గురువారం, ఏప్రిల్ 09, 2009
ఆకాశం ఎందుకు ఎర్రబడ్డది?
నిజానికి, ప్రస్తుత బ్లాగ్ లోకం లో నెలకొన్న పరిస్థితులలో, ఈ టపా రాయటం ఒక సాహసమనే చెప్పాల్సుంటుంది. గతం లో వారి గురించి రాసిన వారిపై సభ్యత మరచి టపాలు రాశారు, వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ నలుగురూ వారి లక్ష్యాలను సాధించగలిగారా? వారి లక్ష్యాలు. బ్లాగరులలో అనైక్యత. బ్లాగరుల మధ్య తంపులు పెట్టడం. బ్లాగులోకం లో భీభత్స వాతావరణం సృష్టించటం. బ్లాగులంటేనే విమనస్కత కలిగించటం. సభ్యత కలిగినవారు బ్లాగులోకంలో ఇమడలేక, జరుగుతున్నది చూడలేక కళ్లుమూసుకోవటం. ఎన్నో బ్లాగుల మూతకు వారు కారణభూతమయ్యారు. అవును వాళ్లు విజయం సాధించారు. అయితే ఈ విజయం శాశ్వతం కాదు. సత్యం, ధర్మం జయిస్తుంది. లేకుంటే చరిత్రగతిలో మనము మిగిలి ఉండేవాళ్లము కాదు.
ఇద్దరు బ్లాగర్ల మధ్య ఏర్పడిన అభిప్రాయభేదం బ్లాగులోకంలో ఇంతటి కల్లోలానికి కారణం కాగలదని ఎవరైన ఊహించారా? పాడి కడతామని ప్రగల్భాలు పలికినవారు, ప్రమాదావనం లోని విషయాలు, ఎవరు, ఆ నలుగురికీ ఉప్పందించారో, ఎందుకు బయటపెట్టడం లేదు? ఇంతకీ, ఆ నలుగురూ ఎందరు, అన్న నా సందేహానికి నవ్వినవారు, జాలి పడినవారు, ఈ ముష్కరుల ముసుగు తీయటానికి ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు? ఆకాశస్త్రం బ్లాగులో, నిజాల వెళ్లడికి, సాక్ష్యం పెట్టకుండా అడ్డుకున్నదెవరు? ఒక మహిళా బ్లాగరును ఆ నలుగురిలో ఒకరిగా ముద్ర వేయటం ఎంతవరకు సమంజసం?
ముసుగు తీయకపోయినా ఫరవాలేదు. ఈ అసభ్య రాతలు కట్టిపెట్టండి. పాఠకులు విసిగి పోయారు. నిజం ఎప్పటికైనా వెళ్లడవుతుంది . ఈ అసభ్య రాతలు కట్టిపెడితే, ఆ ముసుగునూ మరిచిపోదాం. ఎప్పటిలా అందరూ నిర్భయంగా, నిస్సిగ్గుగా చదువుకునేలా, బ్లాగ్ వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడటానికి, అందరం తలో ఒక చేయి వేద్దాము. అసభ్య రాతలతో కూడిన బ్లాగులు చూడలేక సిగ్గుతో ఎర్రబడిన ఆకాశాన్ని, మనోహర వినీలాకాశం చేద్దాము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
10 కామెంట్‌లు:
నిజంగానే మీరు సాహసమే చేసారు... ఇలాంటి సమయంలో ఈ టపా రాసి!
ఆకాశం హిందుకు యెర్రబడ్డది
నిన్న నేను అటు ఇటుగా ఇలాటి టపా రాసి బాగా తలంటించుకున్నా అన్నయ్యో జాగర్త .
ఆ నలుగురు ఎవరో తేల్చడానికి/కనిపెట్టడానికి ఈ ఆదివారం జరిగే (ఈ) తెలుగు బ్లాగురుల సమావేశంలో సభాముఖంగా ఒక ప్రత్యేక కమిటీ వేయించండి సార్. ప్లీజ్. అసలు ధూం ఎవరో సస్పెన్స్ గా వుంటే మిగతా ముగ్గురు ఎవరో తెలియక ఇంకా ఆరాటంగా వుంది. ధూం దొరికాక లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయిస్తే మంచిది - ఆడో, మగో లేక మరొకటో తేలిపోతుంది.
ఆలోచించాల్సిందే!
వావివరసలు లేని బూతు కథలు రాసే శరతా ఆ నలుగురు గురించి మాట్లాడేది?
ఇంకో చిన్న ప్రపోజల్ రావు గారూ. ఆ నిజనిర్ధారణ కమిటీకి మా మార్తాండ బావని అధ్యక్షులుగా నియమించమని కోరుతున్నాను. మా బావ అయితే నిజం త్వరగా తేల్చేస్తారు.
మరో విషయం. ఇప్పుడు పట్టుకోవాల్సింది నలుగురే కాదనుకుంటా - అయిదుగురు - క్రొత్తగా మూర్ఖ వచ్చారు కదా తెర పైకి.
వావివరసలు లేని బూతు కథలు వ్రాసే నువ్వు నీతులు గురించి మాట్లాడితే సారా వ్యాపారం చేసేవాళ్ళు సారా నిషేధ ఉద్యమ సభలలో మాట్లాడినట్టు ఉంటుంది.
ఎవరా నలుగురు? ఏరా నలుగురు?
ఎవరా నలుగురు, ఏరా నలుగురు నీవాళ్లా?
నీలో ఉన్నవాళ్లా?
నిన్ను చూసి నవ్వేవాళ్లా?
నవ్వలేక ఏడ్చేవాళ్లా?
నిను నవ్వుల పాలు చేసేవాళ్లా?
:-) :-)
mundu meeru ee postlu aapandi baabu alane comments raayadam manandi .....alaantune nenu raastunnanu antaara......chaala rojulanunchi choostunna eee sodi
కామెంట్‌ను పోస్ట్ చేయండి