సోమవారం, మే 26, 2008

అమెరికాలో భారతీయ తల్లి తండ్రులు


Mother & Child Location: Bocaraton, Miami, Florida.

"ఆ మధ్యన ఈ మాటలో అనుకూంటా ఒకతను ఒక మంచి కథ రాశాడు ... అమెరికా వచ్చి కూతురి పిల్లని బేబీ సిట్ చేసినందుకుగాను చెల్లింపుల కోసం ఒక తండ్రి , కూతురు-అల్లుళ్ళ మీద దావా వేస్తాడు." -కొత్తపాళి

ఈ వ్యాసం పూర్వా పరాలు చదవని వారు, ఇక్కడ చూడండి.

http://deeptidhaara.blogspot.com/2008/05/8.html

ఈ లింక్ లో మొదటి టపా పై వివరణ చూసి,కామెంట్స్ చదివి, మళ్లా ఇక్కడకు రాగలరు.

ఆసక్తికరమైన కథ. ఈ కథకు లింక్ తెలిసినవారు, పంపితే ఉపయోగకరంగా ఉండగలదు. భారతీయ తల్లితండ్రులు అమెరికా లో తమ పిల్లల వద్ద glorified ఆయాలుగాను, baby sitters గా, వంట చేసే వారుగా, పని వారిగా మారటం ఒక చేదు నిజం. అంతే కాదు, నాలుగు గోడలమధ్య బందీలు. అయితే అడవ చాకిరీ చేస్తుంది పిల్లల వద్ద కాబట్టి, మింగా లేకా కక్కా లేక ఉంటున్నారు.

పిల్లల్ని పెంచటం లో ఉద్యోగస్తురాళ్లైన తల్లుల, భిన్న అనుభవాలున్నాయి. మెము పిల్లల్ని కంటాము. మీరు (తల్లి తండ్రులు) భారత్ లో పిల్లల్ని పెంచండి అని కొందరంటారు.కాని అప్పటికి తల్లి తండ్రులకు ఆరోగ్య,వయస్సు పరిస్థితుల దృష్ట్యా పిల్లలని పెంచటం శక్తికి మించిన భారం అవుతుంది. అయినా కూతురు/కొడుకు పై ప్రేమతో మనవడిని తెచ్చుకుని, ఇండియా లో పెంచుతారు. మనవడిని మూడేళ్లు పెంచాక కోడలు ఒక శుభవార్త చెపుతుంది;తాను తల్లిని కాబోతున్నానని; క్రితం లానే ఈ పిల్ల/పిల్లవాడిని మీరే ఇండియా లో పెంచాలని. హతాశులైన తల్లితండ్రులు వారి వయస్సు/అనారోగ్య దృష్ట్యా - 'మా వల్లకాదు. మేము పెంచ లేమంటే'; ఉద్యోగస్తురాలైన కోడలికి abortion తప్ప వెరే గత్యంతరం లేక పోతుంది.

ఒక తండ్రి కథ: విడాకుల తో భార్య దూరమయ్యింది. పిల్లలను పెంచటం ఎలా? ఒక నానీని ఏర్పాటు చేసుకొన్నాడు. అలా రెండేళ్లు, మూడేళ్లు గడిచాయి. కాని ఎంతకాలం ఇలా? కాలమే దీనికి పరిష్కారం చెప్పింది. పిల్లల తండ్రి, నానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.పిల్లలకు తల్లి, అతనికి భార్య ఇద్దరూ దొరికారు, ఒకే దెబ్బకి. శుభం. కాని అన్ని కథలూ ఒకేలా ఉండవు.

ఇక నానీ ని పెట్టుకోవటం లో కూడా ప్రతి ఒక్కరికి వారి వారి అనుభవాలుంటాయి. ఒక ఉద్యోగస్తురాలైన తల్లి అనుభవం. ఆమె జీతం 60K. కాని ఇందులో పన్నులు సుమారుగా 33.33% దాకా ఉంటాయ్. పన్నులు పోను నెల జీతం $3333/- ఇది DIG (Double income group) కథ. అంటే భార్యా భర్తలిద్దరూ, ఉద్యోగస్తులైన స్థితి. పాప ను చూసుకోవటానికి ఒక గుజరాతీ నానీని పెట్టుకున్నారు.ఈ నాని కుటుంబ సబ్యులు కూడా అమెరికా లో స్థిరపడినవారే. నాని కొడుకు ఆమెను baby sitting కొరకు ఒప్పుకున్న ఇంటిలో, ఉదయం 9 గంటలకు వదిలి మరల సాయంత్రం 6 గంటలకు వచ్చి తీసుకువెళ్లేట్టు,ఏర్పాటు. నాని నెల జీతం $1400/- నాని ఇన్సురన్స్ వగైరాలు ఆమె కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఇక్కడ పాప తల్లి బాదరబందీ, చీకూ చింతా లేకుండా హాయిగా వుద్యోగం చెయ్యగలుగుతుంది.నాని happy. అంతా happy. కొన్ని ప్రాంతాలలో, ఎక్కువ కూడా charge చెయ్యవచ్చు. అయినా ఈ ఏర్పాటు పనిచేసే తల్లులకు అచరణీయమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం. ఇది చట్టపరంగా ఆమోదించబడినదా, కాదా అనే విచారణ ఇక్కడ చెయ్యటం లేదు. నాని సేవలను exploit చేస్తున్నట్లు అవుపించదు. గుజరాతీ కుటుంబ సభ్యులంతా, అమెరికాలో స్థిర పడ్డారు (Green card holders) కాబట్టి, వారు ఎక్కడైనా ఉద్యోగం చెయ్యవచ్చని,ఊహాగానం.

ఇహపోతే, ఉద్యోగస్తురాళ్లలో కొందరు, Citizenship, మరికొందరు Green Cards కలిగి వున్నారు. ఈ తల్లులు, వారి పిల్లల సంరక్షణకై, Au Pair services వాడుకోవచ్చు. ఈ ఆపైర్ లు, వివిధ దేశాలనుంచి, ప్రభుత్వ సాధికారిక అనుమతితో, J-1 Exchange Visitor visa పై అమెరికా వచ్చిన వారు. వీరిని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా, మన ఇంటిలో పిల్లల సంరక్షణకు వినియోగించుకోవచ్చు. వీరు వారానికి 45 గంటలు పని చేస్తూ,మన ఇంటిలోనే వుంటూ, మన పిల్లల బాగోగులు చూసుకొంటారు. వీరి వయస్సు 18 నుంచి 26 దాక వుంటుంది. ఆ పైర్ గా స్త్రీ పురుషులలో, ఎవరినైనా ఎంచుకునే సౌకర్యం మనకుంటుంది. వీరి పూర్వా పరాలు, పరీక్షింపబడినవి కనుక, మన పిల్లలను నిశ్చింతగా వారిపై వదిలి వెళ్లవచ్చు.వారు పిల్లలను స్కూల్ లో దిగవిడిచి, మరల స్కూల్ అయ్యాక పికప్ చేసుకుంటారు. పిల్లలకు కావలసిన ఆహారాన్ని, వారే ఇంట్లో వండి, పిల్లలకు తినిపిస్తారు. పిల్లల ఇతర అవసరాలూ చూస్తారు. వీరికి అయ్యే ఖర్చు, సుమారు $1400/-p.m.

కొంచెం ఖర్చుతో, ఎక్కువ శారీరక, మానసిక ప్రశాంతి, తల్లులకు దొరుకుతున్నపుడు, నాని, Au Pair ఖర్చులు, భరించ సాధ్యమైనవి (affordable) కావున, అతి ఆదాకు పోయి, తల్లులు రాత్రులు నిద్ర చెడగొట్టుకోవటం, పగలు ఉసూరుమంటూ కార్యాలయాలకు వెళ్లటం అవసరమా అని?

ఆలోచించండి.

మరిన్ని వివరాలకు చూడండి

http://www.aupairusa.org/

http://www.aupairusa.org/faqs/au-pair-usa.html

http://www.aupaircare.com/host-families/program-costs

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి