బుధవారం, ఆగస్టు 01, 2007

న్యూయార్క్ నగరం



సంగీతం, సాహిత్యం విడదీయరానివంటారు.సంగీతానికి భాషా ఎల్లలు లేవంటారు. ఇవి మీరు ఒప్పుకుంటే పదండి ముందుకు. న్యూయార్క్ నగరం -ఆపిల్ సిటి. అమెరికా మొత్తం ఎంత చుట్టి చూసినా, న్యూయార్క్ చూడకపోతే మీరు అమెరికా చూడనట్లే. న్యూయార్క్ - ఇది అమెరిక గుండెకాయ. 9/11, సంఘటన ప్రపంచాన్ని ఎంత కలవరపెట్టిందో, మీకు గుర్తుండే ఉంటుంది.

సంగీతపరంగా కూడా, న్యూయార్క్ నగరం పాట మీ మనస్సును అంతగాను కలవరపెడ్తుంది. రంజింపచేస్తుంది.ఈ పాట మాతృక తమిళ్ భాషలో ఉంది. ఎంత మధురంగా ఉందో, ఈ పాటలో భావం. మీరూ రండి, అలా న్యూయార్క్ నగర విహారం చేసి వద్దాము.

New York nagaram urangum neram, thanimai adarndadhu..

నిశీధిలో న్యూయార్క్ నిదురబొయిన క్షణాన, ఏకాంతం నన్ను చుట్టేసింది
Paniyum padarndadhu..

ఎటు చూసినా మంచు,
Kappal erangiye kaatrum karaiyil nadandadhu..

ఓడపైనుంచి వచ్చే గాలి, ఏకాంతంగా నడిచింది సముద్రపు ఒడ్డున,
Naangu kannadi chuvargalukulle naanum mezhuguvathiyum..

నాలుగు గోడల మధ్య ,నేను, నాకు తోడుగా ఒక కొవ్వొత్తి,
Thanimai thanimaiyo.. Kodumai kodumaiyo..

ఒంటరితనం, ఎంత భయంకరం,

చరణం 1

Paechelaam thalaatu pola ennai uranga veikka nee illai

ఓ ప్రియ, నీవు లేవు, నీ తీయని మాటలతో నన్ను నిద్ర పుచ్చటానికి,
Nilavin oliyin mutham thandhu kaalai coffee kudukka nee illai

వెన్నెల కాంతిలో నన్ను ముద్దాడటానికి, ఉదయాన్నే కాఫీ ఇవ్వటానికి, నీవు లేవు,
Vizhiyil vizhum dhoosi thannai naaval edukka nee ingu illai

నా కన్నులలో దుమ్ముపడ్తే, ఊదటానికి నీవు లేవు,
Manadhil ezhum kuzhapam thannai theerka nee inge illai..

నా మదిలోని సందిగ్ధాలను, తీర్చే, నీవు లేవు,

Naan inge neeyum ange, indha thanimaiyil nimishangal varusham aanadheno?

నేనిక్కడ, నువ్వక్కడ, చేస్తుందీ ఏకాంతం నిముషాలను, సంవత్సరాలుగా,
Vaan inge neelam ange, indha oovamaiku eruvarum vilakam aanadheno?

ఆకాశం ఉంది, ఊదా రంగూ ఉంది, ప్రతీకలా మనము వాటికి? ఎలా? ఎలా?


చరణం 2

Naatkurippil nooru thadavai undhan peyarai ezhudhum en pena
నూరు సార్లు రాసింది నా కలం నీ పేరే, నా daily planner లో,
Ezhudhiyadhum erumbu moikka peyarum aanadhena thenaa?
చేరాయి చుట్టూ చీమలు, నీ పేరే మారిందా తేనెగా,
Oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh..
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Jil endru bhoomi irundhum, indha tharunathil kulir kaalam kodai aanadheno?
ఎముకలు కొరికే చలిలో, శీతకాలం, మండు వెసవిలా ఉందేమి నాకు,

Oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh oh..
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

Vaa anbe neeyum vandhal senthanal kuda panikatti pole marumae..

దరికి రా ప్రియ, నీవుంటే, కాదా నిప్పుకణిక,ఒక మంచు ముద్ద,
Yeh yeh yeh yeh yeh yeh yeh…
యె యె యె యె యె యె యె…

తమిళ్ నుంచి ఆంగ్ల అనువాదం -విజయ్ -తెలుగు సేత -సి.బి.రావు

ఇంత మధురమైన పాటను ఎవరు పాడారో తెలుసా? A.R.రెహ్మాన్. రాసింది -వాలి.
చిత్రం: sillunu oru kadhal - ఓక చల్లటి ప్రేమ
ఈ పాట వింటారా? వినకుండా మీరు ఉండలేరు.

http://tinyurl.com/2h2mqd

తారాగణం:సూర్య,జ్యోతిక శరవణన్, భూమికా చావ్లా, వడివేలు ఇంకా సంతానం.
ఈ చిత్రం తెలుగులో నువ్వు నేను ప్రేమ అనే పేరుతో అనువదించబడింది. ఈ పాట తెలుగులో కంటే మాతృకలోనే బావుంది. పాట అనువాదానికి నేను మాతృకనే అనుసరించాను. మీరు తెలుగులో ఈ పాట వింటారా?

http://www.ragalahari.com/newreleasesdetail.asp?newmvname=Nuvvu+Nenu+Prema

పాట, తెలుగు డబ్బింగ్ లో సాహిత్యం తేలిపోయినట్లనిపించింది,నాకు. ఆ కారణంగానే మీకు తమిళ్ నుంచి తెలుగు అనువాదం పైన ఇచ్చాను.
ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని వుందా? చూడండి.
http://en.wikipedia.org/wiki/Sillunu_Oru_Kaadhal

చివరగా మీకు బోనస్ గా, ఈ పాటను చూపిస్తాను. చూడండి.



ఈ పాటను నాకు పరిచయం చేసిన,శంకర్ ఆనంద్ కు, నా ధన్యవాదాలు.
Courtesy & Source of Tamil lyrics:
http://varunnair.wordpress.com/

7 కామెంట్‌లు:

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) చెప్పారు...

this is a superb song i love it hats off to ARR..even the picturisation is superb

రాధిక చెప్పారు...

మొదట్లో ఈ పాట విని ఏదో ప్రైవేట్ ఆల్బం లోదనుకున్నాను.చూసాకా ఇంకా నచ్చింది.ఈ సినిమా కూడా బాగుంటుంది.

గిరి Giri చెప్పారు...

తమిళంలో ధిల్ అనే సినిమా ఉంది. దాంట్లో ఉన్ సమయనరయిల్ నానుప్పా సక్కరయా అనే పాట ఉంది..దాని అనువాదం రాయగలరా

cbrao చెప్పారు...

Giri -ఆ పాట lyrics నాకు లభ్యం కాలేదు. Lyrics మీ వద్ద వుంటే పంపండి.

గిరి Giri చెప్పారు...

Its here..

http://www.youtube.com/watch?v=oG_IfydqJbs

అజ్ఞాత చెప్పారు...

cbrao గారు,

చాలా బాగా తర్జుమా చేసారు!

అజ్ఞాత చెప్పారు...

మీకు తమిళం ఒచ్చా ? నేను భాషా భేదాలు లేకుండా, అన్ని వినేస్తా అన్నమాట ! మీకు లానే ! నాక్కూడా నచ్చేసింది ఈ పాట !
(మీ నువ్వు నాకు నచ్చావు లో పెసూనని నేనే ! )

కామెంట్‌ను పోస్ట్ చేయండి