మంగళవారం, జనవరి 25, 2011

వికీపీడియా దశాబ్ది వేడుక


Invitation designed by  -Veeven

 విజ్ఞానాన్ని పంచుతున్న  తెలుగువికీ ప్రారంభించి నేటికి 10 ఏళ్లయింది. ఎదైనా సమాచారనిమిత్తం మీరు గూగుల్ చేశారనుకోండి. మొదటి మూడు ఫలితాలలో  వికీపీడియా దాదాపుగా వచ్చితీరుతుంది. మన జీవితంలోకి ఈ విధంగా చొచ్చుకు వచ్చిన వికీ మన పై చెరగనిముద్ర వేస్తుంది. Hello world అంటూ ఎంతో సాదాసీదాగా ప్రారంభమయిన వికీ ప్రయాణాం నేడు వందలకొద్దీ భాషలు, లక్షల వ్యాసాలు దాటి కొత్త పుంతలు తొక్కుతుంది.  ఈ వికీపీడియాలో వున్న ఇన్ని వ్యాసాలు ఎవరు వ్రాశారో తెలుసా?  ఎవరో నిపుణులు, శాస్త్రజ్ఞులు  వ్రాసినవి  కావు. మీలాంటి, నా లాంటి పాఠకులు, జిజ్ఞాసువులు వ్రాసిన వ్యాసాలే వికీ కు పట్టుకొమ్మలు. అయితే వికీ కు వ్యాసాలు వ్రాసే వారిలో డాక్టర్లు, మేధావులు కూడా వున్నారు. కొందరు పాఠకులు తరుచూ మాకు వినిపించే సందేహం "నేను పండితుడిని కాను. ఒకవేళ నేను వ్యాసం లో ఏదైనా పొరబాటు వ్రాస్తే ఎట్లా?"  వికీ లో ఎవరైనా నిర్భయంగా వ్రాయవచ్చు. మీరు వ్రాసే వ్యాసాలు, సవరణలు అన్నీ మీ పై వారిచే సమీక్షింపబడి వారి ఆమోదం పొందుతాయి. ఎక్కడైనా పొరబాట్లు ఉంటే , వికీ లో మీ కంటే ఎక్కువ అనుభవం ఉన్న పెద్ద వారు వాటిని సవరిస్తారు. కావున వికీ లో మీరు నిస్సంకోచంగా వ్రాయవచ్చు.   

వికీకు 10 ఏళ్లు నిండిన సందర్భంలో హైదరాబాదులో వికీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో పాల్గొన్న వారికి వికీ తరఫున టీ-షర్ట్ , వికీ చిహ్నం కలిగిన స్టిక్కర్ ఇంకా చొక్కాకు తగిలించే లోహపు వికీ గుర్తింపు చిహ్నం కల బిళ్ల (Badge)   కూడా ఇచ్చారు. విరామ సమయంలో అల్పాహారం, తేనీరు ఇచ్చారు.

ఆహుతులకు శ్రీనివాసకుమార్ వికీపీడియాను పరిచయం చేస్తూ ఈ కార్యక్రమానికి సూత్రధారిగా వ్యవహరించారు.
అర్జునరావు  ఆహుతులకు స్వాగతం చెప్పారు. 


Left to right: Siva Babu, Jyothi Basu and Suneel Mohan. Behind them is Veeven. Click to expand photographs.
తరువాత, వికీపీడియా దశాబ్ది వేడుక  సందర్భంగా  Wiki-10-   కేక్ కోయటానికి వ్యక్తులను ఎంపిక చేయటానికై ఒక ప్రత్యేక పద్ధతి అవలంబించారు.  ఆహుతులకు చిన్న కాగితాలు పంచారు. ప్రతి కాగితం పై ఏదేని అక్షరం లేక సంఖ్య వుంటుంది. W, 1, 0  అని వ్రాసి ఉన్న కాగితాలు వచ్చిన  వారిని కేక్ కోయటానికి ఆహ్వానించారు.  ఈ మూడు చీట్లు కలిస్తే W 10 (Wikipedia -10) అవుతుంది.  కరతాళధ్వనుల మధ్య కేక్ ను  సునీల్ మోహన్, జ్యోతి బాసు మరియు శివబాబు  కోశారు.


 తదుపరి సాఫ్ట్వేర్లు కల ప్రత్యేక C.D. ను వీవెన్ ఆవిష్కరించారు.

తేనీరు విరామ సమయం తర్వాత, రహ్మానుద్దిన్ షేక్  వికీపీడియా  గురించి వివరించారు. వికీమీడియా లోని కేవలం వికీపీడియా మాత్రమే కాకుండా ఇందులోని మిగతా విభాగాల గురించి క్లుప్తంగా పరిచయం చేశారు.
అనుబంధ విభాగాలు  
Wiki Meta - Wikimedia coordination     Wikipedia - Encyclopedia     Wiktionary - Dictionary and thesaurus   Wikibooks - Textbooks and manuals      Wikisource - Library     Wikiquote - Quote compendium Wikispecies - Species directory      Wikinews - News source      Wikiversity - Learning materials

వికి నిఘంటువు, వికి పుస్తకాలు (కాపీరైట్ లేనివి)  వగైరా పైన ఉదహరించిన కార్యక్రమాలలో పాఠకులు పాల్గొనవచ్చును. వికీపిడియా గురించి చెప్తూ ఇందులో 48000 పై చిలుకు వ్యాసాలున్నాయని ప్రతి వారం వికీ మొదటి పేజీలో ఒక ప్రధాన వ్యాసం , బొమ్మ వుంటాయన్నారు. Creative commons లో చిత్రాలు ఉంచవచ్చని, అవి వికీ లోని అన్ని భాగాల వారు ఉపయోగిస్తారన్నారు. పుస్తకాల  కాపీరైట్  గురించిన చర్చ కాలాభావం వలన పూర్తిగా  జరుగలేదు. అయితే  కాపీరైట్ గురించిన సూచనలు వికీ లో ఉంటాయని, ఆహూతులు
వాటిని ఆచరించమని అర్జునరావు సెలవిచ్చారు.Wiki species లో   Taxonomy of all species ఉంటాయన్నారు.

వికీపీడియా దశాబ్ది వేడుక   సందర్భంగా ఈ రోజు విడుదల అయిన  ప్రత్యేక  CD లో ఈ కింది అంశాలున్నాయని రహ్మానుద్దిన్ షేక్   అన్నారు.   

ఫైర్ఫాక్స్ 4.0  బీటా
తెలుగు ఖతులు



వికీపీడియా దశాబ్ది వేడుక  సందర్భంగా వికీ ప్రారంభకులలో ఒకరైన జిమ్మీ వేల్స్ ప్రత్యేక సందేశం.  (ఈ సందేశం దృశ్య శ్రవణాన్ని ఆహుతులకు ప్రదర్శించారు.)
Libre Office
వికీ అభివృద్ధి గురించిన ప్రత్యేక వ్యాసాలు
వికీ ప్రత్యేక వ్యాసాలు
ధ్వనిననుచరించి తెలుగులో టైప్  చేయు సాఫ్ట్వేర్  వగైరాలు


Arjuna Rao C

బెంగలూరు నుంచి ఈ సమావేశానికి ప్రత్యేకంగా వచ్చిన అర్జునరావు  మాట్లాడుతూ కొంతమంది అనుకుంటుంటున్నట్లుగా  Wiki-Leaks కు  Wiki-Media కు ఎలాంటి బాంధవ్యం లేదన్నారు. వికీపీడియా దిన దిన ప్రవర్ధమానమవుతుందని  కొన్ని పట్టికల సహాయం తో గణంకాలు ఇస్తూ వివరించారు. తెలుగు వికీపీడియా కు సంబంధించి 2010 లో విశిష్ట సేవ చేసిన 10 మంది వికీ సంపాదకులగురించి చెప్పారు. వారి పేర్లు దిగువ ఇస్తున్నాను.
1) రవిచంద్ర
2) అర్జునరావు
3) సి.చంద్రకాంత రావు
4) టి.సుజాత
5) ఎన్ రహ్మతుల్లా
6) కాసుబాబు
7) రాజశేఖర్ 1961  
8 నుంచి 10 వరకు విశేష కృషిచేసిన వారి పేర్లు అందుబాట్లో లేనందువలన ఇవ్వలేకపోతున్నాను. వికీ లో వార్తలు విశేషాలతో కూడిన తెవికీ వార్తలు కొత్తగా వికీ లో ప్రచురిస్తున్నట్లు అర్జునరావు అన్నారు.తెలుగు బ్లాగు పాఠకుల సంఖ్య తెలుసుకొన వీలయినట్లే, వికీపీడియా లో కూడా ఏ వ్యాసం ఎంతమంది చదివారన్నారన్న గణంకాలు తెలుసుకొన వీలవుద్దన్నారు.  ఇది ఎలా సాధ్యమవుతుందో తెలిసిన వారు వ్యాఖలలో వివరించి  ఈ వ్యాస ఉపయోగకత పెంచ కోరుతాను.

అర్జునరావు గారి ఉపన్యాసం తరువాత ఆహుతుల పరిచయ కార్యక్రమాలు జరిగాయి. స్వేచ్ఛ  -ఉచిత
సాఫ్ట్వేర్ గురించి దాని బృంద సభ్యుడైన శశిభూషణ్ మాట్లాడారు.  రాజశేఖర్ మాట్లాడుతూ తన పిల్లల కోసం కొరియా గురించిన సమాచారం కోసం వెతికే సమయంలో వికీపీడియా తనకు ఎంతో ఉపయోగపడిందని, ఇది మరింత విస్తృతం చేయటానికై తన వంతు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు.   సునీల్ మోహన్  Linux - GNOME తెలుగు స్థానికీకరణలో తను చేసిన పని కంప్యూటర్
లో చూపిస్తూ వివరించారు. స్వేచ్ఛ కార్యదర్శి ఐన భువన్ కూడా ఈ సదస్సుకు వచ్చారు. సి.బి.రావు తనను ఈ-తెలుగు ఉపాధ్యక్షుడిగా పరిచయం చేసుకుంటూ, తమ సభ్యులు తెలుగు వికీలో క్రియాశీలకంగా ఉన్నారనీ,  ఈ -తెలుగు, వికీపీడియా అభివృద్ధికి శాయసక్తులా కృషి చేస్తుందని అన్నారు.  

సభ్యుల పరిచయాల తదుపరి వీవెన్ వికీపీడియాలో వ్యాస ప్రచురణ, సవరణల గురించి సోదాహరణంగా, LCD ప్రొజెక్టర్ సాయంతో పట్టికలు చూపిస్తూ  వివరించారు. 



తదుపరి ఆహూతులు   కంప్యూటర్ పై Hands On experience పొందారు. వారికి ఈ-తెలుగు వాలంటీర్లు, వికీపీడియన్స్ సహకరించారు.  చాలా ఆలస్యమైనా, భోజన వేళ మించినా  ఆహూతులు తుదివరకూ వికీ అవగాహనా సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సరావు పేట, నెల్లూరు వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి  వికీపీడియన్లు,  కాబోయే వ్రాతకారులు, సంపాదకులు  ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇలాంటి సదస్సులు తరచూ నిర్వహించాలని నిర్వాహకులను కోరారు.   

మరిన్ని చిత్రాలకై  ఇక్కడ సందర్శించండి.

Text & Photos: cbrao Camera: Nikon D90

9 కామెంట్‌లు:

Apparao చెప్పారు...

ఒక కార్యక్రమానికి వెళ్ళామా వచ్చామా అన్నట్లుందే నాలాంటి వారికి జ్ఞాన బోధ చేసారు మీరు
ఈ కార్యక్రమం లో మీ పక్కన కూర్చుని మీ మినిట్స్ బుక్ చూసి , మీరు పత్రికా విలేఖరి అని పొరపాటుబడ్డాను , క్షమించగలరు
ఇప్పుడు మీ పోస్ట్ చూసిన తర్వాత, ఇంకా ఏదన్న సమేవేశానికి వెళ్ళేటప్పుడు పెన్ను , పేపర్ తీసుకు వెళ్తాను అని నిర్ణయించుకున్నాను

రమణ / Ramana చెప్పారు...

రావుగారూ,
creative commons కింది బొమ్మలు/సంగీతం ఎలా వుంచాలి?

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

ఆహుతులు కాదు మహాప్రభో ఆహూతులు

worthlife చెప్పారు...

రావుగారూ... సమీక్ష చాలా బాగుంది. దీని కోసం నిన్నటి నుంచీ ఎదురు చూస్తున్నాను. మీరన్నట్లు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి.

cbrao చెప్పారు...

@రమణ: బొమ్మలు/సంగీతం -వాటి హక్కుదారుల కాపీరైట్ కు భంగం వాటిల్లకుండా చూడాలి.  మీకు హక్కులేని వాటిని మీరు వికిపీడియాకు ఎగుమతి చేయరాదు. అట్లా చేసిన వాటిని వికీ సంపాదకులు తొలగిస్తారు. మీరు తీసిన ఛాయాచిత్రాలు, గీసిన బొమ్మలు, పాడిన పాటలు, సృజించిన సంగీతం వికీకు ఎగుమతి చెయ్యవచ్చు. మీరు ఎగుమతి చేసినవాటి ని  ఇతర వాడుకదారులు  మీకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వాడుకునేలా మీరు అనుమతిస్తున్నారు. ఏ పుస్తకం లేక సృజనాత్మక పని ఏదైనా  సృజనకర్త మరణించిన 60 సంవత్సరాల తరువాత ఆ రచనలను ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అయితే కాపీరైట్ ఉన్నవాటిని వ్యాపార కార్యక్రమాలు కాని వాటిలో  కొన్ని పరిమితులకు లోబడి, సమీక్ష వగైరాల కొసం  Fair usage కింద వాడవచ్చును. ఉదాహరణకు  ఈ బ్లాగ్ లోని చిత్రాలు కొందరు బ్లాగర్లు తమ తమ వ్యాసాలలో వాడుకోవటం జరిగింది. Fair  usage క్రింద ఈ వ్యాసం లోని  చిత్రాలు వాడే సమయంలో Photo Courtesy: cbrao అని ఉదహరించటం సత్సాంప్రదాయం.   వికీపీడియన్లకు ఇలా Photo Courtesy  అని ఉదహరించే  అలవాటు  ఈ రోజు జరిగిన అవగాహ సదస్సు లాంటివి ద్వారా తెలియచెయ్యాలి.    Fair usage గురించిన మరింత సమాచారం కోసం  ఇక్కడ చూడండి.  కాపీరైట్  హక్కుల చట్టం  1957  ను ఇక్కడ నుండి దిగుమతి చేసుకోండి. 

cbrao చెప్పారు...

@రహ్మానుద్దీన్ షేక్:ముద్రారాక్షసాన్ని సవరించాను. మప్పిదాలు.

cbrao చెప్పారు...

@Apparao Sastri: పొరబాటు ఎవరికైనా సహజమే. వికీలో మీ వ్యాసం కోసం ఎదురు చూస్తాను. గొలుసు (link) పంపగలరు. ప్రతి నెలా రెండవ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడా లో జరిగే ఈ -తెలుగు సమావేశాలకు హాజరయి వికీ గురించిన మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. బ్లాగుల గురించీ ముచ్చటించవచ్చు.

ramperugu చెప్పారు...

వికీపీడియా లో రచనలు చేయాలనే నా ఆలోచన కు అర్ధవంతమైన
రూపాన్నిచ్చ్చింది ఈ దశాబ్ది సదస్సు..మంచి మిత్రుల్ని కలిసాను.
ఇక వికీ ప్రయాణంలో మళ్ళీ అందర్నీ కలుస్తా..వ్యాసాలతో..
ధన్య వాదాలు సి.బీ.రావు గారు..

Arjun చెప్పారు...

పేజీ వీక్షణలు తెలుసుకొనటానికి చూడండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి