బుధవారం, డిసెంబర్ 31, 2008
e-telugu elite

శాన్ హోజే పురంలో (San Jose, CA) ఆకులురాలే కాలం Photo: cbrao
కొత్త సమూహం (గుంపు అనే దానికన్నా ఈ పదం బాగుంది కదూ) e-తెలుగు elite ప్రారంభం సందర్భంగా
రావాలి తెలుగు భాషకు ప్రాభవం
పెరగాలి ఇంటింటా యునికోడ్ వాడకం
తెలుగు బ్లాగులు వాడ వాడా విస్తారం
కావాలి తెలుగు వికి మరింత పఠనీయం.
http://groups.google.com/group/eteluguelite
గమనిక: ఈ సమూహం చందా చెల్లించిన, e-తెలుగు సభ్యులకు మాత్రమే. e-తెలుగు లో సభ్యత్వం అభిలషించువారు కోశాధికారి వెంకట రమణ లేక అధ్యక్షులు చదువరి గార్లను ఈ చిరునామాలలో సంప్రదించవచ్చును.
"Venkata Ramana U" uvramana at gmail.com "Caduvari" sirishtummala at gmail.com
ఆదివారం, డిసెంబర్ 28, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -15

శాన్ హోజేపురం (San Jose,CA) జపాన్ టౌన్ లోని బుద్ధ దేవాలయపు తోటలో గులాబీరంగు పూల హాసం Photo: cbrao
ఆదర్శ దంపతులు
ఇది చదివి నవ్వకుండా ఉండటం సాధ్యమా?
http://navvulaata.blogspot.com/2008/12/blog-post_13.html
వినాయకడు దర్శకుడితో భేటీ
హీరోలకు, హీరొయిన్లకు కాకుండా, కొంత కాలం క్రితం కేవలం ఒక సినిమాకు అభిమానులున్న సంఘటన జరిగింది. ఆ చిత్రం గుర్తుందా? రామోజిరావు నిర్మాతగా, జంధ్యాల దర్శకత్వంలో వచ్చింది. ఇది చాలా హాస్య ప్రధానమైన చిత్రం. నరేష్, పూర్ణిమ నటించిన సినిమా.
ఇప్పుడు కత్తి మహేష్ బ్లాగుకు అభిమానులు. కొత్త ట్రెండే. ఇంతమంది అభిమానులు కలిగిన మహేష్ వినాయకుడిలా ఉంటే ఎలాగు? అభిమానుల కోసమైనా అందగాడు శోభన్ బాబులా slim గా ఉండవద్దా?
http://navatarangam.com/2008/12/saikiran_interview_2/
హోమియోపతీ వైద్య విధానానికి అభ్యంతరాలు
కొందరు హేతువాదులు కూడా హోమియోపతి వైద్యవిధానాన్ని అవలంబించటం, ఈ వైద్యవిధాన విశ్వసనీయతపై అయోమయ స్థితి నెలకొనటానికి దారితీస్తుంది.
http://lolakam.blogspot.com/2008/12/blog-post_6097.html
కూర్గ్ విహార యాత్ర
@ మేధ: కాసేపు మమ్మల్ని కూర్గ్ కొండలలో తిరిగిన అనుభూతి కలించారు. అక్కడి స్త్రీల వస్త్ర ధారణ గమనించారా? వారు చీర ఆకర్షణీయంగా ధరిస్తారు. ఈ నృత్యంలోని వేషధారణ గమనించండి.
"కావేరి నిసర్గధామ అంటే తల కావేరి నే కదా..? "
-కాదు. ఈ రెండూ వేరు. తల కావేరి - కావేరి ఉద్భవించిన స్థలం. నిసర్గధామ కావేరి నదివున్న ఒక ద్వీపం. చూడండి ikkad'a.
@ కత్తి మహేష్ కుమార్: మేధ చూసిన జలపాతం ఇరుపుయే, అబ్బే కాదు. ఇరుపు జలపాత దృశ్యం ఇక్కడ చూడవచ్చు.
http://nalonenu.blogspot.com/2008/12/blog-post.html
తెలుగు బ్లాగుల టీ-షర్టులు
చాలా బాగున్నాయి.
http://nagaprasadv.blogspot.com/2008/12/blog-post_16.html
మిస్టర్ మేధావి
రెటమతం, రెట్టమతం రెండూ ఒకటెలా అవుతాయి?
http://blog.vikatakavi.net/2008/12/13/%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%87%e0%b0%a7%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/
బ్లాగులు సమస్యలను పరిష్కరిస్తాయా?
@ వంశి: !!!
@ ఏకాంతపు దిలీప్ : "బ్లాగుల ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణ. అంతే!"
ముఖ్యోద్దేశం భావ వ్యక్తీకరణే. సందేహం లేదు. బ్లాగుని ఇతర ప్రయోజనాలకూ వాడటం వాడుకలో ఉన్న విషయాన్ని విస్మరించలేము.
@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి : బ్లాగులను ఇలాగే రాయాలన్న చట్రం లో ఇరికించటం అభిలషణీయమా?
@ యోగి - The outcast: "blogs are intended for. *Express a unique view*"
అవును బ్లాగులు తొలిగా వ్యక్తిగత అనుభూతులు వ్యక్తీకరించాయి. ఇప్పుడు అవి రూపాంతరం చెంది, పెక్కు విషయాలను వివరించటం జరుగుతుంది. దీనిని ఆపటం సాధ్యమా? అవసరమా?
నేను నా వ్యాసం లో వెలిబుచ్చినట్లుగా ముంబాయి సహాయం లాంటి వెబ్సైట్ ల ద్వారా కొంత సామాజిక ప్రయోజనం కలిగిన విషయాన్ని గుర్తిచకుండా ఉండలేము.
@ యన్.సీతారాంరెడ్డి: మీరు కొరుకున్న విధంగా నడపబడుతున్న forums, groups చాలా ఉన్నాయి . Nature conservation, Photography, Wildlife, Ubuntu Forums వగైరా. మరిన్ని విషయాలకై MySpace FORUMS చూడవచ్చు. తెలుగు లో బ్లాగింగ్ ఇంకా పరిణామం చెందుతూ ఉంది. భవిష్యత్ లో తెలుగులో కూడా మరిన్ని ఫోరంస్ వచ్చే అవకాశముంది.
@ కృష్ణారావు: అవును, మీ అభిప్రాయం సరైనదే. ప్రతి సమస్యకూ ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. దానిని కనుగొనటానికే ఈ అన్వేషణ.
@ అబ్రకదబ్ర: బ్లాగులు సమస్యలకున్న ఇరు పార్శ్వాలను, నిస్పాక్షికంగా పరిశీలిస్తూ తమదైన పరిష్కారాన్ని చూపుతున్నాయి.
@ అజ్ఞాత: ""బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే." అన్న అభిప్రాయంలో బ్లాగర్లు ఉండడం చాలా బాధాకరం. "
ఇది బ్లాగు గురించిన ఒక పార్శ్వాన్నే స్పృశిస్తుంది. బ్లాగు ఎంతో విస్తరించి,తన పరిధిని ఎప్పటి కప్పుడు పెంచుకూంటుంది. రకరకాల పరిణామాలకు అది లోనవుతుంది. భావ వ్యక్తీకరణ నుంచి, వినోదింపచేసిదిగా, సమాచార దర్శినిగా, సమస్యా పరిష్కార వేదికగా అది ఎన్నో రూపాలు సంతరించుకోంటుంది.
http://deeptidhaara.blogspot.com/2008/12/blog-post_2008.html
హోమియో వైద్యం

హోమియో వైద్యం ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చిందా? ఇది పనిచేస్తుందా? పంచదార గుళికలకు దీర్ఘరోగాలు తగ్గుతవా? హేతువాదులలో కొంతమంది ఈ వైధ్యవిధానం అవలంబించటం మరికొంత అయోమయానికి దారి తీస్తుంది. ఈ విషయమై ఆచార్య వేమూరి వారు వారి అభిప్రాయాన్ని తమ వ్యాసం "హోమియోపతీ వైద్య విధానానికి అభ్యంతరాలు" లో తెలిపారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారు హొమియోపతి పై, తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. అది కింద ఇస్తున్నాను. ఈ వైద్య విధానం పై మీ అభిప్రాయమేమిటి?
భారత ప్రధానిగా ఉన్న పి.వి.నరసింహారావు దేశీయ వైద్య విధానాలనూ, హోమియోపతినీ ఆదుకోవటానికి ఒక ప్రత్యేక శాఖను కేంద్రంలో నెలకొల్పారు. ప్రధాని, రాష్ట్రపతి,ముఖ్యమంత్రులు, ఉన్నతోద్యోగులూ, జడ్జీలు గుండెపోటుకు గురైనప్పుడు హోమియో చికిత్సకు వెళ్లిన దాఖలాలు లేవు. కాని ఇతరులకు బోధనలు చేసేటప్పుడు, హోమియో చాలా మంచిదనీ, చౌక అనీ, దుష్ఫలితాలు ఉండవనీ నీతి వాక్యాలు వల్లిస్తుంటారు. ఇది తెలిసి చెప్పే విషయం కాదు. ఈ బోధనల వెనుక హోమియోలజీ ఉన్నది. వారి ఒత్తిడులు పలువిధాలుగా పనిచేస్తుంటాయి. హోమియో వైద్యులు పరోక్షంగా శాసనాల ద్వారా కేటాయింపులు చేయించుకుంటుంటారు. ప్రసార సాధనాలను వాడుకుంటుంటారు. వీటన్నిటికీ మంచి హోమియో టెక్నిక్ ఒకటి ఉన్నది. ఆధునిక వైద్యవిధానంలో ఉన్న లోపాలనూ, చికిత్సకయ్యే ఖర్చు ఖరీదునూ, నయం కాని జబ్బులనూ, చిలువలు పలువలుగా హోమియో వారు తమ ప్రచారానికి వాడుకుంటుంటారు. ఇది భారతదేశంలో పరిమితమైన విషయం కాదు. ప్రపంచమంతటా ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. అమెరికాలో 1938లో రాయల్ కోప్ లాండ్ అనే న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీసెనేటర్ తాను హోమియో వైద్య ప్రాక్టీసు చేస్తూ దానికిచట్ట విలువలను కల్పించటంలో కృతకృత్యుడయ్యాడు. హోమియో మూలపురుషుడు శ్యామ్యూల్ హేనిమన్ వేసిన బాటలోనే వీరంతా పయనిస్తున్నారు. అదేమిటో తెలుసుకొని తరువాత లోతుపాతులు పరిశీలిద్దాం.
హేనిమన్ (1775-1843)
జర్మనీలో వైద్య డిగ్రీ పుచ్చుకున్న హేనిమన్ ఆనాడు ఆ విధానంలో ఉన్న దోషాలనూ ఎలుగెత్తి చాటాడు. హెచ్చు మోతాదులో ఔషధాలివ్వడం, దానివలన విపరీత పరిణామాలు జరగటం, రక్తాన్ని కక్కించటం మొదలైన దుర్వినియోగ కార్యక్రమాలను హేనిమన్ విమర్శించాడు. పాదరసాన్ని రోగులకు యిస్తున్నందువలన విషపూరితమై ప్రమాదకర పరిస్థితులకు దారితీయటం కూడా హేనిమన్ గమనించాడు. ఇందుకు భిన్నంగా ఆయన కొన్ని సూత్రాలు ప్రతిపాదించి దానికి హోమియో అని పేరు పెట్టాడు. అంతవరకూ ఉన్న వైద్య విధానాన్ని అలోపతి అని నామకరణం చేసి, అదొక దూషణపదంగా ప్రచారంలోకి తెచ్చారు.
హేనిమన్ సూత్రాలు మూడు ప్రధాన విషయాలపై ఆధారపడ్డాయి. 1. సారూప్య లక్షణం. మనకు లభించే మూలికలూ, ఇతర పదార్థాలూ స్వీకరించినప్పుడు మనుషులలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఇవి ఔషధ లక్షణాలు. రోగులలో అలాంటి లక్షణాలే ఉన్నప్పుడు. ఈ మందులను ఇచ్చి రోగాలను నయం చేయవచ్చున్నాడు. హేనిమన్ , అతని శిష్యులూ అనేక మూలికలనూ, ఖనిజాలనూ, ప్రకృతిలో లభించే ఇతర పదార్థాలనూ ఆరోగ్యవంతులకు ఇచ్చారు. వారు కూడా తీసుకున్నారు. అందువలన ఎలాంటి లక్షణాలు వచ్చాయో, వాటిని నమోదు చేశారు. దీనినే హెమియోలో వస్తుగుణదీపిక అంటారు. వీటిని రుజువులుగా వారు పరిగణించారు. అక్కడే పెద్ద పొరపాటు జరిగింది. రుజువులకు శాస్త్రీయ పద్ధతులున్నాయి. వాటిని పదే పదే పరీక్షకు పెట్టి ఫలితాలను రాబట్టి అన్వయించాలి. అలాంటిదేమీ లేకుండా, వ్యక్తిగతమైన అనుభవాన్ని రుజువనే పేరుపెట్టి ఈనాటికీ హోమియో వైద్యులు అదొక వేదపద్ధతిగా, మూలగ్రంథంగా స్వీకరించి పాటిస్తున్నారు.
2. హనిమన్ మోతాదు పద్ధతిని హోమియోలో చికిత్సకు ఎంత తక్కువ మోతాదు ఇస్తే అంత బాగా పని చేస్తుందని చెప్పాడు. శరీరంలో సోర, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు లక్షణాలుంటాయనీ వాటిలో తులనాత్మకత తప్పినప్పుడు రోగాలు వస్తాయనటానికి ఎలాంటి ఆధారమూ లేదు. పైగా జీవశక్తి అనేది ఉన్నదని హోమియో నమ్మింది. అది కూడా ఒక వైటల్ ఫోర్సు అన్నారు. హోమియో ఔషధాలు ఈ శక్తిని ప్రేరేపింపజేసి రోగాన్ని ఎదుర్కొని ఎలాంటి చెడు పరిణామాలు లేకుండా రోగిని ఆరోగ్యవంతుణ్ణి చేస్తాయన్నారు. హేనిమన్ ఈ మోతాదు సూత్రాన్ని తీవ్రస్థాయికి తీసుకుని వెళ్ళాడు. తొలుత మోతాదులు తగ్గించుకుంటూ, రాను రాను వాటిని అనూహ్యంగా పలచబడేటట్లు చేశాడు. ఎంత పలచబరిస్తే అంత శక్తి పెరుగుతుంది అన్నాడు. ఇందుకు కూడా నమ్మకమే ప్రధానం గానీ రుజువుకు నిలబడలేదు.
హోమియోలో ఔషధాలను రెండు విధాలుగా తయారు చేస్తారు. నీళ్ళలో గాని, సారాలోగానీ కరిగేవి ఒకవిధమైన ఔషధాలు. అలా కరగని వాటిని పొడి చేసి పాలచక్కెర కలిపి మోతాదులు తయారు చేస్తారు. ఔషధాలను పలచబరచటంలో మూలపదార్థం ఉన్నదా లేదా అనే అంశాన్ని హోమియో పాటించలేదు. హోమివారిచ్చే ఔషధాలలో మూలపదార్థం లేదని హేనిమన్ ఆనాడే గుర్తించాడు. కాని ఔషధం తయారు చేస్తున్నప్పుడు ప్రతి కుదుపుకూ, నూర్పిడికీ శక్తి పెరుగుతూ పోతుందన్నాడు. ఇది పరీక్షలకు అందుబాటులో లేని శక్తి అన్నాడు. అక్కడే జీవశక్తిపై నొక్కు పెట్టాడు. దీనిని నమ్మవలసిందే అన్నాడు. ఆధునిక శాస్త్రీయ రుజువులకు హోమియో నిలబడదని బెర్నార్డ్ లియారీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పి పోతున్నాడు. ఇతడు సుప్రసిద్ధ బ్రిటిష్ హోమియో వైద్యుడు. బ్రిటిష్ హోమియోపతిక్ జర్నల్ 1990 ఏప్రిల్ సంచికలో ఈ విషయమై ఆయన వివరమైన వ్యాసం రాశాడు. హోమియోలోని జీవశక్తిగానీ, ఔషధాలలోని మూలపదార్థంగానీ రుజువులకు నిలబడదని చెప్పేశాడు.
హోమియో మాత్రలను గానీ ద్రవవూరితంగా ఉన్న ఔషధాలను గానీ తీసుకెళ్లి ఒక హోమియో వైద్యుడికి లేదా పరిశోధనాలయానికిచ్చి అందులో ఏమున్నదో చెప్పండీ అంటే చెప్పలేరన్నమాట.
3. హోమియో చికిత్సలో ఔషధ ప్రయోగం చేసినపుడు రోగి లక్షణాలు పెరిగి తగ్గుతాయనే నమ్మకమున్నది. అలా రోగం బాగా పెరుగుతున్నట్లు కనిపించటం మందు బాగా పని చేయటానికి సూచనగా భావించారు. అయితే ఇది కూడా నమ్మకాలలో ఒకటిగానే మిగిలిపోయింది
శుక్రవారం, డిసెంబర్ 26, 2008
మరో ప్రేమ కథ
మన తెలుగు సినిమాలలో 3 గంటలలో చెప్పే ప్రేమకథ. ప్రేమికుల మధ్య అపార్థాల తర్వాత ఎదో ఒక చిన్న సంఘటన తో నాయకుడిపై నాయకికి ప్రేమ కలగటం, చెట్టాపట్టాలు, నాలుగు పాటలు ఇంకాస్త ముందుకెళ్తే, ఆప్రేమకు తల్లి తండ్రుల అభ్యంతరాలు, చివరకు ఏదో ఒక తమాషా పరిష్కారంతో పెళ్లికి పెద్దల అంగీకారం, కథ కంచికి మనమింటికి. ఇదే కథను కేవలం 3 నిమిషాలలో మనోజ్ఞంగా, ఉత్తేజభరితంగా, చిత్రించిన ఈ లఘుచిత్రాన్ని చూడండి. ఇది చూస్తే, మన దర్శకులకు కొత్త ఊహలొచ్చేస్తాయి. ఈ చిత్రాన్ని మీరూ చూసి ఆనందించండి. మీరు దర్శకులైతే మీదైన పద్ధతిలో మీ కథ, స్క్రీన్ ప్లే రాసేసుకోండి.
గురువారం, డిసెంబర్ 25, 2008
Snow Flakes
క్రిస్టమస్ సమయంలో మంచు తునకలు (Snow Flakes) పల్లెలకు, పట్టణాలకు మరింత శోభనిస్తాయి. ఈ సందర్భంగా Jim Reeves పాడిన Snow Flakes గుర్తు వస్తుంది. ఈ పాట వింటుంటే మనస్సులో ఎంత ఉత్సాహం నిండి పోతుందో చూడండి. ఈ పాట మరింతగా ఆనందించాలంటే సాహిత్యం కూడా చూడవచ్చు ఇక్కడ . ఈ పాటను మీరూ విని ఆనందించండి.
శనివారం, డిసెంబర్ 20, 2008
సిలికాన్ వాలీ లో కొందరు రచయితల సమావేశం
శాన్ హోజేపురంలో రచయితలతో

ఎడమనుంచి కుడి వైపు శ్రీయుతులు cbrao, మాగంటి వంశి, అబ్రకదబ్ర మరియు గొర్తి సాయి బ్రహ్మానందం Photo: cbrao
డిసంబర్ 7, 2008 న శాన్ హొజేపురం (San Jose, CA) లో కొందరు తెలుగు బ్లాగరులు, రచయితలతో కలిసే అవకాశం కలిగింది. నేను ఇక్కడకు (San Jose) రాగానే మాగంటి వంశీ మోహన్, అబ్రకదబ్రా గార్లను సంప్రదించటం జరిగింది. వారిద్దరూ పని ఒత్తిడి వలన వెంటనే కలుసుకోనప్పటికీ, టెలిఫోన్, చాట్ ద్వారా ఎప్పుడూ సంపర్కం లో ఉన్నారు. ఎట్టకేలకు, ముందుగా అనుకున్న మేరకు ఈ రోజున మాగంటి వంశీ, అబ్రకదబ్రా నేను ఉంటున్న ఇంటికి రావటం జరిగింది. అనుకోకుండా మరో అతిధి సాయి బ్రహ్మానందం గొర్తి, వంశీ ఆహ్వానం పై వచ్చి సమావేశ శోభను పెంచారు.
తెలుగు బ్లాగర్లకు మాగంటి వంశీ మోహన్, అబ్రకదబ్రా పరిచితులే. బ్రహ్మానందం గారికి ఒక బ్లాగు ఉన్నప్పటికీ దాని వివరాలు మన బ్లాగర్లకు అంతగా తెలియదు. కాని ఈ మాట, నవతరంగం వగైరా అంతర్జాల పత్రికలు చదివే వారికి, వీరు సుపరిచితమే. తెలుగు బ్లాగ్లోకం లో కొత్తగా వచ్చినవారి సౌలభ్యం కోసం వీరందరి పరిచయం చేస్తాను.
ఆంధ్రుల సాహితీ రచనలు, కళా రూపాలు, శతకాలు, ముఖా-ముఖీ సమావేశాలు, ప్రముఖుల వ్యాసాలు, వీనుల విందు చేసే కర్ణాటక సంగీతం, భక్తి గీతాలు, లలిత సంగీతం, పాత తెలుగు సినిమాల పాటలు ఇలాంటి, ఎన్నొ ప్రక్రియలను మనము మాగంటి వంశీ గారు రూపొందించిన మాగంటి.ఆర్గ్ వెబ్ సైట్ లో చూడవచ్చు, వినవచ్చు. ఆంధ్రదేశానికి సంబంధించిన పలు ఉపయుక్త విషయాలున్నవిందులో. ఇంకా పిల్లలకోసం కూడా ఒక వర్గముందండోయ్. కొవ్వలి శ్రావ్య వరాళి కొరియా యాత్ర, కువాయిట్ సుధీష్ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు వగైరా వ్యాసాలు కూడా ఉన్నాయి. సమాచారాన్నంతా ఎంతో శ్రమకోర్చి ఏర్చి-కూర్చి మనకు అందిస్తున్న వంశీ అభినందనీయులు.
ఈ రోజు సమావేశానికొచ్చిన మరో తెలుగాభిమాని అబ్రకదబ్రా మన తెలుగు బ్లాగుల పాఠకులకు పరిచితులే. వీరి బ్లాగు పేరు తెలు-గోడు . వీరు రాసిన మద్య తరగతి మహిళ, పేరు గొప్ప విజయం, శ్రీ ఏసుక్రీస్తుడు, సిటిజెన్ కేన్, బెర్ముడా రహస్యం, కలాపోసన - 1 ,2, 3 వగైరా వ్యాసాలు బహు ప్రాచుర్యం పొందాయి.
ఈ రోజు సమావేశానికొచ్చిన మూడవ అతిధి సాయి బ్రహ్మానందం గొర్తి. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, సాహిత్యం, నాటక రంగాలలో లో కృషి చేస్తున్నారు. వీణ వాయిస్తారు, కథలు, కవితలు ఇంకా సినిమా సమీక్షలు చేస్తుంటారు. బొమ్మలు గీయటం, ఫొటోగ్రఫీలపై అభిరుచి ఉంది. సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాల పై అమెరికా లో అధ్యయనం చేశారు.కొన్ని అంతర్జాల పత్రికలతో అనుబంధం ఇంకా కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు నిర్వహణలో ముఖ్య పాత్ర. మిత్రుల సహకారంతో కాలిఫోర్నియా రచయితల తెలుగు కథల సమాహారం వెన్నెల్లో హరివిల్లు అనే కథా సంపుటి ప్రచురించారు.
వంశీ మాట్లాడుతూ తమ శాక్రిమెంటో ప్రాంతంలో గతంలో పిల్లలకు తెలుగు చెప్పే వారు ఉండేవారని, ప్రస్తుతం లేరని చెప్పారు. ఇది విచారకరమైన విషయం. తెలుగు భాషను నిలబెట్టే, బోధన సౌకర్యం, రాష్ట్ర రాజధాని నగరంలో లేకపోవటం విచారకరం. వెబ్సైట్ నిర్వహణలో సమయం ఎక్కువ కేటాయించ వలసిన అవసరం వుండటం వలన, తన తెలుగు బ్లాగు లో కొత్తవి రాయలేకపోతున్నానని తెలిపారు. ఈ సమావేశానికి బ్రహ్మానందం గారిని తనే ఆహ్వానించారు కాని వారిని మా ఇంటే ప్రధమంగా చూడటం అని తెలియటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అబ్రకదబ్రాకు కూడా ఇదే తొలిసారి ఈ ప్రాంతపు రచయితలను కలవటం.
బ్రహ్మానందం గారు తాము 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు సందర్భంగా ప్రచురించిన కథా సంపుటి " వెన్నెల్లో హరివిల్లు" కథా సంపుటాల్ని సమావేశానికి హాజరైనవారికి అందచేశారు. అబ్రకదబ్రా సమావేశానికొస్తూ "Speeches That Changed the World" అనే విషయ ప్రాధాన్యత గల అందమైన బౌండ్ పుస్తకాన్ని, నాకు కానుకగా ఇచ్చారు. ఎందరో మహనీయుల కథలు, సూక్తుల తో ఉందీ గ్రంధం. ఈ పుస్తకాన్ని మరోసారి విపులంగా పరిచయం చేస్తాను.
బ్రహ్మానందం గారిని మీరు తెలుగులో బ్లాగు ప్రారంభించకూడదా అన్న ప్రశ్నకు బదులిస్తూ, తమకు తెలుగుబ్లాగు (http://www.sahitinandam.com/blog/?page_id=4) ఉందన్నారు. ఇది కూడలి లోకి ఎక్కినట్లుగా లేదు. తెలుగు బ్లాగు పాఠకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదు. కూడలి వారిని తమ జాబితాలో ఈ బ్లాగును చేర్చవలసినదిగా కోరుతాను. బ్రహ్మానందం గారు ఈ మాటలో రాస్తున్న మనకు తెలియని మన త్యాగరాజు కొరకు తంజావూరు ఇంకా అక్కడి సమీప ప్రాంతాలకు వెళ్లి,త్యాగరాజు పై పెక్కు పరిశోధనలు గావించిన పిదప, ఈ వ్యాసాలు వెలువరిస్తున్నానని తెలిపారు. నాటక రంగంతో తమకున్న అనుబంధం గురించి చెప్పారు. వీరి రచనలు ఈ మాట, కౌముది, నవతరంగం ఇంకా ఆంధ్రభూమి పత్రికలలో చూడవచ్చు. బ్రహ్మానందం గారి రచనలు గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాయవలసిఉంటుంది.
చలం రచనల ఉధృతిలో సౌరిస్ రచనలు ఆంధ్రదేశం పెద్దగా పట్టించుకోలేదు. అదే పద్ధతిలో, బ్రహ్మానందంగారి కబుర్ల ప్రభావంలో అబ్రకదబ్రా కు పెద్దగా మాట్లాడే అవకాశం కలుగలేదు. మరోసారి వీరితో సమావేశమవ్వాలి. సమావేశం ముగిసాక కారు పార్కింగ్ లో బ్రహ్మానందంగారితో మాట్లాడే సమయంలో వచ్చారు ద్వాదశి అమర్. వీరు Media Communication ఇంకా అంతర్జాతీయ వ్యాపారం పై రెండు మాస్టర్స్ డిగ్రీల కోర్సులు చేశారు. జై చిరంజీవ, దేవదాసు చిత్రాల అమెరికా షూటింగ్ లో చక్కటి లొకేషన్స్ అన్వేషించటంలో, స్థానిక వ్యక్తులతో సంప్రదింపులు విషయంలో, ఆయా చిత్రాల దర్శక నిర్మాతలకు సహకరించి ఉన్నారు. సంభాషణ కొంతసేపు చిత్రాలపై మళ్లింది. అమర్ కు తెలుగు బ్లాగుల గురించి వివరించి ఉన్నాను, నా ఉత్తరాల ద్వారా. తను తెలుగు బ్లాగులు చదువుతానని, త్వరలో వ్యాఖ్యానాలతో తెలుగులో ప్రవేశం చేస్తానని, చెప్పారు. అమర్ కు చలన చిత్రాలపై అభిమానం మెండుగా ఉంది. తెలుగు, అంతర్జాతీయ చిత్రాల పై తనదైన ఫక్కీలో వ్యాసాలు రాస్తాడని ఆశిద్దాం.
ఇది శీతాకాలమవటంతో పగళ్లు పొట్టిగా రాత్రులు దీర్ఘంగా ఉంటున్నవిక్కడ. వేసవి లో రాత్రి 9 గంటలదాకా ఉండే సూర్యుడు సాయంకాలం 5 గంటల ప్రాంతానికే అస్తమిస్తున్నాడు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొందులకై, శీతాకాలం వస్తూనే గడియారం ఒక గంట వెనక్కు తిప్పుతారు. చలి ముదురుతూంది కావున కబుర్లు చాలించి, వీడ్కోలు తీసుకొన్నాము.

ఎడమనుంచి కుడి వైపు శ్రీయుతులు cbrao, మాగంటి వంశి, అబ్రకదబ్ర మరియు గొర్తి సాయి బ్రహ్మానందం Photo: cbrao
డిసంబర్ 7, 2008 న శాన్ హొజేపురం (San Jose, CA) లో కొందరు తెలుగు బ్లాగరులు, రచయితలతో కలిసే అవకాశం కలిగింది. నేను ఇక్కడకు (San Jose) రాగానే మాగంటి వంశీ మోహన్, అబ్రకదబ్రా గార్లను సంప్రదించటం జరిగింది. వారిద్దరూ పని ఒత్తిడి వలన వెంటనే కలుసుకోనప్పటికీ, టెలిఫోన్, చాట్ ద్వారా ఎప్పుడూ సంపర్కం లో ఉన్నారు. ఎట్టకేలకు, ముందుగా అనుకున్న మేరకు ఈ రోజున మాగంటి వంశీ, అబ్రకదబ్రా నేను ఉంటున్న ఇంటికి రావటం జరిగింది. అనుకోకుండా మరో అతిధి సాయి బ్రహ్మానందం గొర్తి, వంశీ ఆహ్వానం పై వచ్చి సమావేశ శోభను పెంచారు.
తెలుగు బ్లాగర్లకు మాగంటి వంశీ మోహన్, అబ్రకదబ్రా పరిచితులే. బ్రహ్మానందం గారికి ఒక బ్లాగు ఉన్నప్పటికీ దాని వివరాలు మన బ్లాగర్లకు అంతగా తెలియదు. కాని ఈ మాట, నవతరంగం వగైరా అంతర్జాల పత్రికలు చదివే వారికి, వీరు సుపరిచితమే. తెలుగు బ్లాగ్లోకం లో కొత్తగా వచ్చినవారి సౌలభ్యం కోసం వీరందరి పరిచయం చేస్తాను.
ఆంధ్రుల సాహితీ రచనలు, కళా రూపాలు, శతకాలు, ముఖా-ముఖీ సమావేశాలు, ప్రముఖుల వ్యాసాలు, వీనుల విందు చేసే కర్ణాటక సంగీతం, భక్తి గీతాలు, లలిత సంగీతం, పాత తెలుగు సినిమాల పాటలు ఇలాంటి, ఎన్నొ ప్రక్రియలను మనము మాగంటి వంశీ గారు రూపొందించిన మాగంటి.ఆర్గ్ వెబ్ సైట్ లో చూడవచ్చు, వినవచ్చు. ఆంధ్రదేశానికి సంబంధించిన పలు ఉపయుక్త విషయాలున్నవిందులో. ఇంకా పిల్లలకోసం కూడా ఒక వర్గముందండోయ్. కొవ్వలి శ్రావ్య వరాళి కొరియా యాత్ర, కువాయిట్ సుధీష్ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు వగైరా వ్యాసాలు కూడా ఉన్నాయి. సమాచారాన్నంతా ఎంతో శ్రమకోర్చి ఏర్చి-కూర్చి మనకు అందిస్తున్న వంశీ అభినందనీయులు.
ఈ రోజు సమావేశానికొచ్చిన మరో తెలుగాభిమాని అబ్రకదబ్రా మన తెలుగు బ్లాగుల పాఠకులకు పరిచితులే. వీరి బ్లాగు పేరు తెలు-గోడు . వీరు రాసిన మద్య తరగతి మహిళ, పేరు గొప్ప విజయం, శ్రీ ఏసుక్రీస్తుడు, సిటిజెన్ కేన్, బెర్ముడా రహస్యం, కలాపోసన - 1 ,2, 3 వగైరా వ్యాసాలు బహు ప్రాచుర్యం పొందాయి.
ఈ రోజు సమావేశానికొచ్చిన మూడవ అతిధి సాయి బ్రహ్మానందం గొర్తి. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతం, సాహిత్యం, నాటక రంగాలలో లో కృషి చేస్తున్నారు. వీణ వాయిస్తారు, కథలు, కవితలు ఇంకా సినిమా సమీక్షలు చేస్తుంటారు. బొమ్మలు గీయటం, ఫొటోగ్రఫీలపై అభిరుచి ఉంది. సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక అంశాల పై అమెరికా లో అధ్యయనం చేశారు.కొన్ని అంతర్జాల పత్రికలతో అనుబంధం ఇంకా కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు నిర్వహణలో ముఖ్య పాత్ర. మిత్రుల సహకారంతో కాలిఫోర్నియా రచయితల తెలుగు కథల సమాహారం వెన్నెల్లో హరివిల్లు అనే కథా సంపుటి ప్రచురించారు.
వంశీ మాట్లాడుతూ తమ శాక్రిమెంటో ప్రాంతంలో గతంలో పిల్లలకు తెలుగు చెప్పే వారు ఉండేవారని, ప్రస్తుతం లేరని చెప్పారు. ఇది విచారకరమైన విషయం. తెలుగు భాషను నిలబెట్టే, బోధన సౌకర్యం, రాష్ట్ర రాజధాని నగరంలో లేకపోవటం విచారకరం. వెబ్సైట్ నిర్వహణలో సమయం ఎక్కువ కేటాయించ వలసిన అవసరం వుండటం వలన, తన తెలుగు బ్లాగు లో కొత్తవి రాయలేకపోతున్నానని తెలిపారు. ఈ సమావేశానికి బ్రహ్మానందం గారిని తనే ఆహ్వానించారు కాని వారిని మా ఇంటే ప్రధమంగా చూడటం అని తెలియటం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అబ్రకదబ్రాకు కూడా ఇదే తొలిసారి ఈ ప్రాంతపు రచయితలను కలవటం.
బ్రహ్మానందం గారు తాము 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు సందర్భంగా ప్రచురించిన కథా సంపుటి " వెన్నెల్లో హరివిల్లు" కథా సంపుటాల్ని సమావేశానికి హాజరైనవారికి అందచేశారు. అబ్రకదబ్రా సమావేశానికొస్తూ "Speeches That Changed the World" అనే విషయ ప్రాధాన్యత గల అందమైన బౌండ్ పుస్తకాన్ని, నాకు కానుకగా ఇచ్చారు. ఎందరో మహనీయుల కథలు, సూక్తుల తో ఉందీ గ్రంధం. ఈ పుస్తకాన్ని మరోసారి విపులంగా పరిచయం చేస్తాను.
బ్రహ్మానందం గారిని మీరు తెలుగులో బ్లాగు ప్రారంభించకూడదా అన్న ప్రశ్నకు బదులిస్తూ, తమకు తెలుగుబ్లాగు (http://www.sahitinandam.com/blog/?page_id=4) ఉందన్నారు. ఇది కూడలి లోకి ఎక్కినట్లుగా లేదు. తెలుగు బ్లాగు పాఠకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదు. కూడలి వారిని తమ జాబితాలో ఈ బ్లాగును చేర్చవలసినదిగా కోరుతాను. బ్రహ్మానందం గారు ఈ మాటలో రాస్తున్న మనకు తెలియని మన త్యాగరాజు కొరకు తంజావూరు ఇంకా అక్కడి సమీప ప్రాంతాలకు వెళ్లి,త్యాగరాజు పై పెక్కు పరిశోధనలు గావించిన పిదప, ఈ వ్యాసాలు వెలువరిస్తున్నానని తెలిపారు. నాటక రంగంతో తమకున్న అనుబంధం గురించి చెప్పారు. వీరి రచనలు ఈ మాట, కౌముది, నవతరంగం ఇంకా ఆంధ్రభూమి పత్రికలలో చూడవచ్చు. బ్రహ్మానందం గారి రచనలు గురించి ఒక ప్రత్యేక వ్యాసం రాయవలసిఉంటుంది.
చలం రచనల ఉధృతిలో సౌరిస్ రచనలు ఆంధ్రదేశం పెద్దగా పట్టించుకోలేదు. అదే పద్ధతిలో, బ్రహ్మానందంగారి కబుర్ల ప్రభావంలో అబ్రకదబ్రా కు పెద్దగా మాట్లాడే అవకాశం కలుగలేదు. మరోసారి వీరితో సమావేశమవ్వాలి. సమావేశం ముగిసాక కారు పార్కింగ్ లో బ్రహ్మానందంగారితో మాట్లాడే సమయంలో వచ్చారు ద్వాదశి అమర్. వీరు Media Communication ఇంకా అంతర్జాతీయ వ్యాపారం పై రెండు మాస్టర్స్ డిగ్రీల కోర్సులు చేశారు. జై చిరంజీవ, దేవదాసు చిత్రాల అమెరికా షూటింగ్ లో చక్కటి లొకేషన్స్ అన్వేషించటంలో, స్థానిక వ్యక్తులతో సంప్రదింపులు విషయంలో, ఆయా చిత్రాల దర్శక నిర్మాతలకు సహకరించి ఉన్నారు. సంభాషణ కొంతసేపు చిత్రాలపై మళ్లింది. అమర్ కు తెలుగు బ్లాగుల గురించి వివరించి ఉన్నాను, నా ఉత్తరాల ద్వారా. తను తెలుగు బ్లాగులు చదువుతానని, త్వరలో వ్యాఖ్యానాలతో తెలుగులో ప్రవేశం చేస్తానని, చెప్పారు. అమర్ కు చలన చిత్రాలపై అభిమానం మెండుగా ఉంది. తెలుగు, అంతర్జాతీయ చిత్రాల పై తనదైన ఫక్కీలో వ్యాసాలు రాస్తాడని ఆశిద్దాం.
ఇది శీతాకాలమవటంతో పగళ్లు పొట్టిగా రాత్రులు దీర్ఘంగా ఉంటున్నవిక్కడ. వేసవి లో రాత్రి 9 గంటలదాకా ఉండే సూర్యుడు సాయంకాలం 5 గంటల ప్రాంతానికే అస్తమిస్తున్నాడు. ఉన్న కొద్దిపాటి సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొందులకై, శీతాకాలం వస్తూనే గడియారం ఒక గంట వెనక్కు తిప్పుతారు. చలి ముదురుతూంది కావున కబుర్లు చాలించి, వీడ్కోలు తీసుకొన్నాము.
ఆదివారం, డిసెంబర్ 14, 2008
తెలుగు బ్లాగుల దినొత్సవ సందర్భంగా
ఒక చిన్న మాట. ఒక మంచి మాట. బ్లాగరులు వైవిధ్య భరితంగా పలు అంశాలను స్పృసిస్తూ చక్కటి టపాలను వెలువరించటం ముదావహం. వరంగల్ ఆసిడ్ కేసు పై స్పందన - ముంబాయి పై ఆటంకవాదులదాడి సందర్భంగా వచ్చిన స్పందనకు దాదాపు సమానంగా ఉంది. వేడిగా వాడిగా చర్చలు.
ఈ సందర్భంలో నా దృష్టికి వచ్చిన ఉత్తమ టపా ప్రసాదం బ్లాగులో ప్రచురితమైన నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే! మనసు బ్లాగరి సుజాత అమ్మాయిల పై ఆసిడ్ దాడి గురించి రాసిన ఆటవిక న్యాయం అమలైంది! , ఈ మాటలు రాసే సమయానికి 48 కామెంట్లతో hot post గా ఉంది.
స్ఫూర్తిదాయకమైన కథలతో నిండిన జీవితంలో కొత్త కోణం... బ్లాగు చూశారా? ఇలాంటి కథలు మనలోని మంచితనాన్ని నిద్ర లేపుతాయి. ఈ టపాలు బ్లాగు ప్రయోజనానికి ఒక ఉదాహరణగా నిలుస్తాయి.
తెలుగు బ్లాగు దినొత్సవ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంషలు.
ఈ సందర్భంలో నా దృష్టికి వచ్చిన ఉత్తమ టపా ప్రసాదం బ్లాగులో ప్రచురితమైన నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే! మనసు బ్లాగరి సుజాత అమ్మాయిల పై ఆసిడ్ దాడి గురించి రాసిన ఆటవిక న్యాయం అమలైంది! , ఈ మాటలు రాసే సమయానికి 48 కామెంట్లతో hot post గా ఉంది.
స్ఫూర్తిదాయకమైన కథలతో నిండిన జీవితంలో కొత్త కోణం... బ్లాగు చూశారా? ఇలాంటి కథలు మనలోని మంచితనాన్ని నిద్ర లేపుతాయి. ఈ టపాలు బ్లాగు ప్రయోజనానికి ఒక ఉదాహరణగా నిలుస్తాయి.
తెలుగు బ్లాగు దినొత్సవ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంషలు.
శనివారం, డిసెంబర్ 13, 2008
ఆహ్వానం: తెలుగు బ్లాగుల దినోత్సవ సమావేశం

ఈ ఆదివారం డిసెంబర్ 14, 2008 న మధ్యాహ్నం మూడు గంటలకు (3 P.M to 5 P.M. Plus)
సమావేశ స్థలము: Prof. వేమూరి వెంకటేశ్వర రావు గారి నివాసం ప్లసంటన్, సిలికాన్ వాలి, కాలిఫోర్నియా.
తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులందరికీ ఆహ్వానం. ఆసక్తికలవారు నాకు (cbraoin at gmail.com) ఉత్తరం రాస్తే, సమావేశస్థల చిరునామా తెలియపరుస్తాము.
-cbrao
Mobile: 408-466-5736
చివరి మాట: ఇది నా 200వ టపా.ఇన్నాళ్ల నా బ్లాగు ప్రయాణానికి సహకరించిన మీ అందరికీ, అచ్చుతప్పులు సరి చూసిన, సహధర్మచారిణి శ్రీమతి రమణకు ధన్యవాదాలు.
బ్లాగులు సమస్యలను పరిష్కరిస్తాయా?

లాస్ ఏంజెల్స్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే దారిలో రమణీయ ప్రాంతం Big Sur సమీపంలో Rainbow Bridge Photo: cbrao
తమ బ్లాగు Hindu Charities లో శ్రీనివాస్ అడుగుతున్నారు "Can Blogging solve real world problems and provide solutions to Millions of poor and illiterates?"
ఇది ఒక మిలియన్ డాలర్ కొశ్చన్. బ్లాగింగ్ అనేది ఇప్పటి దాకా అందరికీ తెలిసిన వ్యాస/కథా/నవలా రచనకు మరో రూపమే. ఈ రచనల ద్వారా రచయితలు ప్రపంచగతిని మార్చగలుగు తున్నారా? శ్రీనివాస్ అడిగిన ప్రశ్న, రచన ప్రయోజనం నెరవేరుతుందా అని? అచ్చు లో వచ్చే రచనలు బదులుగా, ఆధునిక శాస్త్ర విజ్ఞాన సహాయం తో, బ్లాగరులు తమ రచనలు బ్లాగులో ప్రచురించి, వాటిని తక్షణం పాఠకులకు అందచేస్తున్నారు. అచ్చు రచన పాఠకుడికి చేరాలంటే ప్రచురణ అయ్యేదాకా ఆగాల్సిందే. బ్లాగులో multimedia సహాయం తో, బ్లాగరు వీడియో లాంటి ప్రక్రియలను కూడా తన బ్లాగులో పెట్టి పాఠకులను రంజింప చేస్తున్నాడు. పాఠకుడికి ఇది కొత్త అనుభవాన్నిస్తుంది. ఉదాహరణకు Youtube ద్వారా ఎన్నో పాత, కొత్త తెలుగు పాటలు, వినోదాత్మక వ్యంగకార్యక్రమాలు మనకు అందచేస్తున్నారు బ్లాగరులు. ఆర్థిక,ఆరోగ్య, ఆధ్యాత్మిక,సంగీత, ఛాయా చిత్ర, చిత్ర లేఖనం, హాస్య, రాజకీయ, వార్తలు,ప్రజా సమస్యలు వగైరా విషయాలపై, ఎంతో విలువైన సమచారాన్ని పాఠకులు బ్లాగులు ద్వారా కంప్యూటర్ ఉన్న ప్రతి ఇంటిలో పొందగలుగుతున్నారు. ఇది సమాచార విప్లవమే. పత్రికలు ముద్రించటానికి వెనకడుగు వేసిన రచనలు బ్లాగు లేక పోతే, వెలుగులోకి వచ్చేవి కావు. అందులోని సమచారం కొన్నిసార్లు ఆసక్తికరంగా మారి, బ్లాగు నుంచి పత్రికకు వెళ్లిన సందర్భాలు లేకపోలేదు. లక్షలాది ప్రజల ఈతి బాధలను బ్లాగింగ్ తక్షణం తీర్చలేదు కాని, సమస్యను అర్ధం చేసుకోవటానికి బ్లాగింగ్ నిస్సందేహంగా ఉపయోగ పడుతుంది.
ఒక ఊహ, ప్రతిపాదన జీవన గతినే మార్చివెయ్యగలదు. సిద్ధాంతంలోంచే కదా విప్లవం వచ్చేది. కార్ల్ మార్క్స్ మార్క్సిజం అనే సిద్ధాంత ప్రతిపాదన చెయ్యక పోతె, రష్యా లో ఇంత విప్లవ మొచ్చేదా? జూలియస్ వెర్న్ రాసిన నవలల ఆధారంగా శాస్త్రజ్ఞులు సరికొత్తగా ఆలోచించి, నూతన ప్రయోగాలకు ఆవిష్కారం చేయలేదా?
ముంబాయి సహాయం అనే బ్లాగు లో వచ్చిన వ్యాసాలు, అందులో స్పృశించిన విషయాలు, ప్రజాబాహుళ్యానికి, విపత్కర పరిస్థితులైన, ముంబాయి పై ఆటంకవాదుల ముట్టడి, వరదలు సమయాలలో, ఎంతగానో ఉపయోగపడిన విషయం మీకు తెలుసు.నేడు బ్లాగరులు పలు సమస్యలపై తమ దృష్టి సారించి, తమదైన పరిష్కారం చూపిస్తున్నారు. సమస్యలను, వాటి పరిష్కారాలను, కొత్తగా ప్రభుత్వం కూడా గమనిస్తుంది. అయితే ఇది ఇంకా ప్రాధమిక స్థాయిలోనే ఉంది. ప్రభుత్వం, పత్రికలను గమనించినట్లుగా,భవిష్యత్లో, బ్లాగులలో వస్తున్న విషయాలను గంభీరంగా పరిశీలించే అవకాశముంది. ప్రజల సమస్యలకు బ్లాగింగ్ ద్వారా పరిష్కారం లభించగలదని ఆశిద్దాం.సమాజం, శాస్త్రం ముందుకు పోవాలంటే నూతన సిద్ధాంతాలు రావాలి. మేధో మధనం తోనే ఇవి ఉద్భవిస్తాయి. బ్లాగింగ్ అందుకు తోడ్పడగలదు.
గురువారం, డిసెంబర్ 11, 2008
తెలుగు బ్లాగుల దినోత్సవ సమావేశం

అమెరికా ఎన్నికల సమయంలో, ముంబాయి నగరం పై ఉగ్రవాదుల దాడి సమయంలోను బ్లాగరులు తమ వంతు కర్తవ్యాన్ని, అభినందనీయంగా నిర్వహించారు. ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి వారు కూడా స్వంత బ్లాగుల లో వారి అనుభవాలు రాస్తున్నారు.
రెండేళ్ల క్రితం, బ్లాగులు పెద్దగా తెలియకపోయినా, ఈ రోజున తెలుగు వారు బ్లాగుల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తున్నారు. పెరుగుతున్న తెలుగు బ్లాగులు, పాఠకుల సంఖ్యే ఈ విషయాన్ని తెలియచేస్తుంది. తెలుగు దిన పత్రికలు కూడా బ్లాగుల ప్రాముఖ్యాన్ని గుర్తించి, తమ తమ పత్రికలలో బ్లాగులు, తెలుగు వికిపీడియా గురించిన ప్రత్యేక వ్యాసాలు వెలువరిస్తున్నాయి. కేవలం అచ్చు పత్రికలకు రచనలు పంపే రచయితలు కూడా బ్లాగులు తెరిచి, బ్లాగులో తమ రచనలు వెలువరిస్తున్నారు.
డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం! సందర్భంగా తెలుగు రచయితలు, బ్లాగరులు, పాఠకులం సమావేశమవుదాము. సమావేశం లో ఏమి చెయ్యవచ్చు అనే విషయం పై వీవెన్ (లేఖిని, కూడలి ల నిర్వాహకులు) ఇలా అంటున్నారు.
"* అందరూ కలిసి ఏదైనా సామాజిక ప్రయోజనమున్న పని చేయవచ్చు.
* బ్లాగింగులోని సాంకేతిక లేదా ఇతర సమస్యలని ఇతరులని అడిగి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవచ్చు.
* అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
* లేదా, జాలంలో తెలుగుకై మరింత గంభీరమైన పనులూ చెయ్యవచ్చు:
*ఇప్పుడు కంప్యూటర్లలో తెలుగు చూడవచ్చు, టైపు చెయ్యవచ్చు అని మీ ప్రాంతంలోని ప్రజలకి తెలియజేయండి.
* తెలుగు వికీపీడియాలో మీ ఊరి గురించిన సమాచారం చేర్చండి.
* ఏదైనా కంప్యూటర్ ఉపకరణాన్ని తెలుగులోకి అనువదించండి.
* వందల్లో ఉన్న తెలుగు బ్లాగరులని వేలల్లోకి, వేలల్లో ఉన్న బ్లాగుల సందర్శకులని లక్షల్లోకి పెంచడమెలాగో ఆలోచించండి."
1. వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం
2. తెలుగు బ్లాగు
3. కంప్యూటరుకు తెలుగు నేర్పడమెలా?
పైన పేర్కొనబడిన మూడు అంశాలపై విపులమైన సమాచారం కోసం e- తెలుగు వారు ప్రచురించిన చిన్న పుస్తకాన్ని, ఈ కింది లింక్ నుంచి దిగుమతి చేసుకోవచ్చు.
http://www.bitingsparrow.com/biosymphony/computerlo_telugu.pdf
సిలికాన్ వాలి (Bay Area, California) రచయితలు, బ్లాగరులు ఇంకా పాఠకులు ఈ ఆదివారం డిసంబర్ 14 న సమావేశమవుదాము. తెలుగు భాష అభివృద్ధికై మన వంతు కృషి చేద్దాము. సమావేశానికి వచ్చే పాఠకులు, రచయితలు, బ్లాగరులు మీ ఆసక్తి ని నాకు (cbraoin at gmail.com) తప్పక తెలియ పరచండి. సమావేశ స్థలం, సమయం మీకు తెలియ చేస్తాము. ఈ సమావేశం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తే బాగుంటుందని ఆలొచన. సమావేశ స్థలి ఇంకా నిర్ణయం కాలేదు కావున, మీరు కూడా తగిన స్థలము సూచించవచ్చు.
ఉత్తర అమెరికా, కెనడా ప్రాంత బ్లాగరులు తమ తమ ఊళ్లలో బ్లాగొత్సవాలు జరిపి, తమ బ్లాగులలో సమావేశ వివరాలు, చిత్రాలతో సహా ప్రచురించ కోరుతాను.
ఆదివారం, డిసెంబర్ 07, 2008
తెలుగు బ్లాగు రచయితలు, పాఠకులు

Grass at Sea World of San Diego Photo: cbrao
గత రెండు సంవత్సరాలలో తెలుగు బ్లాగు రచయితలు, పాఠకులు గణనీయంగా పెరిగారు. కొత్త బ్లాగరుల బ్లాగుల సృజనలో, పోషణ (maintenance) విషయంలో, తెలుగుబ్లాగు గుంపు తన వంతు క్రియాశీలక పాత్రలో విజయవంతమైందని చెప్పవచ్చు. తెలుగు బ్లాగుల, తెలుగు వికి ల వ్యాప్తికి తెలుగుబ్లాగు, e-తెలుగు చెప్పుకోతగ్గ కృషి చేస్తున్నాయి. e- తెలుగు కార్యవర్గ సభ్యునిగా, మొదటినుంచీ ఈ సంఘ కార్యక్రమాలలో పాలుపంచుకుంటున్నా. బెంగళూరు తెలుగు బ్లాగరులు నెల నెల సమావేశాలు జరుపుకోవటానికి తెలుగుబ్లాగు గుంపు ప్రోత్సాహం చాలా ఉంది. e-తెలుగు తరఫున, హైదరాబాదు లో ప్రతి నెలా తెలుగు బ్లాగరుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల నివేదికలు గతం లో దీప్తిధార, జాబిల్లి, శోధన, e-తెలుగు ల లో మీరు చదివే ఉంటారని తలుస్తాను. మీరు తెలుగు బ్లాగులకు కొత్త అయినచో, e-తెలుగు సంఘం గురించి దీప్తిధార e - తెలుగు రెండవ అడుగు
http://deeptidhaara.blogspot.com/2007/02/e.html
టపాలో చూడవచ్చు. e--తెలుగు సంఘం bye-laws కూడా ఇదే టపాలోంచి దిగుమతి చేసుకోవచ్చు. భారతదేశంలోని పట్టణాలలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా తెలుగు పాఠకులు,బ్లాగరులు తరుచూ కలుసుకోవాలనీ, తెలుగు భాషా వ్యాప్తికి తమ వంతు కృషి చెయ్యాలని, ఆశిస్తాము. గతంలో అమెరికా బ్లాగరులు ఒక virtual meeting జరిపారు. ఇప్పుడు అడపాతడపా కూడలి కబుర్లలో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కబుర్ల స్ఫూర్తిగా మహిళా బ్లాగరులు కబుర్లలో భాగంగా ప్రమదావనం ఛాట్ నిర్వహిస్తున్నారు.
నేను అమెరికా వచ్చాక, నేను నా వద్ద ఉన్న సమాచారం మేరకు, తెలుగు బ్లాగరులను, పాఠకులను కలవగలిగాను. ఇంతవరకూ డెట్రాయిట్, వాషింగ్టన్, అట్లాంటా, కొలంబస్, డెన్వర్ ఇంక చికాగో పట్టణాల లోని తెలుగు బ్లాగరులు, పాఠకులను కలుసుకోగలిగాను. తరచూ ప్రయాణాలలో ఉండటం వలన ఈ సమావేశాల నివేదిక ఇవ్వటం వీలుపడలేదు. వీలు చేసుకొని, ఈ నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడకు కేవలం సందర్శకుడిగా వచ్చిన కారణంగా పలు నగరాలు సందర్శించే వీలు కలిగింది. ఫిబ్రవరి దాకా ఇక్కడే (ఉత్తర అమెరికా, కాలిఫోర్నియా) ఉండగలను. ఈ కాలిఫోర్నియాలోనే పలు బ్లాగరులు, తెలుగు పాఠకులు ఉన్నారు. వీలు వెంబడి వీరందరినీ కలవాలని తలంపు. కాలిఫోర్నియా నివాస బ్లాగరులు, పాఠకులు మీ contact information నాకు పంపగలరు. మీ వీలునుబట్టి సామూహికం లేక వ్యక్తిగత సమావేశమవుదాము. అమెరికా లోని ఇతర ప్రాంతాలలో నివసించే వారు కూడా మీ contact info నాకు పంపకోరుతాను. నా పర్యటనలో భాగంగా మిమ్ములను కలిసే ప్రయత్నం చేస్తా.

ఈ bloggers & readers data base ఆధారంగా మీకై మీరే ఈ సమావేశాలు నిర్వహించుకోవచ్చు, హైదరాబాదు బ్లాగర్లవలే. డెట్రాయిట్ ప్రాంతంలో తెలుగు బ్లాగరులు, పాఠకులు ఉన్నారు. ప్రాణహిత అంతర్జాల పత్రిక వారు కూడా ఈ చుట్టుపక్కలే ఉన్నారు.వీరంతా నెలకోసారి కలిసే వీలుంది. ఆ ప్రయత్నం చెయ్యవలసినదిగా అక్కడి వారిని కోరుతున్నా. ప్రస్తుతం చికాగో, కొలంబస్ లోని బ్లాగర్ల సమావేశానికి నా వంతు కృషి చేస్తున్నా. వీలు వెంబడి మిగతా ఊళ్లలో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలి. అమెరికాలో దూరాలు ఎక్కువే. దూరాభారాన్ని లెక్కచెయ్యకుండా సమావేశం నిర్వహించటం కష్టమే అయినా, మనసుంటే మార్గముండక పోదు.
అన్ని ఊళ్లలో తెలుగు బ్లాగరులు సమావేశమవ్వాలి; తెలుగు భాష, బ్లాగుల, తెలుగు వికీ అభివృద్ధికై కృషి చెయ్యాలి. పరస్పర సహాయం అందించుకోవాలి. ఈ కింది టపా లో సూచించిన విధంగా మరికొన్ని పనులు చెయ్యవచ్చు.
http://veeven.wordpress.com/2008/12/06/december-second-sunday/
ఉత్తర అమెరికా తెలుగు బ్లాగరులు, పాఠకులు (భవిష్యత్లో బ్లాగరులు?) మీ contact info నాకు పంపగలరు. సమావేశాల గురించి,సమాచార చిట్టా (database)విశ్లేషించి,మీకు తెలియ చేస్తాను. తెలుగు అభ్యుదయానికి మన వంతు తోడ్పడుదాం. తెలుగు బ్లాగులు,వికి ద్వారా తెలుగు భాషలో అందరికీ పనికి వచ్చే మరింత ఉపయుక్త సమాచారాన్ని చేరుద్దాం.
శుక్రవారం, డిసెంబర్ 05, 2008
బ్లాగులు: కొత్త తెలుగు బ్లాగుల సంకలిని (Aggregator)

అడవి పువ్వు, శాంతాక్రజ్ సముద్ర తీరంలో, కాలిఫోర్నియా Photo: cbrao
మీరు చూశారా? బ్లాగులు -కొత్త సంకలిని.
ఈ సంకలిని లో కొత్త ఏమిటి? కూడలి, జల్లెడ లో లేనివి ఇందులో ఏమున్నాయి? ఈ సంకలిని ప్రత్యేకత ఏమిటి? పాత సంకలినులలో కొత్త టపాలు, పాత టపాలను వెనక్కి నెట్టివేయటమూ, ఆపై పాత బ్లాగులు అంతర్ధానం అవటం జరుగుతుంది. కొత్త బ్లాగులు సంకలిని లో సరికొత్త బ్లాగులు పైన వుంటాయి. మీ బ్లాగులో ఛాయచిత్రం లేక కార్టూన్ లాంటివి ఉంటే అవి కూడా ఈ సంకలినిలో కనపడతాయి. కూడలి/జల్లెడ లో లేని అంశమిది. మీ బ్లాగు లో కొత్త పోస్ట్ వచ్చేదాక, పాత పోస్ట్ కనిపిస్తూంటుంది. దీనివలన ఉపయోగమేమంటే, పలాన వ్యాసం ఆ బ్లాగులో చదివా; ఆ బ్లాగు చిరునామా ఏమిటని తలబద్దలు కొట్టుకొనవసరం లేదు. ఎందుకంటే అన్ని బ్లాగులూ టపాలతో సహా ఎల్లవేళలా అందుబాటులో వుంటాయి కనుక. ఇది పాఠకులకు ఎంతో ఉపయోగపడే అంశం. ఇప్పటి దాకా సుమారుగా 206 బ్లాగులు ఈ ఫీడ్ రీడర్ లో జత చేయబడున్నాయి. భవిష్యత్లో వీటి సంఖ్య మరింత పెరుగగలదని నిర్వాహకులు తెలియచేస్తున్నారు.
ఇది కాక, మహిళా బ్లాగరుల ప్రత్యేక సంకలినికి కూడా ఇందులో లింకుంది. ఇందులో కూడా ఛాయా చిత్రాలు ప్రదర్శితమవుతాయి. ఇంకో సంకలిని వీడియో బ్లాగులకోసం ఉద్దేశించినది. ఈ వీడియో సంకలిని పెద్దలకు మాత్రమో లేక అందరికీ ఉద్దేశించినదో స్పష్టమవలేదు. నిర్వాహకులు పెద్దలకు మాత్రమే, అందరికీ వర్గాలను ప్రత్యేక సంకలినులుగా వెలువరిస్తే, పాఠకులు ఎవరికి కావలిసినది మాత్రమే వారు చూడగలరు.
బ్లాగులు -కొత్త సంకలిని కోసం ఈ దిగువ చిరునామాలో చూడండి.
http://blogulu.blogspot.com/
మహిళా (21 రచయిత్రుల) బ్లాగుల సంకలిని దిగువున
http://sarath3.blogspot.com/
వీడియో బ్లాగులకై
http://sarath2.blogspot.com/
ఈ కొత్త సంకలినుల సారధి శరత్. ఈ శరత్ గుర్తున్నారా? "పెద్దలకు మాత్రమే" వర్గపు రచనలు తన బ్లాగులో ఉంచటంతో, మన బ్లాగు మిత్రుల ఆగ్రహానికి గురై కూడలి నుంచి వెలివేయబడ్డాడు. ఆ శరత్ యే ఈ శరత్. గత అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని, శరత్ బాధ్యతాయుతంగా వ్యవహరించగలరని ఆశిద్దాం. ఈ కొత్త సంకలిని - బ్లాగులు లోని కొత్త సదుపాయలను మీరూ ఆనందించండి.
బుధవారం, డిసెంబర్ 03, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -14
శాన్ హోసే (కాలిఫోర్నియా) రహదారి పక్కన చెట్టు కింద మాపిల్ ఆకులు Photo: cbrao
మహా నటి సావిత్రి
గతంలో ఎన్నడూ చూడని అరుదైన చిత్రాలు అందించినందులకు అభినందనలు. మీ వ్యాసం మరో సారి మహా నటిని గుర్తుకు తెచ్చింది. ఆమె జీవితం ఇప్పటి నటీమణులకు ఒక కనువిప్పు కాగలదు.
http://aradhanaa.blogspot.com/2008/11/blog-post_22.html
సిటిజెన్ కేన్
ఈ చిత్ర సమీక్ష చూడటానికి ముందే ఈ అమెరికన్ సంక్రాంతి (Thanksgiving) కి, కాలిఫోర్నియ పసిఫిక్ సముద్ర తీరం, సాన్ సిమియాన్ లోని ప్రఖ్యాతి కాంచిన Hearst Castle ను చూడాలని ప్రయాణం పెట్టుకున్నా. సమీక్ష చదివాక అదే భవనాన్ని కొత్తకోణంలో చూడాల్సుంటుంది. ఈ చిత్రం DVD ఇక్కడ (శాన్ హోజే) లభ్యమవుతుందా?
http://navatarangam.com/2008/11/citizen-kane-revie/
మార్గదర్శి
Film based camera N 75 చాలా కాలం క్రితం భారతదేశం లో కొన్నారా? ఇప్పుడు film S.L.R's ఎక్కడా కానరావు.మీరు మరలా మార్గదర్శి లో చేరితే, సరికొత్త Digital S.L.R. కొనవచ్చు.మీరుండే చోట మార్గదర్శి ఉందేమో వాకబు చెయ్యగలరు.
Word verification అనే పరీక్ష మాకు తప్పదా?
http://nasitralu.blogspot.com/2008/11/blog-post.html
చరిత్ర అడక్కు, చూపింది చూడు
శ్రీ రామదాసు చిత్రాన్ని, మీ రచనలో పండిన వ్యంగాన్ని రెండిటినీ సమంగా ఆనందించాను. ప్రజలకు కావలసినది వినోదమేగా. "చరిత్ర అడక్కు, చూపింది చూడు" - ఈ సూత్రాన్ని అన్వయించుకుంటేనే, చిత్రాన్ని ఆనందించగలము. ఈకలు పీకితే చిత్ర వధ అవుతుంది.
http://anilroyal.wordpress.com/2008/11/24/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%8f%e0%b0%b8%e0%b1%81%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%a1%e0%b1%81/
నవతరంగం
నవతరంగం కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. సినిమా మీడియా లోని పలు కోణాలను నవతరంగం స్పృజించింది. ఉత్తమ చిత్ర పరిచయాల వెబ్సైట్ గా మిత్రులకు పరిచయం చేస్తున్నాను. ఇందులో ప్రచురితమైన కొన్ని ప్రత్యేక వ్యాసాలు, పుస్తక రూపంలో రావాలసిన అవసరం ఉంది. భారత దేశం లో చాలా మందికి ఇంటర్నెట్ చూసే అలవాటు లేదు. ఇంటర్నెట్ తరచుగా చూసే యువతరం కు అచ్చు పుస్తకాలు చదివే సమయం వుండదు. అచ్చు, వెబ్ దేని పాఠకులు దానికి వేరే ఉన్నారు.
http://navatarangam.com/2008/11/help-navatarangam/
గాస్ ధరలు: పెరుగుట విరుగుట కొరకే
మీ ఊరు రమ్మన్న ఆహ్వానానికి ధన్యవాదాలు. మీరు మధురా నగరి (Kansas City) లో, నేను సాధు హోజేపురం (San Jose) లో ఉండటం వలన, ఈ రెండు ఊళ్ల మధ్య ఉన్న భౌతిక దూరంవలన, మీ ఆహ్వానం మేరకు కలవటానికి, ఎదైనా మాంత్రిక తివాసీ లేక ఆకు పసరు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. వీలు కుదిరినప్పుడు, మీ ఊరొస్తా తప్పకుండా. ఒబామా, మెకెయిన్, ఈ ఇద్దరూ నాకు అపరిచితులే. మీలాంటి మితృలతో, చేసే చర్చలు ద్వారా తెలిసిన , ఇక్కడి ప్రజల మనోభావాలే, మీ ముందుంచా. అయితే అందరికీ మీ అంతగా అమెరికన్ పార్టీల చరిత్ర తెలిసియుండక పోవచ్చు. చరిత్ర సరే, ఇంతకూ ఏ కారణం వలన గాస్ ధరలు తగ్గాయని మీరు తలుస్తున్నారో వివరించి ఉంటే సమస్యను అర్థం చేసుకోవటానికి ఒక కొత్తకోణం దొరికిఉండేది. డెమొక్రాట్ల పరిపాలన బాగుండదని మీరు ఎందుకు భావిస్తున్నారో తెలియటం లేదు. మీ బ్లాగు చిరునామా ఇవ్వగలరు.
http://deeptidhaara.blogspot.com/2008/11/blog-post_25.html
ఆపిల్ కంప్యూటర్ సాధారణ వాడకానికి పనికి రాదా?
ఆపిల్ కంప్యూటర్ పై రాస్తున్న మీ వ్యాసాలు ప్రత్యేక వర్గానికి చెందినవి. మన తెలుగు బ్లాగరులలో, మాక్ వాడే వారున్నారు. కాని ఆపిల్ గురించిన వ్యాసాలు వచ్చినవి బహు కొద్ది మాత్రమే. గత నెలగా నేను కూడా ఆపిల్ మాక్ లెపర్డ్ 10.5 వాడుతున్నా. కొత్తలో Operating Manual లేక పోవటంతో తిక మక పడ్డా. మీరు రాయబోయే వ్యాసాలతో మన బ్లాగరుల దృష్టి Mac system పై పడగలదని ఆశిద్దాం. మీ e-mail తెలుపుతూ నాకు ఒక ఉత్తరం రాయండి.
http://kannagadu.blogspot.com/2008/11/blog-post.html
శాన్ ఫ్రాన్సిస్కో చూడర బాబు
మీ co-cameraman చందూ ఎవరు? ఎడిటింగ్ పదునుగా, చక్కటి థీం సాంగ్ తో Pier 39 funky styles తో వీడియో బాగుంది.
http://anilroyal.wordpress.com/2008/12/01/%e0%b0%95%e0%b0%b2%e0%b0%be%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b8%e0%b0%a8-3/
బుధవారం, నవంబర్ 26, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -13

Burning glory tree at Stanford,Palo Alto,CA Photo:cbrao
తెలుగు పాటల్లో మితిమీరిన ఉచ్ఛారణా దోషాలు
అలనాటి పాత చిత్రాల లోని పాటలు చక్కటి సంగీతం, సాహిత్యాల తో కూడి, తెలుగు వచ్చిన గాయకులు, భాష, భావం చెడకుండా పాడటం వలన వినసొంపుగా ఉండేవి. పర భాషా గాయకులకు, తెలుగు భాషపై పట్టులేని కారణంగా, ఉచ్ఛారణా దోషాలతో హింసిస్తున్నారు. వీరిపై మన సంగీత దర్శకులు వ్యామోహం కొంత తగ్గించుకోవటం అవసరం. లేకుంటే మనము కూడా, Queen's English Society లాగా, తెలుగు పాటల్లో, తెలుగు రక్షణకై ఒక సంస్థ స్థాపించి, దానిని e-Telugu సంఘం లో ఒక శాఖగా చెయ్యటం, ప్రస్తుత కర్తవ్యం గా తోస్తుంది.
http://anilroyal.wordpress.com/2008/11/17/%e0%b0%a8%e0%b1%80%e0%b0%b0%e0%b0%b8-%e0%b0%b9%e0%b1%83%e0%b0%a6%e0%b0%af%e0%b0%82/
బంగారం ముచ్చట్లు
"ప్రేమలూ, గీమలూ, అల్లరీ, గిల్లరీ .. ఇలాంటివన్నీ మీరు కూడా విని ఆనందించాలంటే.. "
మీదే ఆలస్యం. వినటానికి మేము సిద్ధం.
http://madhuravaani.blogspot.com/2008/11/blog-post_25.html
నొప్పించే ఉత్తరాలు
cbrao: Private నుంచి Public life లోకి వచ్చినట్లే, బ్లాగరి అయ్యాక. ఆకాశరామన్న వ్యాఖ్యలను తట్టుకోవటం కష్టమే. వారు చాలా నిర్మొహమాటంగా, నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేసేస్తుంటారు. మన తోటి బ్లాగరులు సెలవిచ్చినట్లుగా, కొంచం తోలు మందం చేసుకోక తప్పదు. తమ పేరుతో రాసే వారు అవతలవారి మనో భావాలను గ్రహించి, చెప్పదలచిన విషయాన్ని, నొప్పించని విధంగా రాయటం అభిలషణీయం.
కొత్తపాళి: హెంత అమాయకులండీ!
బ్లాగోత్తముడు ఉపదేశించిన బ్లాగీతలో ఇలా చెప్పాడు.
వ్యాఖ్యాత బ్లాగరికంటే ఎల్లప్పుడూ తెలివైనవాడు అని బ్లాగాది యందే నాచే చెప్పబడి యున్నది. బ్లాగు నాది వ్యాఖ్య నీది అనుకోవడం నీ అహం, నా మాయ.
బ్లాగులోనూ, వ్యాఖ్యలోనూ వ్యాపించియున్న సర్వబ్లాగామి స్వరూపాన్ని నేనే యని గుర్తించుము.
ఈ సూత్రాల మీద బ్లాగర్షి వ్యాఖ్యానిస్తూ (బ్లాగున్నాక వ్యాఖ్య ఉండాలి గదా), నేటి బ్లాగరే రేపటి వ్యాఖ్యాత. ఒకే బ్లాగాత్మ కొంత తడవు బ్లాగరిగానూ కొంత తడవు వ్యాఖ్యాతగానూ ప్రకటిత మగుచున్నాడు. అని సెలవిచ్చారు.ఇట్టి బ్లాగ్సత్యమును ఎరిగిన వారు తమ బ్లాగుల్లో నెగటివ్ వ్యాఖ్యలు లేక సుఖ సంతోషములత్ నుందురు.
http://sangharshana.blogspot.com/2008/11/blog-post_21.html
ఇళ్ళ ఋణాలు మాఫీ పధకం
ఒబామా పదవిలో కొస్తే , ఇళ్ల ఋణాలు మాఫీ అంటే దేశం కొల్లేరవుతుంది. చివరకు దేశాన్ని ప్రపంచ బాంక్ కు తాకట్టు పెట్టే దుస్థితి ఏర్పడే ప్రమాదం. ఇంతమంది సహాయకులు (వాళ్లలో భారతీయులు ఉండవచ్చని అంచనా) తాము ఒబామాకు రాసే ఉపన్యాసాలలో, ఇళ్ళ ఋణాలు మాఫీ పధకం చేర్చకుండా, ఎలా, వదిలేశారు అనేది ఆశ్చర్యమే.
http://blog.vihaari.net/2008/11/blog-post_23.html
పుట్టిన రోజు
ఆడవాళ్లకీ పుట్టిన రోజుకీ ఉన్న అనుబంధం ఎంతో మాటలలో చెప్పలేనిది. అనుభవించాల్సిందే. ఆ అనుభవం రావాలంటే భార్య పుట్టిన రోజు మరచి చూడండో సారి.
@రమణి: పుట్టిన రోజు శుభాకాంషలు.
http://manalomanamaata.blogspot.com/2008/11/blog-post_19.html
Theaters & Multiplexes
చిత్రాల సమీక్షతో బాటు, మంచి చిత్రశాలల సమీక్ష కూడా మన తెలుగు బ్లాగరులు రాస్తే ఉపయోగంగా ఉంటుంది. పాఠకులు కొత్తఊరు వెళ్లినప్పుడు, ఇలాంటి ప్రత్యేకతలున్న, చిత్రశాలలు చూసే వీలు కలుగుతుంది. శాన్ హోజే ప్రాంతంలో AMC 20 మంచి చిత్రశాలల (20 Screens) గుంపు.
http://deeptidhaara.blogspot.com/2008/11/blog-post.html
అట్రాసిటి చట్టం తో మేలు కంటే కీడే ఎక్కువ
అవును, ఆంధ్రజ్యోతి పత్రికా సంపాదకులనే ఈ చట్టం కింద ఖైదు చేశారు. కార్యాలయాలలో కింద ఉద్యోగి S.C/S.T. అయితే, పై అధికారులు పని విషయం లో గట్టిగా అడగలేని పరిస్థితి. బ్లాక్ మెయిల్ వగైరా లాంటి పనులతో, ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది. కాలానుగుణ మార్పులు అభిలషణీయం.
http://parishodana-prakshalana.blogspot.com/2008/11/blog-post_20.html
మంగళవారం, నవంబర్ 25, 2008
అమెరికా నుంచి ఉత్తరం

అమెరికా ప్రజలు తమ జీవితాలలో మార్పు రావాలనుకుంటున్నారు. ఉద్యోగ అభద్రత, నిరుద్యోగం ఇంకా మొన్నటి దాకా గట్టుమీదున్న గాస్ (పెట్రోల్) ధరల సమస్యలతో, ఇక్కడి వారు విసిగి వేసారుతున్నారు. గాలన్ (1 US gallon = 3.78 liters) గాస్ నాలుగు డాలర్లు మించితే,కారు వాడకం తగ్గించారు. హైబ్రిడ్ కార్ల గురించిన అవగాహన పెంచుకుంటున్నారిక్కడ. బుష్ ప్రభుత్వ విధానాలే తమ దేశ ఆర్థిక స్థితిని ఇలా నెట్టివేసిందని, ఒబామా వస్తే పూర్వ వైభవం పునరావృతం కాగలదని పెద్ద ఆశలో ఉన్నారు. చాలా చోట్ల భారతీయులలో ఒబామా పట్ల అనుకూల వైఖరి కనిపించింది. ఒబామా ఎన్నికల ఖర్చుల నిమిత్తం పలు భారతీయులు తమ విరాళాలు అందచేశారు. బుష్ కు ఆయిల్ కంపనీల లో పెట్టుబడులున్నవి కనుక చమురు ధర పెరిగినా పట్టించుకోవటం లేదని, వాల్ స్ట్రీట్ (US Stock exchange) లో జరుగుతున్న futures trading లోని మితిమీరిన speculation కు ఒబామా రాకతో, సంకెళ్లు పడి, చమురు ధరలు తగ్గి, ప్రస్తుతం గాలన్ గాస్ ధర రెండు డాలర్ల లోపు రావటం, ప్రజలకు ఊరట నిచ్చింది. రాబోయే మూడేళ్లలో 2.5 మిలియన్ కొత్త ఉద్యోగాల సృజనకై, ఒబామ ఆర్థికవేత్తలతో కలిపి ప్రణాళికలు రచిస్తున్నాడు.
ఇంత ఆర్థిక మాంద్యం లో కూడా అమెరికా డాలరు గట్టిపడటం పెద్ద విశేషంగా చెప్పాలి. బ్రిటన్ పౌండ్, భారతీయ రూపాయ తో పోలిస్తే, డాలర్ పటిష్టంగా ఉంది. ఇది అమెరికా కు ఆశాజనకమైన విషయం. ఇక్కడ చాలా ఉత్పత్తుల పై చైనా లో తయారయినవి అనే లేబుల్ కనిపించటం మామూలు. వినియోగ వస్తువులన్నీ అమెరికా దిగుమతి చేసుకొంటుంది. దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కెమారాలు, ఆహార వస్తువులు ఎన్నో వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు ఉభయ దేశాలకూ లాభమే.
అమెరికాను అతలాకుతలం చేసిన Sub Prime Crisis నుంచి తెరుకోవటానికి ఇంకో సంవత్సరం పట్టవచ్చు. కొత్త అప్పులు ఇచ్చే విషయంలో చేతులు కాలాక, ప్రస్తుతం ఇక్కడి బాంకులు జాగరూకతో వ్యవహరిస్తున్నాయి. అమెరికాను సాంకేతికంగా, ఆర్థికంగా పరిపుష్టి చెయ్యటానికి ఒబామా ఎన్నో కలలు కంటున్నాడు. ఆ కలలు (The Blueprint for Change) ను ఇక్కడ నుంచి దిగుమతిచేసుకోవచ్చు. కలలు ఫలించాలని, ఇక్కడి ప్రజల సంబరం, కలకాలం నిలవాలనీ ఆశిద్దాం. ఈ ప్రపంచీకరణలో, వసుధైక కుటుంబం అనే భావన, అన్ని దేశాలు సుఖ, సంతోషాలతో ఉండటం లోనే మన భారతీయుల అభ్యున్నతి ఉంటుంది.
గురువారం, నవంబర్ 20, 2008
స్లండాగ్ మిలియనేర్ సమీక్ష

All pictures courtesy: Fox
టొరొంటో లో People's Choice award వచ్చాక, Slumdog Millionaire చిత్రం ఆస్కార్ కు కూడా పరిగణింపబడే అవకాశాలున్నాయని, పలు పత్రిక్లలో విమర్శకులు ఊహాగానాలు చేస్తున్నారు. అంతే కాదు తమ పత్రికలలో అద్భుతమైన సమీక్షలు రాసి 10 కి 8 లేక 9 మార్కులు ఇచ్చి ఈ చిత్రానికి అగ్రస్థానం ఇస్తున్నారు. విమర్శకులను ఇంతగా మెప్పించిన ఈ చిత్రంలో ఏముంది?
ఈ చిత్రం లో, కటిక దారిద్ర్యం, వ్యభిచారం, పిల్లలపై అత్యాచారాలు, మురికి వాడలు, చెత్త నింపే స్థలం (dumping yard) లో పనికివచ్చే కాగితం వగైరా ఏరుకునే పిల్లలు వగైరా లాంటి అతి వాస్తవిక దృశ్యాలతో కూడిన జీవితాన్ని, నగ్నంగా చూపెట్టడం మనలను దిగ్భ్రమకు గురి చేస్తుంది.బురదలోంచి పద్మం వికసించినట్లుగా ఇలాంటి వాతావరణం లోంచే ఎదిగిన, జమాల్ మాలిక్ (ఇంగ్లాండ్ నటుడు దేవ్ పటేల్) , కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో రెండు కోట్లు గెల్చుకున్నాడంటే, ఆశ్చర్యం కలుగక మానదు. ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా నడుస్తుంది. ఒక హాలీవుడ్ చిత్రానికి సగటు నిర్మాణ ఖర్చు 80 మిలియన్ డాలర్ల ఖర్చువుతున్న సమయంలో, బ్రిటీష్ దర్శకుడు డాని బాయిల్ రూపొందించిన ఈ చిత్రం కేవలం 15 మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడింది.ఇంత తక్కువ బడ్జెట్ లో నిర్మిచిన ఈ చిత్రం, కేవలం ఐదు రోజులలో, ఉత్తర అమెరికా లోని 10 సినిమాహాళ్లకు కలిపి, $420,000 వసూలు చెయ్యడం విశేషం.

వికాస్ స్వరూప్ రాసిన Q & A నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్ర కథా నాయకుడు రాం మొహమ్మద్ థామస్ (చిత్రంలో జమాల్ మాలిక్ గా మార్చారు) ని పొలీస్ స్టేషన్ లో ఇంటరాగేషన్ చేస్తున్న సన్నివేశం తో చిత్రం ప్రారంభమవుతుంది. Call Centre లో కేవలం చాయ్ అమ్మే కుర్రవాడు ఇన్ని ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పగలుగుతున్నాడు? ఇందులో ఏదో మోసం ఉందని అనుమానించిన క్విజ్ నిర్వాహకుడు అనిల్ కపూర్, జమాల్ మాలిక్ ను పొలీసులకు అప్పచెప్పి నిజం కనుక్కునే ప్రయత్నం చేస్తుంటాడు.
చిత్ర దర్శకుడు, పొలీస్ ఇనస్పెక్టర్ ఇర్ఫాన్ ఖాన్ అడిగే ప్రశ్నలకు, నాయకుడితో జవాబులు చెప్పిస్తూనే, కథను ముందుకు నడపటం జరిగింది. కథ ఇలాగా భూత, వర్తమానాల మధ్య నడుపుతూ, కథ చెప్పిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒక ప్రశ్న దూరంలో గేం షో యొక్క బహుమతి మొత్తాన్ని గెలుచుకునే సమయంలో కూడా తన బాల్య స్నేహితురాలు లతిక (ముంబాయి మోడల్ Freida Pinto ప్రధమ చిత్రం) ఆపదలోంచి బయటపడి క్షేమంగా వుందన్న వార్త తెలియటమే పెద్ద బహుమతిగా భావిస్తాడు నాయకుడు. అనిల్ కపూర్ అడిగే ప్రతి ప్రశ్నకూ తన జీవితం లో ఎదో ఒక ఘట్టానికి దగ్గర సంబంధముడటం వలన సమాధానాలు కష్టపడకుండా చెప్పగలగడం ఒక విధి వైచిత్రం కావచ్చు. ఈ ఆటలో పాల్గొంటున్న సమయంలో తప్పి పోయిన తన బాల్య స్నేహితురాలు, ఈ ఆట ఎక్కడినుంచైనా చూసి తనను కలుస్తుందేమోనన్న ఆశ, నాయకుడి కళ్లలో మెరుపుగా కనిపిస్తుంది. ఇదంతా చదివి ఇది మరో ప్రేమ కధ అనుకునేరు. ప్రేమ అంతర్లీనంగా ఉంటుందే కాని,దారిద్ర్య రేఖకు దిగువన వున్న కుర్రవాడి జీవితం లోని ఎత్తుపల్లాలు చూపిందీ చిత్రం. దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం మనలను ఆకట్టుకొంటుంది. ఈ చిత్రానికి Casting Director గా పని చేసిన లవ్లీన్ టాండన్ కు సహ దర్శకురాలిగా దర్శకుడు చిత్రం టైటిల్స్లో గౌరవం ఇవ్వటం కొనియాడతగ్గది. ఈ చిత్రంలో ఆమె పనితనం కూడా మనకు కనిపిస్తుంది.

మొదట ఈ చిత్రంలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమ నిర్వాహకుడిగా నటించటానికి అమితాబ్, షారుఖ్లను అడిగితే, వారు కాదనటం వలన అనిల్ కపూర్ కు ఈ పాత్ర దక్కింది. అనిల్ కపూర్ తన పాత్రలో జీవించారని చెప్పటం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్ర నాయకి ఫ్రైడా పింటో తొలి చిత్రం తోనే ఎంతో పేరు తెచ్చుకుంది. రాబోయే చిత్రాలలో ఈమె నాయికగా కనిపించగలదు.ఈ చిత్రంతో దేవ్ పటేల్ మంచి నటుడిగా నిరూపించుకున్నాడు.
Anthony Dod Mantel ఛాయగ్రహణం కనుల కింపుగా ఉంది. ముంబాయి లోని బహుళ అంతస్తుల భవనాలు, వాటికి వైరుధ్యంగా మురికి వాడలు,అక్కడ నివసించే వారి జీవన విధానం లో మనకు తెలియని కొన్ని కొత్త విషయాలు ఆవిష్కరించగలిగాడు. Simon Beaufoy చిత్రానువాదం బాగుంది. Chris Dickens కూర్పు పదునుగా ఉండి కథను వేగంగా నడిపించింది. A.R.Rahman సంగీతం సందర్భొచితంగా ఉంది.
Loveleen Tandan
భారతదేశం లో నిర్మించిన చిత్రం లో ఒక duet/group song లేక పోతే బాగోదని లవ్లీన్ చిత్రం చివరలో నాయికా నాయకుల మధ్య ఒక నృత్య సన్నివేశం ఉంచటం ఒక విశేషం. చిత్రం చివరలో Credits చూపే సమయం లో కనిపిస్తుందీ నృత్యం. ఈ చిత్రానికి దర్శకత్వం లేక ఉత్తమ చిత్రం శాఖలలో ఆస్కార్ బహుమతి రావచ్చని సినీ విమర్శకుల ఊహాగానం. చూడతగ్గదీ చిత్రం.
బుధవారం, నవంబర్ 19, 2008
శాన్ ఫ్రాన్సిస్కో లో స్లండాగ్ మిలియనేర్

కాస్ట్రో థీయేటర్ ప్రాంగణం Photo: cbrao
స్లండాగ్ మిలియనేర్ (Slumdog Millionaire) చిత్రం గురించిన వార్తలు, ముఖ్యంగా టోరాంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో People's Choice Award గెలుచుకున్నప్పటినుంచి, ఈ చిత్రం ఆస్కార్ బహుమతికి కూడా పరిగణింపబడవచ్చన్న వార్తలు విన్న తరువాత, ఈ చిత్రం చూడాలనే ఆసక్తి పెరిగింది.

మూడవ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలన చిత్ర మహోత్సవం Photo:cbrao
శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలన చిత్ర మహోత్సవంలో ఈ చిత్రం కూడా వుందని తెలిసాక, శాన్ ఫ్రాన్సిస్కో లో ఈ చిత్రం చూడటం జరిగింది ఆదివారం నవంబర్ 16, 2008 న.
శాన్ ఫ్రాన్సిస్కో నగరం రహదారులు ఎత్తు పల్లాలతో, ఎన్నో మలుపులతో, సుందరమైన దృశ్యాలతో చూడసొంపుగా ఉంది. కొన్ని రహదారులయితే ఏటవాలుగా చాల ఎత్తుగా ఉన్నాయి. కాస్ట్రో ప్రాంతానికి సమాంతరంగా ఉన్న రహదారిలోంచి, మా కారు మలుపు తిరిగి స్లండాగ్ మిలియనేర్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న కాస్ట్రో థీయేటర్ చేరింది కాని కారు నిలుపుకునే స్థలం లభించక, కారు పెట్టుకునే స్థలం కోరకు సుమారు ఒక 15 నిమిషాల అన్వేషణ తర్వాత, అదృష్టవశాత్తు థీయేటర్ కు సమీపం లోనే కారు నిలుపుకునే స్థలం లభించటంతో, మా అదృష్టాన్ని మేమే అభినందించుకున్నాము. కాస్ట్రో థీయేటర్ శాన్ ఫ్రాన్సిస్కో లోని కాస్ట్రో అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం స్వలింగసంపర్కులకు (Gays & Lesbians) పేర్గాంచినది. థీయేటర్ కు ఎదురుగా ఉన్న ఒక బార్ ఇలాంటి Gays కు స్వాగతం చెప్తూంది. గుమ్మం లో ఒక యువకుడు (వయసు సుమారు 32 సంవత్సారాలుండవచ్చు) కేవలం ఒక లోదుస్తును మాత్రం ధరించి, అతిధులకు స్వాగతం చెప్తున్నాడు. ఆ పక్క దుకాణాలలో వీడియో సినిమాలు, అద్దాల బీరువాలలో ప్రదర్శనకుంచారు. ఇవి స్వలింగ సంపర్కులకొరకు, అమ్మకానికి ఉద్దేసించినవి.
మేము కారు నిలిపిన చోటునించి చూస్తే కాస్ట్రో థీయేటర్ ప్రాంగణం కోలాహలం గా ఉంది. ఇప్పటికే ఎంతో పేరొచ్చిన చిత్రం కావున, ఈ చిత్రాన్ని చూడాలని ఉత్సాహంగా వచ్చినవారితో నిండి ఉంది. టిక్కట్లు ముందుగా కొన్నవారు గంట ముందరనుంచే క్యూలో నుంచుని, లోపలికి వెళ్లటానికి ఎదురుచూస్తున్నారు.

థీయేటర్ ముందరి ఈ Box -Office 1922 నుంచీ వుంది Photo: cbrao
ఇక్కడి సినిమాప్రదర్శనశాలలో ఒకటే క్లాస్ ఉంటుంది. కూర్చునే కుర్చీల క్రమ వరుస సంఖ్య టిక్కెట్లపై వుండదు. ముందు వచ్చినవారు వచ్చినట్లుగా ఎవరికిష్టమైన కుర్చీలలో వారు కూర్చొనవచ్చు. వెండితెర ముందర కుర్చీఐనా, దూరంగా ఉన్న కుర్చీ ఐనా అన్ని టిక్కెట్లకూ ఒకటే ధర. చిత్రం సాయంత్రం 7.45 కు ప్రారంభించవలసి ఉన్నది. ఆ సమయానికీ చాలా మంది ప్రేక్షకులు, కూర్చునేందుకై, ఖాళీ సీటు వెదుక్కునే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ముందుకొన్నవారికి, టిక్కెట్లపై సీటు నంబర్ ఇస్తే, థీయేటర్ లో ఇంత గందర గోళం ఉండదుకదా అనిపించింది. కాని టిక్కెట్లపై సీటు నంబరు ముద్రిస్తే, ప్రేక్షకులు సీటు నంబర్ ప్రకారం కూర్చోటానికి, సహాయకులను హాళ్లలో ఏర్పాటు చెయ్యాలి. సీటు నంబరు చూపించేవారి జీతభత్యాల ఖర్చు, ఇక్కడ ఎక్కువ కావున వాటిని తగ్గించటానికి, టిక్కెట్లపై సీటు నంబర్లు ముద్రించరిక్కడ. భారతదేశం లో ఇలాంటి విలాసాలకు (ఇది నిజంగా luxury అంటారా?) అలవాటుపడి, ఇలా సీట్లు వెదుక్కోవటం ఇబ్బందిగా ఉంటుంది. చిత్రానికి ఆలస్యంగా వస్తే భార్యా భర్తలైనా విడివిడిగా, దూరంగా కూర్చోవలసినదే. కొత్త సినిమాలకు ఆలస్యంగా వస్తే ఇక్కడి సినిమా హాళ్లలో పక్క సీట్లు దొరకవంతే.

థీయేటర్ లోపల బంగారు కాంతుల మధ్య వెండి తెర Photo: cbrao
శాన్ ఫ్రాన్సికో నగరంలో 100 వ కొండగుర్తుగా (Landmark building) గా నమోదయిన ఈ కాస్ట్రో చిత్ర ప్రదర్శన శాల , 1922 లో మూడు లక్షల డార్ల ఖర్చుతో నిర్మించారు. కాస్ట్రో ను, వాస్తుశిల్పి తిమోతి. ఎల్, సుందరంగా, మెక్సికన్ చర్చి ని పోలి ఉండే విధంగా నిర్మాణాకృతి ఇచ్చారు.

ప్రాక్పశ్చిమ కళా మేళవింపుల కుడ్య చిత్రం Photo: cbrao
ప్రదర్శన శాల లోపలి కిరువైపు గోడల పై గల కుడ్య చిత్రాలపై స్పానిష్, ఇటాలియన్ మరియు ప్రాచ్య (Oriental) దేశాల కళా ప్రభావం కనిపిస్తుంది. నాటకాలకు, సినిమా ప్రదర్శనలకు అనువుగా స్టేజ్ రూపనిర్మాణం గావించారు. చిత్రశాల బాల్కనీకు, కింద అంతస్తుకు వెళ్లటానికి అందమైన మెట్లున్నాయి. మెట్ల కిరువైపులా అలనాటి పాత చిత్రాల పోస్టర్లు కనువిందు చేస్తాయి. కింద అంతస్తులో, చిత్రాలకు సంబంధించిన సభలు జరుపుకొనే వీలుంది. కాలక్రమేణా ఎన్నో ఆధునిక మార్పులకు గురై, ప్రస్తుతము, అధునాతన శబ్ద వినికిడి యంత్రాలతో ఉన్నది. గతంలో దీన్ని అద్దెకు ఇచ్చి ఉన్నప్పటికీ, ప్రస్తుతం హాలు యాజమాన్యమైన నాసర్ (Nasser) కుటుంబం వారే దీనిని నడుపుతున్నారు. 1400 మంది కూర్చొనగలే ఈ చిత్రశాలలో, ప్రస్తుతము నాటకాలు, విదేశీ చిత్రాలు, చిత్రోత్సవాలు ఇంకా ప్రత్యేకమైన చిత్రాలు ప్రదర్శిస్తున్నారు.

తెర ముందర ఆర్గాన్ వాయిద్యం వాయిస్తున్న కళాకారుడు Photo: cbrao
సమయం రాత్రి 7.45 కు, హాలులో గల దీపాల వెలుతురు తగ్గింది. ఆశ్చర్యంగా తెరముందుగల ఖాళీ ప్రాంతంలో, కిందనుంచి ఒక చిన్న వేదిక పైకి వచ్చింది, యాంత్రికంగా. ఆ వేదిక పై ఒక సంగీతకారుడు, ఆర్గాన్ వాయిద్యంపై, సుమారు ఒక పదిహేను నిమిషాల పాటు, తన సంగీత నైపుణ్యంతో, అద్భుతమైన స్వరాలు వినిపించాడు.

సంగీత కచ్చేరి ముగిసిన తదుపరి,ఆర్గాన్ యంత్రం ఉన్న వేదిక కిందకి వెళ్లుతుంది, యాంత్రికంగా Photo: cbrao
ఎనిమిది గంటలకు మరల దీపాలు తమ పాత పూర్తి కాంతిని సంతరించుకొన్నాక, ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు, ఆ కళాకారుడు ప్రేక్షకులవైపు తిరిగి అభివాదం చేశాడు. కరతాళ ధ్వనుల తరువాత, కళాకారుడి వేదిక కిందకు వెళ్లిపోయింది. కార్యక్రమ నిర్వాహకులు వచ్చి, ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని జరపటానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపటంతో, ఆ తదుపరి కార్యక్రమమైన, చిత్ర ప్రదర్శనకు సన్నాహాలు మొదలయ్యాయి. ప్రేక్షకులు కూడా ఆత్రంగా నిరీక్షిస్తుండగా, మరలా దీపాల కాంతి తగ్గి, తెరలు తొలగి స్లండాగ్ మిలియనేర్ చిత్ర ప్రదర్శనకు వేదిక సిద్ధమయ్యింది.
చిత్ర దర్శకుడు డాని బాయిల్, ఈ చిత్రం యొక్క భారత దేశం లోని చిత్రీకరణగురించి, చెప్పినది, చూడండి.
సోమవారం, నవంబర్ 10, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -12

చికాగో కూడలిలో ముచ్చట కొలిపే మొక్కలు -చిత్రం: సి.బి.రావు
కొత్త బంగారు లోకం
నేననీ నీవనీ.. వేరుగా లేమనీ.. చెప్పినా వినరా ఒకరైనా...!! నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ.. ఒప్పుకోగాలరా ఎపుడైనా..!!!
సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన, ఈ అందమైన పాట పాడినది శ్వేతా పండిట్. CD కవరుపై పొరబాటుగా స్వేతా ప్రసాద్ అని అచ్చయ్యింది. చిత్రంలో ఈ పాట చిత్రీకరణ బాగుంది. నాయిక స్వేతా ప్రసాద్ చక్కటి నటి అని మీరు ఒప్పుకొంటారు.ఈ పాట వీడియోను ఇక్కడ చూడవచ్చు.
http://madhuravaani.blogspot.com/2008/11/blog-post_09.html
ముంబాయి
ముంబాయి నాకు నచ్చటానికి ఒక ముఖ్య కారణం పక్షి ప్రేమికులకు మక్కా లాంటి ఊరది. Bombay Natural History Society ఉన్నదీ ఊళ్లోనే. కడప జిల్లా లంక మల్లీశ్వరం అడవులలో అంతరించిపోతున్న Jerdons Courser రక్షణకై, ఈ సొసైటీ వారు ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వం తో పలు చర్చలు జరిపి, అడవి గుండా వెళ్లే తెలుగ గంగ గతిని మార్చి, ప్రపంచంలోనే అరుదైన, మన తెలుగు పక్షి (ఈ పక్షి ఆంధ్ర ప్రదేష్ లో తప్ప మరెక్కడా లేదు - 108 సంవత్సరాల తరువాత BNHS శాస్త్రజ్ఞుడు భరతభూషణ్ కనుగొన్నారు దీన్ని) కి పునర్జీవమిచ్చారు. ఈ సొసైటీ వారు ప్రతి ఆదివారం birdwatching trips వేస్తుంటారు. చక్కటి గ్రంధాలయం, జంతు ప్రదర్శన శాల నడుపుతున్నారు. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు ఈ సొసైటీ ని మరలా దర్శించాలి.
ఇంకో కారణం. తెలుగువారికి నచ్చే హిందీ సినిమాలు. చక్కటి పాటల సాహిత్యంతో, మధురమైన సంగీతం తో, ఉన్నత సాంకేతిక విలువలతో తయారయ్యే ఇక్కడి సినిమాలు. లత, ఆష, రఫి ముకేష్, కిషోర్ కుమార్ వంటి ప్రతిభావంతమైన గాయకులు, శంకర్ జైకిషన్, O.P. నయ్యర్ లాంటి ఎందరో సంగీత దర్శకులు తమ పాటలతో ఎందరినో రంజింప చేశారు.
నచ్చనిది. ఉత్తరాది వారిని, దక్షిణాది వారినీ పరాయి వారినిగా చూసే ఇక్కడి రాజకీయవాదుల సిద్ధాంతం. మహారాష్ట్ర లో తయారయే వస్తువులు భారతదేశమంతా వాడబట్టే , ముంబాయి వాణిజ్య రాజధాని అయ్యిందన్న విషయాన్ని, ఇక్కడి రాజకీయవాదులు విస్మరిస్తున్నారు.
http://satyasodhana.blogspot.com/2008/11/blog-post_05.html
సంసారం సంసారం ప్రేమ సుధాపూరం
పెళ్లి కెందుకు తొందర? వయస్సు 23 ఏళ్లేగా! ఒక మూడేళ్లాగితే సరి, పెళ్లి గురించి ఆలోచించవచ్చు. నీకు నచ్చిన అమ్మాయి దొరక్కపోదు.నిశ్చింతగా ఉండు. జీవితందూరదర్శన్ కాదు, నవరంగ్ అని అనుభవం మీద చెప్తావు. శుభం.
http://ballasudheer.blogspot.com/2008/11/blog-post_08.html
కాలం విలువ
మీరు ఒక పట్టుచీరల డిజైనర్ అయ్యుండి, తెలుగు బ్లాగు నడుపుతున్నందుకు, మీ అభిరుచికి అభినందనలు. మీ కాటగరీ లో బ్లాగరులలో, మీరే ప్రధములు.
http://nandayarrachowdu.blogspot.com/2008/09/blog-post_275.html
స్ఫూర్తిధాయకం
మీ వీరగాధ చదువుతూ ఆ నొప్పినీ, సున్నితమైన హాస్యాన్ని అనుభవించాను. నొప్పిని నొప్పిగా మాత్రమేకాక, హస్యం మేళయించటం తో, మీ కథనం కొత్తపుంతలు తొక్కింది. ఈ కథతో మీరు పాఠకులకు బాగా దగ్గరయ్యారు. మీ ఆరోగ్య స్థితి గురించి, పెళ్లికాక ముందు, మీ హీరో ఏమనుకున్నారు? మీరే తన నాయకి అని హీరో ఎలా తలిచారు? ఎంతైనా, ఆయన ధీరోదాత్తుడే.
http://sangharshana.blogspot.com/2008/11/2.html
Software Jobs: Fake Experience
దొంగ సర్తిఫికేట్స్ తో వైద్యం చేస్తే ప్రాణం పోయే ప్రమాదముంది. Fake experience తో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం చేస్తే, ప్రొగ్రాంలో బగ్స్ వస్తాయి. వాటిని rectify చేసి, debug చెయ్యవచ్చు. కాని పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. పెద్ద కంపనీలకు, దరఖస్తుదారులలో కొందరు fake experience పెడ్తున్నారని తెలిసీ, వాళ్లని కంపనీ అవసరార్ధం ఉద్యోగాలలో నియమించి, అవసరం తీరాక దొంగ సర్తిఫికేట్స్ పెట్టారంటూ ఉద్యోగంలోంచి తీసివేస్తున్నారు. Global economy బాగా లేక భారత్ లోని కంపనీలకు కొత్తగా వచ్చే software projects తగ్గటమే దీనికి కారణం.
అన్ని భాషలకు, ఉచ్ఛారణ ఆధారిత ఆధునిక లిపి.
@doc.joj:మీరు కనుగొన్న ఈ లిపి గురించిన వ్యాసమేదన్నా ఉంటే దాని లింక్ పంపగలరు. లేక, మీ లిపి గురించి ఒక వ్యాసం రాయగలరు. మీరు తెలుగును ఇంగ్లీష్ అక్షరాలతో , లెఖిని ఉపయోగించి, తేట తెలుగులో రాయవచ్చు. చూడండి. http://lekhini.org/
http://deeptidhaara.blogspot.com/2008/07/blog-post_15.html
శనివారం, నవంబర్ 08, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -11

డెన్వర్ విమానాశ్రయంలో, సొరంగమార్గపు, ప్రయాణీకుల రైలు మార్గము. చిత్రం: సి.బి.రావు.
నా పెళ్లి చూపులు
ఈ వ్యాసానికి label గా hospital అని వుంచటం జరిగింది. ఎందుకో? వ్యాసానికి ఒక పేరు పెడితే communication effective గా ఉంటుంది. ఉదాహరణకు ఈ వ్యాస మకుటంగా "నా పెళ్లి చూపులు" లేక మీకు నచ్చినది పెట్టుకోవచ్చు.
http://sarada4u.blogspot.com/2008/08/blog-post.html
పుట్టినప్పుడు బట్ట కట్ట లేదు
సరికొత్త తరహాలో, మీ బ్లాగు ఆలోచింపచేసింది. నవ్వించింది. మీరు కాదన్నా, మీ బ్లాగు పాఠకులు పేర్కొన్నట్లుగా, ఇది వేరే బ్లాగుకు satire గానే తోస్తుంది. ఆడా మగా ఒకటే రకం బట్టలేసుకుని, లింగ భేదం లేని పేర్లు పెట్టుకుంటే, public toilets ఎలా design చెయ్యాలో తెలియక architects బుర్ర బద్దలు కొట్టుకుని చావాల్సిందే.
http://panashaala.blogspot.com/2008/11/blog-post_3823.html
తలనొప్పి
అమెరికా లోని తెలుగువారిని చూసి , అసూయ పడనవసరం లేదు. ఇక్కడి వాళ్లకు తెలుగు కార్యక్రమాలు చూపించటానికై పెద్ద పరిశోధక సంస్థలే పూనుకుని చాల సాఫ్త్వేర్లు తయారు చేశారు. ఈ సంస్థలలో 70 శాతం మంది భారతీయులే పనిచేస్తున్నారు. ఈ భారతీయులలో 70 శాతం తెలుగు వారే. వీరు మనకు ఇప్పుడు రక రకాల కేబుళ్ల ద్వారా మా,జెమిని, టి.వి 9, ఈనాడు ఇంకా జీ టీవి వగైరాలు చూపించేస్తున్నారు. నేను దర్శించిన అట్లాంటా,కొలంబస్ వగైరా పట్టణాలలో మన తెలుగు వారు ఈ కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నారు.
http://manishi-manasulomaata.blogspot.com/2008/11/blog-post.html
నడుమునొప్పి
ఎంత బాధాకరం నడుము నొప్పి? ఇంతటి సీరియస్ ఉదంతాన్నీ , lighter vein లో చెప్పిన మీ కథనం బాగుంది. మీ అనారోగ్యాన్ని లెక్క చెయ్యక, పెళ్లికి ఒప్పుకున్న ఒరియా యువరాజు, కథానాయకుడే. సందేహం లేదు. ఆపరేషన్ సమయంలో కూడా మొక్కవోని మీ ధైర్యం అభినందించతగ్గది.
http://sangharshana.blogspot.com/2008/11/part-i.html
మహిళల లైంగిక హక్కులు
"మహిళలు తమ లైంగిక హక్కుల్ని సాధించుకుంటారు. "-మహేష్
cbrao: మహిళల లైంగిక హక్కుల నిర్వచనమేమిటి? ఈ వ్యాసంలో మీరు చెప్పదలుచుకున్న విషయంలో స్పష్టత లోపించింది. ఈ అస్పష్టతే అనామకుడినుంచి అసభ్య వ్యాఖ్యలు వచ్చేలా ప్రేరేపించింది. మీ భార్యను, తల్లిని అవమానించేలా రాసిన అనామక వ్యాఖ్యలు తొలగించగలరు. ఆ వ్యాఖ్యలు మీరు అనుమతించరాదు.
పిల్లలను ఎప్పుడు, ఎంతమందిని కనాలి అనే విషయంలో గతంలో స్త్రీకి స్వాతంత్రం లేదు. కాని ఆధునిక మహిళకు కొన్ని దేశాలలో ఈ స్వాతంత్రం ఉంది. ఆఫ్రికా లో స్త్రీకి సుంతీ లాంటివి (Removal of clitoris) అమలుచేస్తున్నారు. స్త్రీ చదువుకొని, తనకాళ్లపై తను నిలబడగలిగితే చాల సమస్యలకు పరిష్కారం దొరకకలదు. మహిళా సంస్థలు ఈ దిశగా కృషిచెయ్యవలసి ఉంటుంది. చలం మైదానం లో లాగా స్త్రీ ప్రవర్తిస్తే, ఆమె తన జీవితాన్ని తనే వ్యర్ధం చేసుకున్నట్లవుతుంది. సెక్స్ లో కాదు స్వేచ్ఛ , స్త్రీకి జీవితంలో తనకు, తన పిల్లలకు ఆర్థిక స్వావలంబన, భద్రత ఎక్కువ అవసరం.
Mahesh: చాలా విషయాలు కొంత సైద్ధాంతిక assumptions నేపధ్యంలో రాయటం వలన మీరన్న సృష్టత రాలేదేమో. నాకు మాత్రం నేపధ్యం తెలుసుకాబట్టి తేటతెల్లంగా వుంది. కొందరు స్నేహితులు చదివికూడా అర్థమయ్యిందనే చెప్పారు. బహుశా వారి ఆలోచనకు ప్రాతిపదికకూడా ఆ previous knowledge అయ్యుండచ్చు. మీరు చెప్పిన వ్యాఖ్యల్ని తొలగించాను.
స్త్రీలకు ఆర్థిక,సామాజిక స్వావలంబన అతిముఖ్యమని నేను నిర్ధ్వందంగా అంగీకరిస్తాను. కానీ,లైంగిక హక్కులుకూడా అందులోభాగమని కూడా నమ్ముతాను.
cbrao: "మహిళల లైంగిక హక్కుల నిర్వచనమేమిటి?" అన్న నా ప్రశ్నకు బదులిచ్చుంటే, వ్యాసంలోని అస్పష్టత కొంత తొలిగిపోయుండేది. మీ జవాబు అసలు విషయాన్ని వదిలేసి beating around the bush అన్నట్లుగా తోచింది. మీ వ్యాసం అసంపూర్ణం అనిపిస్తుంది.
Mahesh: క్షమించాలి అందరికీ తెలుసుకదా అనే నా assumption వలన మళ్ళీ అదే తప్పుచేసినట్లున్నాను.
ప్రపంచ ఆరొగ్యసంస్థ (WHO) ప్రకారం ఈ క్రింది వాటిని లైంగిక హక్కులుగా పేర్కొనచ్చు.
1.గర్భధారణ విషయంలో మహిళలకు నిర్ణయాధికారం
2.చట్టబద్ధమైన సురక్షిత ఆబార్షన్ కొరకు హక్కు
3.గర్భానికి సంబంధించిన ఆర్థిక,సామాజిక వివక్షనుంచీ విముక్తి
4.గర్భనిరోధకాలు దానికి సంబంధించిన విషయాలపై అవగాహన మరియూ ఉపయోగించే సాధికారత.
5.లైంగికచర్యద్వారా సంక్రమించే వ్యాధులనుంచీ రక్షణ కోరుకునే హక్కు.
6.గర్భవతులకు సంరక్షణ మరియు ఆరోగ్య సేవల హక్కు.
7.లింగవివక్షతాపూర్వకమైన సున్తీలాంటి (female genital cutting)లాంటి వివక్షతలనుంచి రక్షణ.
8.కూలంకషంగా,మానవహక్కులలో భాగంగా సంక్రమించే శరిరాలపై సంపూర్ణమైన హక్కు.
http://parnashaala.blogspot.com/2008/11/vs_07.html
బ్లాగు ముదురు
చక్కటి satire తో, మీరు బ్లాగు ముదురయారు.
http://kasturimuralikrishna.wordpress.com/2008/11/08/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%AC%E0%B1%81%E0%B0%A7%E0%B1%8D-%E0%B0%87%E0%B0%82%E0%B0%95%E0%B1%8B-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%9A/#comment-459
శుక్రవారం, నవంబర్ 07, 2008
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -10

Fireworks at Navy Pier, Chicago Photo: cbrao
పుస్తక సమీక్షలు
సమీక్షించిన తీరు,శైలి ఆకట్టుకుంది.మామూలు టపాలకు వచ్చినట్లుగా పుస్తక సమీక్షలకు పాఠకులు పెద్దగా స్పందించరు.పుస్తక సమీక్షలు కాని వాటిని అలవోకగా రాయగలం.సమీక్షలకు మూలవస్తువును పరిశీలనా దృక్పధంతో చూడవలసుంటుంది.పుస్తక సమీక్షకు స్పందన తక్కువయినా,మంచి పుస్తకం దవటంలో,సమీక్షించటంలో ఎక్కువ తృప్తి కలుగుతుంది.
http://oohalanni-oosulai.blogspot.com/2008/10/life-of-pi.html
ఆర్థిక సంక్షొభంలో అమెరికా
Let us wish early recovery to US. If US catches cold, India has to sneeze. That is the power of globalisation.
http://devanahariprasadreddy.blogspot.com/2008/10/summer-2009.html
పెళ్లి కాని ప్రసాద్‌లు : బట్టతల
బట్టతల ఇస్తుంది పెద్దరికం.సమాజంలో గౌరవం. కాని పెళ్లికాని అబ్బాయిలకు బట్టతల ఇబ్బందే.ఆడపిల్లలు, పెళ్లయ్యాక, జుట్టు పీకటానికి వీలుండే విధంగా, జుట్టున్న కుర్రాళ్లనే ఎంచుకుంటారు.అమెరికాలో ఉద్యోగం, బట్టతల ఉంటే పెళ్లికాని కుర్రోళ్లు ఎదురిచ్చి చేసుకుంటే తప్ప పిల్లనివ్వటానికి ఆంధ్రదేశం లో తల్లి తండ్రులు సిద్ధంగా లేరు.అందుకే ఇక్కడి (అమెరికా) బట్టతల కుర్రవాళ్లకు చేతిలో కోకా కోలా,చంకలో కుక్కపిల్ల, కళ్లలో కన్నీళ్లు తప్పటం లేదు.
-cbrao
విహారి నవ్వుల తోట,డెన్వర్ మహానగరం,కొలొరాడో.
http://meenakshir.blogspot.com/2008/09/blog-post.html
రమణీయం
జ్యోతక్క రాసిన, మీ బ్లాగు సమీక్ష చదువుతూ, అక్కడి లింక్ పై క్లిక్ చేసి ఇక్కడి కొచ్చా. మీ బ్లాగుపై జ్యోతక్క సమీక్ష బాగుంది. ఆమె మీ బ్లాగుపై వెలిబుచ్చిన అభిప్రాయంతో ఎకీభవిస్తా. వ్యంగం రాయటంలో మీలో అభివృద్ధి గమనిస్తున్నా. అభినందనలు.
@సీగానపెసూనాంబ: భారతదేశంలో ఆకాష్ (మనమడు) కబుర్లలో ముచ్చటబడే నేను, కొలంబస్ లో మరో మనమడిని చూసి సంతోషబడ్డా. ఇన్నాళ్లూ, నువ్వు ఏమయ్యావని కొంత ఆలోచించా. తెలుగు బ్లాగులు మరచిపోలేదన్న మాట. నువ్వు గాయని వన్న సంగతి తెలిసి , ఆనందించా. బ్లాగు రాయక పోయినా ఫరవాలేదు. ఎక్కడున్నావు? ఇక్కడా (అమెరికా) లేక భారత దేశం లోనా? ఇక్కడే ఉంటే నాకు ఒక సారి ఫోన్ చెయ్యి. వీలయితే కలుద్దాము. డెట్రాయిట్, వాషింగ్టన్, అట్లాంటా,చికాగో, కొలంబస్ ఇంకా డెన్వర్ వగైరా పట్టణాల లోని తెలుగు బ్లాగరులతో సమావేశం జరిపా. వాటి విషయాలు వీలు వెంబడి దీప్తిధార లో రాస్తా.
-ప్రేమతో,
-cbrao,
San Jose, CA.
Mobile: 408-466-5736
http://manalomanamaata.blogspot.com/2008/09/blog-post_26.html
మరో స్వయంవరం
100 కామెంట్లే ఏకంగా! మీ అమ్మాయి పెళ్లికి దిగుల్లేదు. రాజకుమారుడు వెతుక్కుంటూ వచ్చి, మీ అమ్మాయిని వరిస్తాడు. అభినందనలు.
-cbrao
San Jose, CA.
రావు గారు,
మా అమ్మయి పెళ్ళా? హ హ ! ఆమె నాకు చెప్పి చేసుకుంటుందో లేదో? అప్పటి సంగతి ఏమిటో...రాజకుమారుడిని తెచ్చి మాకు డైరెక్టుగా పరిచయం చేస్తుందేమో అని ఒక చిన్న డౌటు. అదే మంచిది లెండి!
-సుజాత
http://manishi-manasulomaata.blogspot.com/2008/10/blog-post_30.html
ఆర్థిక సంక్షొభంలో అమెరికా
చైనా,జపాన్ ఆర్థికంగా బాగా ఉన్నాయ్. చైనా దగ్గర సమృద్ధిగా డాలర్లు, జపాన్ యెన్ పెరుగుదల - ఈ పరిస్థితులలో, ఈ రెండు దేశాలు అమెరికాను సంక్షొభంలోంచి బయటపడవేసే ఎలాంటి ప్రయత్నాలు చేసినట్లు కనిపించదు. కారణం తెలియదు. ఇక్కడి ఇళ్ల ధరలు ఇంకా తగ్గే అవకాశముందంటున్నారు. ఇళ్లు కొనే వారు తగ్గారు. అద్దె ఇళ్లకు గిరాకి పెరిగింది. ఇళ్ల అద్దె పెరగటానికి ఇది ఒక కారణం. ఈ ఉపద్రవం లో పెక్కు సంస్థలు సరైన ద్రవ్య చలామణి లేక, తమ ఉద్యోగస్తులను తగ్గించివేస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను వాయిదా వేస్తున్నారు. దాని ప్రభావం వలన భారత దేశానికి వ్యాపార అవకాశాలు తగ్గటంతో , అక్కడా ఉద్యోగస్తులను తీసివేయటం జరుగుతుంది. ఈ పరిస్థితి నుంచి కోలుకోవటానికి సంవత్సరం పైనే పట్టవచ్చని కొందరి అంచనా. ఈ విపత్కర పరిస్థితులలో, భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. డెట్రాయిట్లో ఒక నిరుద్యోగి తన భార్యా పిల్లలను చంపటం లాంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. చూడండి http://www.detnews.com/apps/pbcs.dll/article?AID=2008810290387. అమెరికా త్వరగా కోలుకోవాలని ఆశించటం మినహా, ప్రస్తుతం ఏమీ చెయ్యలేని పరిస్థితి.
చక్కటి వ్యాసం అందించిన కొత్తపాళీ గారికి జన్మదిన శుభాకాంషలు.
-cbrao,
San Hose, CA.
http://kottapali.blogspot.com/2008/10/blog-post_27.html
Sujata బ్లాగు పదనిసలు
చక్కటి వైవిధ్యమున్న తెలుగు బ్లాగులలో గడ్డి పూలు ఒకటి. మీ బ్లాగు చదివి ఆనందించే వారిలో నేనూ ఉంటాను. బ్లాగు రాయటం చక్కటి emotional outlet కూడా. మనసు తేట పడుతుంది. You hum with joy and ecstasy.
http://sangharshana.blogspot.com/2008/11/blog-post.html
రానారె పలకా బలపం ఇంకా ఊడే లాగు
ఈ టపా చదువుతున్నంత సేపూ, కాసేపు రాయల సీమ , కడప జిల్లాలో ఉన్న అనుభూతి, ఎదురుగా జరుగుతున్నట్లుగా దృశ్య రూపం గోచరించింది. నేను కడప జిల్లాలో పుట్టి ఉంటే ఇలాగే రాస్తునా? ఏమో? మీ స్కూల్ లో పెంచలయ్యసారు అయితే, మాకు స్కూల్ లో పులి సీతారామయ్య అనే లెక్కల మాస్టారు వుండే వారు. గణితంలో హోంవర్క్ చెయ్యక పోతే, చింత బరిక తీసుకుని ఎడా పెడా నాలుగు అర చేతిలో వడ్డించే వారు. ఆయనంటే పిల్లలకు సింహ స్వప్నం. లాంతరు పుచ్చుకొని, పిల్లకాయిలము, వారి ఇంటికి వెళ్లేవారము, ప్రత్యేక ట్యూషన్కు. క్లాస్ అయ్యాక అక్కడే నిదురించి, పొద్దున్నే ఇంటికి బయలు దేరే వాళ్లము లాంతరుతో సహా. సీతారామయ్య గారి ఇంటి పేరు పులి కాదు. పిల్లకాయలకు ఆయనంటే ఉన్న భయమే, ఆయనకు ఆ పేరు వచ్చేలా చేసింది.
http://yarnar.blogspot.com/2008/10/blog-post.html
సరిగమపదనిసా
జ్యోతక్కా, నీ బ్లాగు ప్రయాణం లో ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు; అన్నీ ఈ టపాలో వచ్చినట్లు లేవు. అన్నీ ఒక్కసారే రాయాలంటే కష్టమే. రాసినంతవరకూ బాగున్నా, కొనసాగింపుగా మరొకటి రాయ కోరుతాను. అత్యంత పాఠకాదరణ ఉన్న, కొద్ది మహిళా బ్లాగులలో, నీ బ్లాగు ఒకటని నిస్సందేహంగా చెప్పగలను. డెట్రాయిట్ సమావేశంలో ఎంపిక చేసిన ఆరు బ్లాగుల లో, నీ బ్లాగు కూడా ఉన్నదని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అభినందనలు.
http://jyothivalaboju.blogspot.com/2008/10/blog-post_16.html
సిలికాన్ వాలి బ్లాగరులు
తెలుగువాడిని, అబ్రకదబ్ర, కిరణ్ వాకా, మాగంటి వంశీ, కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ గారు ఇంకా ఎంతో మంది పాఠకులు ఈ సిలికాన్ వాలీ లోని శాన్ హోసే చుట్టు పక్కలే ఉన్నారు. కలవాలి వీరందరినీ వీలు చూసుకుని. నెటిజన్, మీరెక్కడున్నారో తెలియపరుస్తూ నాకు ఒక వ్యక్తిగత వేగు పంపగలరా?
http://netijen.blogspot.com/2008/10/blog-post_23.html
ఆపిల్ దాని పేరు
చాలా ఆసక్తికరమైన కథ ఆపిల్ కంప్యూటర్స్‌ది. ప్రకటన , ముద్రణ రంగంలో రారాజిది. కాని ఆపిల్ యొక్క సఫారి బ్రౌసర్ లో తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి చదువలేక పోతున్నా. ఫైర్ఫాక్స్ బ్రౌసర్లో పద్మ కొనసాగింపు తో తెలుగు దిన పత్రికలు చదవవచ్చు. తొలివాక్యం లోని కంప్యూటర్స్‌ది లో ఒక నిలువు గీత గమనించండి. విండోస్ లో ఇలా రాదు. ఈ వ్యాఖ్య నేను ఆపిల్ Mac OS X Leopard వ్యవస్థాపితమైన కంప్యూటర్ పై రాస్తున్నా. ఇందులో ఛాయా చిత్రాలు మనొహరంగా కనిపిస్తాయి. వైరస్ బెడద ఉండదు. సురక్షితం.
-cbrao
Mobile: 408-466-5736
http://anilroyal.wordpress.com/2008/10/15/%E0%B0%86%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%81/
మీరు ప్రత్యేకమైన వ్యక్తి
మీరు ప్రత్యేకమే. ఈ సృష్టిలో ప్రతి వ్యక్తీ విభిన్న వ్యక్తే. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు ఒక్కరు కారు. భిన్నంగా ఆలొచిస్తారు, స్పందిస్తారు. అన్ని బ్లాగులూ ఒక్కలా ఉండవు. శ్రీధర్ బ్లాగు, వ్యక్తి ప్రత్యేకమే. మీ భార్య కూడా ప్రత్యేక విశిష్ట వ్యక్తే. ఒక్కరు పోలి మరొకరుండరు. అదే సృష్టి వైచిత్రి.
http://sridharcera.blogspot.com/2008/11/blog-post_4909.html
The power of positive thinking
శుక్రవారమే సినిమా చూడటం కుదరని పక్షంలో, ఆ రోజు మరో విధంగా ఆనందంగా గడిపేలా ప్రణాళిక వేసుకోవచ్చు. శుక్రవారం కొత్త సినిమా విడుదలయిన రోజయితే, ఇక్కడ, అసలే చిన్న థీయేటర్ తెర ముందు కూర్చోవాల్సుంటుంది. నిన్న మంగళ వారం కొత్త బంగారు లోకం చిత్రం IMC6 లో చూశాము. మేము ముగ్గురము ,ఇంకో భార్యా భర్తలు మాత్రమే ప్రేక్షకులు. ఇంటర్వల్ తరువాత ఆ couple మాయం. మేము ముగ్గురమే చిత్రాన్ని, హోం థీయేటర్ లో చూసినట్లుగా చూసి ఆనందించాము. పైగా మంగళవారం రెండు డాలర్ల తగ్గింపు ధరలతో టిక్కెట్లు పొందవచ్చు. శుక్రవారం సాయంత్రం సమయాన నాకు ఇంకా రెండు రోజులున్నాయి ఆనందించటానికని సంతోషంగా గడపండి. శనివారం సాయంత్రం, ఇంకా ఒక రోజు ఉన్నది , నా చేతిలో; స్వేచ్చగా, ఉల్లాసంగా గడపటానికి అనే positive thinking లో ఉండవచ్చు. Positive thinking ఆలొచన విధానం జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
-cbrao
San Jose, CA.
http://vasundhararam.wordpress.com/2008/03/15/%E0%B0%B6%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81/
పెళ్లి అవసరమా ?
"లైంగికతను శాసించే నైతికతలు పోయి, స్వతంత్ర్యంగా లైంగికతను ఒక వ్యక్తి యొక్క ఆద్శావకాశం (informed choice)గా నిర్ణయించుకునే మార్పు వస్తుందని ఆశిద్దాం." -మహేష్
ఏమిటి చెప్పదలుచుకున్నారు? పెళ్లి అనే కట్టుబాటు లేకుండా కలిసి ఉండటం లేక స్త్రీ తనకు సమ్మతమైన వారితో ఐచ్చికంగా కలిసి నిదురించటం లాంటివి ప్రజాదరణ పొందాలనా? పెళ్లి అనే వ్యవస్థ ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎన్నో అంశాలను పరిశీలించిన పిదప పెళ్లి అనే వ్యవస్థీకృతమైన పద్ధతి అమలులో కొచ్చింది. సామాజిక ఆరోగ్యానికి, సుఖ శాంతులకు పెళ్లి అనే లైంగిక కట్టుబాటు, నియమం అవసరం. పెళ్లి లేని సమాజం ఎలా వుంటుందో ఒక సారి ఊహించండి. మరో జంబలకిడి పంబ లా తయారవుతుంది సమాజం, నిత్య యుద్ధాలతో.
http://parnashaala.blogspot.com/2008/11/vs_06.html
శనివారం, అక్టోబర్ 25, 2008
విహారి నవ్వుల తోటలో కుందేలు

ఎర్ర రాళ్ల కొండలోంచి వాహన మార్గం
అక్టోబర్ 23, 2008 సమయం సాయంత్రం 5 గంటలు.చీకటి పడకముందే, ఎర్ర రాళ్ల కొండలు చూసివద్దామన్న విహారి సూచనకు తలూపాను.డెన్వర్ లో ఈ ఎర్ర రాళ్ల కొండలు ప్రసిద్ధిగాంచినవి. కొలొరాడో color - ado, అంటే ఎర్రరాళ్ల ప్రాంతమని స్పానిష్ వారు పేరు పెట్టి పిలువసాగటంతో,ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది.

Red Rocks వద్ద ఛాయా చిత్రంలో ఉన్నవారు:cbrao బొమ్మ తీసినవారు:విహారి
డెన్వర్ లోని Red Rocks లోని ప్రత్యేకత ఏమంటే, రెండు కొండల మధ్య ఉన్న ప్రత్యేక ధర్మాన్ని,ధ్వనితరంగశాస్త్రం (acoustics) సహాయంతో, ధ్వనిని పెంచి (ఎలాంటి amplifier, speakers లేకుండా), సంగీత కచ్చేరీలు నిర్వహిస్తారిక్కడ.

ఎర్ర రాళ్లలో ఆరుబయలు రంగమంటపం (Open air theater)
ప్రపంచంలోనే, మరెక్కడా లేని, అరుదైన రంగమంటపమిది. వానాకాలం లో ఇక్కడి ఎర్రరాళ్ల సొగసు, ఇంద్రధనసు రంగులు చూసితీరవలసినదే. ఈ Red Rocks గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు Red Rocks Web Site చూడవచ్చు. అక్కడి ఎర్రరాళ్లను, ఆరుబయటి రంగుమంటపం (Open air theatre) చూసాక, డెన్వర్ కొండల మీదుగా, వంపులు తీరి ఉన్న రహదారిపై ప్రయాణించే సమయంలో అకస్మాత్తుగా మా వాహనం ఆగింది. దానంతట అది ఆగలేదు.

గడ్డి మేస్తూ దుప్పి
ఎదురుగా రెండు దుప్పులు (Deer ) రహదారి పక్కన గడ్డి మేస్తూ కనిపించటంతో, విహారి వాహనాన్ని ఆపటం జరిగింది. రహదారిపై ఏటా అమెరికాలో 2000 పై చిలుకు వన్యప్రాణులు, రహదారి దాటుతూ మరణిస్తున్నాయి. వీటి రక్షణకై పెక్కు చర్యలు తీసుకుంటున్నారు.రహదారికి రెండు పక్కలా కంచె వేసి వీటిని రక్షిస్తున్నారు. రహదారిపై, వన్యప్రాణులు రహదారి దాటే ప్రాంతమని, హెచ్చరించే ప్రకటనలు, దారి పొడుగూతా కనిపిస్తుంటాయి.ఇదివరలో ఈ ఎర్ర రాళ్ల ప్రాంతంలో, జింకలు, గుంపులు గుంపులుగా కనిపించేవని, ఇప్పుడు సంగీత కచ్చేరీల వలన, జనం రావటం ఎక్కువవటం తో వాటి సంచారం తగ్గిందని విహారి ద్వారా తెలుసుకొన్నాను.సూర్యాస్తమయం అవటంతో, వెలుతురు తక్కువగా వుండి, నా కెమరా ఆటో ఫోకస్ కావటానికి కష్టపడసాగింది.అయినా,దుప్పుల చిత్రాలు, కొన్ని తీయగలిగాను.
కొండదారి పై మా ప్రయాణం కొనసాగి, చిన్న చిన్న పట్టణాల మీదుగా పయనిస్తూ,Highlands Ranch లోని Blackbird Circle లోని విహారి ఇంటి ముందర మా వాహనం ఆగింది. విహారి, కుడివైపు ఉన్న పచ్చిక బయలులో, గడ్డి తీరికగా మేస్తున్న కుందేలుపై, నా దృష్టిని సారించటం తో, ఉత్సుకతో వాహనం దిగి ఆ కుందేలును దూరం నుంచి ఛాయా చిత్రాలు తీస్తూ దగ్గరగా వెళ్లసాగాను.ఆశ్చర్యం,కుందేలు నన్ను చూసి బెదరలేదు. చుట్టూ చూశా, ఎక్కడన్నా తాటాకులు దొరుకతవేమోనని.

డెన్వర్ లో ఆకులు రాలే కాలం (Fall - Maple Leaves)
ఆకురాలు కాలమవటంతో,చుట్టూ రాలిన మాపిల్ (Maple leaves) ఆకులు కనిపించాయి.ఆ మాపిల్ ఆకులను సేకరించి,కుందేలుకు దగ్గరగా వచ్చి చప్పుడు చేయసాగాను.ఊహు! ఈ కుందేలు మాపిల్ ఆకుల చప్పుళ్లకు బెదిరేది కాదని తెలిసిపోయింది.భారత దేశం అడవులలో, కుందేళ్లను తాటాకు చప్పుళ్లతో బెదిరించటం అలవాటయిన నాకు, అమెరికాలో ఈ కుందేలు బెదరకపోవటం ఆశ్చర్యం కలిగించింది.ఇహ లాభం లేదని,దగ్గరగా వెళ్లి చేతితో చప్పట్లు చేయబోయి,దగ్గరగా వెళ్తుంటే 'ఆగు ' అన్న మాట వినపడటంతో, ఉలిక్కిపడి చుట్టూరా చూశా, ఏదన్నా దెయ్యం అలా పలుకుతుందేమోనని.

హాలోవిన్ పండుగకు స్వాగతం చెప్తూ చేసిన, గ్రుహం ముందటి అలంకరణ
దెయ్యం నా ఆలోచనలోకి రావటానికి ప్రత్యేక కారణం లేక పోలేదు.ఈ రోజు మధ్యాహ్న సమయం లో, శ్రీమతి ప్రశాంతి నాకు వాళ్ల కౌంటీ లోని, హాలోవిన్ (Halowin) పండగ (దెయ్యాల పండగ) కోసం ప్రత్యేకంగా అలంకరించిన, చాలా గృహాలను చూపటం జరిగింది. ఈ దెయ్యాల పండగ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. వాటి (హాలోవిన్ దెయ్యాల) తాలుకు ఆలోచనలు నా మనస్సును ప్రభావితం చేసి,ఏ మానవ సంచారం లేని ఆ సమయంలో,ఆ శబ్దమెటునుంచి వస్తున్నది అని తెలుసుకోందుకై, చుట్టూ పరికించి చూశా. ఎవరూ లేరు. మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తున్నది? ఆశ్చర్యం, ఆ శబ్దం కుందేలు వైపు నుంచి వచ్చింది.

మాట్లాడే కుందేలు
నమ్మశక్యం గాక, కుందేలు వైపు మరో అడుగు వేశా. కుందేలే ' ఆగు ' అని మరలా హెచ్చరించింది. నేను అమితాశ్చర్యంతో, ఏమిటి నీవు మానవులవలే మాట్లాడుతున్నావు? అదియునూ,ఆంగ్లంలో కాకుండా తెలుగులో ఎట్లా మాట్లాతున్నావని అడిగాను. కుందేలు చెప్పిన సమాధానానికి నేను కుదేలయిపోయా.
కుందేలు అన్నది, తాను అదే ప్రాంతంలో ఉంటానని, విహారి తోటలో, టొమటో ఇంకా ఇతర కాయగూరల మొక్కలు, గడ్డి తింటానికి తరచూ ఇక్కడికి వస్తుంటానని , విహారి సాయంకాలపు బడిలో, కౌంటీలోని పిల్లలలకు తెలుగు బోధిస్తుంటే, తనూ విని వినీ, పిల్లలతో పాటు, తనకూ తెలుగు వచ్చేసిందనీ, అందుకే తను తెలుగులో మాట్లాడగలుగుతున్నానని. (విహారి, భూపతి పంతులువారిగా తెలుగు పాఠాలు చెప్పే విశేషాలు, మీరు, అమెరికాలో తెలుగు వారి పిల్లలకు తెలుగు పాఠాలు అనే వ్యాసంలో తెలుసుకోవచ్చు). అంతే కాదు, పంతులుగారి పిల్లలు కూడా, ఇంట్లో తెలుగే మాట్లాడుతుంటే, తనూ తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నానని, కుందేలన్నది.
సరే బాగుంది, నాకు ఇంకో సందేహముంది అన్నా. సరే,డెన్వర్ వచ్చి, ప్రశ్న దాచటమెందుకు, అడగవచ్చు అని కుందేలనటంతో, నేను ఇన్ని చప్పుళ్లు చేస్తున్నా, నీవు బెదరక పోవటం లోని రహస్యం తెలుసుకోవాలనుంది అన్నా. ఇందాక చెప్పాగా, నేను విహారి తోటకు తరచు వచ్చిపోతుంటానని.విహారి తెలుగు పాఠాలతో పాటుగా, విహారి బ్లాగు కబుర్లూ వింటున్నా. మొదట 50, తరువాత 100, అలా అలా విహారి టపాలకు 300 పై చిలుకు Hits రావటం తో, ఆ కబుర్లు వింటూ, హిట్లకీ,చప్పుళ్లకీ తట్టుకునే ధైర్యమొచ్చేసింది. అందుకే, ఇందాక, మీరు అన్ని చప్పుళ్లు చేసినా, భయపడలేదు అన్నది.
కుందేలు ఇన్ని కబుర్లు చెప్తుంటే, ముచ్చటేసి, ఒక్కసారి దాన్ని రెండుచెవులతో ఎత్తి, గాలిలో గిర గిరా తిప్పి నా ఆనందాన్ని వ్యక్తం చెయ్యాలనిపించి, దానికి దగ్గరగా వెళ్లసాగాను. ఆగు, నీ పరిధిని దాటుతున్నావన్న కుందేలు హెచ్చరిక లెక్కచేయకుండా, కుందేలుకు, ఇంకా దగ్గరికి వెళ్ల సాగాను. నేను దగ్గరికి రావటాన్ని గమనించి, కుందేలు రెప్పపాటులో అద్రుశ్యమయ్యింది, ఆశ్చర్యంగా.
ఛాయా చిత్రాలపై కాఫీ, టీ హక్కుదారులు: cbrao