ఆదివారం, జులై 27, 2008

రజనీకాంత్ కొత్తచిత్రం: కథానాయకుడు -2


ఈ చిత్ర విశేషాలతో కూడిన సమాచార వీడియో చూడండి.


చిత్రంలోని పాట చూడండి.

సినిమా సినిమా సినిమా సినిమా ఎంటీఅర్, ఏన్ఆర్, రాజకుమార్ ఎంతొమంది వచ్చారండీ, అంతా సినిమా మహిమా మహిమా

కృష్ణుడినెవ్వరు చూశారు? మన కళ్లకి చూపిందీ సినిమా?

స్వర్గం నెవరు చేరారు, మనదరికి చేర్చిందీ సినిమా

కథానాయకుడు చిత్రం trailer చూడండి.

శనివారం, జులై 26, 2008

రజనీకాంత్ కొత్తచిత్రం: కథానాయకుడు

kathanayakudu
రజనీకాంత్, జగపతి బాబు, నయనతార, మీనా ముఖ్య తారాగణంగా కథానాయకుడు సినిమా రాబోతుంది. మలయాళం లో అఖండ విజయం సాధించిన చిత్రం  "కథ పరయుంబోల్" ఈ చిత్రానికి మాతృక.

రజనీకాంత్ నిజజీవితంలోంచి కొన్ని సంఘటనలు, మిత్రుల ప్రస్తావన ఈ చిత్రం లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చిత్ర కథానుసారం రజనీకాంత్, జగపతి బాబు మంచి మిత్రులు. రజనీకాంత్ సూపర్ స్టార్ అయితే, మరొక హీరో మంగలిగా వుండిపోతాడు. వారి స్నేహం అలాంటి పరిస్తితులలో ఏమవుతుందో చిత్రంలో చూడాల్సిందే. ఈ చిత్రంలో స్నేహం విలువ ఎంతో సముచితంగా చూపబడింది. ఆగస్ట్ 3 World Friendshipday ను, ఈ చిత్రం విడుదలను కలిసి ఉత్సవంగా నిర్వహించబోతున్నారు. ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని హిందీ లో షారుక్ ఖాన్ నాయకుడిగా నిర్మించబోతున్నాడు.

కథానాయకుడు లో Comedian సునీల్ తన ఇష్టానుసారం, మీసాలు పెంచటం, తగ్గించటం ఒక విశేషం. 75 ఏళ్ల దక్షిణ భారత చలన చిత్రసీమకు నీరాజనం పడుతూ నిర్మించిన సన్నివేశాలలో, తెలుగు, తమిళ, మలయాళ ఇంకా కన్నడ చిత్ర ప్రముఖులను చూపించటం జరిగింది.

soundarya_rajnikanthఈ చిత్రానికి కావలసిన గ్రాఫిక్స్ అన్నీ రజనీకాంత్ పుత్రిక సౌందర్య, తన స్టుడియో ‘Ocher’ లో చెయ్యటం జరిగింది. ఈ నీరాజనం సన్నివేశం లో, స్టుడియో సాంకేతిక నిపుణలతో బాటుగా, సౌందర్య కూడా కొన్ని సెకన్లు కనిపించబోతున్నది.  శంకర్ మహాదేవన్ పాడిన సినిమా సినిమా సినిమా సినిమా ఎంటీఅర్, ఏన్ఆర్, రాజకుమార్ ఎంతొమంది వచ్చారండీ అనే పాట ఈ సినిమాలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పాటలో రజనీ 10 సోకైన పాత్రలలో కనిపిస్తాడు.వచ్చే వచ్చే వాన అంటూ శ్రేయ ఘోశాల్ పాడిన పాట మెరుపు కలలు చిత్రం లోని సుజాత పాడిన ఓ వాన పడితే ఆ కొండ కోన హాయీ అనే పాట గుర్తుకు తెస్తుంది. ఓం జరారె అంటూ డేలర్ మెహందీ, చిత్ర, సాధన సర్గం పాడిన ఇంకో పాట ఈ చిత్రానికి మరో ఆకర్షణ. Soundarya Rajnikanth Pic Courtesy: Hindu Cinema Portal

సంగీతం: G V ప్రకాష్
దర్శకత్వం: పి.వాసు (Chandramukhi fame)
నిర్మాత: సి.అశ్వనీ దత్

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం, 1200 (తెలుగు మరియు తమిళం కలిసి) ప్రింట్ల తో, ఆగస్ట్ 1 న విడుదల కాబోతుంది . అమెరికా లో పలు నగరాలలో, జులై 31 న, ఈ చిత్రం ప్రివ్యూ షోలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేష్ లో 300 ప్రింట్ల తో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

చిత్రం లోని పాటలు ఇక్కడ వినండి.

http://musicmazaa.com/telugu/audiosongs/movie/Kathanayakudu.html?e

ఏ మెదడు మీరు ఉపయోగిస్తారు?

ఇది చాలా అమోఘమైనది. చాలా గంటల పాటు మీరు దీని గురించి ఆలొచిస్తూనే ఉంటారు.

amazinggirl

ఈ బొమ్మలో అమ్మాయి, కుడిపక్కకు తిరుగుతున్నట్లుగా మీకు అనిపిస్తే దానర్ధం మీరు మెదడులోని కుడి భాగం వాడతారని; ఇంకోలా కనిపిస్తే, మీరు ఎడమ మెదడు వాడతారని అర్థం. కొంతమంది రెండు దిక్కులూ తిరుగుతున్న అమ్మాయిని చూడగలరు. కాని ఎక్కువమంది అమ్మాయి ఒకవైపు మాత్రమే తిరుగుతున్నట్లుగా గ్రహించగలరు. మీరు మెదడు లోని ప్రవాహ గతిని మార్చి, ఆ అమ్మాయి రెండు దిశలలోనూ తిరిగేట్లుగా చెయ్యగలరు. ఇలా అమ్మాయి భిన్న దిశలలో తిరుగుతున్నట్లుగా అనిపించటానికి, మెదడు లోని రెండు పార్శ్వాలే కారణభూతాలని ప్రయోగాల ద్వారా తెలుస్తుంది.
ఈ కింది పట్టిక ఎడమ, కుడి భాగాలలో ఉన్న మెదడు లోని తేడాలని తెలియచేస్తుంది.

Left Brain     Right Brain
Logical         Random
Sequential     Intuitive
Rational        Holistic
Analytical      Synthesizing
Objective      Subjective

Looks at       Looks at
parts             wholes

Most individuals have a distinct preference for one of these styles of thinking.Some, however, are more whole-brained and equally adept at both modes. In general, schools tend to favor left-brain modes of thinking, while downplaying the right-brain activities.Left-brain scholastic subjects focus on logical thinking, analysis, and accuracy.

Right-brained subjects, on the other hand, focus on aesthetics, feeling, and creativity.If you look away, she may switch from one direction to the other.I found that if I just look at her feet or relax and look at the floor where the reflection shows, she will switch direction!

Source of article : Internet

శుక్రవారం, జులై 25, 2008

అద్భుత మోటార్ సైకిల్ విన్యాసం

1950 -1960 లో జరిపిన అపూర్వమైన, ఇటాలియన్ పొలీసుల మోటార్ సైకిల్ విన్యాసం ఇది. వారి నైపుణ్యానికి, క్రమశిక్షణకు అబ్బురపడవలసినదే. వావ్ అనకుండా ఉండలేము. మీరే చూసి చెప్పండి.   

బుధవారం, జులై 23, 2008

లకోటా ప్రశ్నలు

chiru1

Pix courtesy: The Hindu

 

చిరు కొత్త పార్టీ

పలకా బలపం బ్లాగులో ఒక లకోటా ప్రశ్న అడిగాను. నా ప్రశ్న ఇది.
When Chiru is going to announce his political party?
నా కొచ్చిన సమాధానం ఇదిగో కింద చూడండి.
What you are thinking will not happen.

నేనడిగిన మరో ప్రశ్న.
Will congress survive no confidence motion?
నా కొచ్చిన సమాధానం.

What you are thinking will not happen. 

నా తదుపరి ప్రశ్న ఇదిగో.
తరువాతి ముఖ్యమంత్రి చిరు?
సమాధానం: Yes. ....But it will be realised in future.

సరదాగా ఒక లుక్ వేయండి, లకోటా ప్రశ్నలపై. మీరు అడగవచ్చు కొన్ని ప్రశ్నలు -ఉదాహరణకు
నాకు పెళ్లెపుడవుతుంది?
నా లాటరీ టికెట్ కు బహుమతి వస్తుందా? Use your creativity and ask questions. It is fun.

మంగళవారం, జులై 22, 2008

రేడియోలో నా ఇంటర్వ్యూ - 1

OLYMPUS DIGITAL CAMERA

నేడు Rainbow FM లో సుమన్స్పతి రెడ్డి గారు చేసిన ఇంటర్వ్యూ లో, పక్షుల గురించి, ఛాయాగ్రహణం గురించి, తెలుగు బ్లాగుల గురించీ మాట్లాడాను.  ఆది బ్లాగరు చావా కిరణ్, వీవెన్ బ్లాగుల కోసం చేస్తున్న విశేష కృషిని ప్రస్తావించాను. కంప్యూటర్ కు  తెలుగు నేర్పటం అనే విషయం పై తెనాలిలో చేసిన Workshop గురించి ఉదహరిస్తూ, ఆసక్తి ఉన్న వ్యక్తులకూ, సంస్థలకూ తెలుగు బ్లాగు గుంపు, e-telugu తరపున Workshops నిర్వహించటానికి సంసిద్ధత తెలియ పరచాను.

OLYMPUS DIGITAL CAMERA

Left to Right: cbrao and Sri Sumanaspati while recording the programme

 
ఈ ప్రోగ్రాం broadcast అయ్యే సమయంలో  live record చెయ్యటానికి, నా వద్ద, స్నేహితుల వద్ద working condition లో ఉన్న, టేప్ రికార్డర్ లేక పోవటం తో, ధ్వనిముద్ర గావించ లేక పోయాను. ఆకాశ వాణి టేప్ సంపాదించి, పూర్తి శ్రవణ interview  త్వరలో ఇక్కడ ఇవ్వటానికి కృషి చేస్తాను.


అప్పుడే ఒక శ్రోత నుంచి ఉత్తరం వచ్చింది. శ్రీనివాస్ కుమార్ గారు రాస్తున్నారు: "I would like to know about any website that provides Telugu typing using INSCRIPT method. I know lekhini.org but it is phonetic English based one. Kindly let me know if there is something like this." 


గమనిక: ఈ కార్యక్రమం తొలిసారిగా 22 జులై  2008 న మధ్యాహ్నం 1.30 P.M. కు సరదా లో ప్రసారమయ్యింది.   ధ్వని ముద్రణ అయ్యిన గంటకే ప్రసారం చేశారు. మరలా, మరలా వారికి ఖాళీ దొరికినప్పుడల్లా ఇది పునః ప్రసారమవుతుంది కావున, తెలుగు బ్లాగుల గురించిన సమాచారం ఎక్కువమందికి చేరే అవకాశం ఉంది.

శనివారం, జులై 19, 2008

స్వేత సౌధం లో తెలుగబ్బాయి రోహిత్

rohit


పదునాలుగు సంవత్సరాలకే అమెరికా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు యువకుడు; అమెరికాలో ఎన్నిక కాబోయే నూతన అధ్యక్షుడిని కలుసుకోమని - ఆ సందర్భంగా జరిగే యువత చర్చలలో (Presidential Youth Inaugural Conference) పాల్గొనమనమని ఆహ్వానం పొందటం అతని తల్లి తండ్రులకే కాక, ఆంధ్రప్రదేష్ కూ గర్వ కారణం. అతని పేరు రోహిత్. అతని తల్లి తండ్రులు హైదరాబాదు కు చెందిన వారు. ప్రస్తుతం రోహిత్ వాషింగ్టన్ సమీపంలో పార్క్లాండ్ మిడ్డిల్ స్కూల్ లో విద్య పూర్తి చేసి హైస్కూల్ లో ప్రవేశించాడు.bushatrohit'sschool

గత సంవత్సరం రోహిత్ స్కూల్‌కు అమెరికా అధ్యక్షుడు బుష్ వచ్చినప్పుడు తలవని తలంపుగా రోహిత్ దగ్గరికి వచ్చాడు. 

రోహిత్ సైన్స్, గణితం అంటే ఆసక్తిగల విధ్యార్ధి. ఇప్పటికే ఛార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం పైన, రొబొల పైన, జ్యోతిష్యం లోని అశాస్త్రీయత పైన పరిశోధనా పత్రాలు సమర్పించాడు.
 Rohitwithslateschoolteachers1
                                                                                 Photo:cbrao

Slate school, S.R.Nagar., Hyderabad లో "జ్యోతిష్యం ఎంతవరకూ శాస్త్రీయం?" అనే అంశంపై ఉపన్యసిస్తున్న రోహిత్ -కూర్చున్న వారు శ్రీయుతులు ఇన్నయ్య మరియు వాసిరెడ్డి అమర్ నాథ్ (స్లేట్ స్కూల్ నిర్వాహకులు). ప్రసంగం తరువాత, జ్యోతిష్యం పై, రోహిత్, ఆసక్తికరమైన ప్రయోగం, స్కూల్ ఉపాయాధ్యాయినుల పై జరిపాడు.

Rohitwithslateschoolteachers2
                                                                            Photo:cbrao

Astrological predictions - అందరికీ ఒకే జాతకఫలితం పంచి, ఎవరికి వారు తమదే అని భ్రమించేట్లు చేసి జ్యొతిష్య దొషాన్ని బయట పెట్టడం జరిగిందీ ప్రయోగంలో.

మేరీలాండ్ రాష్ట్రం లోని,పార్క్లాండ్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నప్పుడు రోహిత్ సమర్పించిన డార్విన్ పరిణామ సిద్ధాంతం పలువురి ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత Oxford విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త, మానవతావాది రిచర్డ్ డాకిన్స్ (Author of “The God Delusion” etc., books) రోహిత్ పనితనాన్ని మెచ్చుకున్నవారిలో ఒకరు. రోహిత్ సమర్పించిన డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఇక్కడ చూడండి.
http://www.bitingsparrow.com/biosymphony/NHD-%20Charles%20Darwin.ppt
United States Achievement Academy  వారి జాతీయ ప్రతిభా పరీక్షలో ఎంపికై, యోగ్యతాపత్రము స్వీకరించాడు. వ్యక్తిగత అభిరుచులలో పియానొ, కరాటే పేర్కొనతగినవి. భారత శాస్త్రీయ పరిశీలనా కేంద్రం, అమెరికా లోని Secular Society ఉమ్మడిగా నిర్వహించిన భారతీయ శాస్త్రజ్ఞుల మత నమ్మకాల పరిశీలన లో తోడ్పడ్డాడు. స్కూల్ లో పత్రికకు విలేఖరిగా పనిచేశాడు. రోహిత్ తల్లి డా.నవీన (Writer of Feelings – Please see అనుభూతులు at
http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_7658.html )
చిన్నపిల్లల మానసిక చికిత్స వైద్యురాలు. తండ్రి హేమంత్ ఉపగ్రహ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్నారు. రోహిత్ కు మేనమామ చాలు వచ్చిదనుకుంటే, మేనమామ ప్రస్తుతం Mint -Financial & Economic Daily పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు.
స్వేతసౌధం నుంచి రోహిత్ కు వచ్చిన ఆహ్వాన పత్రం
pyic
You've Been Selected to Attend the Presidential Youth Inaugural Conference!
Dear Rohit,
Congratulations! You have been selected to take part in a truly historic occasionhe Inauguration of the 44th President of the United States! I am very excited to announce your selection to attend the Presidential Youth Inaugural Conference (PYIC) in Washington, D.C.
From January 17-21, 2009, you will take part in what is the most historic and celebrated event to occur in our nation and which is the hallmark of our democratic governmenthe peaceful transfer of power to our newly elected president. While the entire world watches the President of the United States take the formal oath of office on television, you will be among the privileged few who experiences this momentous occasion in person!
As an Inaugural Scholar and special guest on the National Mall, you will not only bear witness as the President of the United States is sworn into office, you will also meet a major presidential candidate, White House officials, congressional staff, political experts and special VIPs such as Lance Armstrong.
Following the inauguration, you will experience the sights and sounds of a jubilant nation during the inaugural parade and even attend a Black Tie Gala Inaugural Ball. Attending the Conference also represents an excellent opportunity to explore the many cultural and historic sites that only our nation's capital can offer.
You have been awarded this special opportunity due to your scholarly achievements as an alumnus of the National Young Leaders State Conference (NYLSC). At the Conference, you and your fellow alumni will be honored as distinguished young leaders and accomplished students. Attending the Inaugural Conference will also provide you with a great opportunity to reconnect with your friends from NYLSC.
I have just placed in the mail important materials regarding your selection to attend the Conference. The blue and gold envelope, which contains all the information you need to enroll in the Conference, should reach you in the next few days.
Congratulations again, and please look for the blue and gold envelope I am sending to arrive shortly. For more information on the Presidential Youth Inaugural Conference, please visit www.cylc.org/pyic.
Sincerely,


clip_image002
Tonia Jacobson
Director of Admissions


phone: (703) 584-9897
e-mail: pyic@cylc.org
web: www.cylc.org/pyic
ONLINE ENROLLMENT
Click the button below to enroll in the 2009 Presidential Youth Inaugural Conference.
clip_image003
DATES & LOCATION
January 17 - 21, 2009
Washington, D.C.

SAMPLE SCHEDULE
Sample schedules demonstrate both the scope of topics and the pace of our programs.
Click here to view a sample schedule.

Congressional Youth Leadership Council
1919 Gallows Road, Suite 700
Vienna, VA 22182

మంగళవారం, జులై 15, 2008

సాంకేతిక నిపుణల దొంగ ఉద్యోగ దరఖాస్తు పత్రాలు

jobapplication


Tata Consultancy Service(TCS), వారు తమ ఉద్యోగులలో 20 మందిని దొంగ సర్తిఫికేట్ చూపించి ఉద్యోగం పొందారన్న అభియోగం తో తీసివేసింది.  గతంలో Infosys, Satyam , Wipro కూడా  false resumes పై ఇలాంటి చర్యే తీసుకున్నారు. విప్రొ ఇలా దొంగ రెస్యూంస్ పెట్టి ఉద్యోగం సంపాదించే వారి data base తయారు చేసి మిగతా కంపనీలకు ఆ సమాచారాన్ని అందచేస్తుంది.

ఇప్పుడు క్రమ శిక్షణ ఎదుర్కొంటున్న ఉద్యోగులు, వ్రాత పరీక్ష, సామూహిక చర్చ, సాంకేతిక నిపుణుల ప్రశ్నల బాణాలు, HR Dept ల శల్య పరీక్షకు  తట్టుకుని, ఎంపికైన వారే. ఇలా ఉద్యోగం పోయిన వారు కోర్ట్ కు వెళ్లే అవకాశం ఉందా? తప్పెవరిది?   
ఈ విషయం పైన చర్చలు చూడండి. మీరేవంటారు?

http://www.siliconindia.com/shownews/43754/2

బుధవారం, జులై 09, 2008

కొత్త పార్టీ అధినేత చిరుకి ప్రేమలేఖ






చిరు కొత్త పార్టీ గురించిన ఊహాగానాలు, ఆశించేవి ఎక్కువయ్యాయి. అంతా కొత్తవారినే పార్టీ లో చేర్చుకుని, రాజకీయ రంగును సమూలంగా మారుస్తాడేమో అనుకున్న వారికి, చిరు పార్టీలోకి, ఇతర పార్టీల నాయకులు చేరటం, కొంత ఆశాభంగం కలిగిచ్చింది. అయితే, పాతవారిని కూడా తన నూతన భావజాలంతో ప్రభావితం చేసి, ప్రజలాసిస్తున్నట్లుగా, పాత రాజకీయాలకు భిన్నంగా చిరు మార్పు తెస్తాడా? ఎన్నో ప్రశ్నలు. వీటికి ఇప్పుడే విశ్లేషణనివ్వటం కష్టమే. కొద్దికాలం వేచియుండాల్సిందే.



కొత్తపార్టీ అధినేత చిరు కు ఇన్నయ్య గారి లేఖ చూడండి.


















Read this document on Scribd: Chiru Party

ఆదివారం, జులై 06, 2008

అంతర్జాల వీక్షణం -4

boat_on_godavari_rjm

గోదావరి -రాజమహేంద్రవరం రైలు వంతెన

 

గోపి గోపిక గోదావరి

http://thatstelugu.oneindia.in/movies/avi/2008/06/kamalini-new-film-gopi-gopika-godavari-280608.html

దర్శకుడు వంశీ కు, గోదావరి లేకుండా సినిమా ఎలా చిత్రిస్తారు అనేది మొదటి ప్రశ్న. వంశీ కు గోదావరి నది అన్నా, అక్కడి ఇసుక తిన్నెలన్నా, గ్రామాలన్నా, అక్కడి మనుషులన్నా ఎంతో ప్రాణం. గోదావరి సినిమాతో కమలిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న కొత్త చిత్రం గోపి గోపిక గోదావరి. ఈ చిత్రం విశేషాలు thatstelugu లో చూడవచ్చు.

 

చదువు- తెలుగు మాధ్యమం

http://drbr1976.blogspot.com/2008/06/blog-post_27.html

ఇది గంభీరంగా ఆలోచించవలసిన విషయమే. పిల్లలకు మాతృభాష లో తలకెక్కినట్లుగా, మరే భాష లోను, జటిల విషయాలు బొధ పడవని కొందరు విద్యావంతులు చెప్తున్నారు. ఇది కొట్టిపారెయ్యటం కష్టం కానీ, 8 వ తరగతి వరకు తెలుగు మాధ్యం ఉండటం బాగుండునని భవదీయుడి ఆలోచన. శాస్త్ర పదాల లోని ఆంగ్ల, తెలుగు పదాలు రెండూ విధ్యార్థులకు బోధించాలి. మేరేమంటారు? భావుకుడన్ చెప్పే కథనం బాగుంది.

 

మిధ్య - Virtual reality

http://groups.google.co.in/group/AxaraYagyamu/browse_thread/thread/ab6e0937b18de3f8

మిధ్య అంటే ఏమిటి? ఒక Engineer View Point ఏమిటో చదవండి. చదివినాక మీ ఉద్యోగం మిధ్య, మీ క్లైంట్ మిధ్య అని అనిపిస్తే? మీ చెయ్యి గట్టిగా గిల్లమని పక్కవారికి చెప్పండి. ఆకుల నాగేశ్వర రావు విశ్లేషణ ఇది.

 

కారంపుడి a.k.a కారెంపుడి

http://venusrikanth.blogspot.com/2008/06/aka.html

అగ్నిపూలలో ఉండే కాడలతో కోడి పందాలు ఆడారా, మీ బాల్యంలో? పల్లెలో, టూరింగ్ టాకీస్ లో చిల్మా (Cinema) చూసారా? ఘంటసాల గారి "నమో వెంకటేశా" "ఏడుకొండలవాడా" పాటల తో మొదలయ్యే సినిమా అనుభవం గుర్తుందా? ఇంటర్వల్ లో పూరి కూరా తింటూ బెల్ వినిపించగానే, హడావుడిగా చేతులు కడిగేసుకుని హాల్లోకి వెళ్లి కూర్చున్న జ్ఞాపకం గుర్తు తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? పౌరుషాలకు పుట్టినిల్లు అయిన కారంపుడి లో తన బాల్య స్మృతులు గుర్తు చేసుకుంటూ రాస్తున్న వేణూ శ్రీకాంత్ కబుర్లు, మిమ్ములనూ, మీ బాల్యం లోకి తీసుకెళ్తాయి.

 

నువ్వు నాకొద్దు

http://www.eemaata.com/em/issues/200511/49.html

డాక్టరు. నిసీ షామల్ భారత్ నుంచి అమెరికా వచ్చిన కొత్తల్లో అక్కడి జీవన విధానం అర్థం కాక అయోమయానికి గురైనా, కొంత కాలం తర్వాత అలవాటు పడ్డాక, అక్కడి జీవన విధానం లో కలిసిపోగలిగింది. హాస్పిటల్ కు వచ్చిన రోగి కి మందులు మాత్రమే కాక నాలుగు మంచి మాటలు స్వాంతనను ఇస్తాయని అనుభవం మీద గ్రహించి, రోగులతో ప్రేమగా ఉంటుంది. ఈ పరిస్థితిలో, డేవిడ్ ఆర్ఠర్ అనే ప్రాస్టేట్ కాన్సర్ తో బాధపడుతున్న రోగి, డాక్టరు. నిసీ షామల్ ఆడ డాక్టర్ అన్న కారణంతో ఆమెతో వైద్య పరీక్షలు చేయించుకోవటానికి నిరాకరిస్తాడు. డాక్టరు. నిసీ షామల్, డేవిడ్ ఆర్ఠర్ కు ఎలా వైద్యం చేసిందన్నది మిగతా కథ. డాక్టర్‌కు రోగికి మధ్య ఉండాల్సిన అవగాహన ప్రాముఖ్యాన్ని, ఈ కథ చక్కగా చెప్తూంది. ఈ కధ రచయిత్రి లైలా యెర్నేని.

లైలా న్యూయార్క్ నగరం గురించి రాసిన కవిత దిగువున ఇస్తున్నాను. చదివి కాసేపు న్యూయార్క్ లో విహరించండి.

 

మనోహర న్యూయార్క్

న్యూయార్క్ నగరంలో
హోటెల్ పెనిన్స్యులా
రూఫ్ టాప్ రెస్టరాంట్ లో
ఓ రాత్రి నేను
నా చనువు చుట్టాలతో చేరి
సురను సేవిస్తున్నా
ఫిఫ్త్ ఏవెన్యూలో ట్రాఫిక్ ని చూస్తున్నా
దూరపు భవనపు గోపురంపై
అస్తమించే సూర్యగోళాన్నీ
వందల అద్దాల్లో ప్రతిఫలించే ఎర్రని
వేల వేల వెలుగులనీ గమనిస్తున్నా
నేపథ్యంలో వినిపిస్తున్న
ఏదో దేశపు కలగలుపు పాటను
అన్యమనస్కంగా వింటున్నా.
ఆ గాయకుడెవరో కాని
అకస్మాత్తుగా
స్వచ్ఛంగా, స్ఫుటంగా
నమో నారాయణా! అని పలికితే
అందరి మాటలూ ఆగిపోయాయి.
మళ్ళీ ఆ పాటగాడు స్పష్టంగా
శంభో శివ!
అంటే, ఏమున్నదో? ఆ మాటల్లో
గుప్తమై శక్తి ఏమున్నదో,
నా ఒళ్ళంతా ఝల్లుమని పోయింది.

 

వయ్యంటే బిడ్డే

http://annisangathulu.blogspot.com/2008/05/blog-post_23.html

ఇండియా టుడే లో ఒక వ్యాసం చదివాను. మన దేశం లో స్త్రీ పురుషుల నిష్పత్తి తగిన విధములో లేదనీ, స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గిందనీ. పంజాబు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల లో, ఒకే స్త్రీని, ఇద్దరు ముగ్గురు పురుషులు కలిసి వివాహం చేసుకోవాల్సొస్తుందని, సారాంశం. ఇది విపాత్కార పరిస్థితి. బీహర్ మొదలగు రాష్ట్రాలలో, పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షల సహాయం తో, స్త్రీ భ్రూణ హత్యలెక్కువయ్యాయి. పుట్టబొయ్యే పిల్లలు ఆడ లేక మగ అనేది సృష్టి లో ఎలా నిర్ణయించబడుతుందో, సులభమైన శైలి లో వివరిస్తున్నారు గీతాచార్య.

శనివారం, జులై 05, 2008

బ్లాగరు మిత్రులకు: మీతో నేను -2









 నా బ్లాగు చిట్టా

దీప్తిధార బ్లాగులోని My Blog List చూసారా? అందులో మీరు ఇష్టపడే బ్లాగుల లింకులు పెట్టుకోవచ్చు. ఇందులో కొత్త ఏముంది అంటారా? ఇంతకు క్రితం ఉన్న Blog Rollలో, కేవలం ఆయా బ్లాగులకు లింకులు మాత్రమే వుంటే కొత్తగా వచ్చిన ఈ My Blog List లో ఆయా బ్లాగులలో తాజాగా ప్రచురించబడిన టపాల పేర్లు లింకులతో సహా ప్రత్యక్షం. అంతే కాదు, మీరు snippets ఎంచుకుంటే, ఆయా తాజా టపాలలోని మొదటి మూడు వాక్యాల, ముందుచూపు కూడా చూడవచ్చు. ఉదాహరణ కావాలంటే నా ప్రపంచం సైట్లోని , My Blog List చూడవచ్చు. ఈ బ్లాగులలో సరికొత్తగా తాజీకరించబడిన టపాలు పైన, అన్నిటికన్నా పాత టపాలు దిగువనా కనిపిస్తాయి. కొత్త టపాలను ఈ విధంగా గుర్తించటం చాలా సులువు. మీరు తరచుగా చదివే బ్లాగులకు ఇలా మీ బ్లాగులో, మీరు లింక్ ఇవ్వటం వలన ఆయా బ్లాగులకు rating value పెరుగుతుంది. అంతే కాదు, మీ బ్లాగు పాఠకులు, మీ బ్లాగులో టపా చదవటం పూర్తయ్యాక, తాజాగా ప్రచురించబడిన టపాల వైపు వారి దృష్టి మరలి, ఆయా బ్లాగులూ చదువుతారు. మీ మిత్రులూ, వారి బ్లాగులో, మీ బ్లాగుకు ఇదే విధంగా లింక్ ఇస్తే, అక్కడి పాఠకులు ఇక్కడకూ వస్తారు. ఇది ఉభయత్రా లాభకరము. మరి My Blog List ఎలా పెట్టుకోవాలంటే, సహాయము కొరకు ఈ దిగువ లింక్ చూడగలరు.
http://buzz.blogger.com/2008/06/show-off-your-favorite-blogs-with-blog.html

మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?
http://teluguvadini.blogspot.com/2008/03/blog-post_8627.html

డ్రాఫ్ట్ బ్లాగరు లో పెను మార్పులు

కొత్తగా draft.blogger లో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు మీ బ్లాగ్ పోస్ట్ కింద స్టార్ రేటింగ్, వర్డ్ ప్రెస్ లో లాగా కామెంట్ బాక్స్ వగైరాలు. ఈ విషయమై చదువరి టపా చూడండి.
draft blogger లో auto save సదుపాయం లేదు. draft.blogger.com ద్వారా తెలుగు Inscript Documents ను Copy & Paste చేసి ప్రచురించే సమయంలో పెక్కు HTML coding సమస్యలు సతాయిస్తాయి. Word తో వచ్చే Meta Tags ను draft.blog, అంగీకరించదు. Line breaks సమస్యలు కూడా వస్తాయి. పరిష్కారం ఉంది. Windows Live Writer ద్వారా ప్రచురిస్తే ఈ Coding సమస్యలు రావు. పై చెప్పిన, వీటిలోని చాలా అంశాలు దీప్తిధార లో ప్రవేశ పెట్టబడినవి. గమనించగలరు.

విండోస్ లైవ్ రైటర్ తో ఉపయోగాలు

Word Press ఉపయోగించే వారు గమనించే ఉంటారు; బొమ్మలు ఎగుమతి సమయంలో కొన్ని సార్లు అది మనలను ఇబ్బంది పెడుతుంది. మీ account blogspot , wordpress లేక మరేదైనా Windows Live Writer దిగుమతి చేసుకుని, చాలా సులభంగా, మీ బ్లాగులు, ఒకే చోటి నుంచి, ప్రచురించుకోవచ్చు. చిత్రాలకు సంభందించి కొద్దిపాటి editing సదుపాయం కూడా ఇందులో లభ్యం. Windows Live Writer ను దిగువ చిరునామా నుంచి దిగుమతి చేసుకోండి. ఉపయోగించటం చాలా సులువు.
http://get.live.com/writer/overview

బ్లాగ్ రేటింగ్ పెంచుకోవటం ఎలా?

సీనియర్ బ్లాగరులకు, బ్లాగు అభివృద్ధికి సూచనలు, ఇక్కడ చూడండి.
http://bloggingblunders.com/

ఈ సూచనలు పాటించాక, మీరు బ్లాగు రాయటం లో నిమగ్నమయినప్పుడు, ఎవరైనా ఫోన్ చేస్తే, ఈ వీడియోలో చూపిన విధంగా చేయండి. బ్లాగే జనా, సుఖినోభవంతు.


గురువారం, జులై 03, 2008

Firefox యోగ్యతా పత్రం

17 జూన్ 2008 న ప్రపంచవ్యాప్తంగా 8,002,530 మంది ఫైర్ ఫాక్స్ ను దిగుమతి చేసుకొని, కొత్త ప్రపంచ సంఘటనగా, గిన్నీస్ పుస్తకంలో (24 గంటలలో అత్యధికంగా దిగుమతి కాబడిన మృదులాంత్రము) నమోదు చేశారు. నేను కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నా. ఇదిగో నా కిచ్చిన యోగ్యతా పత్రం చూడండి.
                                                                                                           
Read this document on Scribd: Firefox certificate


ఈ విజయాన్ని హైదరాబాదులో ఫైర్ఫాక్స్ మిత్రులు పండుగగా తలిచి, క్రిష్ణకాంత్ పార్క్ లో కలిసి అచ్చట్లూ ముచ్చట్లూ చెప్పుకున్నారు.

 OLYMPUS DIGITAL CAMERA







సాక్షి పత్రికలో ఈ అపూర్వ సంఘటన గురించి వార్త వచ్చింది.

firefoxsakshicoverage

 హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ నివేదిక  లో దీని గురించిన పూర్తి వివరాలు లభ్యమవుతాయి. మీరు కూడా Firefox అభిమానులయితే, http://groups.google.com/group/hyfox లో సభ్యులుగా చేరవచ్చు. ముత్యాలరావు గారు Firefox extensions డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. మీరు కూడా ఒక చెయ్యి వేద్దామనుకుంటే, స్వాగతం చెపుతాము.

Photos: cbrao

బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 1

మీ ఉత్తరాలు

బ్లాగ్వీక్షణం చదివి మీరు వెలిబుస్తున్న అభిప్రాయాలు ఉపయోగకరంగా ఉన్నై.మీ ఉత్తరాలకు సమాధానం రాయటానికీ కొన్ని సార్లు నేను చిన్నపాటి పరిశోధనలే చెయ్యవలసి వస్తుంది. ఇది కష్టమయినా, ఇష్టమైన పని కాబట్టి, కష్టమనిపించటంలా. ఉదాహరణకు అమెరికాలో భారతీయ తల్లి తండ్రులు వ్యాసం. ఉద్యోగం చేసే తల్లి తండ్రులకు ఎంతో ఉపయుక్త సమాచారముందిందులో.మీ ఉత్తరాలు నాకు కొత్త విషయాలు తెలుసుకోవటానికి దోహదపడినట్లే, నా వ్యాసాలు కూడా మీకు ఉపయోగపడితే, వాటి ఉద్దేశం నెరవేరినట్లే.

నా టపా బ్లాగ్వీక్షణంలో లేదెందుకు?

కొంతమంది మిత్రులు వారు రాసిన ఎంతో మంచి టపా గురించి బ్లాగ్వీక్షణంలో రాయలేదేమని అడగటమో/రాయటమో చెస్తున్నారు. కూడలి/జల్లెడలో వచ్చే వ్యాసాల సంఖ్య పెరిగింది. ఇన్ని వ్యాసాలలో మంచివి ఏవో గుర్తించాలంటే, అన్ని టపాలు చదవాలి. ఇది సాధ్యమయే పనేనా ఏ వ్యక్తి కైనా? పొద్దు పత్రికలో ‘మే’లిమి బ్లాగులు జాబులూ అనే శీర్షికతో, ప్రతి నెలా వచ్చే బ్లాగుల బాగోగులను సమీక్షుస్తున్నారు. చక్కగా వుంటున్నవీ సమీక్షలు. ఈ భోగట్టా తయారు చేసి,విశ్లేషణకై, ఆరుగురు కష్టపడుతున్నారు.Too many cooks spoil the broth అనే ఆంగ్ల సామెత తప్పని పొద్దు సంపాదక వర్గం ఋజువు చేసింది. వారికి అభినందనలు.బ్లాగ్వీక్షణం అలాకాక,భవదీయుడు ఒంటరిగా చేసే/రాసే విషయం. కొన్ని మంచి టపాలు తప్పిపోయే అవకాశాలు ఎక్కువ. మీరు రాసిన టపా, ఎంతో కష్టపడి రాసింది,నలుగురికీ ఉపయుక్తమైన టపా అని మీరు భావిస్తే,బ్లాగ్వీక్షణం లో దాని సమీక్షకై, ఆ టపా URL ఇస్తూ,ఒక ఉత్తరం రాయండి నాకు.

బ్లాగ్వీక్షణంలో టపాలు ఎలా ఎంపిక చేస్తారు? ?

కొందరు మిత్రులు ఏ basis పై బ్లాగ్వీక్షణం లో టపాలు ఎంపిక చేస్తారని అడిగారు. ఈ ఎంపిక చాలా రకాలుగా ఉంటుంది. బ్లాగరు మిత్రుల సమావేశాలలో ఎక్కువగా ప్రస్తావనకు వచ్చే బ్లాగులు, ఎక్కువ కామెంట్స్ వచ్చిన టపాలు, మిత్రులు సిఫారసు చేసినవి, కొత్తవైనా వినూత్నంగా వుండేవి. కొత్త బ్లాగులకు ప్రాచుర్యం కలిగించటం కూడా ఒక ఉద్దేశం గా ఉన్నది.

Wordpress లో చేంతాడంత url

పురాణ ప్రలాపం e-పుస్తకం url ను పత్రికల వారు తప్పుగా ప్రచురించటం అయ్యాక, వచ్చిన కొత్త ఆలోచన ఏమంటే, ఇంత చిన్న url ముద్రించటం కష్టమయితే,Wordpres లో తెలుగు బ్లాగుల url మూడు నాలుగు లైన్లని, తప్పు లేకుండా పత్రికలు ఎలా ముద్రించగలవు అని. మిత్రులకు ఇంత పెద్ద url పంపాలన్నా కష్టమే కదా. అదృష్టవశాత్తు వర్డ్‌ప్రెస్ లో ఒక సౌకర్యం ఉంది. మీరు రాసిన టపాను భద్ర పరచు/ప్రచురించే సమయంలో,Permalink లో change లేక మార్చు అనే option ఉన్నది. దీనిని ఉపయోగించి, మీ url చివరన వున్న తెలుగు పేరును, క్లుప్తమైన ఆంగ్ల పేరు తో భద్ర/ప్రచురిచతం చేస్తే, మీ url పొడగు చాలా క్లుప్తం గా ఉండగలదు. దీనిని వాడటం అందరికీ సులువు. బ్లాగ్వీక్షణం లో మీ బ్లాగు url ఇవ్వటం కూడా సులువై పోతుంది.

అనామక వ్యాసాలు

కొందరు బ్లాగు మిత్రులు, వ్యాసానికి పేరు లేకుండా ప్రచురిస్తున్నారు. వీటిని గుర్తించటం చాలా కష్టం. కొన్నాళ్ల తరువాత, ప్రచురించిన వారు కూడా ఏ టపాలో ఏముందో చెప్పలేరు. వ్యాసం లోని విషయాలకు సంబంధముండేట్లుగా, ఏదైన పేరు వ్యాసానికి ఉంచండి. ఇలా పేరులేని వ్యాసాలకు బ్లాగు సమీక్షలలో చోటు దొరకటం కష్టమని గుర్తించండి. అంత కష్టపడి వ్యాసం రాసి చిన్న పేరు వుంచటానికి బద్ధకించవద్దు. కొందరు ఒకే పేరు పలు టపాలకు పెడ్తున్నారు. ఇలాంటి సందర్భాలలో పేరు-1, పేరు -2 లాగా వ్యాసాలకు పేర్లు వుంచండి. లేకుంటే మీ వ్యాసాలు కవలలై, గుర్తించటం కష్టం.

నా బ్లాగుకు Hits రావాలంటే ఏమి చెయ్యాలి?

కొత్త బ్లాగరులు, తమ బ్లాగులకు హిట్స్ రావటం లేదనీ, ఏమి చెయ్యాలో సూచించమంటారు. మీరు తీరిక సమయంలో,ఇతర బ్లాగులు చదివి, వాటికి చక్కటి కామెంట్స్ రాయండి. ఈ కామెంట్స్ వలన, మీ బ్లాగుకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. కూడలి, తేనెగూడు, జల్లెడ లాంటి సైట్స్ లో మీ బ్లాగుపేరు register చెయ్యండి.ఎలా register చేయాలో తెలియక పోతే, తెలుగుబ్లాగు గుంపు కు ఒక ఉత్తరం రాయండి. మీ బ్లాగులో కామెంట్ రాసిన ప్రతి ఒక్కరికీ తగిన జవాబు లేక ధన్యవాదాలు తెలియచేయండి.

బ్లాగు: గృహాలంకరణ

మీ బ్లాగు template ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి. ఇది మీ ఇల్లు కదా. తాజాగా పలువురిని ఆకర్షించింది ముక్తలేఖ అనే బ్లాగు.ఈ బ్లాగు టెంప్లేట్ చాలా సింపుల్ గా ఉంటూనే ఆకర్షణీయంగా వుంది. బ్లాగర్.కాం లో ఇచ్చే టెంప్లేట్ కాక బయట టెంప్లేట్లు దొరుకుతాయి. గూగుల్ లో blogspot templates అని అన్వేషించండి.మీకు ఒక మంచి ఇల్లు దొరకగలదు.

మంచి బ్లాగరను ఎలా అవ్వటం?

ఏమి రాయాలి, ఎట్లా రాయాలి అనే విషయం పై TEN TIPS FOR WRITING A BLOG POST చూడండి.

మీకు ఇప్పటికే బ్లాగులు రాసిన అనుభవముంటే ఇది చూడండి.

7 + 1 Habits of a Highly Effective Blogger

(To be continued)