గురువారం, ఫిబ్రవరి 15, 2007

e - తెలుగు రెండవ అడుగు

ఎంత పెద్ద ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది. e - తెలుగు ప్రయాణం మొదలయ్యింది సంక్రాంతి కానుక తో. 11th Feb 2007 న ఈ నెల e - తెలుగు సమావేశం జరిగింది. తొలిసారిగా ఈ సమావేశానికి సత్యశాయి గారొచ్చారు. సమావేశ స్థలం: కుకట్‌పల్లి లోని పటెల్ కుంట ఉద్యానవనం. కుకట్‌పల్లి లో అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరికి చేరుతూనే చదువరిగారికోసం చూశాము. ‘మీ వాడు ‘ చదువరి అక్కడ మా కోసం నిరీక్షిస్తూ కనిపించారు. అందరం కలిసి గమ్యస్థానం చేరాము.
Click on photos to enlarge

Chaduvari and Satya Sai (Left to Right)

మిత్రులంతా ముందు వెనుకగా ఒక్కరొక్కరొచ్చి సమావెశంలో చురుగ్గా పాల్గొనటం జరిగింది. కొత్తగా సమావేశానికి వచ్చిన సత్యసాయి గారు మన తెలుగు బ్లాగరులకు పరిచితులే. వీరి పరిచయం త్రివిక్రం మాటలలో "దక్షిణ కొరియాలో వ్యవసాయ శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్న సత్యసాయి కొవ్వలి (సత్య శోధన) ప్రముఖ తెలుగు బ్లాగరి. చక్కటి భాష, భావ ప్రకటనా శక్తి కొవ్వలి సొత్తు. హాస్యాన్ని రాయగల కొద్ది మంది బ్లాగరులలో సత్యసాయి గారొకరు. బ్లాగు రాసే వారు బ్లాగరి అయితే, శ్రేష్ఠమైన బ్లాగరులను బ్లాగ్వరులు అని, చిరకాలంగా బ్లాగుతున్నవారిని బ్లాగ్భీష్ములు అని ప్రయోగించారొక వ్యాసంలో." ఉద్యానవనం చేరిన వెంటనే బయట ఉన్న ప్రకటన పలకలు (bill boards) మా దృష్టిని ఆకర్షించాయి. వాటిపై రాసుంది ' Photography strictly prohibited' అని. ఈ విషయాన్నే సత్యసాయి గారు తమ బ్లాగులో క్రితమే ప్రస్తావించియున్నారు. గర్భ గుడి లో చాయాగ్రహణం పై నిషేధపు ఉత్తరువులు అర్థం చేసికొనవచ్చు. కాని ఉద్యానవనం లో కూడా వద్దన్న మొదటి భారతీయ ఉద్యానవనం ఇదేనోమొ.


Sriharsha, cbrao and Trivikram

పరిచయ కార్యక్రమం అయ్యాక చర్చ e-తెలుగు మార్గదర్శక సూత్రాలపై (Bye-Laws) జరిగింది. c.b.rao గారు తయారు చేసిన ఈ నిభందనావళిపై సుదీర్ఘ చర్చ తరువాత కొన్ని మార్పులతో దానిని ఆమోదించటం అయ్యింది. సభ్యులు శక్తివంతంగా చర్చ జరుపుటకై చదువరి మిఠాయిలు పంచారు.


Trivikram, Srinivasa Raju, Sudhakar

Bye-Laws మీకు ఇక్కడ లభ్యమవుతాయి.
e telugu Bye - Laws -  Public
e telugu Bye - Law...
Hosted by eSnips


ఈ సమావేశంలో తీసుకొన్న కొన్ని ముఖ్య నిర్ణయాలు.

e-telugu.org website లో
1) ఒక మాస పత్రిక (Unicode or P.D.F.)
2)Wiki Software తో కొన్ని పుటలు (pages). ఇది ఎలావుంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి.
ఇంకా


Chava Kiran, Venkata Ramana

Workshop on Telugu Unicode
తెలుగులోని ఉత్తమ టపాలతో ఒక పుస్తక ప్రచురణ. ఈ పనికై ఒక త్రిసభ్య ఆలోచనసభ (Committee) ఉండగలదు.

ఉత్తమ తెలుగు బ్లాగులను e-telugu ఎంపిక చేస్తే ఎలా ఉంటుంది? షరా మాములే దీనికి ఒక త్రిసభ్య ఆలోచనసభ ఉంటుంది. ఇందులోని సభ్యులను పొటీ లోకి పరిగణించము.


Veeven (Right to Chaduvari) listens keenly to what Chaduvari says about Koodali; ‘A blog must appear in Koodali, soon after it is uploaded.’

Bye-Laws మరియు ఇతర ఆలోచనలపై మీరు ఏమి అనుకుంటున్నారు? రండి, కలిసి నడుద్దాం.
This meeting is powered by Chaduvari.

Text & Photos: cbrao

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

భాస్కర రావు గారూ,
ఈ సమావేశం విశేషాలూ, ఫోటోలు పోస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు.
మీ సమావేశాలకి హాజరు కాలేకపోయినా వాటికి సంబంధించిన విశేషాల
(సభ్యుల ఫోటోల!) కోసం చాలా ఆసక్తితో చూస్తూ ఉంటాను.
శుభాకాంక్షలతో,
-- లక్ష్మీ వసంత

రవి వైజాసత్య చెప్పారు...

ఈ తెలుగు ప్రస్థానానికి మేమేం చెయ్యగలమో కూడా చెప్పండి రావుగారు..ఈ టపాను అందించినందుకు కృతజ్ఞతలు

cbrao చెప్పారు...

లక్ష్మి వసంత - మీ జాబుకి ధన్య వాదాలు. మిమ్ములను ఎప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు. మీ పరిచయం కలిగించండి.

రవి వైజాసత్య - e-తెలుగు నిబంధనావళి (Bye-Laws) చదవండి. సమావేశం లో చర్చించిన విషయాలతో మీరు ఏకీభవిస్తే ఆ సంగతి రాయగలరు. e-తెలుగు లో సభ్యులను చేర్పించటంలో సహకరించండి. ఎలా చేరాలి (దరఖాస్తు పత్రం నింపాలి), బాంక్ వివరాలు త్వరలో.

మురళీ కృష్ణ వలివేటి చెప్పారు...

తెలుగు భాషాభివృద్దికై పాటుపడుతున్న మిత్రులందరికీ శుభాకంక్షలు. e-telugu.org.in శుభప్రదం కావాలని ఆశిస్తూ, అందుకు నావంతు సేవ అందిస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నేను చీరాలలో వుంటాను. మీలా ముఖాముఖి కలవలేక పోయినా, అవకాశం చూసుకుని, ప్రగతిని అర్ధం చేసుకుంటూ, నలుగురికీ తెలియజేస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి కొద్దిగానైనా కృషి చేస్తుంటాను. ఎప్పుడో తప్పక కలుద్దాము. దూరంగా వుండైనా దోహదపడగల అవకాశములను గమనించి శక్తిమేరకు తోడ్పడతాను.

నమస్కారములు,
మురళీ కృష్ణ వలివేటి
తెలుగుదనం.కో.ఇన్
+91-98856-19996

మురళీ కృష్ణ వలివేటి చెప్పారు...

ఇంకొక చిన్న మాట. చాన్నళ్ళుగా e-telugu ప్రపంచంలో మీ అందరి పేర్లు చూస్తూ వున్నాను e-mails ద్వారా. ఈరోజు ఫొటోలద్వారా మనుషులను కూడా చూడగలిగినందుకు చాలా సంతోషం కలిగింది. ధన్యవాదములు. శుభాకాంక్షలు.

అజ్ఞాత చెప్పారు...

nenu kuda melo okkadini

కామెంట్‌ను పోస్ట్ చేయండి