గురువారం, డిసెంబర్ 21, 2006

హైదరాబాదు తెలుగు బ్లాగరుల ప్రత్యేక సమావేశం

Muralidhar & Veeven
Muralidhar and Veeven

Dec 10 న తెలుగు బ్లాగరుల సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను సభ్యులకు వివరించటానికై Dec 17న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యులకు వివరించటం జరిగింది. తెలుగు బ్లాగరుల సంఘం ఎందుకు, ఎలా, ఎప్పుడు అనే ప్రశ్నలకు వివరణ ఇవ్వటం జరిగింది. హైదరబాదు లోని తెలుగు ప్రేమికుల కార్యక్రమాలు మీకు ఆసక్తికరంగా ఉండవచ్చని తోచి ఆ విశేషాలు మీ ముందు ఉంచుతున్నాను.
Text:cbrao Photos: cbrao

తెలుగు బ్లాగరుల* తరపున ఒక కరదీపికను , అత్యుత్తమ బ్లాగుటపాలను ప్రచురించాలని ఈ నెల పదవ తేదీన జరిగిన బ్లాగరుల సమావేశంలో నిర్ణయించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. రావుగారు ఆ పుస్తకాల ముద్రణ కయ్యే ఖర్చులు, పుస్తకపంపిణీలో ఎదురయ్యే సాధకబాధకాలు , తదితర విషయాలను వివరించడానికి తన ఇంట్లో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ హేతువాది , ప్రచురణారంగంలో 3 దశాబ్దాల అనుభవం ఉన్న మురళీధర్ ఈ వివరాలనందించడానికి ఈ సమావేశానికి వచ్చారు . ఈ సమావేశం నిన్న ఉదయాన్నే ఖరారు కావడం వల్ల ముందుగా తెలుపడానికి వీలు లేకపోయింది . అయినా సమాచారాన్ని అందుకున్న చదువరి , వీవెన్ , సుధాకర్, నేను కాస్త ముందూ వెనుకగా ఆ సమావేశానికి హాజరయ్యాం.

Sudhakr & Veeven
Sudhakar and Veeven

1. ఎలాంటి రంగులు, హంగులు లేకుండా 16 పేజీల కరదీపికను పిన్నింగ్ పద్ధతిలో 1000 కాపీలు ముద్రించడానికి 4500 అవుతుందని మురళీధర్ తెలిపారు. హైదరాబాదు తెలుగు బ్లాగరు*లైన చదువరి, చావా కిరణ్, త్రివిక్రమ్ , సుధాకర్ , సిబిరావు, కశ్యప్, శ్రీహర్ష, యు .వి .రమణ, వీవెన్ లు ఈ ఖర్చును భరిస్తారు.

దీన్ని వీలైనన్ని కాపీలు ముద్రించి ఉచితంగా పంపిణీ చెయ్యాలని ఆలోచన. ఈ పుస్తకాన్ని ఎవరైనా తమకు వీలైనన్ని కాపీలు ముద్రించి ఉచితంగా పంచదలచుకుంటే నిరభ్యంతరంగా పంచవచ్చని , దానికి ఎలాంటి ముందస్తు అనుమతీ అక్ఖర్లేదని పుస్తకంలో మనమాటగా పేర్కొంటాం . అలాగే ఆ పుస్తకం చూసినవారెవరికైనా మన కార్యకలాపాలు నచ్చి తెలుగుబ్లాగరులకు విరాళాల ద్వారాగానీ , ఇతరత్రాగానీ సహకారమందించదలిస్తే తమ వివరాలను తెలుపవలసిందని, బ్లాగరుల సంఘం ఏర్పాటయ్యాక మేమే సంప్రదించగలమని ఆ కరదీపికలో పేర్కొంటాం . ఈ వివరాలను మనలో ఒకరు తమ దగ్గర సేకరించి పెట్టుకోవాలి. వారి చిరునామా , ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ ఆ కరదీపికలో పేర్కొంటాం.

మొదటి ప్రయత్నంగా ఆ కరదీపికను డిసెంబరు 31-జనవరి 1 తేదీల్లో హైదరాబాదులో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో పంపిణీ చెయ్యదలిచాం . నిర్వాహకులు అనుమతిస్తే సభాప్రాంగణంలో ఒక బ్యానరును , ఒక కియోస్క్ లో ఒకటి -రెండు ల్యాప్ -టాప్ ల ద్వారా కంప్యూటరుకు తెలుగు నేర్పడం , ఇంటర్నెట్ లో తెలుగు వెలుగుల గురించి ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది . (తాజా సమాచారం: నిన్న (సోమవారం) సాయంత్రం నేను శాయి గారిని అడిగి కనుక్కున్నాను. పుస్తకాన్ని పంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బ్యానర్లు, కియోస్కులను మాత్రం అనుమతించరని తెలిపారు.)2. ఇక 120 పేజీల పుస్తకాన్ని ముద్రించడానికి కనీసం 25,000 ఖర్చవుతుందని మురళీధర్ తెలిపారు. మురళీధర్, వీవెన్, చదువరి వెళ్ళిపోయిన తర్వాత రావుగారు బ్లాగరుల సంఘం ఆవశ్యకతను గురించి చాలా విపులంగా మాట్లాడారు. దీనికి అందరూ సుముఖంగానే ఉన్నందున ఇక కార్యాచరణలోకి దిగడమే తరువాయి.

*బ్లాగరులంటే బ్లాగరులు మరియు వికీపీడియనులు అని అర్థం చేసుకోగలరు.

P.S. కంటెంటు:
కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎలా? ఈ వ్యాసాన్ని రమణ ఈ శనివారానికి పూర్తిచేస్తాడు.
వికీపీడియా గురించి చదువరి రాస్తారు.
బ్లాగుల గురించి: ఉన్న వ్యాసంలో అవసరమైన మార్పులు ఎవరైనా చేయవచ్చు.


Text: Trivikram

Trivikram, chaduvari
Trivikram and Chaduvari

date Dec 17, 2006 10:57 PM
subject నెట్లో తెలుగు -ఓ ఉచిత పుస్తకం
mailed-by gmail.com

sudhakar@gmail.com,
త్రివిక్రమ్ ,
cbraoin@gmail.com,
"Veeven (వీవెన్)" ,
kashyap.karthik@gmail.com,
harsha.pvss@gmail.com,
uvramana@gmail.com,
Kiran Kumar Chava

నెట్లో తెలుగు -ఓ ఉచిత పుస్తకం
డిసెంబరు 10 న జరిగిన బ్లాగరుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో నెట్లో తెలుగు గురించి ఓ చిన్న పుస్తకాన్ని ముద్రించి ఉచితంగా పంచాలనేది ఒకటి. (అత్యుత్తమ బ్లాగులు ఓ యాభయ్యో అరవయ్యో ఏరి ఓ పుస్తకంగా వేద్దామనుకున్నదీ ఇదీ వేరు వేరని గమనించగలరు) ఈ పని చేసేందుకు డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో త్యాగరాయ గానసభలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సభల రూపంలో మనకో చక్కటి అవకాశం వచ్చింది. వంగూరి ఫౌండేషను ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభల్లో మనమనుకున్న ఈ పుస్తకాన్ని ఉచితంగా పంచితే బాగుంటుందని తలచాం.

దీని గురించి చర్చించేందుకు డిసెంబరు 17 ఆదివారాన, సీబీరావు గారి పనుపున ఆయన, వీవెన్, సుధాకర్, త్రివిక్రమ్, నేనూ రావుగారి ఇంటి దగ్గర కలిసాం. ఈ సభల నాటికి పుస్తకాన్ని ముద్రించి, ఉచితంగా పంచాలని నిర్ణయించాం. పుస్తకం 1/8 డెమ్మీ సైజులో, ఓ పదీ పన్నేండు పేజీలుండేలా, ఆర్భాటాలేమీ లేకుండా చేద్దామని కూడా నిర్ణయించాం. మొత్తం వెయ్యి ప్రతులు వేద్దామని అనుకున్నాం. పుస్తకంలో మూడు ముఖ్యమైన భాగాలుంటాయి.

1. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?
2. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
3. బ్లాగు

అలాగే సభా నిర్వాహకులు ఒప్పుకుంటే సభా ప్రాంగణంలో లాపుటాపుల్తో ప్రదర్శన చెయ్యడం, బ్యానరు కట్టించడం వంటివి కూడా చేద్దామని అనుకున్నాం. పుస్తకం కోసం మనం ముఖ్యంగా చెయ్యవలసిన పనులు రెండున్నాయి:

1. పుస్తకానికి అవసరమైన కంటెంటును సమకూర్చడం. మనందరం పూనుకుని ఈ పని చెయ్యాలి. ఇప్పటికే కొంత విషయం http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81:%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF/%E0%B0%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8612 పేజీలో రాసి ఉంది. దీన్ని మెరుగుపరచి గానీ, పూర్తిగా ఎత్తి రాసి గానీ మనమీ కంటెంటును తయారు చెయ్యవచ్చు.
2. ఇక రెండోది - డబ్బు. పుస్తకం ప్రచురించడానికి సుమారు 4,500 లోపు కావచ్చని అంచనా వేసాం. మన తొమ్మిది మందిమీ ఈ బాధ్యతను భుజాన వేసుకుంటే సరిపోతుందని అనుకున్నాం. తలా ఐదొందలు వేసుకుంటే పనయిపోద్ది. డబ్బును ఈ వచ్చే శుక్రవారం లోపు రావు గారికి అందజేస్తే సరిపోతుంది. ఖర్చులకు పోగా డబ్బు మిగిలితే ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచించవచ్చు.

రావుగారి స్నేహితుడు - మురళీధర్ గారు కూడా అక్కడకు వచ్చారు. ఆయన హేతువాది, ముద్రణా రంగంలో ఉన్నారు. ముద్రణ విషయమై ఆయన సలహాలు ఇచ్చారు. తానే ముద్రించి ఇస్తానని కూడా చెప్పారు.

మీమీ అభిప్రాయాలతో ఈ మెయిలుకు జవాబు - అందరికీ (Group) -పంపండి.

ఉంటాను.
Text: Chaduvari

Manav & Veeven
Manav , web architect from Ann Arbor(MI) and Veeven

7 వ్యాఖ్యలు:

spandana చెప్పారు...

అంత పనీ మీరే చేయడం ఎందుకు! మాకూ ఇవ్వండి అవకాశం. నా వంతుగా నేనూ Rs500 ఇవ్వడానికి సిద్దం.
ICICI/CITI అక్కౌంటు వివరాలు చెబితే పంపగలను.
--ప్రసాద్
http://blog.charasala.com

radhika చెప్పారు...

చాలా మంచి ఆలొచన.నాకు ఈ మహత్కార్యం లో పాలు పంచుకోవాలనేవుంది కానీ ఇప్పటికే పేద పిల్లల చదువుల కోసం ఇస్తున్నందువల్ల మా వారు నా వల్ల కాదని చేతులు ఎత్తేసారు.[ఆయన వుద్దేస్యం అవే డబ్బులు ఇంకో పేద పిల్లాడికి ఇవ్వచ్చునని]ఇలాంటి సమయాల్లోనే అనిపిస్తూ వుంటుంది నేను సంపాదించగలిగితే బాగుండు నని.ఏమయితేనె అన్ని సక్రమం గా జరిగి ఆలోచనలు కార్యరూపం దాల్చాలని ఆశిస్తున్నాను.

raghu ram చెప్పారు...

శ్రీరస్తూ !! శుభమస్తూ !! అవిఘ్నమస్తూ !!

పారుపల్లి చెప్పారు...

అవును ఖర్చు భరించటానికి మాకూ ఇవ్వండి అవకాశం

ప్రసాదం చెప్పారు...

మంచి ఆలోచన. వచ్చే వారం హైదరాబాదుకు వస్తున్నాను. వీవెన్ గారు, నా తరపునా 500/- ఇస్తున్నాను. అన్నట్టు, మిమ్మల్ని కలవాలంటే ఎలా?

సత్యసాయి కొవ్వలి చెప్పారు...

ఇంతమంది ఔత్సాహికులు తెలుగును ముందుకు తీసుకెళ్ళడానికి నడుంకట్టడం చాలా గొప్పవిశేషం. నేను కూడా నా వంతు ఇవ్వగలను. ఇప్పటికి ఇలా కానిచ్చినా,బ్లాగర్ల సంఘం, దానికో ఆర్థిక ప్రతిపత్తి ఏర్పాటయితే తప్ప మనం పెద్దగా ఏమీ సాధించలేం. కేవలం ఏకొంతమందో పాటుపడితే బ్లాగ్రథం కదలదు.

Dr.isMail చెప్పారు...

నేను నా ఎం.డి. ఇంటర్వ్యూలలో మునిగి కాస్త ఆలస్యంగా
రాస్తున్నాను. మీ అందరినీ ఇలా కలుసుకోవడం ఎంతో ముదావహం! రావు గారికి ధన్యవాదాలు, ఇలా అందర్నీ మీ బ్లాగులో చూపుతున్నందుకు. ఈ మహత్కార్యానికి నేను ఉడతాభక్తిగా నా వంతు ఇవ్వగలను. కోశాధికారి ఎవరు? ఎలా పంపాలి?

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి