ఆదివారం, ఏప్రిల్ 15, 2007

e - తెలుగు సమావేశం April 2007


Left to right: Trivikram, Sudhakar, Chava Kiran, Venkata Ramana, Veeven and Srinivasa Raju. Click on photos to enlarge.

మండుటెండలు కూడా మన మిత్రుల ఉత్సాహాన్ని చల్లార్చలేక పొయాయి.ఈ నెల సమావేశం కృష్ణకాంత్ ఉద్యానవనములో 7 వ తారీకు సాయంత్రం జరిగింది. నేను,వీవెన్,త్రివిక్రం park వెళ్ళే దారిలో ఉండగానే వెంకట రమణ నుంచి ఫోన్ - మే మెక్కడున్నామని? రమణ, సుధాకర్, కిరణ్ చావా మేము park చేరేసరికి మా కోసం నిరీక్షిస్తూ కనిపించారు. రాలేనని చెప్పి, వచ్చిన కిరణ్ ను చూసి ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వివాహాయా బ్లాగు నాశాయా అని ఎవరన్నారో కాని అది తప్పని మన చావా కిరణ్ నిరూపించారు. ఎంత ఉల్లాసంగా బ్లాగులు రాస్తున్నారో గమనించారా!


Trivikram and Sudhakar

మిత్రులంతా చేరితే కబుర్లకు కొదవేముంటుంది? కోడ్ల (Codes) దగ్గరినుంచి jokes దాకా కాదేది కబుర్ల కనర్హం? కిరణ్ Dilbert Joke చెప్పారు. Dilbert దగ్గరికి వాళ్ళ boss వచ్చి అతను install చేసిన firewall బాగా పని చేస్తుందని, కంప్యూటర్ వేడెక్కిందని చెప్తాడు. సుధాకర్ Indian Express వాళ్ళు తనను telephone లో తెలుగు బ్లాగుల గురించి interview చేశారని ఆ వివరాలు చెప్పారు. చూడండి http://farm1.static.flickr.com/194/450383810_f16696df93_o.jpg

Veeven, Sudhakar and Chava Kiran looking at progress of various pending projects.

వీవెన్ Wordpress అనువాదం 52% అయ్యిందన్నారు. Skype అనువాదం త్వరలో అయిపోవచ్చు. Wictionary కి జ్యొతి గారు బాగా contribute చేశారని సభ్యులు చెప్పారు. నేను cartoonist అయ్యుంటే జ్యొతిగారిని సవ్య సాచిగా ఒక చేత్తొ బ్లాగు రాస్తూ ఇంకో చేత్తో వంటింట్లో గరిట తిప్పుతున్నట్లుగా బొమ్మ గీసే వాడినేమో! ఇట్లా అనటం స్త్రీవాదులులకు (Feminists) సహిస్తుందా! స్త్రీ వాదం అంటే ఏమిటి అన్న చర్చ మిత్రులలో వచ్చింది. సుధాకర్ మాట్లాడుతూ ఇందులో కూడా మితవాదులు, అతివాదులు వున్నారన్నారు. స్త్రీకి సమాన హక్కులు నుంచి స్త్రీలను దోపిడీ (exploitation) చెయ్యటాన్ని వ్యతిరేకించటం దాకా feminism ఉంది. స్త్రీవాదం లో నాకు తెలియని, అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. నాకు తెలిసినవి. స్త్రీలను పురుషులతో సమానంగా చూడటము. మూఢ నమ్మకాలనుంచి, క్రూరమైన మతాచారాలనుంచి రక్షణ కలిపించడం. స్త్రీ విద్యను ప్రోత్సహించటం. తనకు నచ్చిన విధంగా చదువుకునే స్వేచ్చ ఇవ్వటము. వివాహం విషయంలో స్త్రీని సంప్రదించి భాగస్వామిని ఎంపిక చెయ్యడము. నాకు అర్థం కానివి: స్త్రీలు మగవారికి ఆకర్షణ వస్తువులు కాదు అని కొందరు స్త్రీలు నిరశిస్తూ, కొన్ని సంవత్సరాల కిందట టాంక్ బండ్ పై నుంచి bra లను హుస్సేన్ సాగర్ లో విసిరి వేయటం. స్త్రీలు మగవారితో సమానమన్న వాదనతో మంగళ సూత్రాలు తీసివేయటం.


Glass house, Lal Bagh, Bangalore.

మిత్రులు నన్ను బెంగళూరు సమావేశ విశేషాలు చెప్పమని కోరారు. ఆ సమావేశానికై పక్షం రోజుల కిందటే ప్రకటన ఇచ్చినప్పటికీ సరైన స్పందన రాలేదు.నేను బెంగళూరులో ఉన్నప్పుడు వివినమూర్తి, పప్పు నాగరాజు గార్లు ఫోన్ లో courtesy calls చేశారు. ఇద్దరిదీ ఒకటే మాట.ఇంట్లో అతిధులున్నారని, సమావేశానికి హాజరు కాజాలమని. బెంగళూరు మిత్రులకు సరైన సారధి లేడు. Periodical గా కలుసుకునే అలవాటు లేదు. నేను హైదరాబాదు నుంచి వచ్చినా సమావేశానికి రావటానికి tune అయి లేరు. సలహ - మీరు ఒక group గా form అవ్వండి. ప్రతి నెల కలుస్తూ ఉండండి. మీరంతా మంచి స్నేహితులయి పోతారు. ఒకసారి ఆ స్నేహ మాధురి అలవాటయితే మరల వచ్చే నెల సమావేశం ఎప్పుడా అని ఎదురు చూస్తారు. మిగత ఊళ్ళలో లేక విదేశాలలో ఉన్న మిత్రులకు విన్నపం. మీరంతా నెలకు ఒక సారి కలుస్తూ ఉండండి. మీ సమావేశ విషయాలు మాకు తెలుపండి. పొద్దులో ప్రచురిస్తాము. Photos కూడా పంపండి. తెలుగు మిత్రుల స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించండి.


Left to right Sri Tirumalarao and C.B.Rao.

ఈ నెల సమావేశానికి ఒక విశిష్ట వ్యక్తి వచ్చారు. వారు ప్రొఫెసర్.జయధీర్ తిరుమలరావు Ph.D. వీరు A.P.Govt Oriental Manuscripts Library & Research Institute లో director గా పనిచేస్తున్నారు.ఇక్కడ ఎన్నో తాళపత్ర గ్రంధాలు, రాగిరేకులపై గల పుస్తకాలను digitalize చేస్తున్నారు. తాటాకులపై గల తిక్కన భారతం లోని భీష్మ పర్వం,పోతన భాగవతము, ఛత్రపతి శివాజి ఫర్మానా వగైరాలు వీరివద్ద ఉన్న కొన్ని ఆకర్షణీయ సంగ్రహాలు. ఇంకా అరబిక్, పారశీక భాషల్లో గల గ్రంధాలు కూడా ఉన్నాయి. ఈ digitization కు ఇరాన్ ప్రభుత్వము వారు సహాయమందిస్తున్నారు. రాగిరేకుల శాసనాలలో మచ్చుకు కొన్ని విశేషాలు. కొన్ని గ్రామాలలో రక రకాల మట్టి పాత్రలు చేయుటకు భిన్న వ్యక్తులకిచ్చిన అనుమతి పత్రాలు. అదిలాబాదు జిల్లాలో రంజన పాత్రలు తయారీకి ఒకరికి అనుమతి నిచ్చిన శాసనము. మట్టి, గుర్రపు లద్దెలతో ఈ పాత్రలు తయారు అవుతవి. ఎండకాలం లో ఇవి నీటిని చల్లగా వుంచుతాయి.1885 నుంచి తెలుగు పత్రికలను కూడా digitize చేసినట్లు అవి Press Academy, Nampally లో లభ్యమవుతాయని చెప్పారు. తిరుమలరావు గారు రచయిత. ఆంధ్రజ్యొతి వగైరా పత్రికలలో వారి వ్యాసాలు ప్రచురితమవుతుంటాయి. మార్క్సిస్టు సాహిత్యవిమర్శనా వ్యాసాలు రాసారు. కథలు, కవితలు కూడా రాస్తుంటారు. కవితా సంపుటి: దళిత గీతాలకు సంపాదకత్వం వహించారు.. చూడండి
http://www.openlibrary.org/details/dalitageetalu019169mbp
Download చేసుకోండి.
http://ia331306.us.archive.org/2/items/dalitageetalu019169mbp/
dalitageetalu019169mbp.pdf

గగుర్పొడిచే బూర వాయిద్య ధ్వని,ఉరుముల్లాంటి ఢంకా మోతలు,కాళ్ల గజ్జెల రవళి సొంతమైన పోలవరం డాం నిర్వాసితులైన లంబాడ, కోయ,కొండ రెడ్డి వగైరా ఆదివాసీల జీవన శైలి పై పరిశోధన చేశారు. తెలుగు జానపద కళారూపాలపై పరిశోధన చేస్తున్నారు.
చూడండి:
http://www.vepachedu.org/burrakatha.htm
అంధ్రజ్యొతి ఆదివారం 8-4-2007 తెలుగు జానపదం జిందాబాద్
http://www.hindu.com/2006/07/19/stories/2006071910870400.htm
జయధీర్ తిరుమలరావు గారి digitization పై అంధ్రజ్యొతి లో వచ్చిన వార్త చదవండి.

ప్రాచీన రాతప్రతుల కంప్యూటరీకరణ

(ఆన్‌లైన్‌ సిటీబ్యూరో)హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 : ఎనిమి ది శతాబ్దాల నాటి రాతప్రతులను కంప్యూటరీకరించే బృహత్తర కార్యక్ర మానికి రాష్ట్ర ప్రాచీన రాతప్రతుల గ్రంథాలయం శ్రీకారం చుట్టింది. దీనితో పాటు అరుదైన తాళపత్రాల ను, రాతప్రతులను సేకరించే కార్యక్ర మాన్ని కూడా చేపట్టింది. ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలో దాదాపు 1100 మందితో సర్వే చేపట్టి ఇప్పటివరకు వెలుగులోకి రాని రాత ప్రతులను సేకరించనున్నట్టు గ్రంథా లయం డైరెక్టర్‌ జయధీర్‌ తిరుమల రావు తెలిపారు. ప్రస్తుతం రెండున్నర లక్షల పేజీలను కంప్యూటరీకరిస్తు న్నామన్నారు. జాతీయ రాతప్రతుల సంశోధన సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాచీన రాతప్రతులను సేకరించే కా ర్యక్రమాన్ని 2003 ఫిబ్రవరిలో ప్రా రంభించిందన్నారు. తమ గ్రంథా లయంలో ప్రస్తుతం 16 భాషలకు సంబంధించిన 24వేల రాతప్రతులు ఉన్నాయని తెలిపారు.
రాతప్రతులంటే...
కనీసం 75 సంవత్సరాల చరిత్ర కలిగిన, చేతితో రాసిన ఏ పత్రాన్న యినా రాతప్రతిగా వ్యవహరిస్తారని చెప్పారు. వాటిలో సాహిత్య(పంచ తంత్రం), బొమ్మలతో కూడిన కళా త్మక(మొఘల్‌ లిఖిత ప్రతులు), కళా సంబంధ(నాట్యశాస్త్ర), వైజ్ఞానిక (ఆ యుర్వేదం), ధార్మిక (భగవద్గీత) సంబంధమైనవి ఉండవచ్చునన్నారు.
ఇలాంటి రాతప్రతులు ఎవరి దృష్టికి వచ్చినా తమ సర్వేయర్లకు తెలపాలని తిరుమలరావు కోరారు. రాతప్రతులను సమర్పించిన వ్యక్తు ల వివరాలను కూడా తాము కంప్యూట ర్లలో భద్రపరుస్తామని చెప్పారు.
Courtesy: ఆంధ్ర జ్యోతి

తిరుమల రావు గారు digitalization సందర్భంలో data చౌర్యం కాకుండా వుండాలంటే ఏమి చెయ్యాలనే విషయంలో మనల్ని సలహా అడిగారు. సుధాకర్ ఈ విషయం లో వారికి తగిన సూచనలిచ్చారు.

లేఖిని: వీవెన్ తెలుగు రాయటానికి దీన్ని వాడటం మానివేయటం తో, శ్రద్ధ సన్నగిల్లినట్లనిపిస్తోంది. Windows In script చక్కగా పని చేస్తుండం తో దీనిని discontinue చేస్తె ఎలావుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. అదనపు నిర్వహణ భారం ఇంకో కారణం అవ్వచ్చు. Inscript లో ఎలా type చెయ్యాలో, వత్తులు ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. ఎవరైన Inscript typing పై tutorial -help page రాయగలరా? నేను ఈ టపా లేఖిని పైనే రాస్తున్నాను. మీరు కూడా Inscript పై type అలవాటు చేసుకోండిక.

చదువరి సమావేశానికి రాలేక పోయారు. కాని మనల్ని మర్చి పోలేదు. త్రివిక్రం ద్వార e -తెలుగు bye-laws ప్రతులను కార్యవర్గ సభ్యుల సంతకానికై పంపారు. వచ్చిన వారంతా సంతకాలు చేశాము.
Download bye – laws here.
e-telugu doc 1
e-telugu doc 1.doc
Hosted by eSnips


e-telugu doc 2
e-telugu doc 2.doc
Hosted by eSnips


రాత్రి 8 గంటలు కావస్తుంది. దాదాపు 4 గంటలయ్యింది సమావేశం ప్రారంభమయి. అలాగే వదిలేస్తే ఇంకొన్ని గంటలు కబుర్లు చెప్పుకోవాలనే స్థితిలో ఉన్నారు మిత్రులు. మిగతా కబుర్లు మన Google group లో కొనసాగిద్దామని, అంతటి తో సమావేశం ముగించవసి వచ్చింది. సమావేశం ముగిసిందని భారమైన హృదయాలతో ఇంటికి బయలు దేరాము.

Photos: cbrao

5 వ్యాఖ్యలు:

Nune Srinivasa Rao చెప్పారు...

ఈ తెలుగు సోసైటీకి నా హృదయ పూర్వక అభినందనలు. మీరు కొనసాగించబోతున్న యజ్ఞానికి పూర్తిగా నా చేయూతనిస్తాను. నేను ప్రస్తుతం సి-డాక్ భారత ప్రగతి ద్వారం లో పనిచేస్తున్నాను. భారత ప్రభుత్వం భారతీయ భాషలలో వెబ్ పోర్టల్ అభివృధ్ధి చేస్తుంది. దయచేసి www.indg.in visit చేయండి

నూనె శ్రీనివాసరావు, హైదరాబాద్

oremuna చెప్పారు...

శ్రీనివాస రావు గారూ,

మీ సైటు బాగుంది,కానీ తెలుగు ఊనీకోడులో ఉంటే ఇంకా బాగుండేది.

మీరు కూడా ఈ సమావేశాలకు రావచ్చు

spandana చెప్పారు...

లేఖినిని ఆపేయడమా? ఎవరామాటన్నది?
ఎటువంటి సఫ్ట్‌వేరూ install చేయలేని ఫెడరల్ గవర్నమెంటులో పనిచేస్తున్న నాలాంటి వారి గతేం కాను. లేదా ఏదో చుట్టాలింటికో, తెలుగు రాని/కాని వారింటికో వెళితే అక్కడ ఏదైనా తెలుగులో రాయాలంటే ఎలా? లేదు స్థానికంగా ఓ లైబ్రరీకి వెళతాను అక్కడ inscriptలూ అవీ వుండవు అప్పుడూ నాకు తెలుగులో రాయాలనిపిస్తుంది. ఏంచేయాలి లేఖిని లేకపోతే!!!

వీవెన్ కు కష్టమయితే దాన్ని నిర్వహించడానికి నేను రెడీ.

--ప్రసాద్
http://blog.charasala.com

వీవెన్ చెప్పారు...

కొన్ని సార్లు మనం ఆకాశం అంచులదాకా వెళ్ళిపోయి ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు వచ్చిందే లేఖినిని మూసేసే ఆలోచనకూడా. జనాలను inscript కి మరల్చడానికి నేను ఆలోచిస్తున్న ఉపాయాల్లో ఇదొకటి. అంతేగానీ నిజంగా మూసేయాలని కాదు. అలా అనుకున్నవాటినన్నీ అనుకున్నట్టుగా అమలు చేసేస్తామా ఏమిటీ.

రావుగారూ... మీతో జాగ్రత్తగా ఉండాలి.

oremuna చెప్పారు...

ఆ చివరిదానితో నే ఒప్పుకుంటాను.

రావు గారితో జాగ్రత్తగా ఉండాలి అని నే ఇంతకు ముందు కూడా ఓ నాలుగైదు సార్లు అనుకున్నానని మనవి చేసుకుంటున్నాను

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి