గురువారం, డిసెంబర్ 28, 2006
పొద్దు - పొడిచింది
పొద్దు (http://poddu.net) - కొత్త ప్రయోగం బాగుంది. మొదటి సారి చక్కగా చదివిస్తుంది. జబ్బ పుష్టి ఉన్న సంపాదకీయాలు, వ్యాసాలు మనల్ని అలరిస్తాయి. రెండవసారి చదువుదామంటే ఇది ఎప్పుడు, ఎలా పొడుస్తోందో తెలియరాదు. Update అయిన అంశాలకు మన తెలుగు బ్లాగ్ గుంపులో సందేశం ఉండదు. ఏ అంశం ఎప్పుడు మారుతుందో తెలుసుకోవటానికి పరిశోధన చెయ్యాలి. ఏ వ్యాసం ఎవరు రాశారో (ఉదాహరణకు కబుర్లు) అని కూడా భవిష్యత్లో చరిత్రకారులు పరిశోధన చెయ్యటానికి మంచి అంశం అందించారు సంపాదకులు. ఆ వ్యాస రచయిత ఎవరు, ఆ పత్రిక సంపాదకులు ఎవరు అనే అంశం పై భవిష్యత్లో ఎవరైన పరిశోధించి డాక్టరేట్ సంపాదించే అవకాశం ఉంది. కవయిత్రి మొల్ల మా జిల్లా మనిషని నెల్లూరు వారంటుంటే కాదు మా జిల్లా అని కడప వారు వాదించుకునేలా ఈ పత్రిక యాజమాన్యం గురించి చక్కటి చర్చ రచ్చబండలో రా వొచ్చు. సూచనలు - పొద్దు -1, పొద్దు -2, పొద్దు -3 , పొద్దు -4 అంటూ ఇలా సంచికలుగా వస్తే పాఠకులు తాము ఏది చదివామో, చదవలేదో సులభంగా గుర్తు పెట్టుకుంటారు. సంచిక కూ సంచికకూ మధ్య ఎడమును పొద్దు సంపాదకులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త సంచిక వెలువడ్డాక తెలుగుబ్లాగ్ గుంపుకు సందేశం పంపాలి. రచనల చివర రచయిత పేరు ఇవ్వటం సత్సాంప్రదాయం. పొద్దు సంపాదకులు, యాజమాన్యం గురించి పత్రిక లో రాయాలి. గోప్యంగా ఉంచటంలో ఏ ప్రయోజనం ఉందో అంతుపట్టడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
పొద్దు కి RSS సౌలభ్యం ఉంది. మీరు దానిని ఉపయోగించవచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి