శుక్రవారం, డిసెంబర్ 29, 2006

తెలుగు పరిమళ వ్యాప్తిగత అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం -సాకారం దాల్చిందని తెలియ చెప్పటానికి సంతోషిస్తున్నాను. తెలుగు పరిమళ వ్యాప్తి కై, మొదట 1000 పుస్తకాలు వేద్దామనుకున్నపటికీ, ఎక్కువమందికి ఈ సమాచారం అందిచాలన్న ఉద్దేశ్యంతో, అంచనా వ్యయం పెరిగినా, 2000 కాపీలు ముద్రించాలని మలి నిర్ణయం తీసుకున్నాము. తెలుగు వారి సమావేశాల్లో ఉచితంగా పంచిపెట్టే ఈ పుస్తకాలలో ఈ అంశాలు ఉన్నాయి.

1. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
2. తెలుగు బ్లాగు
3. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?

ఈ పుస్తకం ఎలా వుందో చూడాలనే కుతూహలం మీలో ఉండటం సహజం. మీ కోసం ఈ పుస్తకం ఈ కింద ఇవ్వబడిన లింక్ లో లభ్యం అవుతుంది. ఈ అపరూప కానుకను అందుకోండి.

http://www.bitingsparrow.com/biosymphony/computerlo_telugu.pdf

ఈ పుస్తకం మీరు కూడా ముద్రించి మీ మీ పట్టణాల్లో జరిగే తెలుగు వారి సభలలో పంచి పెట్టి తెలుగు పరిమళ వ్యాప్తి చెయ్యండి. ఈ పుస్తకం పై మీ అభిప్రాయాలు రాయండి. వ్యాసాల అభివృద్ధి కి మీ సలహాలు తదుపరి ముద్రణలో స్వీకరించబడగలవు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి