బుధవారం, మే 21, 2008

అనుభూతులు



Dr.నవీన, ఆంగ్ల కవితల పుస్తకం, Feelings, తాజాగా వెలువడింది. ఈమె పిల్లల మానసికశాస్త్ర నిపుణురాలుగా,అమెరికా లో పనిచేస్తున్నారు. ఇవి ఆమె teenager గా వున్న సమయంలో రాసుకున్న కవితలు. ఆ వయస్సులో అమ్మాయిలకు,తమ కలల రాకుమారుడి గురించిన ఆలొచనలు రావటం సహజం. ఒక సంఘటనకు స్పందించే గుణం కూడా ఎక్కువే. తమ తల్లి తండ్రులంత గొప్పవారు లేరని, తమ సోదరుడు ధీరోదాత్తుడని విశ్వసిస్తారు. ఈ కవితా సంపుటి లో నవీన యొక్క, భిన్నమైన ఆలోచనలు, ఆశలు, అనుభూతులు,అనురాగం, అనుతాపం,సంతోషం, దుఃఖం అన్నీ కనిపిస్తాయి.యవ్వనపు తొలి ఛాయలో ఉండే కుర్రకారందరికీ కలిగే సహజమైన ఆలొచనలే ఇవి. కొన్ని మిమ్ములను కదిలిస్తాయి.


ఈ పుస్తకం లోని Feelings అనే కవితకు, తెలుగు స్వేచ్ఛాను వాదం (అనువాదం: cbrao) చదవండి.

సంభ్రమంగా,నిశ్శబ్దంగా కూర్చున్నా;
నా ఎదురుగా ఉత్సాహ భరిత, ప్రశాంత సాగరం,
చల్లటి గాలులు శరీరాన్ని తాకుతుంటే,
సముద్రపు నీరు నా పాదాలను కడుగుతోంది
కోమలంగా, అతి సున్నితంగా

దాని బలం నాకు తెలుసు
వుంటుంది ఎట్లా, తెలియకుండా?
నిన్ననేగా నా ప్రియ నేస్తాన్ని కబళించింది
ఉప్పొంగే అలలు తమ కౌగిలిలో నన్ను సుతారంగా ఉంచుతుంటే
ఎంత లాలిత్యం,స్వఛ్ఛం అయినా, నాకు తెలుసు అవి నిర్దయలు


Maipadu Beach, Nellore Photo: cbrao

నీళ్లలోని రాళ్లను,ఒడ్డుపైని బండ రాళ్లను కఠినంగా
ఖణీల్మని కొట్టుతూ,వాటిని అరగదీస్తూ, గాయపడి, బాధతో
వెళ్తుంది వెనక్కు, ప్రశాంత సముద్రం

అయినా అంతుతెలియని అగాధపు లోతుల్లోంచి
వస్తుంది వెనక్కు, నీలాంబరాన్ని తన కౌగిలిలో బంధించాలని
గాల్లోకి ఎగురుతూ, ప్రతి సారీ కొత్త శక్తితో, ప్రళయ కావెరిలా
ఎగిసే అగ్ని జ్వాలలా,అలుపెరగని అల
మరల మరల వస్తుంది, రాతిని ఢీ కొట్టి, మూలుగుతూ,
గుబులుగా, వెనక్కు వెళ్లటానికి.

ఈ కవితా సంపుటి లో That Special Someone, Feelings, Lost and Lonely, Gone Forever, Oh Daddy (About Innaiah Narisetti) ,He was But a Tiny Tot (About brother Raju Narisetti),Contentment, For A Dear Friend వగైరా కవితలున్నాయి.


Painted Stork at Pulicat Lake, Sullurpet Photo: cbrao

పుస్తకం చక్కటి ఆర్ట్ కాగితంపై, సౌందర్యంగా, ముద్రించబడింది.మనోహరమైన page design తో బాటుగా, ప్రతి పేజీ లో Nature Photographs కళారాధకులకు, కనువిందు కావించి, మంచి అనుభూతి మిగల్చగలదు.

మే 21,Dr.నవీన పుట్టిన రోజు. ఈ Feelings పుస్తకం, ఆమెకు పుట్టిన రోజు కానుకగా ఇస్తున్నారు, ఆమె తల్లి తండ్రులు. నవీన 100 పుట్టిన రోజులు జరుపుకొని, పిల్లల మానసిక స్వస్థత కు ఎన్నో, సేవలందించాలని కోరుకుందాము.

కొస మెరుపు: ఈ పుస్తకం లోని ఛాయాచిత్రాలు భవదీయుడు, లదాఖ్,కూర్గ్, పులికాట్ సరస్సు,మామందూర్,శాంతినికేతన్ వగైరా ప్రదేశాలలో తీసినవి.

ఈ అందమైన పుస్తకాన్ని మీరూ చదివి, చూసి ఆనందించండి. కింద ఇచ్చిన లింక్ లోంచి ఉచితంగా download చేసుకోండి.

Feelings_poems
Feelings_poems.pdf
Hosted by eSnips

1 కామెంట్‌:

Bolloju Baba చెప్పారు...

కవిత హృద్యంగా ఉంది.
బొల్లోజు బాబా

కామెంట్‌ను పోస్ట్ చేయండి