శనివారం, మే 26, 2007

మహిళా బ్లాగులు

రాధికా,

మీ సుదీర్ఘ ఉత్తరం ఎన్నో సంగతులను మోసుకొచ్చింది. చాలా రోజుల తదుపరి ఈ సాహితీ వనంలో అడుగుబెట్టే వీలు చిక్కింది; మీ ఉత్తరం చూడటమూ జరిగింది. మన గురించి అన్ని విషయాలు, అందరికీ చెప్పల్సిన అవసరం లేదు. అట్లని, మన గురించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచవలసిన అవసరమూ లేదు.మన గురించిన పరిమిత సమాచారం అవతలివారిలో, మనపై విశ్వసనీయత పెంచుతుంది. తొలినాళ్ళలో నేను మహిళా బ్లాగులపై సమీక్షలు రాసే సమయంలో,చాలా మంది వారి e-mail చిరునామా గోప్యంగా ఉంచే వారు.

సమీక్ష రాసే ముందు వారితో interact అయ్యే అవకాశం లేదు. ఉదాహరణకు నేను రాసిన కల్హార సమీక్ష చూడండి. ఈ సమీక్ష ప్రతిని స్వాతికి పంపుదామంటే ఆమె e-mail చిరునామా లేదు. చాలాకాలం తరువాత ప్రచురితమైన అమూల్య -హృదయతరంగాలు సమీక్ష చూడండి. ఇది ప్రచురితమైన తేది September 5th, 2006 అమూల్య కూడా తన చిరునామా ఇవ్వ లేదు. నా గుప్త గూఢచారి ప్రవరాఖ్య 007 ద్వారా ఆమె చిరునామా తెలుసుకొని, interact అయి, ఆమె ఇష్టా, అయిష్టాలను తెలుసుకోగలిగాను. అవి సమీక్షలో పొందుపరచగలిగాను. పరిస్తితులు మారుతూ ఉన్నాయి. ఉన్నవాళ్ళ చిరునామాలు మాయమవుతుంటే (రాధిక), లేని వారి చిరునామాలు మెల్లగా లభ్యం కాగలిగాయి. స్వాతికుమారికి నా సమీక్ష e-mail చేశాను. పాత సమీక్షలలో అచ్చయిన సమాచారాన్ని విశ్లేషణ చేస్తే, ఆ తరువాత సమీక్షలలో పాఠకుల కోసం అంతకు క్రితం అందుబాటులో లేని నూతన సమాచారాన్ని ఇవ్వటం లో, కొంత విజయం సాధించాను. ఒక అడుగు ముందుకే కదిలింది.

పరిస్థితి ఆశాజనకంగా ఉందని 'biosymphony- Yahoo Group' తరపున ఉత్తమ మహిళా బ్లాగులకు బహుమతి ఇచ్చే పథకం గురించిన మనసులో మాట మిత్రులకు చెప్పటం జరిగింది. ఎందుకో తెలియదు మరి; మహిళా బ్లాగరులను contact చెయ్యటం మరలా కష్టం కాసాగింది. వారితో interaction, పరిచయం దొరకటం కష్టమైంది. ప్రవరాఖ్యుడి కాలికి రాసిన లేపనం కరిగి పోయింది.

పాఠకులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు. వారు మన నుంచి వారికి తెలియని సమాచారాన్ని ఆశిస్తారు. తక్కువ సమాచారమున్న తొలి బ్లాగులనుండి కాల క్రమేణా ఎక్కువ సమాచారమిచ్చే సమీక్షలలో, అంత కంటే తక్కువ సమచారం, విశ్లేషణ ఇవ్వటం ఇష్టం లేక సమీక్షలు మానివేశాను.

ఇలాంటి situation లో తారసపడింది -యెండమూరి - వెన్నెల్లో ఆడపిల్ల. మీరు సరిగ్గానే ఊహించారు. సరిగమల -సిరిసిరిమువ్వ. వెన్నెల్లో ఆడపిల్ల లోని నాయిక, నాయకుడికి తన గురించి సమాచారం, కొన్ని clues ఇస్తూనే తన పేరు, ఉనికి చెప్పదు. గుర్తొస్తుందా? యెండమూరి నాయికలు ఎంతో తెలివైన వారు. డబ్బు 2 ది పవర్ ఆఫ్ డబ్బు గుర్తుందా? ఆ నవలలో హారిక, లక్ష్మి, వెన్నెల్లో ఆడపిల్లలో నాయిక రమ్యస్మృతి, నిజంగా intelligence కు మారు పేర్లు. ఈ పొలిక ఎందుకు తెచ్చానంటే సిరిసిరిమువ్వ కూడా తన గురించిన సమాచారం, ఎన్నో clues ఇచ్చారు. ఎవరైనా కనుగొనగలరేమో అని. తాను కొంత కాలం గోప్యంగా ఉండాలనే ఆకాంక్షా ఉంది. ఆమె అభీష్టానికి భిన్నంగా వ్యవహరింపలేక ప్రవరాఖ్యుడికి సెలవు ఇచ్చాను. నా సమీక్షలలో తక్కువ సమాచారం ఇవ్వటం నాకే ఇష్టం కాక, సరిగమల సమీక్ష విరమించాను. ఎవరన్నా సరిగమలు సమీక్షిస్తే నేనూ ఆనందిస్తాను.

మారు పేర్లతో రాయటం, చిరునామా గోప్యంగా ఉంచటంతో, రాసేది మహిళలా లేక మగవారు ఆడ పేరుతో రాస్తున్నారా అనే విషయం కనుగొనటం కష్టం. అనామకులుగా రాస్తే వచ్చే లాభ నష్టాలేమిటో నాకు తెలియదు. అనుభవజ్ఞులైన అనిల్ లాంటి వాళ్ళు చెప్పాల్సిందే. అనామకులైనా,సదా ఒకే సాంకేతిక నామంతో వ్యవహరిస్తే వారికి, మనకూ మేలు. అభిసారిక కవితల సమీక్ష కూడా చేసాను అప్పట్లో. మంచి కితాబే ఇచ్చాను కూడా. ఆమె కవితలు, వాటితో ఉండే చిత్రాలు ఒకటి తో మరొకటి పోటీ పడుతుండేవి. ఈ మధ్య కొందరు కవిత్వానికి పాఠకులలో ఆదరణ తగ్గిందన్నారు. వారు మీ స్నేహమా
సందర్శకుల సంఖ్య (4154 Visitors since 22nd September 2006) చూస్తే, వారి అభిప్రాయం మార్చుకొనక తప్పదు.

మీరంతా అమెరికాలోని ప్రశాంత వాతావరణాన్ని ఆనందిస్తున్నారని తలుస్తాను. నా అమెరికా ప్రయాణం వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. కొద్ది రోజుల క్రితం, ఇక్కడ, వాన, ప్రమోదాన్ని, ఖేదాన్నితెచ్చింది, కొన్ని గంటల పాటు. మబ్బులు మరలా తేలి పోయాయి. గ్రీష్మ తాపం తో బయట తిరగటం తక్కువయ్యింది. ఎక్కువ కాలం ఇంట్లోనే ఉంటం.

హృదయ పూర్వకంగా,

సి.బి.రావు.

3 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

రావు గారూ మీ ఉత్తరం ఈ రోజే అందింది.విషయాలన్ని తెలుసుకుని సంతోషించాను.నేను మీరు రాసిన కలహారా,హ్రుదయతరంగాలు రెండు సమీక్షలూ చదివాను. అప్పట్లో మీరు నా విషయాలు ఎందుకు అడిగారో తెలీలేదు.అప్పటికి నేను బ్లాగు లోకానికి కొత్త.నా బ్లాగుని నాకోసమె నేను మొదలుపెట్టాను.కూడలిలో ఎవరు చేర్చారో నాకు తెలీదు కానీ దానితో నా అలవాట్లు,హాబీలు అన్ని మారిపోయాయి. అంతర్జాలంలో మన విషయాలు గోప్యం గా వుంచాలనే మావారి మాటలవల్ల కొన్నాళ్ళకి బయోడేటా తొలగించాము.పోటీల్లో పాల్గొనడాలు,బహుమతులు అంటే ఎవరికి మాత్రం సరదాగా వుండదు చెప్పండి.కాని ప్రతీ దానికి ఒక అర్హత వుండాలనుకుంటాను.అభిసారిక విషయం లో నేను కొద్దిగా తొందర పడ్డట్టున్నాను.ఎవరో రాసిన పిల్ల జెల్లకొట్టింది అన్న కామెంటు చూసి ఆవేసంలో అలా రాసేసాను.అన్నట్టు అభిసారిక సమీక్ష ఎక్కడవుంది?
ఎండల్లో ఎక్కువ తిరక్కండి.ఆరోగ్యం జాగ్రత్త.ఇక్కడికి మళ్ళా వేసవి లో రండి.అక్కడి వేసవి తాపాన్ని తప్పించుకోవచ్చు.
రాధిక

రాధిక చెప్పారు...

అన్నట్టు మీ ప్రవరాఖ్యుడు ఎవరు?అందరి ఐడిలు మీదగ్గర ఎలా వుంటాయి.ఎవరికి ఎవరి ఐడీ కావలిసివచ్చినా రావుగారిని అడగండి తెలుస్తుంది అంటారు. మీరు బ్లాగుల మామ [గూగుల్ మామ లాగ]అన్న మాట.

cbrao చెప్పారు...

రాధికా,

ఆప్యాయతతో కూడిన మీ జాబు ప్రమోదాన్నిచ్చింది. అభిసారిక విషయంలో - మీరు రాయటంతో పాఠకుల సందేహాలు తీరాయని తలుస్తాను. అభిసారిక బ్లాగుపై నా సమీక్ష ఇక్కడ చూడండి.
http://paradarsi.wordpress.com/
ఈ వైచిత్రం గమనించారా? అభిసారిక బ్లాగు లేదు కాని సమీక్ష ఉన్నది. జీన్ పాల్ సాత్రె సిద్ధాంతం ప్రకారం సమీక్ష ఉన్నది కావున బ్లాగు ఉన్నట్లే. అప్పట్లో నాకు లేఖిని తెలియదు. జీవన్‌టోన్ ముందరా, తరువాతా చిత్రాలు మీరు చూసే ఉంటారు. చూడక పోతే అది ఒక health tonic.ఇది లేఖిని తెలియక ముందు రాసినది. హృదయతరంగాలు సమీక్ష చూడండి. అది లేఖిని గురించి తెలిసాక రాసింది. తెలుగు బ్లాగు చరిత్రలో లేఖినికి పెద్ద పీటే వెయ్యాలి. లేఖిని సృష్టికర్త నాకు కూత వేటు దూరంలో వున్నారనే విషయం ఒక thrill factor అవుతుంది.


మీ బ్లాగులో , మీ ఉనికి తెలుసుకోని విధంగా మీ పరిచయం ఇవ్వవచ్చు. ఇతరుల e-mail ఇవ్వటానికి ముందు, safe అనిపిస్తేనే ఇస్తాను. మీరు నన్ను బ్లాగుల మామ [గూగుల్ మామ లాగ] అన్నారు. మా కోడలి (Houston) కన్నా మీరు వయస్సులో చిన్న. బ్లాగులకే కాదు, మీకూ మామనే. మీ సూచన ప్రకారం వచ్చే వేసవిలో మీ దేశంలో ఉంటాను.
మామ (విహారి style లో)
-రావు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి