సోమవారం, ఆగస్టు 06, 2007

మంచి రచనలెలా చేయాలి?


శాంతినికేతన్ లో చిత్రకారిణి -ఫొటొ:cbrao

మీరు రచయితా? లేక రచయిత కావాలనుకుంటున్నారా? మీరేదైనా విషయం పై రచన చేయాలని, మననులో గట్టి కోరిక, సంకల్పం ఉంటే, మనసును distract చేసే, పనుల జోలికి వెళ్ళవద్దు. కూడలి, తెలుగు బ్లాగు గుంపు, T.V.,ఇతరాలు మిమ్ములను సులభంగా distract చేస్తాయి. టపా (బ్లాగు Blog భాషలో article) రాయండి, ప్రచురించండి.ఇప్పుడు relax అవ్వండి. కూడలి చూడండి. మీ కిష్టమైన విషయాలు చెయ్యండి. కొన్ని సార్లు, చాలా విషయాలు, మిమ్ములను వాటిపై టపా రాయమని, మనసులో జోరీగల లాగా వెంటాడి తరుముతుంటాయి. ఆ topics అన్నీ ఒక కాగితం (Notepad)పై రాసి, వాటి ప్రాధాన్యాల దృష్ట్యా, వాటికి వరుస క్రమంలో numbers ఇవ్వండి. ఎక్కువ మందికి ఉపయోగ పడే అంశాలున్న రచనకు, ప్రాధాన్యంలో మొదటి పీట వేయండి.ఒక పర్యాయం, ఒక topic పై, వ్యాసం చక్కగా రాయగలుగుతారు. ఇది One job at a time principle పై ఆధారపడి మంచి ఫలితాల నిస్తుంది.


రచన రాసే సమయంలో,అందుకు కావలసిన వాతావరణం సృష్టించుకోండి.గదిలో, సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. మీ కుటుంబ సభ్యులను, TV తక్కువ volume లో, చూడమని అభ్యర్ధించండి.మీ కిష్టమైన సంగీతం, మీ కంపూటర్లో play చెయ్యండి. మీకు బీరిష్టమైతే ఒక మగ్గు బీరు మీ టేబుల్ పై పెట్టి, మీ కిష్టమైన వారి చిరునవ్వుల నగుమోమొకసారి తల్చుకొని, టపా మొదలెట్టండి. పూర్తయ్యే దాకా, మీ కలం (కంప్యూటర్)ఆగదు. టపా రాసే కాలం శీతాకాలమైతే, నా కిష్టమైన కానియాక్ (Cognac) లో, కొన్ని ice cubes వేసుకుని, సిప్ చేస్తూ, టపా అలా సరదాగా రాసేస్తాను. మీరు ఆడవారైతే, మీ కిష్టమైన fruit juice సేవిస్తూ, ఉల్లాసంగా రాసేయండి టపాను. మీకు ఇష్టమైతే fruit juice బదులుగా Red wine కూడా మంచిదే.

మీరు కథా రచయితలా? మీ కథను వర్ణనలతో కాకుండా, ఏదైన event తోనో లేక ఆకర్షణీయమైన పట్టు ఉన్న అంశం తోనో మొదలెట్టండి.ఉదాహరణకు ' శారద ఈ సాయంత్రం నా గదికి వస్తానంది ' అన్న కథా నాయకుడి స్వగతం తో కథ మొదలు పెడితే, పాఠకుడిని, మొదటి వాక్యంతోనే కట్టి పడ వేయ వచ్చు. శారద గదికి ఎందుకు వస్తానంది?, శారదకూ కథానాయకుడికి సంబంధమేమిటన్న ఆలోచనలతో, పాఠకుడిని, మొదట్లోనే, మీ గుప్పెట్లో పెట్టు కోవచ్చు. కథలో ఎత్తుగడెంత ముఖ్యమో, ముగింపు కూడా అంతే ముఖ్యం.ఈ ముగింపుతో, మన కథ మంచి కథా లేక చెడ్డ కథా అని పాఠకుడు తేల్చేస్తాడు. మంచి ముగింపు ఎలా వుండాలంటే, ఉదాహరణగా O.Henry కధలు గురించి చెపుతారు. మీరు అవి చదవక పోయివుంటే, తప్పక చదవండి. మీ కథలు కొత్త మలుపు తిరుగుతాయి.

మీరు travelogue రచయితా? మీ వ్యాసానికి కావలసిన ముడి సరుకైన, విషయ సేకరణ ముందరే తయారు చేసుకోండి. నేను దర్శించిన ప్రదేశాలలో, ఆ ప్రదేశం గురించి, ఏమన్నా పుస్తకాలుంటే ముందస్తుగా కానీ లేక ఆ ఊళ్ళో గానీ కొంటుంటాను. అదనపు విషయ సేకరణకు, నేను search engine ఉపయోగిస్తాను. డెట్రాయిట్ నుంచి ఒక పాఠకురాలు పంపిన సమాచారం మేరకు, నేను Dogpile search engine వాడతాను.కొన్ని సార్లు మీరు వెదికే సమాచారం గూగుల్ లో, ఉండని సందర్భాలు కూడా ఉంటై.ఈ సెర్చ్ ఇంజన్,ఒకే దెబ్బకు పలు సెర్చ్ ఇంజన్ల ఫలితాలను చూపిస్తుంది. మీకు కోరినంత సమాచారం, చాయా చిత్రాలు కూడా లభిస్తాయిక్కడ. మీరు వెళ్ళే ప్రదేశాలకు మీతో మీ కెమారా తీసుకు వెళ్ళటం మరువకండి. 1000 మాటల్లో చెప్పే విషయం, ఒక చిన్న చిత్రం తో చెప్పి, మీ పాఠకులను మీరు ఆకట్టుకోవచ్చు.


మీరు వ్యాస రచయిత ఐతే, పాఠకులకు మీ రచన చక్కగా కనిపించిందేందుకు, మీరు చెప్ప దలచిన point, effective గా చెప్పటానికి, కొన్ని చాయాచిత్రాలో లేక పెయింటింగ్స్ నో వ్యాసం లో ఉంచండి. ఇది మీరు మీ గృహాన్ని అలంకరిస్తున్నట్లుగా, భావించండి. బొమ్మలున్న టపా dry గా లేకుండా, పాఠకులకు కనువిందు చేస్తుంది. వ్యాసంలో మీరు చెప్పే విషయాలకు, support గా కొన్ని గణాంకాలు, Pie Chart, 2D Line Graph లు ఇవ్వండి. అవసరమైన సందర్భాలలో,ఆయా subjects లో నిపుణులైన వారి సలహా తీసుకోండి. మీ వ్యాసానికి, నిపుణుల సలహాలు గంభీరతను, ప్రామాణికతను సంతరిస్తాయి. వ్యాసం ముగింపులో, జిజ్ఞాస ఉన్న పాఠకులకోసం further reading నిమిత్తం కొన్ని references ఇవ్వండి.

టపా (article) రాయటం పూర్తయ్యింది కదా! ఇహ ఇందులో అచ్చు తప్పులు, spelling mistakes, ఒక పదాన్ని సరైన అర్థంలో వాడామా, అని నిర్ధారించుకొనేందుకు,సరి చూసుకోండి. ఈ కింది నిఘంటువు, ఈ పనికి మీకు ఉపయోగ పడుతుంది.

http://dsal.uchicago.edu/dictionaries/brown/

ఇక్కడ ఆంగ్ల పదములకు తెలుగు, తెలుగు పదములకు ఆంగ్ల అర్థములు ఉంటాయి ఇదంతా అయ్యాక, 24 గంటలు ఆగండి.ఇప్పుడు మీ వ్యాసాన్ని మీరు చదువుతుంటే, అంతకు క్రితం మీకు తట్టని కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవి, వ్యాసం విలువను పెంచుతాయని మీకు అనిపిస్తే, వాటిని మీ వ్యాసంలో, తగిన ప్రదేశములో, జత చేయండి.దీనిని మీరు మీ బ్లాగులో ప్రచురించండి. మీకు బ్లాగు లేకపోతే blogger లో ఖాతా తెరవండి. మీ వ్యాసంలో, పలు అంశాల పై పరిశోధన చేసి, విశేష వ్యాసం ఉత్పన్నం కావిస్తే,లేక మీ రచనలో, punch ఉందని మీరు తలిస్తే అటువంటి వ్యాసాన్ని, పొద్దు, tlca లేక ఈ-మాట లాంటి web పత్రికలకు పంపండి. మీ బ్లాగు కంటే ఇలాంటి మాగజిన్లకు భిన్నమైన పాఠకులుంటారని గమనించండి. తద్వారా, మీ రచనలు కొత్త పాఠకులు చదువుతారు. మీ రచన ఎక్కువమంది పాఠకుల దగ్గరకు వెళ్తుంది. అంతేకాక,ఇక్కడి feedback కూడా నాణ్యంగా ఉంటుంది.


పైన చెప్పినవి ఒక సారి ప్రయత్నించి, మీ అనుభవాలతో, ఇక రాసేయండి మరి. Good luck.

ఇవి కూడా చూడండి:

1) వాడుక భాషే రాస్తున్నామా? -రంగనాయకమ్మ
2) సాహిత్యావలోకనం - సొదుం రామ్మొహన్
3) తెలుగు వాక్యం -చేకురి రామారావు
4) పాపులర్ రచనలెలా చెయ్యాలి? -యెండమూరి

11 కామెంట్‌లు:

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

మీ "మంచి రచనలెలా చేయాలి" చదివాను. బావుంది. అటువంటి వ్యాసాలు ఈ సమయంలో చాలా అవసరమేనని భావిస్తాను.

మీ వింజమూరి విజయకుమార్

Chari Dingari చెప్పారు...

బాగు0ది...కానీ బీరూ....వైనూ...తాగకు0డా రాయలేమా?

అజ్ఞాత చెప్పారు...

రావు గారు...మనస్సులో ఉన్నది నేరుగా చెప్పేస్తున్నాను. వ్యాసం యొక్క ఉద్దేశ్యం అధ్బుతం. నాకు చాలా నచ్చిన అంశం. కానీ బీరు..వైను.....అని సలహా ఇవ్వడం...ఏమీ బాగోలేదు. మత్తుపానీయాలు సేవించడం ఎవరి ఇష్టం వారిదైనా....ప్రచారం కూడదు అని నా అభిప్రాయం. ఈ విషయాలు పక్కన పెడితే..ఇలాంటి వ్యాసాలు మీ నుండి ఇంకా ఆశిస్తున్నాను.

రాధిక చెప్పారు...

చాలా మంచి టపా . నాదీ నవీన్ గారి అభిప్రాయమే.మీలాంటి వారు రాసే వ్యాసాలకు ఒక స్థాయి వుంటుంది. ఇలాంటివి టపా స్థాయి ని తగ్గిస్తాయి.

saisahithi చెప్పారు...

చాలా బాగుంది
వర్ధమాన రచయితల మార్గదర్శ కంగా ఉంది.

RG చెప్పారు...

WTF !!!
మీకు బీరుతాగడం ఇష్టంలేకపోతే కోక్ తాగుతూ బ్లాగండి. బీరు వైన్ల పేరెత్తితేనే "శివ శివా" అని గుండెలుబాదుకోవడం దేనికి??
Addict కానంతవరకు ఏదైనా Acceptable అన్నది నా ఉద్దేశ్యం.

సుజాత వేల్పూరి చెప్పారు...

నేను కాస్తో కూస్తో, కనీసం అందరికీ అర్థమయ్యే తెలుగు రాయగలనంటే దానికి కారణం చిన్నప్పటినించీ (నిజంగా పదేళ్ల వయసునించే) రంగనాయకమ్మ గారి పుస్తకాలు చదవడమే అనుకుంటాను. అంత బాగా రాస్తారు ఆవిడ! 'స్త్రీల సమస్యల ' పట్ల వాదాల జోలికి పోకుండా ప్రాక్టికల్ గా ఆలోచించడం కూడా ఆమె రచనల వల్లే!

మీరు చెప్పిన పుస్తకాల్లో 2, 3 నేను చదవలేదు(సాహిత్య హింసావలోకనం చదివాను...నం.పా.సా గారిది)వాడుక భాషే రాస్తున్నామా చదివితే ప్రతి రోజూ ప్రతి పుస్తకంలో తప్పులు పట్టుకోవడం మొదలెడతాము!

యండమూరిది పక్కా కమర్షియల్ రచనలు చెయ్యడానికి పనికొచ్చే పుస్తకం.(పాపులర్ రచనలు అని ఆయనే అన్నారనుకోండి)ఇది చదివాను.

అన్నట్టు రావు గారు, రంగనాయకమ్మ గారి 'కుట్ర ' కథ చదివారా మీరు? విప్లవ కారుల తెలుగు నినాదాల గురించి, వాళ్ళ పుస్తకాల్లోని భాష గురించీ రాశారు ఆవిడ.భలే ఉంటుంది ఆ కథ!

cbrao చెప్పారు...

@సుజాత: కుట్ర చదవలేదు. అది రాసినట్లే తెలియదు. ఎందులో ప్రచురితమయ్యింది? పుస్తకంగా వచ్చిందా? తన రచనలు తనే disown చేసుకునే విశిష్ట రచయిత్రి ఆమె. అది ఆమె బలం. బలహీనతేమంటే విమర్శలను హర్షించలేక పోవటం. ఆమె రాసిన కృష్ణవేణి నవల ఆంధ్రప్రభ లో సీరియల్ గా వస్తున్నప్పుడు చదివా. కేవలం ఉత్తరాలతో కథ నడిపిస్తారు, హృద్యంగా. నన్ను ఆకట్టుకున్న రచన అది, ఆ వయస్సులో. నిషీగంధ ఊసులాడే ఒక జాబిలట చదువుతున్నారా? ఇది కూడ కేవలం ఉత్తరాల మీదే నడిచే కథ . మీ భాషలో ఆడపేజీ కథే కాని ఆసక్తికరంగా రాస్తుంది. నేను చదువుతున్నా;సమీక్ష రాయడం కోసం, వ్యవధి దొరకటం లేదు రాయటానికి. కెనడా, అమెరికా వెళ్లే పనిలో, ఇక్కడ చూడాల్సిన పనులు చూడటం లో, ఇదివరలా సమీక్షలకు సమయం దొరకటం లేదు.

సుజాత వేల్పూరి చెప్పారు...

రావు గారు,
ఆడపేజీ అని నేను ఎందుకు వాడానో మీకు తెలిసే ఉండాలి! సున్నితమైన భావుకత్వానికి, ప్రేమ భావాలకు నేను వ్యతిరేకిని కాదు. నిషిగంధ రాస్తున్న కథ బాగుందని నేను ప్రతి నెలా చదివాక (ఎక్కడ, ఏమి నచ్చిందో కూడా) రాస్తూనే ఉన్నాను.

"అమ్మ" కథా సంకలనంలోనో, లేక "ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది" కథా సంకలనంలోనో 'కుట్ర ' కథ ఉంది. తర్వాత ఆమె 2002 లో ఆ4 సైజులో తన కథలన్నింటినీ ఒక పెద్ద పుస్తకంగా వేసారు.(ఈ పుస్తకం కొన్నపుడు ఒక వ్యాసపీఠం కూడా ఇవ్వాలని కోరాను నేను డిసెంబర్ పుస్తకాల ఎగ్జిబిషన్లో) అందులో కూడా ఈ కథ ఉంది.
కృష్ణవేణి నవల, తర్వాత కాలంలో ఆవిడకు నచ్చక మళ్ళి మళ్ళీ వెయ్యలేదు. అయితే ఆవిడ వద్దనుకుని తీసి పారేసిన కథలు కూడా మరో పాత పుస్తకరూపంలో నా దగ్గరున్నాయి.

"ఆ కథలో పాత్రకి అంత నీచ భావాలున్నాయంటే ఆ నీచత్వం పాత్రది కాదు, నాదే! నా బుద్ధి అల్లా ఏడ్చింది " అని ఆమె తనని తాను విమర్శించుకునే పద్ధతి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

సుజాత వేల్పూరి చెప్పారు...

అది ఆ4 కాదు, A4 సైజు.

cbrao చెప్పారు...

నెనర్లు. ఈసారి విశాలాంధ్ర కెళ్లినప్పుడు కుట్ర దొరుకుతుందేమో ప్రయత్నం చేస్తా. ఈ కథను పరిచయం చేస్తూ ఒక టపా రాయగలరా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి