బ్లాగు ఏది, ఆ బ్లాగరు ఎవరు?
2) అంతర్జాలానికి తెలుగు తీసుకొచ్చిన వారెవరు?
ఇంతే కాదు మన తెలుగు ఫాంట్లను ప్రజా బాహుళ్యం లోకి తీసుకు వచ్చి, మీరు ఇప్పుడు, తెలుగులో కూడా రాయవచ్చని లోకాని చాటి, తెలుగు భాష జండాను అంతర్జాలంలో విహరింప చేసిన దెవరు? కూడలి, Quillpad, పద్మ మొదలగు transliterators కు ఆద్యులు ఎవరు? వాటి సృష్టికర్తలెవరు? Dynamic fonts నుంచి యునికోడ్ కు తోడ్పడిన వారెవరు?
తెలుగు బ్లాగరుల మొదటి సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఆనాటి విశేషాలేమిటి? సచిత్రంగా ఈ సమావేశ bulletin లు ఎప్పుడు మొదటగా ప్రారంభ మయ్యాయి? తొలిగా తెలుగు బ్లాగులను సమీక్షించిందెవరు? తెలుగులో బ్లాగు serials trend వేటితో మొదలయ్యింది? ఏ బ్లాగులో ఎక్కువ బ్లాగు సీరియల్స్ ప్రచురితమయ్యాయి?
తొలి తెలుగు బ్లాగు రచయిత కృష్న దాస కవి రాజేనా? చూడండి http://krsnadasakaviraju.rediffblogs.com/
మిత్రులు చావా కిరణ్ ఆ పేరుతో రాయవలసిన అవసరం ఏమిటి?
ఉత్తమ తెలుగు బ్లాగరుగా ఎవరు మొదటగా గుర్తింపు పొందారు?
తెలుగులో అత్యధిక ప్రజాదరణ పొందుతున్న బ్లాగులేవి? Top 10 Blogs ఏవి? వీటిలో పూతరేక్స్ లాంటివి కలుప వొద్దు. పూతరేక్స్ లో స్వంత రచనలతో పాటు ఎక్కువగా సేకరణలు ఉంటాయ్. సూచన: నవీన్ సేకరణలకు ప్రత్యేక బ్లాగు ఖాతా తెరవటం బాగుండగలదు. తెలుగు బ్లాగుల ప్రాచుర్యం లో కూడలి, లేఖిని పాత్ర ఎంత వుంది?
పైన అడిగిన ప్రశ్నలకు సమాచారం ఉన్నవారు కామెంట్స్ రూపంలోనో, లేక నాకు ప్రత్యేక ఉత్తరం ద్వారానో తెలిపితే వాటిని క్రోడీకరించి అందరికీ ఉపయోగ పడేలా ప్రత్యేక వ్యాసం రాస్తాను.
ఎందరో మహాను భావులు. అందరికీ వందనములు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్లు:
"కూడలి, Quillpad, పద్మ మొదలగు transliterators కు"
లేఖిని అనబోయి కూడలి అన్నారా?
మంచి ప్రయత్నం. శుభమస్తు.
* ఇది చాలా మంచి ప్రయత్నం. ఇటువంటి పరిశోధనలు, సమాచారం ఎంతయినా అవసరం.
* మీ సూచన చదివాను. నేను సేకరణ్లన్నిటికి "వార్తలు" అని ట్యాగ్ చేస్తాను. ట్యాగులున్నది అందుకే కదా :)
అంతేకాక రెండు బ్లాగులు నిర్వహించే ఓపిక నాలో లేదు :(
అత్యధిక కామెంట్లు ఉన్న బ్లాగు ఏది?
అత్యధిక యునీక్ కామెంట్లు ఉన్న బ్లాగు ఏది?
పూర్తిగా మొదటి పేరాగ్రాఫు చదివిన తరువాత అఖరున వివరాలు తెలయజెయనివాడి బుర్ర రాంకీర్తిని పాడిస్తానంటరేమొనని, విక్రమార్కుడు, భేతాళం కధల్లొలాగ చెపొద్దు చాలా ఇదై పొయానండి! నాకు వారు వాల్లు ఎవెరు తెలియరండి. ఆ బ్లాగు ఎమిటొ, అదెటొ కూదా అర్ధంకాట్లెదండి. నన్నొగ్గెయండి, మహప్రభొ, నన్నొగ్గెయండి! నేను పత్తేదారి పని లొ లెనండి..మీకు అంత ఇదిగా ఉంటె మీరు చెప్పండి నేను ఆలకిస్తను. నామీద ఒట్టు. కిక్కురుమనకుండా..
సుమారు 300 తెలుగు బ్లాగుల్లో 10 మాత్రం చెప్పడం కష్టమండి.కావలంటే హాస్య భరిత బ్లాగులు,సమీక్ష బ్లాగులు,వంటల బ్లాగులు,పాటల బ్లాగులు,రాజకీయ బ్లాగులు ఇలా వర్గీకరించండి.అప్పుడు తలో వర్గం లో 10 వాటిని ఎన్నుకుంటాము.[బాగుందా అవిడియా?]
మీరు ఇప్పటిదాకా మీకు తెలిసిన సమాచారంతో ఒక టపా వ్రాయండి. సభ్యులందరూ దానికి మార్పులు చేర్పులు మరియు అదనపు సమాచారం వ్యాఖ్యలలో చేర్చుతారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి