మంగళవారం, నవంబర్ 20, 2007

సమీక్ష: క్రైస్తవం ఇంత అమానుషమా?


జులై 8, 2007 న ప్రెస్ క్లబ్ లో,పుస్తకాన్ని విడుదల చేసిన టి.వి.9 రవి ప్రకాష్ Photo:cbrao

శాం హారిస్ రాసిన 'A Letter to Christian Nation" అనే పుస్తకాన్ని ఇన్నయ్య గారు “క్రైస్తవం ఇంత అమానుషమా?” అనే పేరుతో తెలుగీకరించారు.


మతం మానవాళికి మత్తుమందన్నాడు కార్ల్ మార్క్స్. ఎవరికి వారు తమ మతం గొప్పదంటే తమ మతం గొప్పదంటూ యుద్ధాలు సృష్టిస్తున్నారు; మూఢనమ్మకాలకు తమ వంతు చేయూతనిస్తున్నారు.

ఈ భూమిపై జరిగే ప్రతి పనీ, దేవుని అనుజ్ఞతోనే జరుగుతుందని క్రిష్టియన్ల విశ్వాసం. 2004 సునామిలో కొన్ని వేల మంది పిల్లలు తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. తమిళ్‌నాడు లోని వెళ్లంకన్ని మేరి మాత చర్చ్ కు, క్రిస్ట్మస్ పర్వదినాన వెళ్లిన భక్తులు, ఆ మరుసటి దినం వుదయాన చర్చ్ పక్కనే గల బీచ్ లో వాహ్యాళి కెళ్లిన సందర్భంలో, సునామి వాత పడి సుమారు 2000 మంది చనిపోయారు;120 వ్యాపార అంగళ్లు కొట్టుకు పోయాయి. చర్చ్ కు ఏమి కాలేదు. ఆసియ ఖండంలో సునామి దెబ్బకు ఎంతో మంది అనాధలయ్యారు. దేవుడే వుంటే ఇలాంటి అరాజకపు పని జరగనిస్తాడా?

ఏసు దయామయుడని క్రిస్టియన్ల విశ్వాసం. బైబుల్ లో పరమత సహనం: దేవుని యందు విశ్వాసం లేని వారిని చిత్రహింస చెయ్యాలని (సెయింట్ ఆగస్టీన్), చంపెయ్యాలని(అక్వినాస్) చెప్పారు.బైబుల్ బానిసత్వాన్ని, జంతుబలిని ప్రోత్సహిస్తుంది.ఆఫ్రికా ఖండం ఎయిడ్స్ తో సతమతమౌతుంటే, సహారా ఎడారి ప్రాంతంలో కండోం లు వాడవద్దన్న క్రైస్తవుల ప్రచారంతో, ఎయిడ్స్ అక్కడ ఒక పెద్ద సామాజిక సమస్యై కూర్చుంది. క్రిస్టియానిటి గర్భస్రావాన్ని అనుమతించక పోవటం తో , పెళ్లి కాని తల్లులు, పెక్కు సమస్యలు, కొన్ని దేశాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది.బైబుల్ లో పరస్పర విరూద్ధాంశాలు చాల ఉన్నాయి. ఆ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

బైబుల్ దేవవాక్కయితే, ఇందు లో గణితానికి సంబంధించి తప్పులెలా వుంటాయి? బైబుల్ సర్వస్వం కాదు.వైజ్ఞానిక విషయాలను చెప్పటంలో విఫలమయ్యింది. ఉదాహరణకు విద్యుత్, జీవాణువు (DNA), విశ్వ పరిమాణం, విశ్వ వయస్సు ఇంకా కాన్సర్ చికిత్స గురించి బైబుల్ చెప్పలేదు. ఈ విశాల జగత్తులో బాల్య మరణాలు అధికం. బాప్టిజం పుచ్చుకోకుండా చనిపోతున్న ఈ బాలలంతా, శాశ్వతంగా నరకంలో వుండి పోతారని,సెయింట్ ఆగస్టీన్ బాష్యం చెప్పారు.క్రైస్తవంలో,అనంత విస్ఫోటనాన్ని (Big Bang theory) అంగీకరించక, అంతా దేవుడి తెలివైన నమూనా (Intelligent Design) అని నమ్మి, ఆ సిద్ధాంత ప్రచారానికై, అశాస్త్రీయ పాఠ్య పుస్తకాలను పిల్లలపై రుద్దుతున్నారు.

మత సంఘర్షణలు: కాథొలిక్స్కు, ప్రొటెస్టంట్లకు పడదు.సున్నీ, షియాలకు పడదు.శైవులకూ, వైష్ణవులకూ పడదు. వీరంతా ఒకే మతంలో వుంటూ, ఆ మతానికి పరస్పర విరుద్ధ భాష్యాలు చెపుతూ కలహించు కొంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా భిన్న మతస్తులు పరస్పరం యుద్ధాలు చేసుకొంటున్నారు.

1775 లో అమెరికా లో బానిసత్వాన్ని తొలగించాలని కొందరు వాదిస్తే, అలా వాదించే వారు తమ సమయాన్ని వృధా చేసుకొంటున్నారని తలిచారు. ఈ మతం వలన మానవాళికి ఒరిగిందేమిటి? పరస్పర యుద్ధాలు, మనిషిని అంధ విశ్వాసాల లోకి నెట్టి వేయటం తప్ప. విద్య,శాస్త్రీయ దృక్పధం,హేతువాదం పెంపొందిన నాడు , దేవుడనే ఇప్పటి ప్రజల విశ్వాసం చూసి, భవిష్య మానవుడు నవ్వుకుంటాడు.


మూల రచయిత శాం హారిస్ తో ఇన్నయ్య

సాంకేతికాంశాలు: అనువాదం సరళంగా చదివించేదిగా వుంది.ముఖచిత్ర గెటప్ బాగుంది.అక్షరాల ఫాంట్ బాగుంది కాని అక్కడక్కడా అచ్చుతప్పులు ఇబ్బంది పెడతాయి. పుస్తక ధర కేవలం Rs.30/- అన్ని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతుంది.

ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో చాలా వున్నాయి. మీ సౌలభ్యం కోసం ఈ పుస్తకాన్ని e-book గా ఇస్తున్నాము.

Christianity by Sam
Christianity by Sa...
Hosted by eSnips

16 వ్యాఖ్యలు:

rajendra devarapalli చెప్పారు...

మతం భారతీయ జీవన విధానం అని ఎన్ని మెట్ట వేదాంతాలు వల్లించినా వ్యాపారానికి,భక్తికీ వున్న అవినాభావసంబంధం విడనంత వరకూ మన దేశంలో గాని,ప్రపంచంలో గాని నాలుగు గంభీరమైన,మార్మికమయిన మాటలు, పలికే వారి భుక్తికి వచ్చిన నష్టమేమీ లేదు ఇప్పట్లో. మొన్నమొన్న ముగిసిన దీపావళికి అయిన ఖర్చు ఒక్క సారి రమారమి లెక్క కట్తి చూస్తే ఎవరికి వారికే అర్ధమవుతుంది.సుమారు వంద కోత్లు జనాభా వున్న మన దేశం లొ 80కోట్ల మంది హిందువులనుకుంటే,ఇంటికి నలుగురు లెక్క కట్టి,ప్రతి ఇంటికీ సగటున వెయ్యి రూపాయలు వదిలాయి అని ఒక్కసారి లెక్కవేసి చూడండి. దీపావళికి ఒక్క పండగకే దేశప్రజల ఖర్చు అన్ని వేలకోట్లైతే సంవత్సరానికి ఎన్ని పండగలు,ఎంత ద్రవ్య చలామణి,పండగలంటే అరచేత్తో వళ్ళుకోసుకుంటరానే వాళ్ళం కాబట్టే ఎక్కడెక్కడి దేశాల వారూ మన పండగలనూ,సంప్రదాయాలను స్పాన్సర్ చేసేందుకు సిద్ధమయ్యారు.రేపు రానున్న క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెట్టిస్తుందో ఎవరి అంచనాలకూ అందదు.
రాబర్త్ జి. ఇంగర్సాల్ నుంచి బెట్రాండ్ రస్సెల్ తో సహా ఎందరో క్రైస్తవంలో మానవాంశ ను పరిచయం చేయమని ఉద్యమస్థ్హాయిలో ప్రయత్నించారు.ఈరోజు క్రిస్టొఫర్ హిచ్చెన్సు లాంటి వాళ్ళు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. కానీ ఇప్పటికీ అమెరికా,యూరప్ లాంటి చోట్ల నేను నాస్తికుడ్ని అని చెప్పుకొనే వాతావరణం లేదు. శాం హ్యారిస్ కూ,ఇన్నయ్యకూ నా అభినందనలు.

రవి వైజాసత్య చెప్పారు...

ఈ పుస్తకము యొక్క ఉద్దేశము, అవసరము బొత్తిగా అర్ధం కాలేదు. మతం, దేవుడు వితండవాదమన్నప్పుడు వితండవాదంపై వితండవాద పుస్తకమెందుకు? దేవున్ని నమ్మేవాళ్ళు దేవుని గురించి రచనలు చేశారు కానీ నాస్తికులను వ్యతిరేకిస్తూ రచనలు చెయ్యటం చాలా అరుదు. చాలా మటుకు మతాల సందేశాలు time and place specific. వాటినే ఆ పరిస్తితులలోనే అర్థం చేసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం రక్తసిక్త ప్రపంచములో యేసు ఇచ్చిన sermon on the mount ఒక విప్లవాత్మక శాంతి సందేశం. అది దేవునిదని చెప్పుకున్నా, యేసు అనే వ్యక్తిది అని చెప్పుకున్నా దాని ప్రాముఖ్యత తరగనిదని నా నమ్మకం. బైబిలు క్యానర్ చికిత్స గురించి, రాకెట్ ఇంధనం గురించి చెబుతానని ఎక్కడా వక్కానించుకోలేదు.
నమ్మకపోతే నమ్మకపోదురు కానీ ఇలా తెలివైన పుస్తకాలతో మేధావులు ఎందుకు శ్రమ వృధా చేసుకుంటారో అర్ధం కాని విషయం. వెనకట ఒక మేధావి నేను గ్రావిటీని నమ్మనుగాక నమ్మను అని పదంతస్తుల మేడనుండి దూకాడంట. గ్రావిటీకి నమ్మకంతో పనిలేదని అర్ధం అయ్యేసరికి పాపం లేటైపోయింది).
మతం ఒక పెద్ద సానికొంప అని నా అభిప్రాయం. (అందులో మార్పేమీ లేదు)

యువరాజు చెప్పారు...

కొందరు క్రైస్తవులమని చెప్పుకుంటూ అమానుష కార్యాలు చేస్తున్నారు. అయితే క్రీస్తు ప్రేమాస్వరూపి అనీ తనను సిలువ వేసిన వారిని సైతం క్షమించగలిగిన దేవుడు అనీ గుర్తించాలి.

Suresh Muragalla చెప్పారు...

eeroju oka kotha vishyam telusukunnanu.. Thanks for the nice blog

Ranjeeth చెప్పారు...

Dear Rajendra,

"మతం భారతీయ జీవన విధానం అని ఎన్ని మెట్ట వేదాంతాలు వల్లించినా వ్యాపారానికి,భక్తికీ వున్న అవినాభావసంబంధం విడనంత వరకూ మన దేశంలో గాని,ప్రపంచంలో గాని నాలుగు గంభీరమైన,మార్మికమయిన మాటలు, పలికే వారి భుక్తికి వచ్చిన నష్టమేమీ లేదు ఇప్పట్లో"

మతం భారతీయ జీవన విధానం అని ఎక్కడ చదివారు మీరు? మీ పెద్దలు మీకు చెప్పిన కథల్లొ ఎక్కడన్నా ఈ ప్రస్తావన వచ్చిందా?

అజ్ఞాత చెప్పారు...

ఈ పుస్తక సమీక్షను ఇచ్చిన cbrao గారికి దన్యవాదాలు.

Please read the following book also.

"Christ Conspiracy: The Greatest Story Ever Sold"

http://truthbeknown.com/

Also read about inquisitions in Goa and Europe.

ravi maata చెప్పారు...

christianism is not cruel,but christians are cruel,

Marthanda చెప్పారు...

ఏసు క్రీస్తు పుట్టాడనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. హీబ్రూ భాషలో "యెహెసువా" అంటే "దేవుడు రక్షించును" అని అర్థం. పూర్వం ఇజ్రాయెల్, పలస్తీనా ప్రాంతాలలో "యెహెసువా" అని పేరున్న వ్యక్తులు చాలా మంది ఉండే వాళ్ళు. "యెహెసువా" అనే పేరు ని గ్రీక్ భాషలో "iesus" అని, అరబ్ భాషలో ఈసా అని, ఇంగ్లిష్ భాషలో "jesus" అని ట్రాన్స్లిటరేట్ చెయ్యడం జరిగింది. పూర్వం యెహెసువా బెన్ పండిరా (పండిరా కుమారుడైన ఏసు) అనే మత ప్రచారకున్ని యూదులు ఉరితీశారు. యెహెసువా బెన్ పండిరా (పండిరా కుమారుడైన యెహెసువా), యెహెసువా బెన్ మిర్యం (మరియ కుమారుడైన ఏసు) ఇద్దరూ ఒకరేనని నిరూపించడానికి ప్రయతించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి వాళ్ళిదరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.

cbrao చెప్పారు...

@Marthanda: ఆసక్తి కరమైన సమాచారం ఇచ్చినందులకు ధన్యవాదాలు. మరియ గర్భాన జీసస్ బెత్లెహాంలో జన్మించటం జరిగిందని క్రిస్టియన్లు నమ్ముతారు. వివరాలకై చూడండి http://en.wikipedia.org/wiki/Jesus

Juda Lion Tribe చెప్పారు...

ఓ సహోదరుడా ఇప్పుడున్న హైందవ నిరక్షరాసుల దగ్గరుకు వెళ్ళి మరో నిరక్ష్య రాసుడు యేసుని నమ్ముకో అంటె నమ్ముతాడ! చదువురాని వాడు మరొకడికి చదువు చెప్పటం కుదురుతుందా! మూడుకోట్ల దేవతులున్న ఈ భారతదేశమును వదిలి ఎవరైనా యేసును నమ్ముతార? ఈ ప్రపంచములో ఎవరైనా ఏ దేశామెల్లిన వారి వారి సంస్క్రుతులును వదులుకుంటారా? వారి వారి మతాలను మార్చుకోండి అంటె మార్చుకుంటారా? మీరు చెప్పినట్లు తూర్పు దేశపు జ్ఞానులు ఇండియా నుండి యేసు ప్రభువు దగ్గరుకు వెళ్ళారని పూజించారని భాగానే ఉంది ఐతే నేను అడుగుతున్నాను. 2000 సంవత్సరాల క్రితమే బస్సులు విమానాలు లేని ఆ రోజుల్లో ఇండియా నుండి ఇస్రాయెల్ దేశమునకు వెళ్ళి యేసును పూజించిన వారిని జ్ఞానులు అంటున్నారు. అదే పూజ ఇండియాలో 2000 సంవత్సరాల తరువాత చేస్తే దానిని మతమార్పిడి అని పరాయి మతమని, తెల్ల వాళ్ళ మతమని అనే వాళ్ళను ఏ మనాలో అర్ధం కావటములేదు! అంటె యేసు ప్రభువును తెలుసుకొని పూజించిన ఆనాటి మన పితరులు జ్ఞానులైతే అదే బాటలో నడుస్తున్న ఈనాటి మన సహోదురలును ఇంకేమనాలి మూర్ఖులు అని ఎవరైనా అనగలరా? మన జ్ఞానులు తమంతట తామే యేసును వెదకి కనుగొన్నట్లుగా ఈనాడు కూడ ఎవరికీ వారే స్వచ్చందముగా కనుగొని నమ్ముతారో తప్ప ఎవరో చెపితే నమ్మటానికి మనవాళ్ళు వెర్రివాళ్ళు కాదు. ఆ రోజుల్లో యేసు ప్రభువును యూదులు అనగా తన స్వంత జనము ఏవిదముగా యేసును హింసలకు గురిచేసి చంపినారో అదే విధముగా యేసు ప్రభువుని నమ్ముకుంటున్న మన సహోదరులుని హింస పెడుతున్నారు చంపుతున్నారు మనసొంత ప్రజలను! ఇదే నన్ను భాద పెడుతున్న విషయం భారతీయులు ప్రపంచములో ఉన్న వాళ్ళందరి కంటే జ్ఞానులు అని తెలియజేయటానికి నేను గర్వపడుతున్నాను. అలాంటి నా సహోదరులు ఎవరో చెపితే మతం మార్చుకొనే అధములు కాదు. కొండల్లో కోనల్లో ఉండే గిజనులను తమ తమ తలలను దేవతకు వదులు కోవటానికి ఇష్ట పడతారేమో గాని ఎవరో చెపితే యేసును నమ్ముతార?
ప్రంచంలో ఎక్కడైనా చిన్న గ్రామములో నైన దేవుడిని గురించి చిన్న ఆనవాలు లేకుండా ఉన్న దేశ మేదైనా ఉందా లేనే లేదు కదా! ప్రతి ఒక్కరికి ఏదో ఒక దైవమే తమకు ఆధారం అలాంటి నమ్మకాని ఎవరో వచ్చి చెబితే పోదు. ఇక పొతే యేసు ప్రభువుని నమ్ముకొని అలంకారంగా ఉంటె అసలు కుదరదు "పరిశుద్దతకు అప్పగించు కునే ఇరుకు మార్గం" ఎన్ని భాదలైన అనుభవించ వలిసినదే సమాజములో చిన్న చూపు రిజర్వేషన్లు ఉండవు పైగా సూటిపోటి మాటలు కొట్టిన తిట్టినా చంపినా మారు మాట్లాడకుండా భరించాలి. ఎవరు ఏమైనా అనవచ్చు క్రైస్తవుడు నోరు తెరవకూడదు, ఇటువంటి అగ్ని గుండములో కి రమ్మని ఆహ్వానిస్తే ఎవరైనా గెంతుకుంటూ వస్తారా? చివరిగా ఒక మాట ' మారాల్సింది మతం కాదు మనస్సు , మనస్సె మతము అయితే అందరికి మనస్సు ఉండదు మతమే ఉంటుంది'.

rameshudatha చెప్పారు...

bhagundi

shankar చెప్పారు...

ఎవరి ఉద్దేశాన్ని వాళ్ళు చెప్పుకోవడం లో తప్పులేదు కానీ తనను సృష్టించి తనకోసం రక్తం చిందించి తను ఇంకా తన తండ్రి ని తెలుకోకపోయిన ఇంకా జీవించి ఉన్నదంటే తను అదో ఒక రోజు తెలుసుకుని మార్పు చెందుతాడని మాత్రమే అది గ్రహిస్తే చాలు ఏ మతము క్యాన్సుర్ గురుంచి కానీ ఎయిడ్స్ గురుంచి కానీ చెప్పలేదు కానీ అవ్వి ఒస్తున్నయంటే అది మనము చేస్తున్న చేస్కున్న పాపమూ ల వల్లనే మాత్రమే డియర్ బ్రదర్స్ మీరు నమ్మక పోయిన సరే కానీ విమర్శించడం మాతరం ఒద్దు ప్లీజ్ ఓకే న

అజ్ఞాత చెప్పారు...

అనేక ప్రశ్నలు... మగవాళ్ళ దగ్గర X Y క్రోమోజోమ్స్, స్త్రీల దగ్గర కేవలం X మాత్రమే ఉన్నాయి ఏమిటి? బైబిల్ దీనికోసం ఏమి చెప్పింది? ఓహ్! చెప్ప లేదా? సో... బైబిల్ అబద్ధం, ఉత్త కల్పితం, సరే పోనీ ఇతర మత గ్రంధాలు ఏమైనా చెప్పాయా?.... లేదా? సో... అవి కూడా అబద్ధం. మరి బుద్ధుడు వీటి కోసం ఏమైనా చెప్పాడా? లేదా సో, బుద్దుడు చెప్పినవి కూడా అబద్ధం, మహా వీరుడు, గురునానక్, శిరిడి సాయి బాబా వీళ్ళు కూడా అబద్ధం మేనా? దేవుడు వుంటే సునామి ఎందుకు వస్తుంది? మదర్ థెరిసా కాలంలో కలరా వంటి వ్యాదులు వస్తే ఆమె ఎందరికో సేవ చేసి నయం అయేలా చూసింది, దేవుడు వుంటే కలరా ఎందుకు వస్తుంది? బైబిల్ లోను భగవద్గీతలోను రిలయన్స్ అంబాని 500 మొబైల్ ఫోన్ పరిచయం చేస్తాడని లేదు కదా? సో, అవి అబద్ధం!! కరెంటు పోగానే ఆగిపోయే ఇంటర్నెట్ మాత్రం నిజం, పెట్రోల్ అయిపోగానే కూలిపోయే విమానం నిజం, అసలు ఏది నిజం? సునామీలోనే మొదటి సారి ఈ భూమి మీద జనం మరణిచారు, అదివరకు ఎవరికీ మరణమే లేదు!!!! పోనీ ఇది నిజామా? నమ్మగలమా? చనిపోగానే ఈ DNA మనని బ్రతికించదేమి? శరీరం చావగానే కుళ్ళి పోతుంది ఎందుకు? ఈ సైంటిస్టులుకి చావు లేదు....? వారికి అన్నీ తెలుసు... బైబిల్ లో వీళ్ళ కోసం ప్రస్తావన లేదు కాబట్టి అది అబద్ధం!!! మరి ఏది నిజం? మనలో ఉన్న కుళ్ళు నిజం, మనలో వున్న పక్షపాతం నిజం, మనకి నచ్చని వాటిని తక్కువ చేసి మాట్లాడడం, వీలైతే వాటి విశ్వసనీయతను ప్రశ్నించడం, దానకి ఈ రోజు ఒక సిద్దాంతం చెప్పి, కొన్ని సంవత్సరాల తరువాత దానికి విరుద్దంగా మరో సిద్దాంతం చెప్పే ఈ సైంటిస్టులు జ్ఞ్యానం ఒక దన్ను, జీవం ఏమిటో ఎప్పటికి కనిపెడతారు వీళ్ళు? భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు అయింది అని చెప్తారు, కోట్ల సంవత్సరాలుగా జరిగిన సంగతులు అన్ని వీళ్ళు ఎప్పటికి కనిపెడతారు? ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు కావలి వీళ్ళకి? సరే పోనీ వీళ్ళు ఏవేవో కనిపెట్టేసారు అనుకుందాం, అసలు భూమి మీద ఉన్న సంగతులు, వాటి పుట్టు పూర్వోత్తరాలు అన్ని ఒక పుస్తకంలో వ్రాయడం సాధ్యం అవుతుందా? అప్పుడు ఆ పుస్తకం సైజు ఎంత ఉంటుంది? ఆ సైజు పుస్తకాన్ని మనం ఎలా చదివేయగలం, అరే, ఈ వాదన అంతా వితండంగా వుంది అనిపిస్తుంది కదా? ఎస్, వాదన ఎప్పుడూ ఇలాగే ఉంటుది, ఎవరి వాదన వాళ్ళు బల పరుచుకోవడానికి ఇలా ఎన్నిటినయినా చెప్పవచ్చు? అసలు తిరుపతి ఒక బౌద్ద ఆరామం అని, వెంకటేశ్వర స్వామీ విగ్రహం బౌద్ధులకు సంబందిచినది అని, అందుకే ఆ విగ్రహం ఇతర వాటితో పోల్చినప్పుడు చిత్రంగా అనిపిస్తుంది అని ఒక పరిశోధన ఇది కూడా మన సైంటిస్టులు (తెలుగులో పరిశోధకులు) కనిపెట్టిందే, అరే, అది వినేసి అందరు తిరుపతి వెళ్ళడం మానేస్తున్నారా? తిరుపతి వెళ్లి డబ్బులిచ్చీ మరి గుండు కొట్టిచుకుంటే, ఈ జుట్టులన్నిటిని ఎవరో ఒకరు కాంట్రాక్టుకు పాడుకుని వాటితో విగ్గులు, సవరాలు చేస్తారు, మరి దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఈ ప్రక్రియ వల్ల మనం సహజ వనర్లు ఎంతగా కోల్పోతున్నామో మనకు నిజంగా తెలిదా? నో నో... ఇది పూర్తిగా అసంబద్ధ వాదన, దేవుడు అనేక మందికి ఉపాది కల్పించడం కోసమే ముందుగానే ఈ గుండు కొట్టించడం అనే ఒక ఏర్పాటుని పెట్టాడు, దాని వల్ల పరోక్షంగా ఎంతమంది ఉపాది పొందుతున్నారు? దేవుడు గుండుతో కూడా మనిషికి మంచే చేస్తాడు!!
మనమే సమర్దిస్తాం, మనమే విమర్శిస్తాం, మనం చాలా తెలివిగా చాలా చెప్పేస్తాం. చివరికి ఏమి ఉండదు, టైం వేస్టు తప్ప.

Rowell చెప్పారు...

are you anti-christ? You know nothing about real christianity.

IBgold2009 చెప్పారు...

Ha ha.. "Love your neighbour as you love yourself" anedhi "AMAANUSHAM" gaa kanabaduthundha? Great!!!

Prapanchaaniki "agnaanula" vallagaanee "gnaanula" vallagaanee peddhagaa nashtam undadhu . Kaanee, ilaa 10% thelisi migathaavi theliyakundaa pitchi pitchi prashnalatho ilaanti vishayaala meedha peddhagaa avagaahana leynivaariki kottha kottha sandheyhaalu leypadam thappa meekeymaina prayojanam onagoorindhaa?? !!!

If you have guts, search for the real "TRUTH" my dear.. That too with no partiality!!!


You can save your life!!! Hope to see yopu one day..

Thank you!!!!

yedla sudhakar rao చెప్పారు...రాజ్యాంగం రాసుకున్నాం... గొప్పదని చెప్పుకుంటాం. నిజమే గొప్పదే. అందులో సమ న్యాయం, సమ పాలన, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, వాక్ స్వాతంత్ర్యం చాలా ఉంటాయి. సమాజంలో నిజంగా చూస్తే ఇవేవి కనిపించవు. అధికారం, డబ్బు ఉన్నవాడే రాజ్యాంగంలో ఉన్న హక్కులు మించి పొందగలుగుతారు. తప్పు ఎక్కడ జరుగుతోంది. రాజ్యాంగంలో లోపం ఉందా...? అమలు చేసే వ్యవస్థల్లో లోపాలా.??. అమలు చేయాల్సిన యంత్రాంగంలో ( సిబ్బంది) లోపాలా..??.. పాటించాల్సిన ప్రజల్లో లోపాలా..?. వేదికలు ఎక్కి...గొప్ప రాజ్యాంగం అని జబ్బలు చరుస్తాం. గొప్ప రాజ్యాంగం అయితే ఎందుకు అమలు కావడం లేదు. తప్పు రాజ్యాంగంలో లేదు. తప్పు బారత దేశంలో లేదు. మనలోనే..

అంతర్జాతీయ వేదికలపైకి ఎక్కి మాట్లాడమంటే పుస్తక రచయిత అయిన మీరు కూడా రాజ్యాంగ గురించి చాలా గొప్పగా చెబుతారు. సమాజంలో పరిశీలిస్తే... రాజ్యాంగంలో ఉన్నవి సామాన్యుడికి దక్కడం లేదు అని అర్థం అవుతుంది. రాజ్యాంగాన్ని నిందిస్తారా...

అలాగే యేసు క్రీస్తు ఎం చెప్పారు.... పాటించేవారు ఎలా పాటిస్తున్నారు. రెండు వేర్వేరు. అలా చూసే కన్నులు మీకు దేవుడు ఇవ్వాలని...మరో పుస్తకం పశ్చాతాపంతో రాస్తారని ఆశిస్తున్నా....

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి