మంగళవారం, సెప్టెంబర్ 18, 2007

సాహితీ వనం

సాహిత్య విషయాలన్నా, సాహితీ కారులన్నా మిత్రుడు పొద్దు త్రివిక్రమ్ కు అభిమానం,గౌరవం. గతంలో నేనేదో ఊసుపోక సాహిత్యం గుంపుకు కొన్ని సార్లు రెండు ప్రశ్నలు అంటూ సాహిత్యం పై అడిగే ప్రశ్నలను తను ఆసక్తిగా చూడటం జరిగింది.సాహితీ అభిమానులనుంచీ దానికి మంచి స్పందన వచ్చింది.ఎందుకు రెండు ప్రశ్నలు రాయటంలేదని గుర్తు పెట్టుకుకుని నన్ను అడగటం జరిగింది.అదే ఈ వ్యాసానికి ప్రేరణ.

నా వద్ద ప్రశ్నల అమ్ముల పొది సిద్ధంగా ఉంది.తూణీరాలను కాచుకోండి మరి. సాహిత్యాభిమానులకు,
ఈ శరాలు తీయని బాధనే కలుగ చేస్తాయని ఆశ.

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి

1) ఆరుద్ర
2) ఆత్రేయ
3) శ్రీశ్రీ
4) దేవులపల్లి

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

1) ఆంధ్ర ప్రభ
2) ఆంధ్ర పత్రిక
3) స్వతంత్ర
4) భారతి

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు

1) శ్రీశ్రీ
2) సముద్రాల
3) పింగళి
4) ముళ్లపూడి

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు

1) యస్.దక్షిణామూర్తి
2) ఆదినారాయణరావ్
3) ఘంటసాల
4) సి.ఆర్.సుబ్బరామన్

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం

1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
2) లక్ష్మి
3) భూదేవి
4) సినీ జగత్తుతో సంబంధం కల వ్యక్తి

ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలుంటే, అవన్నీ సరైన సమాధానాలుగా రాయవచ్చు.

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.

1) వీరుల పాడు
2) తుమ్మపూడి
3) తెనాలి
4) సంగం జాగర్లమూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత

1) ఆదివిష్ణు
2) శ్రీరమణ
3) నండూరి పార్థసారధి
4) శంకరనారాయణ

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం

1) సతీ సావిత్రి
2) మీరా
3) అవ్వైయ్యార్
4) చంద్రలేఖ

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత

1) తాపీ ధర్మారావు
2) త్రిపురనేని రామస్వామి
3) ఆరుద్ర
4) మహారధి

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి

1) ఆత్రేయ
2) కొసరాజు
3) శ్రీశ్రీ
4) ఆరుద్ర

ఇటీవలే వివాహమైన,సాహిత్యాభిమాని, మిత్రుడు త్రివిక్రమ్ కు ఈ వ్యాసాన్నే పెళ్లికానుక గా ఇస్తున్నా. పాఠకులు ఈ వ్యాసంపై మీ స్పందనను,మీ జవాబులను కామెంట్స్ లో తెలియజేయగలరు. మీకు వ్యక్తిగత జవాబులపై ఆసక్తి ఉన్నట్లైతే మీ జాబులో మీ e-mail చిరునామా ఇవ్వటం మరువకండి.

15 కామెంట్‌లు:

Naga Pochiraju చెప్పారు...

ఒ) శ్రీ శ్రీ
ఐ)తాపి ధర్మారావు
ఏ)మీరా
ఎ)శ్రీ రమణ

అంతే తెలుసు

C. Narayana Rao చెప్పారు...

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు
1) యస్.దక్షిణామూర్తి

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం
1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.
2) తుమ్మపూడి

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం
2) మీరా

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత
3) ఆరుద్ర

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి
1) ఆత్రేయ

RG చెప్పారు...

ఇంతకీ శ్రీ శ్రీ గారు "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" ఏ పుస్తకం లొ రాశారు?

నేను ఈ కవిత కొసం చాల రోజులుగా వెతుకుతున్నాను. మహాప్రస్థానంలో గానీ ఖడ్గసృష్టి లో గానీ నాకీ కవిత కనపడలేదు. కాస్త చెబుతారా ప్లీజ్?

S చెప్పారు...

అ)3- శ్రీశ్రీ
ఆ)
ఇ)- ఇది ఎప్పటి సినిమా అండీ??
ఈ)1- సుసర్ల దక్షిణా మూర్తి
ఉ)1,2- అమావస్య, లక్ష్మి
ఊ)
ఎ) 2- శ్రీరమణ
ఏ) 2- మీరా
ఐ)3- ఆరుద్ర
ఒ) 3- శ్రీశ్రీ

S చెప్పారు...

ఓ! ఇంతలోపే ఇంత మంది సమాధానం...
ఇంతకీ నాదో సందేహం.... కారులో షికారుకెళ్ళే పాట రాసింది - శ్రీశ్రీ అని నేను ఈ మధ్యే http://satyamsivamsundaram.blogspot.com/2007/08/o.html లో చూసాను... మరి కరణి గారు ఆత్రేయ అని రాసారు... అది చూసాక గూగుల్ చేస్తే (ఆంగ్లం లో చేసాను) ఆత్రేయ అని రాసున్న పేజీ కనిపించింది... ఏది సరైనది ఇంతకీ?

అజ్ఞాత చెప్పారు...

అ).శ్రీశ్రీ - ఖడ్గసృష్టి అని గుర్తు.
ఈ).సుసర్ల దక్షిణామూర్తి
ఊ). తుమ్మపూడి
ఐ).ఆరుద్ర
ఒ).ఆత్రేయ

చేతన_Chetana చెప్పారు...

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం
2) మీరా

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత
1) తాపీ ధర్మారావు

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి
1) ఆత్రేయ

అజ్ఞాత చెప్పారు...

సారీ, రామాయణంలో పిడకల వేట:
టపా కన్నా, మీరు చూపిస్తున్న పుస్తకం ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది నాకు. ఈ టపాకీ, ఆ బొమ్మకీ సంబంధం ఏమిటి? ఆ పుస్తకం గురించి కొంత తెలియచేయగలరు. అది ఏదైనా చైనీస్/ఇంగ్లీష్ పుస్తకానికి అనువాదమా? అయితే దానిపేరు, ఆ తెలుగు పుస్తకం దొరికే చోటు తెలియచేయగలరు. ధన్యవాదాలు. ప్రస్తుతం నేను "కల్చరల్ రివల్యూషన్ అబ్సెషన్" తో బాధ పడుతున్నాను. :- )

కొత్త పాళీ చెప్పారు...

"ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" పద్యం శీర్షిక కూడా అదే అనుకుంటా. ఇది ఖడ్గసృష్టిలో ఉంది. ప్రేరణ ఒక ఫ్రెంచి కవి - ఈ లంకె చూడండి.
http://en.wikipedia.org/wiki/Fran%C3%A7ois_Villon

netizen నెటిజన్ చెప్పారు...

అ -శ్రీ శ్రీ
ఆ - ఆం.పత్రిక
ఇ - ముళ్ళపూడి
ఈ -దక్షిణామూర్తి
ఉ - సినిజగత్తుతో సమ్బన్ధమ్ కల వ్యక్తి
ఊ - తుమ్మపూడి
ఎ - ఆదివిష్ణు
ఏ - అవ్వైయార్
ఐ -ఆరుద్ర
ఒ - కొసరాజు
netijen.blogspot.comలో కూడా కొన్ని తెలుగు సాహిత్యానికి సంభదించిన ప్రశ్నలున్నావి. చూసారా?

అజ్ఞాత చెప్పారు...

ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు? - ఖడ్గ సృష్టి లో "ఏవి తల్లీ!" అన్న గేయ కవితలో వచ్చే పాదాలు.
కొత్త పాళీ గారు చెప్పినట్లు, Francois Villon వ్రాసిన "The snows of yester year" కి అనుసరణము.

cbrao చెప్పారు...

స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు. కొత్తగా ఈ టపా చూస్తున్నవారు మీ సమాధానాలు, స్పందన పంపండి.సాహితీవనం ప్రశ్నలకు సమాధానాలు, వచ్చే వారం, దీప్తిధార లో ప్రచురితమవుతాయి.

బుజ్జి చెప్పారు...

ఇవీ నా స్మాధానాలు

అ) " ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు? “అని ప్రశ్నించిన కవి
3) శ్రీశ్రీ

ఆ) కాలాతీతవ్యక్తులు రచయిత్రిగా డాక్టర్ శ్రీదేవి ప్రసిద్ధిగాంచారు.వీరి కాలాతీతవ్యక్తులు ఈ పత్రికలో సీరియల్ గా వచ్చింది.

1) ఆంధ్ర ప్రభ (ఊహ)

ఇ) రామ భక్త హనుమాన్ -ఈ చిత్రానికి మాటలు, పాటలు రాసిన వారు
4) ముళ్లపూడి (ఊహ)

ఈ) నిదుర పోరా తమ్ముడా అంటూ సంతానం చిత్రంలో ఆంధ్ర దేశానికే లతా మంగెష్కర్ చేత లాలిపాట పాడించిన సంగీత దర్శకుడు
1) యస్.దక్షిణామూర్తి (ఊహ)

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం
తెలీదు

ఊ) ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్ చనిపోయేదాకా ఇక్కడే నివసించారు.
2) తుమ్మపూడి

ఎ)' గుత్తొంకాయ కూర మానవ సంబంధాలు ' రాసిన రచయిత
2) శ్రీరమణ (ఊహ)

ఏ) ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి నాయికగా నటించిన చిత్రం
3) అవ్వైయ్యార్

ఐ) రాముడికి సీత ఏమవుతుంది పుస్తక రచయిత
1) తాపీ ధర్మారావు

ఒ) తోడికోడళ్లు చిత్రం లోని కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దానా పాట రాసిన కవి
3) శ్రీశ్రీ

బుజ్జి చెప్పారు...

avనెగెటివ్ మార్కులు లేవు అని తెలిసినప్పుడు జవాబులు ఊహించి వ్రాసే అలవాటు నాకింకా పోలేదు :-)

వ్యక్తిగతంగా జవాబులు తెలిసికొనగోరుతున్నాను

kotharavikiran@yahoo.com
kotharavikiran@gmail.com

కొత్త

rākeśvara చెప్పారు...

ఉ) ఆరుద్ర రాసిన సినీవాలి అంటే అర్థం
1) చంద్రకళ కానవచ్చెడి అమావాస్య
శ్రీశ్రీ - కవితా ఒ కవితా
"ఉన్మాది మనస్సినీవాలిలో
ఘూకం కేకా! భేకంబాకా!"

నాకు ఇది తెలుసు.
వందకి పది మార్కులు, చాలా సంతోషంగా వుంది :D

కామెంట్‌ను పోస్ట్ చేయండి