శుక్రవారం, సెప్టెంబర్ 05, 2008

నువ్వు నాకు నచ్చావ్

 bench 

Click to enlarge

nuvvunaakunaccaav 

Source of Info & Pic: Internet

39 కామెంట్‌లు:

Kathi Mahesh Kumar చెప్పారు...

ప్రకాష్ రాజ్ తరహాలో ప్యారడీ అదిరింది. ఎవరు రాసారు?

Ramani Rao చెప్పారు...

superb
అదిరింది .
ఇంకొంచం ఆడ్ చేద్దామిక్కడ
ఇంకాస్త గట్టిగా :
దేవుడా:
బ్లాగడానికి, బ్లాగులిచ్చావు.
రాయడానికి వ్యాఖ్యలనిచ్చావు
నువ్వు నాకు నచ్చావు.

Unknown చెప్పారు...

ఇది నేను చాన్నాళ్ళ క్రితమే Forward Mailsలో చదివా. 'రమణి'గారు చెప్పింది చేరిస్తే, ఇది బహు చక్కగా మన బ్లాగ్లోకానికి సరిపోయేట్టుగా ఉంది.

Kottapali చెప్పారు...

హ హ హ
రమణి గారు, మీ పొడిగింత మరీ బాగు.

సుజాత వేల్పూరి చెప్పారు...

కొసమెరుపు కసుక్కున దిగింది!

నిషిగంధ చెప్పారు...

SUPER :))

Purnima చెప్పారు...

ఆడుకోడానికి టి.టి టేబుల్ ఇచ్చావు.. ఇది లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

రమణి గారు: అదిరింది!

Sujata M చెప్పారు...

Nice. It was actually a mail. Ramani gari addition bavundi.

Purnima... manchi TT Player.. andaroo vinandaho !!!!!

CB Rao garu - baavundi.

cbrao చెప్పారు...

పూర్ణిమ టపాలలో కనిపించే spin, TT ఆటలోంచే వచ్చిందా? What a blog serve? Wow!

Purnima చెప్పారు...

@Sujata:
అందరకీ చెప్పటం దేనికండీ? కొన్ని తెలియకపోతేనే బాగుంటాయి. వాటిని అలానే ఉండనిద్దాం.

అజ్ఞాత చెప్పారు...

బెంచ్ మీద ఉన్న సమయంలో పుస్తకాలు చదువుకునో, కొత్త టెక్నికల్ స్కిల్స్ పెంచుకునో సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవచ్చుగా? దేవుడిని "ఎందుకు బెంచ్ మీద ఉంచావని" ప్రశ్నించడం ఏంటి? బాగా లేదు.

మురళి

అజ్ఞాత చెప్పారు...

@మురళి గారు, :-D

అజ్ఞాత చెప్పారు...

@ మురళి గారు, :) :D

cbrao చెప్పారు...

@మురళి: బెంచ్ మీద ఉన్న బాధ, మానసిక స్థితి, దేవుడిని తలిచేలా, అలా అనిపించేలా చేస్తుంది. కష్టాలలో ఉన్నప్పుడే కదా, ఎక్కువమందికి దేవుడి అవసరం తెలిసొచ్చేది? అర్థం చేసుకోరూ!(స్వర్ణకమలం -భానుప్రియ స్టైల్ లో)
@సీ గాన పెసూనాంబ: ఎక్కడనుంచి వచ్చారు మీరు? బుడుగు పుస్తకం లోంచా? సిసలైన తెలుగు పేరు. మీ గురించి రాయండి.

Unknown చెప్పారు...

అంతే లేండి మా బాధ మీకు నవ్వులాటలాగే ఉంటుంది.

Bolloju Baba చెప్పారు...

bhalE bhalE baavumdi

bollojubaba

Ramani Rao చెప్పారు...

@ నా పొడిగింతని పొగిడిన బ్లాగు మిత్రులకి వందనాలు.

@సీ గాన పెసూనాంబగారు: ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దోరకదు. సి.బి రావు గారి లాంటి ప్రముఖ సమీక్షుల దృష్టిలో పడ్డారంటే ఇహ మీరు వెను తిరిగి చూసుకోనక్కర్లేదు. తొందరగా ఓ బ్లాగు క్రియేట్ చేసుకొని, ఏమి రాయలేకపోయినా పర్వాలేదు ఒక్క వేమన పద్యం రాసినా చాలు మీ బ్లాగు సమీక్ష దీప్తి ధార లో చోటు చేసుకొంటుంది , రావుగారు మీ వివరాలడిగారు అంటే మీరు నక్క తోక తొక్కి వచ్చారన్నమాటే. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. కొత్త బ్లాగర్లకి మంచి ప్రొత్సాహకులు శ్రీ సి.బి రావు గారు. (మేము మిస్స్ అయ్యాము అందుకే ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాము).

అజ్ఞాత చెప్పారు...

మీరు నేను రాసిన వ్యంగ్య టపాలో, జీవిత సత్యాలు వివరిస్తూ రాసిన వ్యాఖ్యకు ఇది నా ప్రతి వ్యాఖ్య. అర్థం చేసుకోరూ!

-మురళి

cbrao చెప్పారు...

@మురళి : అర్థం చేసుకున్నా. అందుకే నా స్పందన స్నేహపూర్వకంగా రాయటం జరిగింది.

cbrao చెప్పారు...

@రమణి: మీ పొడిగింత ఈ టపాకు కొత్త అందాన్ని తెచ్చింది. నా పై మీరు చూపే ఆత్మీయత, గౌరవానికి, నా ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

@ రమణి గారు,
ఇంత గొప్ప 'భలే మంచి చౌక బేరాలు' ఉన్నాయని తెలియలేదు, ఈ బ్లాగ్ లో కామెంట్ చేసేప్పుడు.:-) నేను కేవలం, ఒక విషయం మీద స్పందించి ఇక్కడ కామెంట్ రాసాను.దీనికి వస్తున్న response చూస్తుంటే, ఆశ్చర్యం తో కూడిన ఆనందం వల్ల, భయం గా ఉంది.

ప్రస్తుతానికే కాదు, భవిష్యత్తు లో కూడా, నాకు బ్లాగు, ప్రారంభించే సదుద్దేశం లేదు. ప్రముఖ సమీక్షకులు,వేమన పద్యం తప్ప బ్లాగ్ లో ఏమి రాయలేని, నా లాంటి వాళ్ళని ఉద్ధరించే కన్నా, నిజం గా ప్రతిభ ఉన్న వాళ్ళని ఆదరించటానికి, వారి అమూల్య సమయాన్ని వెచ్చించాలని మనం కోరుకోవటం, సముచితమేమో కదా రమణి గారు ?

ఏదేమైనా, మీరు నా మీద ఎంతో అభిమానం తో ఇచ్చిన సలహాలకి, నా గుండె చెరువై పోయింది...మీకు నా ధన్యవాదాలు.

@cbrao గారు,
నేను చక్కని సాహిత్యానికి అభిమానిని.ఇంతకు మించి చెప్పుకోటానికేమీ లేదు.మీరు Internet నుంచి ఎత్తుకొచ్చిన ఈ పేరడీ బాగుంది.అసలు రచయితకి, నా జేజేలు.

cbrao చెప్పారు...

@సీ గాన పెసూనాంబ : వ్యక్తులు ధరించే దుస్తులు, వాటి రంగులు బట్టి వారి గురించిన ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కాని అంతర్జాలం లో ఎదుటివారి దుస్తులు కనపడవు. పేరులో ఏమున్నది పెన్నిధి అని సామెత ఉంది. కాని బ్లాగ్లోకంలో కనిపించేది ఎదుటవారి పెరే కదా. ఈ పేరు బట్టి మీరు ఎన్ని జడలు వేసుకొంటారనే ఊహ పాఠకుడికి కలుగుతుంది. మీ పేరు, మీ వ్యాఖ్యలు మీరు మంచి బ్లాగరి కాగలవని చెప్తున్నాయి. నాతో మాట్లాడుతున్నట్లుగానే, ఈ టపా కి వ్యాఖ్యలు రాసే చందంలో ఒక టపా రాయండి. ఇంత చాలు, మీరు పెద్ద మధన పడి రాయనవసరం లేదు. ఇలా మాట్లాడినట్లుగా చెప్పే టపాలే భవిష్యత్లో పెద్ద హిట్ అవుతాయి. ప్రారంభించండి. శుభమస్తు.
@కత్తి మహేష్ కుమార్: ఇంటర్నెట్ లో తిరుగాడుతున్న ఉత్తరం ఇది. ఒక అజ్ఞాత రచయిత ఈ పారడీ రాసారు.

అజ్ఞాత చెప్పారు...

@cbrao గారు,
నాకు మీ తొలి పరిచయం,మీ వ్యాఖ్య వల్లే కలిగింది.రమణి గారు చెప్పారు,మీరొక ప్రముఖ సమీక్షకులు,మీతో పరిచయం,నక్క తోక తొక్కటం etc అని...మీ లాంటి ప్రముఖుల వాడులకి,నా లాంటి రెండు జెళ్ళ పెసునాంబలు,ఇలా చెప్పాల్సి రావటం...బాగా లేదు.అయినా,చెప్పాలని ఒకసారి committ అయ్యాను,కాబట్టి నా మాట నేనే వినను.అహ,అన్నానంటే అన్నాను అంటారు కాని,మీరొక చక్కని వ్యంగ్య భరిత హాస్య కథని,తార్కిక దృష్టితో విశ్లేషించి,శల్యుడి టైపు లో feeling ఇవ్వటమే(I mean,శల్య పరీక్ష చేయటం)...బాగా లేదు.పరమాన్నం లో pepsi కలిపి,బాగా లేదు అనటం ఎంత బాగుందో,మీ విశ్లేషణ అంత బాగుంది.

ఒక మంచి రచన మీద చూపించని ప్రోత్సాహం,ఇక్కడ కేవలం నేను ఒక అమ్మాయి ని కావటం వల్ల(లేక నా పేరు బట్టి,లేదా నా ఒకటో రెండో వ్యాఖ్యల వల్ల) వస్తుంది అంటే...అస్సలు బాగా లేదు.ఒక వేళ నాకు ప్రతిభ ఉందని మీరు అనేసుకున్నా,నాకు ఆవ గింజంత ఆసక్తి కూడా లేదు,ఈ ప్రపంచపు సాలెగూడు(www)లో చిక్కు పడేందుకు.మీ ప్రోత్సాహానికి ధన్యురాలిని.

సిరిసిరిమువ్వ చెప్పారు...

@సీ గాన పెసూనాంబ, మీరు పెసూన పురాణం రాసే సీ గాన పెసూనాంబ గారేనా?

అజ్ఞాత చెప్పారు...

@సిరిసిరిమువ్వగారు,నా పేరుతో ఎవరో 'పెసూన'పురాణం రాసేస్తున్నారు బాబోయ్!నేను కాదు,నేను కాదు!
నేను సమ సమాజం కోసం,గొప్ప లాయర్ని అవుదాం అని ప్రయత్నిస్తున్నా అంతే!మామూలుగా అయితే,బోల్డు ఫీజు తీసుకుని వాదించాలిట అనుకో,కాని న్యాయాన్ని రష్చించేయలనిపించేస్తే ఫ్రీగా కుడా వాదించేస్తా అన్నమాట(నాకు న్యాయం అనిపిస్తేనే సుమా!)ఇలా చేస్తా అని తెలిస్తే,బుడుగు బామ్మ ఖోప్పడేస్తుంది.అల్లరి పిల్లకానా,నీకెందుకే?అమ్మాయి అంటే అణకువగా ఉండాలి అంటుందా?అణకువ అంటే,నిజం తెలిసినా చెప్పకపోటం అన్నమాట.నేను పట్టించుకోను అనుకో!

cbrao చెప్పారు...

@సీ గాన పెసూనాంబ అల్లరే కాదు, అందంగా అబద్ధం చెపుతారు కూడా. మీ ఉత్తరానికి నా జవాబు పారదర్శి లో చూడండి.

అజ్ఞాత చెప్పారు...

@cbrao గారు, నేను అల్లరి చేస్తానంతే,నేను రాయని వాటిని నేనే రాసేసా అని అబద్ధం చెప్పేసుకునేంత చిన్న మనసు,చితక మనసు కాదు నాది ! ఐనా పోదురూ,మీ అంత అందంగా ఎవరైనా అబద్ధం చెప్పగలరా?బాగున్న దాన్ని,బాగా లేదనగలరు.కయ్యానికి కాలు దువ్వి,ఇది స్నేహమే సుమా అనగలరు.దీన్నే తిమ్మిని బమ్మి చేయటం అంటారుట.అంటే నాకు తెలుసు.

ఇదే నేను ఏదైనా నిజంగా బాగా చేస్తే,బుడుగు గాడు బాగా లేదు అన్నాడనుకోండి,(వాడికి ఒక్కో సారి కుళ్ళు లే).నిజంగా బాగుంటే,బాగులేదు అనటం తప్పు కదూ?అని నేను ఖోప్పడేస్తే,నిజమే తప్పు పెసూనాంబా,ఇంకెప్పుడు చేయనేం?అని గుంజీళ్ళు తీసి అంటాడు.మీరు ప్రముఖుల వాడు గారు కదా,అంటే పెద్ద వారు అని అర్థంట.మరి మీకు పెద్ద మనసు ఉండి,మీది చిన్న మనసు,చితక మనసు కాకపోతే,మీరు అంతకు ముందు రాసిన వ్యాఖ్యకి జవాబుగా,తప్పు ఒప్పేసుకోండి.అంతే !దీన్నే సంస్కారం అంటారుట.అంటే,తప్పు చేస్తే,అవును తప్పే,అని చెప్పగల పెద్ద మనసు ఉండటంట.అందరు తప్పులు చేస్తారుట,కాని కొందరు అస్సలు ఒప్ఫుకోరుట.ఏంటో మరి.
అసలు విషయం మాట్లాడకుండా,రాయని పురాణాలని రాసేసా అని పక్క దార్లు,నక్క దార్లు పట్టిస్తే ...నాకసలే బోల్డు ఖోపం వచేస్తుంది! ఆ!

అజ్ఞాత చెప్పారు...

@cbrao గారు,మీ పారదర్శిలో ఆర్టికల్ చదవలేదు నేను,నా previous వ్యాఖ్యకి ముందు,మన్నించాలి.ఎందుకంటే అన్ని blocks blocks గా కనిపించింది.ఇప్పుడే మా బుడుగు గాడి సాయంతో,చదివా!ఒట్టు,దేవుడి మీద,ఈ పురాణం నేను రాయలేదు.నాకు నిజ్జంగా ఏ బ్లాగ్ లేదు.నేనే రాసుంటే,మీరు అన్నట్టు రెండు జెళ్లు ఎగరేసి మరీ చెప్పేదాన్ని.ఇంత చక్కని బ్లాగ్ ఉంటే,ఎవరైనా ఎందుకు దాస్తారు చెప్పండి? లోకంలో ఎందఱో సీ గాన పెసునాంబలు ఉన్నారు.నేను వారిలో ఒక దాన్ని.ఆ పురాణం రాసిన పిల్ల బ్లాగ్ మీ వల్లే తెల్సింది.

అల్లరి పిల్లనే అని ఒప్పుకున్నా,ఎందుకంటే నేను అందంగా అబద్ధాలు చెప్పలేను కాబట్టి.కథని విమర్శించి,దానికో కొత్త రూపం తీసుకురావటం మంచిదే,కానీ ఏదొక విమర్శ కాదు.నేను చిన్న పిల్లని కాబట్టి,బయటికి వెళ్లి చదువుకోలేను గా,అందుకే ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది.నేను చెప్పింది,ఇంట్లో ఉంటే కూడా ఎంత తలనోప్పో ఈ సీరియల్స్ వల్ల అని.దీన్లో మనిద్దరి అభిప్రాయం ఒక్కటి ఏమి కాదు.

అయినా,ఈ కథ లో మురళి గారు, అందర్నీ టీవీ సీరియల్స్ చూడలేకపోతే,బయట తిరగమని చెప్పట్లేదు.పాఠక లోకం అంత దద్దమ్మలేమి కారు,ఒక వేళ అలా చేస్తే ఎవరైనా,వాళ్ళ పెళ్ళాలు ఊరుకోరు అని LKG పిల్లాడికి కూడా తెలుసు.కాబట్టి కథ పరమార్థం కేవలం, ఇలాంటి తల నొప్పి ప్రోగ్రామ్స్ మీద వ్యంగ్యం, చక్కని హాస్యం,అంతే.ఇది గమనించకుండా,మీరు విశ్లేషణ చేయటం...బాగా లేదు.

ఐనా సరే, నేను ఇలాగే విశ్లేసిస్తా అంటే, మీ 'నువ్వు నాకు నచావు' లో కాని,ఎందులోనైనా కాని,హాస్యానికి వ్యంగ్యం అనేది one of a beautiful expression.అసహజం గా ఉన్న సందర్భాలే హాస్యం పుట్టిస్తాయి.for eg,ఈ పెసునా పురాణంలో,"ఆనాటి పురాణాలే నేటి బ్లాగులని,నాచే ఈ సృష్టి ఆదియందు చెప్పబడియున్నది"...ఇలా ఒక పిల్ల చెప్పటం,అసహజంగా ఉంటుంది,ఈ లైన్ మీకు కాని,నాకు కాని,అందరికి నచ్చి నవ్వుకోటం అందువల్లే.మురళి గారి కథ లో కూడా,సుబ్బారావు టీవీ సీరియల్స్ కి భయపడి ఇంటికి వెళ్లకపోవటం అలంటి అసహజం మాత్రమే.ఇది సాటి పాఠకులు అందరికి అర్థమయ్యింది,మీలా శల్య పరీక్ష చేయాలనుకునే వారికి తప్ప.హాస్యాన్ని హాస్యంగా కాక, విశ్లేషించాలి అని ... పురాణాలు బ్లాగ్ అవ్వటం ఏంటి,మూరెడు లేని పిల్ల సృష్టి ఆది లో చెప్పటం ఏంటి,బాగా లేదు..అని విశ్లేషించాలి అంటారా...కానివ్వండి !!!

ఏదేమైనా,సిరి సిరి మువ్వ గారు,భలేగా గూగుల్ సెర్చ్ కొట్టి మంచి బ్లాగ్ ని పరిచయం చేసారు.సత్య ప్రామాణికం గా,అది నాది కాదు.కాబట్టి,అలా ఆ అమ్మాయిని అడక్కుండా,లింక్ ఇవ్వటం మానేయ్యండి.తనకి తెలిస్తే బాధ పడొచ్చు.మీరు భ్రమ పడుతున్నట్టు బుడుగు గాడు,నా పనేమీ పట్టలేడు.నేనే వాడి పని పట్టేస్తుంటా.వాడికి నేనంటే హడల్!కాబట్టి మీ పప్పులు,ఉప్పులు ఉడకవు!

నేను అల్లరి పిల్లని కాబట్టి భరిస్తున్నా అనకండి.నేను చెప్పిన దాన్లో పరమార్థం అర్థం ఐనా/కానట్టు అల్లరి చేసేస్తోంది మీరు!ఈ పెద్దాళ్ళు కూడా కనపడకుండా అల్లరి చేసేసి,మనల్ని చమించేసాం అంటారు!నాకు బోల్డు ఖోపం ఇలా చేస్తే!నేను అల్లరి చేసినా,కృష్ణుడి లా,ఒక purpose కోసమే చేస్తా!న్యాయం కోసం అయితే,ఎప్పుడు ముందే ఉంటా!ఏమనుకున్నారో,ఆ !

cbrao చెప్పారు...

అయితే సీ గాన పెసూనాంబ is not equal to సీ గాన పెసూనాంబ అంటారు. వో కౌన్ థీ? మీరెవరు?

అజ్ఞాత చెప్పారు...

@cbrao గారు, ఆమె ఎవరో నాకేం తెల్సు.నేను, తను ఒకటి కాదు.ఇంక పెసునంబ అనే పేరు ఎవరికున్న, అది నేనే అని...ప్రహ్లాదుడి లా,ఆ పేరు ఎవరికీ ఉన్న,నేనే అనుకుంటా అంటే నేనేం చేయలేను. పెసున పురాణం అంటే అలాంటి బుక్ ఉందేమో,బుడుగులా అనుకున్నా, మీ టపా చూసే దాక నాక్కూడా తెలిదు...ఆ పిల్ల నాకంటే అల్లరి దానిలా ఉంది,నాక్కూడా నచ్చింది! నేను కేవలం మీ విపరీత విశ్లేషణ మీద విస్లేశించతానికి, సీ గాన పెసునాంబ రూపం లో వచ్చిన కాళికా దేవి ని !!! ఈ ఇంకో సీ గాన పెసునాంబ ఎవరు, cbrao గారు ఎవరు, సిరి సిరి మువ్వ గారు ఎవరు, రమణి గారు ఎవరు, మురళి గారు ఎవరు అని తెలుసుకోవాలనే ఉత్సాహం నాకు లేదు.ఇలాంటి ఉత్సాహాలు మీకు,సిరి సిరి మువ్వ గారికి ఉంటే, that's your problem! మనం ఒక విశ్లేషణ మిద మాట్లాడుతున్నాం,ఎంత సేపు నక్క దార్లు పట్టించతమే తప్ప, మీకు నిజం ఒప్పుకునే ధైర్యం లేదని తెల్సిపోయింది.మీరు అర్జెంటు గా రాజకీయాల్లో ట్రై చేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది !అప్పుడు ఇంకా ప్రముఖుల వాడు గారు ఐపోతారు! అసలు ఆ కథ లో, సుబ్బారావు ఇంటికి వెల్లకపోటమే టీవీ సీరియల్స్ కి భయపడి అనేది అసహజం, అదే అందులో హాస్యం, ఆ పాయింట్ తీసేస్తే, కథ లో కామెడీ పోతుంది.ఇది అర్థం చేస్కోకుండా ఇంటికేల్లపోటం ఏంటి ? బాగా లేదు అంటూ భలే గ విస్లేశించేసి,హమ్మయ్య ఒక పని ఐపోయింది అనుకున్నారు.అసలు పని ఇప్పుడే స్టార్ట్ అయింది !

నేను ఈ బ్లాగ్ రాసిన అమ్మాయిని మాత్రం కాదు,చెప్పాను ఇది వరకే, నాకు ఏ బ్లాగ్స్ లేవు, నాకు ఇష్టమైన వాళ్ళందరి మీద ఒట్టు !!!కొత్త వాళ్ళని మీరు ప్రోత్సహించేస్తే, పరిగేట్టేసుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేస్తా అని కాదు ! నా విషయంలో,మీ ప్రోత్సాహం అని కాదు,నాకే ఆసక్తి లేదు ! నిజమైన టాలెంట్ కి లేని ప్రోత్సాహం,అమ్మాయిల మీద మీకున్న ప్రత్యేక వాత్సల్యం వల్ల ఇస్తున్నారు ,అందుకు ధన్యురాలిని అయితిని !!! ) విషయం లేకపోయినా, విశ్లేషణ మీ జీవిత ధ్యేయం కదా !

అలాగే, నాకు ఎక్కడైనా అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు, కాపాడటం నా ధ్యేయం ! ఇంతకు మించి, మీ ఇంటికొచ్చి, మీరు ఇచ్చే సుత్తి invitation( నేనెవరో ,మీరెవరో ముచట్లకి ) మీ డొక్కు tea, నాకేం అక్కర్లేదు!(గోదావరి లో కమలిని లా!!! )

మీరు నిజం గా చిన్న మనసు, చితకా మనసు లేని వాళ్ళు అయితే, ఈ పాటికి అవునమ్మా బంగారూ, మరీ over గా విస్లేసిన్చేసా. కథ లో point అర్థం చేస్కోకుండా అని ఒప్పుకునే వాళ్ళు !

మీకు నేనెవరో తెల్సుకోవలేనేసేంత ఉత్సాహం కలగజేసిన ,
your's sincerely, పెసూన.

cbrao చెప్పారు...

గోదావరి చిత్రం లో సీత లాంటి స్వాభిమానమున్న పెసునా - నీ ఉత్తరం ఆసాంతం ఆసక్తిగా చదివా. అందులోని sense of humour ని appreciate చెయ్యకుండా వుండలేకపోతున్నా. నేనే కాదు మన మిత్రులు రాధిక, రమణి, సుజాత, జ్యోతక్క, పూర్ణిమ, వరూధిని అంతా నీ సంభాషణలను ఆనందిస్తున్నారని నమ్ముతాను. అప్పుడే అయిపోయిందా అనిపించింది నీ ఉత్తరం. నీవన్నట్లుగా నీ పాయింట్ కొచ్చి ఒప్పేసుకుంటే నీ అందమైన, సున్నిత హాస్యంతో జాలువారే ఉత్తరాలు ఆగిపోతాయనే విచారం మదిలో లేక పోలేదు. కొత్త బ్లాగర్లను ప్రొత్సాహించటం మొదటి నుంచీ ఉన్న పాలసీ అది. రెండు జెళ్ల పెసూనా నీకేమో బ్లాగు లేదాయే. మేమంతా నీకు పిచ్చ అభిమానులయ్యము కదా. నీవు బ్లాగు మొదలెట్టేక నువ్వు చెప్పిందే నిజమని ఒప్పుకుంటానని నీ మీద ఒట్టేసి చెపుతున్నా. ఇద్దరు పెసునాల లో నిన్ను ఎలా గుర్తించటం? ఇప్పటికే ముగ్గురు సుజాతలతో తికమకపడుతున్నాము. దానికి తోడుగా ఇప్పుడు ఇద్దరు పెసునలు. దేవుడా నువ్వుంటే, ఈ సమస్యకు పరిష్కారం చెప్పు.

పెసున: ఈ ఉత్తరానికి బదులుగా నువ్విచ్చే జవాబుకి వెంటనే సమాధానమివ్వలేక పోవచ్చు. Detroit లో DTLC వారి సమావేశాలకై రేపు రాత్రి బయలుదేరి కేనడా వెళ్తున్నా. అటునుంచి డెట్రాయిట్ కు ప్రయాణం. మధ్యలో ఖాళీ దొరకబుచ్చుకుని, నీ ఉత్తరానికి బదులిస్తా. ఆలస్యానికి కోప్పడొద్దు. బుడుగు ద్వారా కొన్ని పుస్తకాలు పంపుతున్నా. చదివి ఆనందించు. టాటా, బిర్లా....అంబానీ...

అజ్ఞాత చెప్పారు...

@cbrao గారు,చచ్చేట్టు తిట్టుతుంటే,సున్నిత హాస్యమా? ఏంటో మీ లాంటి ప్రముఖుల వాడు గార్ల taste నాకు అర్థం కాదు!మీకు ఇలా తిట్టుతేనే హాస్యం అనిపిస్తుంది అంటే, మురళి గారికి చెప్దాం,మిమ్మల్ని తిట్టుతూ రాస్తే,అప్పుడు మాత్రమే మెచ్చుకుంటారు cbrao గారు అని! మీరు ఇచ్చే లంచాలకి నేనేం పడిపోను!!! నేను బ్లాగ్ start చేస్తేనే, మీరు నా పాయింట్ ఒప్పుకుంటా అంటే,గంగిరెద్దు లా తలూపేసి, బ్లాగ్ మొదేలేట్టే అంత చిన్న దాన్ని, చితక దాన్ని కాను! ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేపోతే లేదు! నాదేం పోయింది! ఒప్పుకోపోతే,మీది చిన్న మనసు,చితక మనసు అని ఈ పాటికి పాఠక లోకం తెల్సుకునేసింది గా !నా మిద ఒట్లు వేయకండి ! నాకు బోల్డు ఖోపం,ఎందుకనో ! నాకు బ్లాగ్ రాయాలనే ఉద్దేశం లేదు మొర్రో అంటే, స్వర్ణకమలం లో వెంకటేష్ లా ఫీలింగ్ ఐపోకండి! నేను భానుప్రియ టైపు కాదు! గోదావరి లో సీత టైపు !

మీరేం అనుకున్నా,నేనో నిజం తెల్సుకునేసా ! మీ మిత్రులందరూ అమ్మాయిలే !మీ ప్రోత్సాహం కూడా చాలా మటుకు అమ్మాయిలకే? ఏం? ఆనందం సినిమాలో ధర్మవరపు టైపు ఆ ? మీ లాంటి ప్రముఖుల వాడు గార్లు ఒకవేళ, నిజమే బంగారూ తప్పు చేసేసా,మరి మనం ఫ్రెండ్స్ అవుదాం, ఏం? అని తప్పు హుందాగా ఒప్పుకుని, అప్పుడు friendship అని ఉంటే ,పోన్లే అని చమించేసి, బుడుగు గాడు నేను కల్సి, మా జట్టులో చేర్చుకునే వాళ్ళం! ఇప్పుడు మీరు ఆ అవకాశం కోల్పోయారు! ఒక్క సారి,ఈ పెసూన కాదు అంది అంటే, కాదంతే ! సూర్యుడు పడమర లో ఉదయించినా, దానికి తిరుగు లేదు !

>>"దేవుడా నువ్వుంటే, ఈ సమస్యకు పరిష్కారం చెప్పు."--- గాల్లో దీపం పెట్టి, దేవుడా పరిష్కారం చెప్పు అనటం ఏంటి ? బాగా లేదు ! కష్టాల్లో కేవలం దేవుడ్ని తలచుకోవాలి, కష్టాలు మాత్రం మనమే పరిష్కరించుకోవాలి,అంతే కానీ ఆయన్ని పరిష్కారం అడగటం, ఏమి...బాగా లేదు !(మురళి గారి బ్లాగ్ లో మీ గొప్ప విశ్లేషణ లా ! )

లోకం లో ఇంకా బోల్డు అన్యాయాలు జరుగిపోతున్నాయిట! ఎక్కడ ధర్మం నశిస్తుందో, అక్కడ ఈ పెసూన అవతరించి , ధర్మాన్ని నిలబెడుతుంది కదా మరి ! మీతో మాట్లాడుతూ ఇప్పటికే బోల్డు సమయం ఐపోయింది !ఇంకా నేను ఉద్దరించాల్సిన పన్లు బోల్డు మిగిలిపోయాయి !మరి ఉంటానేం ! మీతో ఎప్పటికి స్నేహం చేయని --- పెసూన.

రాధిక చెప్పారు...

హేయ్ పసూనా మీ ఇద్దరి పేర్లేకాదు శైలి కూడా ఒకేలా వుంది.చిత్రంగా నీ బుడుగు కూడా ఆ ఇంకో పసూనకి ఫ్రెండే.ఒక్కసారి మీ బుడుగుని కనుక్కో వాడుగానీ నీపేరుతో బ్లాగు రాసేయట్లేదు కదా?

Ramani Rao చెప్పారు...

సీ గానపెసూనాంబ గారు: నేను చెప్పానా! నేనే ఇంకా రావు గారి గురించి తక్కువ అంచనా వేసాను. వారి మీద నాకింకా ఇంకా ఇంకేంతో అభిమానం పెరిగిపోయి వరదలై పారుతోంది ఇక్కడ. మిమ్మల్నో బ్లాగు సృష్టించుకొని ఓ వేమన పద్యం రాసేయండి చాలు దీప్తి ధార లో మీరు వెలిగిపోతారు అని తప్పుగా చెప్పాను క్షమించండి. మీరేమి రాయకపోయినా , "పారదర్శి" లో (ఇప్పుడే చదివాను) ఇట్టే పేరు ప్రఖ్యాతలు గావించేవిధంగా చేసిన గొప్ప మహిమ గల మనీషి శ్రీ సి.బి రావు గారు. "కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడ్తాడంటే ఇదేనేమో". ఏది ఏమైనా వ్యాఖ్య రాసే కాలానికే సమీక్ష ని అందుకొన్నారు. శుభాకాంక్షలు.

cbrao చెప్పారు...

@ సీ గాన పెసూనాంబ: ఎందుకో మరి, బుడుగు నీతో స్నేహం అంటూనే ఇంకో పెసున తోనూ స్నేహం చేస్తున్నాడు. రాధిక చెప్పినట్లుగా, నీ శైలీ పట్టేసి, ఆ రెండో పెసున పేరు రాసేస్తున్నాడు.నాలా ఎందుకు రాస్తున్నావని బుడుగును ఒకసారి గట్టిగా కడిగెయ్, సంగతేమిటో తెలియగలదు. మొన్న ఆంస్టర్‌డాం లో తిరుగుతుంటే, కొందరు అందమైన అమ్మాయిలు కనిపిస్తే, ఎందుకో నువ్వే గుర్తుకొచ్చావ్. వాళ్లకు pony tails ఉన్నాయి.పెసున రెండు పోనీ టైల్స్ లో ఎలా వుంటుందో అనుకున్నా. ఈ సారి బాపు కనిపిస్తే చెప్పాలి; సీ గాన పెసూనాంబ కు ఒక సారి పోనీ టైల్ వేసి బొమ్మగీయమని, కాలంతో బాటే సీ గాన పెసూనాంబ కూడా మారాలని.

నువ్వు నాతో ఎప్పటికి స్నేహం చేయనంటున్నావని ఇక్కడ లండన్(ఆంటారియో, కెనడా) లోని Maple చెట్టుకు చెపితే అవి కన్నెర్ర చేసి ఎర్రగా అయి నిన్ను భయపెటతానన్నాయి. అవును ఇక్కడ మాపిల్ ఆకులు నీ మీద కోపంతో ఎర్రగా అవుతున్నాయి. త్వరగా నాతో స్నేహం చేసెయ్ లేకపోతే అవి పసుపు వర్ణంలోకి మారి,ఖిన్న వదనంతో తెల్లమొహం వేసుకుని, ఆత్మత్యాగం చేస్తానంటున్నాయి.నాతో స్నేహం చేస్తావో, ఇక్కడి మాపిల్ చెట్లను ఇలా బాధతో నగ్నంగా చేస్తావో, నీ ఇష్టానికే వదిలిపెడ్తున్నా.

అజ్ఞాత చెప్పారు...

he he ... etee gola. pesuna mee age ayyundadu sir,paapam vadileyyandi.

cbrao చెప్పారు...

@కృష్ణ: స్నేహానికి కావలసినది వయస్సులో సమానతా? మానసిక పరిపక్వతా? సంజీవదేవ్ తనకంటే వయస్సులో పెద్దవారైన ప్రసిద్ధ చిత్రకారుడు అసిత్ కుమార్ హాల్దార్ (రవీంద్రనాథ్ ఠాగోర్ మనమడు) తో స్నేహం చెయ్యలేదా? హాల్దార్ తన పుస్తకం మానస్‌ముకుర్ ను సంజీవదేవ్ కు అంకితం చెయ్యలేదా? సీ గాన పెసునాంబ భవిష్యత్ లో ఏమి చిత్రాలు చెయ్యబోతున్నదో?

అజ్ఞాత చెప్పారు...

nenu sneham gurinchi matladaledu sir.vadileyyandi.

అజ్ఞాత చెప్పారు...

na uddesam,mee discussion tho chinna pillalani dadipistunnaru ani.tanani vadileyamani naa vinnapam.

tane bhayapadi mee nunchi paripoyindanukondi, adi vere vishayam.

కామెంట్‌ను పోస్ట్ చేయండి