సోమవారం, జనవరి 01, 2007

అడవిలో అర్థరాత్రి

డిసెంబర్ 23 2006 న అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ కు ప్రయాణం. ఉదయం 7 గంటలకు సికందరాబాద్ జుబిలీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరే బస్ కొరకు నేను స్టేషన్ చేరేసరికే అక్కడ BSAP (Birdwatchers society of Andhra Pradesh) సభ్యులు ఉత్సాహంగా పక్షుల గురించి మాట్లాడుతూ కనిపించారు. తోటి పక్షిమిత్రులకు హాయ్ చెప్పి నేనూ వారితో కబుర్లలో పడ్డాను. పోయిన సంవత్సరం ఇదే సమయంలో మేమంతా డెహరాడూన్ యాత్ర లో ఉన్నాము. ఆ యాత్ర మా మదిలో మరుపురానిదిగా మిగిలి పోయింది. అక్కడి Wildlife Institute of India (WII) లో మా బస, మేము చూసిన రాజాజి నేషనల్ పార్క్, ముస్సొరీ లో మంచు తో ఆడిన ఆటలు, మాకు కనిపించిన అనేక పక్షులు, జంతువులు (చిరుతపులి వగైరా రాజాజీ పార్క్ లో ) మా మదిలో ఇంకా మెదలుతూ ఉండగానే నిర్మల్ కు ప్రయాణం - అక్కడ ఏం చూడబొతున్నమో అనే ఉత్సుకత అందరిలో కనిపించింది.

15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన బస్ దారిలో కామారెడ్డి లో ఆగాక అక్కడి కాంటీన్లో మా ప్రాతఃకాల భోజనము (Breakfast)చేశాము. బస్ అనేక గ్రామాలను, అడవులను దాటుకుంటూ నిర్మల్ కు సుమారు 12.30 గంటల ప్రాంతంలో చేరింది. నిర్మల్ ఊరు చేరక ముందే మాకు రహదారికి ఒక పక్క కోట, మరో పక్క కస్సార్ చెరువు అందలి బొల్లి కోళ్ళు (common Coots) కనిపించాయి. ఇంకా మరికొన్ని పక్షులైతే కనిపించాయి కాని బస్ వెగంగా వెళ్ళటంతో వాటిని గమనించలేక పోయాము. బస్ సారధిని (Driver) ను అభ్యర్దించి నిర్మల్ పట్టణంలో రహదారి పక్కనే ఉన్న అటవీ సంరక్షణాధికారి కార్యలయం ముందే బస్ దిగి , కార్యాలయ ఆవరణలోనే ఉన్న అటవీ అతిధి గృహంలో బస చేశాము. కొద్దిసేపు విశ్రమించి, ఉడిపి హోటల్లో భోజనము కావించి కుంతలా జలపాతము చూడటానికై బయలు దేరాము.

కుంతలా జలపాతము


Come, join our tour to Kumtala falls

కుంతలా నిర్మల్ పట్టణం నుంచి 45 కిలో మీటర్ల దూరములో ఉంది. అదిలాబాద్ రహదారిలో కుడి వైపు తిరిగి సుమారు 4 K.M. దూరం వెళ్తే కుంతలా వస్తూంది. 1974లో దీనిగురించి మొదటిసారిగా విన్నాను. ఇన్నాళ్ళకు దీనిని చూశే అవకాశం కలిగినందుకు ఆనందిస్తూ, కుంతలా వైపు మా ప్రయాణం సాగించాము. నిర్మల్ నుంచి అదిలాబాద్ వైపు వెళ్ళే రహదారిగుండా మా జీపు పయనిస్తుంది. నిర్మల్ దాటు తూనే అడవి మొదలయ్యింది. ఇంకొంచెం ముందు కెళ్ళాక కొండల పై (Ghat road) మలుపులు తిరుగుతూ సాగింది మా ప్రయాణం. ఈ కొండ మార్గంలో మాకు దారి పొడగూతా కోతులు కనిపించాయి. ఒక చోట కారు కింద పడి మరణించిన కోతి కళేబరం కూడా కనిపించింది. వాహనాల కింద పడి ఇలా వన్య ప్రాణులు ప్రాణం కోల్పోవడం, దేశంలోని అనేక జాతీయ వనా ల్లో జరుగుతూనే ఉంది. వాహన చోదకులు వన్య మృగాలు రహదారి దాటుతున్నప్పుడు జాగ్రత్తగా వాహనం నడిపితే వీటిని నివారించవచ్చు. టేకు చెట్ల అడవి గుండా మా ప్రయాణం సాగి కుంతలా చేరుకున్నాము.

Tree growing on a rock


View of forest around Kumtala falls

కారు నిలిపిన స్థలము నుంచి కుంతల వెళ్ళుటకు రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి) సహజసిద్ధమైన రాళ్ళ గుండా ఎగువ కుంతలా నుంచి దిగువ కుంతలా కు దిగుతూ వెళ్ళటం. రెండు) మానవ నిర్మితమైన మెట్ల ద్వార దిగువ కుంతల వైపు ప్రయాణం. అక్కడి స్థానిక దారిచూపేవాడు (Guide) మమ్ములను మొదట రాళ్ళ ద్వారా కొంత దూరం తీసుకెళ్ళాడు. లాభం) తక్కువ దూరంలో జలపాతం దిగువకు కిందకు వెళ్ళవచ్చు. నష్టం) ఇట్లా దిగటం కష్టం. పడే ప్రమాదం ఉంది. ఎముకలు విరుగకలవు.

Birders at upper Kumtala


Birder's dilemma - Is it Yellow Wagtail or
Grey wagtail?

ఎగువ కుంతలా నుంచి మంచి దృశ్యం -ఎదురుగా పెద్ద కొండలు , కింద లోయ , చిన్న తటాకాలు,చెట్లూ , వినీలాకాశం సుందరంగా కనిపించాయి.

View from upper Kumtala

ఇందాక ఏటవాలుగా కొండ దిగితే, కొండపైకి తక్కువ దారిలో వెళ్ళటానికై ఈ సారి నిట్టనిలువుగా కొండపైకి వెళ్ళటం. కొంత దూరం వెళ్ళాక నేను balance తప్పి పడ్డాను. నా వెనుక గీతా శ్రీనివాసన్ ( Software engineer working in a M.N.C., at Gachibowli, Hyderabad) ఉంది ఆ సమయంలో. నేను పడటానికి కొన్ని కారణాలు. మెడకు Binoculars, భుజానికి Camera bag వెళాడుతున్నాయి. జిగ్-జాగ్ గ కాక నిలువుగా నడిచే ప్రయత్నం. అలా కాకుండా Binoculars Camera Bag లో పెట్టి, ఆ పెట్టెను నా చేతికందినంత పైభాగానికి చేరవేసి, నేను జిగ్-జాగ్ గా పైకి ఎక్కివుంటే ఇలా పడి ఉండెడి వాడిని కాను. ఇలాంటి అనుభవాలే మనకు పాఠాలు నేర్పుతాయి. అంతే కాదు. కొండ మెట్లు ఎక్కే సమయంలో నిటారుగా కాక జిగ్-జాగ్ > గా నడిస్తే అలసట తగ్గువగా ఉంటుంది.

మొత్తానికి పడి లేచి కొండ పైకి వెళ్ళేసరికి అక్కడ కొంత మంది పక్షి ప్రియులు పక్షులను వీక్షిస్తూ కనిపించారు. కుల్కర్ణి మెట్ల దారిగుండా దిగువ జలపాతం దగ్గరికి వెళ్ళి ఉండటంతో ఆయన్ను పిలవటానికి అర్జున్ గైడ్ తో కలిసి కిందకు వెళ్ళటం తో నేను కూడా కిందకు బయలు దేరాను.మిగతా వారు పైనే ఉండి పక్షులను వీక్షిస్తామన్నారు.


Steps to lower Kumtala falls view

మెట్ల కిరువైపులా రక రకాల అడవి చెట్లు నన్ను స్వాగతించాయా అన్నట్లుగా చల్లని, చక్కనైన,పరిశుద్ధమైన గాలి వీచ సాగాయి. మెట్ల రహదారి, సుందరమైన చెట్లతో ఎంతో రమ్యంగా ఉంది. వడి వడిగా మెట్లు దిగి దిగువ జలపాతం వైపు నడిచాను. దూరంగా కుల్కర్ణి, అర్జున్ కనిపించారు. జలపాతం చాయా చిత్రాన్ని తీయటానికై అనువైన ప్రదేశం వైపు వెళ్ళి ఎకధారగా కిందకి ఉరుకుతున్న కుంతలా జలపాతాన్ని నా కెమారా లో బంధించాను.

Scenic Kumtala falls

బాపు సినిమా సీతాకల్యాణం లో గంగావవతరణం లోని గంగ గుర్తుకొచ్చింది కుంతలా ను చూస్తుంటే. పైనుంచి కిందకు స్వేతాంబర ధారియై ఉరుకుతూ ఉంది కుంతలా. జలపాతం దగ్గరికెళ్ళాలని ఆ నీటి తుంపర్లలో సెదతీరాలని ఎంతగానో అనిపించింది. ఈ సమయంలో కుల్కర్ణి, అర్జున్ పైకి వెళ్ళిపోవటంతో మా గుంపులో నేను ఒక్కడినే కొండ కింద మిగిలాను. పైన ఉన్నవారు నా కోసం వేచిఉంటారు అన్న ఆలోచనతో, దూరంగా వున్న కుంతలా కు వీడ్కోలు చెప్పి, కొండ పైకి మెట్ల మీదుగా వడి వడి గా నడవ సాగాను. దిగటంలో ఉన్న హాయి, మెట్లు ఎక్కటంలో లేదని అతి త్వరలోనే ఎక్కువవుతున్న నా ఉచ్చ్వాశ నిస్వాశలు తెలిపాయి. గుండె కొట్టుకునే వేగం ఎక్కువైంది. ఆ అతివేగంలో గుండె ఏమవుతుందో అన్నట్లుగా అనిపించింది. నా వెనుక నలుగురు కాలేజ్ అమ్మాయిలు పైకి ఎక్కలేక వగరుస్తూ అక్కడే మెట్లపై చతికిల పడటంతో నేనూ ఆగిపొయ్యాను. కానీ మనసంతా పైన వున్న నా తోటి పక్షి ప్రియులపైనే ఉంది. గుండె చప్పుడు తక్కువయ్యాక మరలా పైకి ఎక్కసాగాను. కొంత సేపయ్యాక మరలా గుండే చప్పుళ్ళు వినిపించసాగాయి. మరలా విశ్రాంతి తీసుకొని, కొండ పై చేరి సహచర మిత్రులను చేరుకొగలిగాను. అప్పటికి వారు Yellowfronted Pied or Mahratta Woodpecker చూసినట్లుగా చెప్పారు.

అక్కడే ఒక చిన్న టే దుకాణంలో టే తాగుతూ పరిసరాలను పరికిస్తుంటే ఇదుగో ఈ White eyed buzzard కనిపించింది. కుంతలా లో పక్షి వీక్షణ ముగించాక నిర్మల్ వైపు సాగింది మా వాహనం. ప్రధాన రహదారిపై పోచారం జలపాతం దర్శించమని ఉన్న పెద్ద hoarding కనిపించింది. అప్పటికే చీకటిపడటం మొదలయ్యింది - వ్యవధి లేనందున తిన్నగా నిర్మల్ పట్టణం కు బయలు దేరి వెళ్ళాము. ఎట్టకేలకు ఇలా కుంతలా జలపాతం చూడగలిగాను.

రెండవ రోజు: ఉదయం 7 గంటలకు బయలుదేరి అదిలాబాద్ రహదారిగుండా పయనిస్తూ రామన గండి అనే ప్రాంతంలో మా వాహనాన్ని కుడి వైపు మళ్ళించి కొంతదూరం వెళ్ళాక వాహనం దిగి అడవి బాట గుండా నడవ సాగాము. దారిలో పక్షులు వాటి గళాలను వినిపించసాగాయి. చాల సందర్భాలలో పక్షి గొంతు వినిపిస్తోంది కాని పక్షి కానరాదే. మా దుర్భిణిల కు పనిపెట్టి పక్షులకై అన్వేషిస్తుంటే ఒక్కటొక్కటిగా కనపడ సాగాయి.

Rose-Ringed Parakeet

ఇదుగొ ఎడమ వైపు చెట్టుపైగల ఈ చిలకను Roseringed Parakeet ను చూడండి. రామ చిలకను చూసాక 200 గజాలు నడిచాక ఎడమ వైపు చెట్టుపై వున్న పర్సుపు పిట్ట Baya weaver bird గూళ్ళు వేళ్ళాడుతూ కనిపించాయి.

Baya, Weaver Bird's Nests

మా ఎదురుగా సన్నని కాలి బాట ఉంది. పరిసరాలను గమనిస్తూ పక్షుల అరుపులకై చెవులు రిక్కిస్తూ ముందుకు సాగాము. రక రకాల పక్షులను గమనిస్తూ వెళ్తూ వాగు దగ్గరికి చేరుకున్నాము. వాగులో నీళ్ళు లేవు కాని ఇరువైపుల దట్టంగా చెట్లున్నాయి. కుల్కర్ణి ఒక మాట చెప్పారప్పుడు. నీళ్ళున్నా , లేకపోయినా వాగు దగ్గర పక్షుల, జంతువుల సందడి ఉంటుందని. అతని మాట నిజమేనని నిరూపిస్తూ అక్కడ చెట్లపై చాలా పక్షులు కనిపించాయి. వాటిని గమనిస్తూ నోట్స్ రాసుకుంటూ వెనుతిరిగాము. దారిలో ఒక రాతిపై కనిపించిందీ మల్ల గద్ద Pariah Kite. అప్పటికి ఉదయం 10 గంటలు కావస్తుంది. హైదరాబాదు నుంచి డాక్టర్ ప్రవీణ్, రాజీవ్ వస్తున్నట్లుగా సమాచారం అందింది. నిర్మల్ గెస్ట్ హౌసె మేము చేరిన సమయం లో వారి కారు కూడ వచ్చి మా ముందు ఆగింది.

(సశేషం) 

Text and Photos: cbrao

15 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

mii prayaanapu samgatulu caala cakkaga vivarimcaaru.ii vayasuloa kuuda miiru anta utsaaham gaa vundadam maa andariki aadarsam.

Sriram చెప్పారు...

chaala baagunnayandi....mee kadhanamu, chitraalu...abhinandanalu.

జ్యోతి చెప్పారు...

రావుగారు , మీరు ఇంత వయసులో చలాకీగా కొండలు గుట్టలు ఎక్కేస్తున్నారు. మేమేమో కాస్త పని చేయగానే ఆపసోపాలు పడిపోతున్నాము. కాస్త మీ ఆరోగ్య రహస్యం చెప్తారా? నిజంగా మీరు గ్రేట్ అండి

ramperugu చెప్పారు...

Chala baagundi
Intha manchi trip gurinchi
velle mundu cheppalede?
article baaga rassru
all the best
nellore lo kuuda bird watchers club pettali .details cheppandi?
ram

అజ్ఞాత చెప్పారు...

మీ వ్యాసం చాలా బాగుంది. చదువుతున్నంతసేపూ మీతొ ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది. మీరు చెప్పినతీరు నన్ను బాగా ఆకట్టుకున్నదు.

రానారె చెప్పారు...

గిజిగాని గూళ్ల ఫోటో బైనాక్యులర్‌తో తీశారా? ఆ గూడు అంత సంక్లిస్టంగా, దృఢంగా, పిల్లలు పడిపోకుండా child lock system engineering కనబరిచే ఆ పక్షిగూళ్లు మా ఇంటిదగ్గరున్న ఈతచెట్లకు చాలానే వేలాడుతూండేవి. ఒక 15యేండ్ల క్రితం గిజిగాని పిల్లలు పెద్దవయి, గూళ్లు అనాధలయ్యాక వాటి పనితనాన్ని చూసి హాచ్చరపడిపొయ్యేవాణ్ణి. ఇప్పుడు జనసంచారం పెరిగి గిజిగాడికి privacy లేకుండాపోవడంతో గూళ్లూలేవిప్పుడు.

cbrao చెప్పారు...

అడవిలో అర్థరాత్రి మీకు నచ్చినందుకు ఆనందం. మీ ఊరిలో Bird watchers Society పెట్టాలంటే మీరు కొంత infrastructure ఏర్పరచుకోవాలి. వివరంగా ఒక బ్లాగు రాయల్సినంత చెప్పవలసిఉంటుంది. మీ కై ఒక బ్లాగు రాస్తాను ఈ విషయమై. ఈ Baya Weaver birds గూడును చూశారు కదా. ఇది ఒక పడక గదిని కలిగి ఉంది. నేను నిజామాబాద్ లో రెండు పడక గదుల గూటిని చూశాను.మొగ పక్షి గూటిని నిర్మిస్తే ,ఆడ పక్షి 2-4 తెల్ల గుడ్లను పెట్టి, పొదుగుతుంది. మొగపక్షి గోపాల కృష్ణుడిలా పెద్దిల్లు,చిన్నిళ్ళతో, గోపికలతో కలిసి సహజీవనం చేస్తుంది. Binoculars కి కెమేరా అమర్చి ఉన్నవి అమెరికాలో లభ్యం. వీటి చాయా చిత్రాలలో నాణ్యత లోపిస్తుంది.Digital SLR లో టెలిఫొటొ లెన్స్ కలిగినవి మంచి నాణ్యత గల చిత్రాలనివ్వగలవు. Canon 400D ఒక ఉదాహరణ. నేను fixed lens camera కు 2x extender వాడి పక్షుల ఫొటోస్ తీస్తుంటాను. నేను వాడే camera Sony.

JOAN GONZÁLEZ_MIRATGES చెప్పారు...

bonitas fotos

salut joan

అజ్ఞాత చెప్పారు...

ఇక్కడ amazing photo blog link ఎక్కడుందండి? కనిపించటం లేదు

cbrao చెప్పారు...

Anonymous - మీరు స్పానిష్ మిత్రుడు అనే వ్యాసం చూడండి,దీప్తిధార లో.
http://deeptidhaara.blogspot.com/2007/01/blog-post_06.html#links

Vissu చెప్పారు...

cbrao garu: na memories ni rewind cheyincharu. Nenu nizamabad lo chadiveppudu maa classmates tho kalisi picnic vellamu. Anni arrangements chesanu apptalo anduke naaku adi marapurani anubuti. Classmates antha 'damager' where are u? we need this ani nannu kavvinche vaallu.

Gijigaani gollu maaku chaala ekkuva.. maa bavi loki vangipoina chettuki 100 daaka vuntayi. kommalu vongipoyi vuntayi. ramnadh cheppinatlu privacy kuda taggipoyi.. chaala pakshulu kuda kanapaddam taggi poindi.

v_tel001 చెప్పారు...

చాలా బాగున్నాయి

cbrao చెప్పారు...

Dear Pradhan,

I thank you for your letter. Please write more about your ‘Roman Script’ or give a link to any article describing the same.

అజ్ఞాత చెప్పారు...

21 jan 2007 to 11 mar 2008 i am still reading the archaic roman letters Telugu. How easy it wld be for Telugu and all all all indian and world languages if Roman Phoneticised Modernised Script is used in English and Telugu and Vernacular mags !!!

అజ్ఞాత చెప్పారు...

chala bhagundi pachani adaulu , pakshulu . pakshulagurinchi chala vishayalu thalisinavi..entho sundaramayena adaulu , pakshlu..

కామెంట్‌ను పోస్ట్ చేయండి