గురువారం, మే 10, 2007

బొమ్మను గీస్తే అది నీలా ఉందితెలుగు బ్లాగరుల సమావేశ విశేషాలు October 2006 నుంచి రాస్తూ ఉన్నాను. మీరు మీ అమూల్యాభిప్రాయాలు రాశారు. ఇందులో మెచ్చు కోళ్ళు, విమర్శలూ అన్నీ ఆనందించాను. కట్టె కొట్టె సమావేశ report ల నుంచి format మార్చి, సచిత్రంగా, వివరంగా సమావేశానికి రాని వాళ్ళకు వాళ్ళు సమావేశం లో ఉన్నట్లుగా ఉండే feel కలిగించటానికి కొన్ని minute details ఇవ్వటం జరిగింది.Painting by Sanjivadev

మే 2007 నివేదిక కూడా రాశాను.చూడండి.
http://tinyurl.com/2vl39q
చాయా చిత్రాలు లేకుండా ఎదో Govt.Report లా dull గా వుందా?
అసలేమి జరిగింది?
ఈ నివేదిక సచిత్ర సహితంగా దీప్తిధార కు upload చేసే సమయంలో అనూహ్యంగా ఈ కింది error వచ్చింది.
'URL contains illegal characters'
వీవెన్ గారి సహాయం కోరుతూ వారికి ఈ టపాను post చేశాను. వారు ఎంతో శ్రమించి అన్ని url కు html links ఇచ్చి http://tinyurl.com/2vl39q లో publish చేశారు. వారికి నా కృతజ్ఞతలు. కాని ఫలితం చూస్తే చిత్ర రహితంగా (ఎదైనా బొమ్మ చూడాలంటే ఆ లింక్ నొక్కి, బొమ్మ చూసి మరల back button నొక్కాలి), ఉప్పులేని కూరలా, పుల్లారెడ్డి మిఠాయి లేని విందులా, remote control లేని T.V. లా తయారయ్యింది వ్యాసం. ఇది వ్యాసం చదివే సమయం లో రసాస్వాదనకు భంగం కలిగించే చర్య. పాఠకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.

పాఠకులు ఎప్పుడూ నవ్యతను కొరుకుంటారు. ఎప్పుడూ ఒకరే ఇలాంటి నివేదికలు రాస్తే, మొత్తం సమావేశాల్ని ఒకే perspective లో చూసే ప్రమాదముంది. అంతే కాక ఈ నివేదికలలో monotony ధ్వనించే ప్రమాదముంది. వెరే వారు రాస్తే fresh idea తో ఇంకా బాగా రాసే అవకాశమూ ఉంది. అందుకే వచ్చే June 2007 నుంచి ఈ నివేదిక రాసే బాధ్యతను, సభ్యులలోని ఉత్సాహవంతులకు అప్పచెపుతున్నాను.

దీప్తిధార లో మీకు నచ్చే విధంగా వ్యాసాలు రాస్తూనే ఉంటాను.

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ చెప్పారు...

రావుగారు, లేనివాళ్ళకు కూడా అక్కడ ఉన్నట్టు - కళ్ళకు కట్టినట్టు - బాగుంది మీ సమావేశ నివేదిక.

ఇక్కడ సంజీవదేవ్ బొమ్మ అంతరార్ధం ఏవిటి? ఈయన్ని గురించి చెదురుమదురుగా వినడమే గానీ ప్రత్యక్షంగా తెలిసింది చాలా తక్కువ. ఆయన చిత్ర లేఖన గురించి గానీ రాతల గురించి గానీ మీకు తెలిస్తే కొన్ని టపాలు వ్రాయ ప్రార్ధన.

cbrao చెప్పారు...

ఇక్కడ సంజీవదేవ్ బొమ్మ అంతరార్ధం ఏవిటి?
-కొత్త పాళీ
బహుశా మీ ఉద్దేశం ఈ బొమ్మకూ, ఈ టపాకు సంబంధం ఏమిటని అయ్యుండవచ్చు. అదే అయితే - ఈ టపా పేరు, ఇందులో బొమ్మ,బ్లాగు రాసే సమయంలోని బ్లాగు రచయిత మానసిక స్థితికి ప్రతిరూపం. బొమ్మను గీస్తే అది నీలా ఉంది, అంటూ hum చేస్తూ, తన కిష్టమైన సంజీవదేవ్ చిత్రాలను చూస్తూ,ఆహ్లాదకరమైన మానసిక స్థితిలో రాసిన టపా అని, ఆవేశం లో రాసిన టపా కాదనీ అర్థం. ఇక బొమ్మను సాంకేతికంగా విశ్లేషణ చేస్తే - ఈ బొమ్మ తెలిసిన రూపానికి, తెలియని అపరిచిత రూపం. బొమ్మ చూస్తే మానవ రూపంలా వుంది కాని మనం చూసె మానవ రూపాలు అలా ఉండవు కదా.రవీంద్రుని (Tagore) కొన్ని చిత్రాలలో కూడా ఇలాంటి ప్రక్రియ కనిపిస్తుంది.

సంజీవదేవ్ విభిన్నకళల మణిహారం. త్వరలో దేవ్ గురించి పాఠకులకు పరిచయం చేస్తూ ఒక వ్యాసం వెలువరిస్తాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి